అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

గురువారం, డిసెంబర్ 31, 2009

ఎత్తరుగుల అమెరికా వీధి - ఈనాడు కథ

"ఈనాడు" తెలుగు వార్తాపత్రికల పాఠకులకు చిర పరిచితమైన పేరు. ఈ దినపత్రిక ఆదివారం అనుబంధం ప్రచురించటం మొదలు పెట్టాక, నిజం చెప్పొద్దూ వారపత్రిక ప్లస్ దినపత్రిక కలిపి ఒకే రేటుకు వస్తుంది అనిపించింది. ఒకప్పుడు ఈ ఆదివారం అనుభందం లో నేను తరచుగా చదివేది బాలవినోదిని, కథ, ఇది కథకాదు, పదవినోదిని(cross word puzzle). కానీ రాను రాను నాకు కవర్ పేజి వెనక వేసే తారల విశేషాలు ప్రత్యేకమైన బొమ్మలుకూడా వదలకుండా మొదటి పేజి లోని ’మాయా’లోకం నుండి చివరి పేజీ లోని ’పదవినోదిని’ వరకూ ప్రతి అక్షరం చదవడం అలవాటు అయింది. ఎన్ని చదివినా అప్పటినుండి ఇప్పటివరకు చదవకపోతే మిస్ అయ్యేంతగా...

మంగళవారం, డిసెంబర్ 29, 2009

నేనూ.. మౌనం.. సంతోషం..

డిశంబర్ అంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నెల అయిపోయింది నాకు. అసలు ఈ కోర్స్ చేయడం వెనక ఓ పిట్ట కథ ఉంది కానీ దాని వివరాలు మళ్ళీ ఎపుడైనా సమయం కుదిరినపుడు చెప్తాను. బేసిక్ కోర్స్ చేసిన ఆనందం సద్దుమణగక ముందే పార్ట్ 2 కోర్స్ చేద్దాం అని నిర్ణయించుకున్నాను. దానికోసమని మళ్ళీ ఆశ్రమం కి వెళ్ళిన వెంటనే శలవల్లో ఇంటికి వెళ్ళిన అనుభూతి కలిగింది. అక్కడి వైబ్రేషన్స్ మహిమో ఏమిటో తెలియదు కానీ ఆశ్రమం లో ఉన్నంత సేపూ బయటి ఇబ్బందుల గురించి కానీ సమస్యలగురించి కానీ ఆలోచనలు ఏమాత్రం రావు. ఎపుడూ ఒకటే ధ్యాస.. ధ్యానం.. సేవ.. అదో మధురమైన అనుభూతి. అనుకోకుండా నాతో కలిసి పార్ట్...

గురువారం, డిసెంబర్ 17, 2009

జీవించడం ఓ కళ - ఆర్ట్ ఆఫ్ లివింగ్ - 2

రెండో రోజు ఉదయం ఆరుగంటలకు నిద్ర లేచి ఏడున్నరకల్లా అల్పాహారం కోసం బయలుదేరాను కాస్త కొండలు గుట్టలుగా ఉన్న ప్రాంతమవడంతో మెట్లు ఎక్కిదిగడం పైగా ఎంతదూరమైనా నడకే కావడంతో కాస్త కష్టంగా ఉందనిపించింది, అసలేమన దైనందిన జీవితంలో పక్కసీట్ కు వెళ్ళాలన్నా కుర్చీలోనే జరుగుతూ వెళ్ళేంత బద్దకిష్టులం కనుక అంతే ఉంటుంది లే అని సర్దిచెప్పి అలానే తిరిగేశాను. కిచెన్ చాలా పెద్దగా ఉంది దాని డాబా పైన బోలెడన్ని సోలార్ ప్యానల్స్ ఆకర్షణీయంగా పేర్చి ఉన్నాయ్ వాటిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును కిచెన్ అవసరాలకు ఉపయోగిస్తారుట. కిచెన్ లో కింద కూర్చుని భోజనం కేవలం పెద్దవాళ్ళకోసం...

బుధవారం, డిసెంబర్ 16, 2009

జీవించడం ఓ కళ - ఆర్ట్ ఆఫ్ లివింగ్ - 1

బ్రతకడానికి జీవించడానికి మధ్య గల తేడాను చదువరులకు వివరించాల్సిన పనిలేదు అనుకుంటున్నాను. మనలో చాలా మందిమి బ్రతికేస్తుంటాం జీవించేవారు ఏ కొందరో ఉంటారు. నాకు ఇలా జీవించే అవకాశం మొన్న ఓ వారాంతం లో (డిశం 3 నుండి 6 వరకూ) దొరికింది. బెంగళూరు శివార్లలో కనకపుర రోడ్ లో ఉన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం గురించి నేను ఇదివరకు చాలా సార్లు విన్నాను. అహా అంత పెద్ద ఆశ్రమం కట్టించారంటే మహ కోటీశ్వరులై ఉంటారు బాగా డబ్బులు దండుకునే మరో సంస్థ అని అనుకునే వాడ్ని. నిజానికి ఒక పది పదేహేనేళ్ళ క్రితం నాకే కాదు చాలా మందికి రవిశంకర్ అంటే కేవలం ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్...

ఆదివారం, నవంబర్ 22, 2009

బండీ రా.. పొగబండీ రా..

శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే రైలుబండి అని కూడా తెలియని వీడికి ఒక బ్లాగు.. దానిలో పోస్ట్ లు.. వాటిని మనం చదవడం..హుః" అని మోహన్ బాబు స్టైల్ ల్లో తిట్టేసుకోకండి మరి, చివరి ఫోటో చూస్తే అసలు ఈ టపా ఎందుకు మొదలెట్టానో మీకీపాటికి అర్ధమైపోయుంటుంది. అసలు టపా లోనికి వెళ్ళేముందు ఓ చిన్ని పిట్టకథ చెప్పాలి.ఇది చాలా రోజుల క్రితం కథ, అప్పటికింకా వోల్వోబస్సులు మన ఆర్టీసీకి రాని రోజుల్లో.. బస్సుల్లో కూడా హైటెక్ హవా నడుస్తున్నరోజుల్లో ఓ శుభముహుర్తాన...

సోమవారం, నవంబర్ 16, 2009

టీవీ ఛానళ్ళూ - సృజనాత్మక తలలు !

ఏమిటీ చిత్రమైన శిర్షిక అని హాశ్చర్యపడిపోతున్నారా? ఏంలేదండీ creative heads ని ఆంధ్రీకరించాను అంతే. గత ఏడాది బ్లాగులు, వార్తలు, టీవీ కార్యక్రమాలని ఫాలో అయిన వారెవరికీ ’ఈటీవి’ కి పట్టిన చీడ సుమన్ మరియూ క్రియేటివ్‍హెడ్ ప్రభాకర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను (మీ మనోభావాలు ఏమాత్రం దెబ్బతిన్నా ఈ టపా చదవడం ఇంతటితో ఆపేయమని నా సలహా!! ఇహ ముందుకు చదవడం అనవసరం అని నా ఉద్దేశ్యం, ఆపై మీ ఇష్టం). ఆ చానల్ ను ఇంచుమించు నాశనం చేసేయబోయిన ఈ చీడ భారినుండి రామోజీ గారు ఆలశ్యంగానైనా మేలుకుని, కొడుకు అని కూడా చూడకుండా వీళ్ళ ఇద్దరి భారి నుండి జనాన్ని,...

మంగళవారం, అక్టోబర్ 13, 2009

Wake Up SID !!

నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది, ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయ్ అని తెలిస్తే కానీ చూడను. అలాంటిది కాస్త మంచి టాక్ వచ్చిందని తెలిసి ఈ వారాంతం wake up sid చూడటం తటస్థించింది. నేను చాలా సాధారణ ప్రేక్షకుడిని, సినిమా టెక్నికాలిటీస్ గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. సినిమా అంటే బోలెడంత ఇష్టం మాత్రం నా సొంతం. స్క్రిప్ట్ తో కట్టి పడేసే సినిమాలు, థియేటర్ బయటకు వచ్చాక కూడా సినిమా గురించి ఆలోచించేలా చేసే థ్రిల్లర్స్ అంటే కూడా ప్రత్యేకమైన...

శుక్రవారం, అక్టోబర్ 09, 2009

ఐస్..పుల్లైస్..పాలైస్..

వేసవి శలవల్లో మండే ఎండలలో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయం లోనో లేదా మూడు గంటల సమయం లోనో చల్లని ఈ పుల్ల ఐస్ చప్పరిస్తుంటే ఆ ఆనందం మాటలలో చెప్పతరమా చెప్పండి. అసలు ఈ రుచి ఎరుగని జన్మ ఒక జన్మేనా అనిపిస్తుంది నిజంగా. తర్వాత తర్వాత ఐస్క్రీములు వచ్చి వీటి అమ్మకానికి గండి కొట్టాయ్ కానీ నా చిన్నతనం లో ఇవే రారాజులు. వీధిలో కేక వినబడగానే ఏ పని చేస్తున్నా వెంటనే అలర్ట్ అయిపోయే వాడిని. ఒకో రోజు కాస్త పెద్ద వాళ్ళు మాత్రమే తీసుకు రాగలిగే రెండు చక్రాల చిన్న తోపుడు బండి లో తెచ్చేవాడు. ఆ బండి భలే ఉండేది చెక్కతో చేసిన పెద్ద పెట్టె, దాని లోపల థర్మోకోల్ అట్టలూ, పింక్...

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

సంస్కారం a.k.a. manners

ఒకో సారి ఓ వ్యక్తి మనకి నచ్చలేదు అంటే అతనికి సంభందించిన ఏ విషయమూ మనకి నచ్చవేమో కదా... దానికి తోడు ఆ వ్యక్తి సకల కళా వల్లభుడైతే ఇక చెప్పాలా... ఈ టపాకి మొదట చుట్టా, బీడీ, సిగరెట్.. అని పెడదాం అనుకున్నాను, ఆగండాగండి, పొగాకు ప్రియులంతా నా పై దండెత్తి రాకండి, ఈ టపా ఉద్దేశ్యం ఫలానా అలవాట్లు మంచివి, ఫలానావి కావు అని చెప్పడానికి కాదు. సదరు అలవాట్లు ఉన్న ఒకరిద్దరు వ్యక్తుల వలన నాకు కలిగిన అసౌకర్యం గురించి చెప్పడానికి మాత్రమే. సాధారణంగా నా ముక్కుకు సెన్సిటివిటీ ఎక్కువ, ఎంత ఎక్కువ అంటే ఒకోసారి నా చెమట వాసన కి నాకే చిరాకు వస్తుంటుంది, అందుకే నేను సాధారణం గా...

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009

ఇది నిజమేనా ??

కోట్లాది అభిమానుల గుండెల్లో గత ఇరవై నాలుగు గంటలు గా పదే పదే మొలకెత్తు తున్న ప్రశ్న ఇది. చెరగని చిరునవ్వుకీ, నిండైన తెలుగు తనానికీ, ఎదురు లేని ఆత్మ విశ్వాసానికీ, తిరుగులేని మొండిధైర్యానికీ కలిపి రూపం ఇచ్చినట్లుగా ఉండే మన YSR (డాక్టర్ ఎడుగూరి సంధింటి రాజశేఖరరెడ్డి) గారు ఇక లేరు అనీ ఇకపై కేవలం వీడియో లు ఫోటోల లోనే కనపడతారనీ.. ప్రజల గుండెల్లో ఏర్పరచుకున్న చెరగని స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు అని తెలిసిన ప్రతి ఒక్కరూ అయ్యో అనుకోక మానరు. కనపడుట లేదు అని ప్రకటించిన దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాత chopper was found burnt అని వార్తలు వచ్చినా... "ఏమో ఒక...

శనివారం, ఆగస్టు 15, 2009

ఈటీవీ --> ఝుమ్మంది నాదం2

మొన్న సోమవారం రాత్రి 9:20 కి హడావిడిగా ఆఫీసులో అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి ఇంటికి పరిగెట్టుకు వచ్చాను. కారణం ముందు రోజు చూసిన ఈటీవి ఝుమ్మంది నాదం వాణిజ్య ప్రకటన. ఆ ప్రోగ్రాం సోమవారం రాత్రి 9:30 కి ప్రసారమవుతుంది. మొన్న సోమవారం బాలమురళీ కృష్ణ గారి తో ప్రోగ్రాం. ఈ సోమ వారం తరువాయుభాగం కూడా ప్రసారమౌవుతుంది. కానీ ఈ రోజు నా స్కెడ్యూల్ ప్రకారం వీలవుతుందో లేదో అని గాబరాగా ఉంది. కానీ ఏంచేస్తాం లైఫ్ ఈజ్ జిందగీ.. అనుకున్నామనీ జరగవు అన్నీ.. అనుకోలేదనీ ఆగవు కొన్నీ.. అని పాడేసుకోడం అంతే.. అసలు సుమన్ వదిలేసాక మళ్ళీ ఈటీవి కి మంచి రోజులు వచ్చాయి. నేను తిరిగి ఆ చానల్...

మంగళవారం, ఆగస్టు 11, 2009

వర్షాన్ని విందామా !!

అబ్బే! వర్షం సినిమా పాటలు కాదండీ బాబు, మామూలు వర్షం గురించే నే చెప్తున్నది. మొన్న శనివారం మధ్యాహ్నాం సుష్టుగా భోంచేసి వారం రోజుల కరువంతా తీరేలా నిద్ర పోయానా.. సాయంత్రం లేచే సరికి జోరుగా వర్షం... నే లేచే సరికి వర్షమో లేక వర్షమే నన్ను నిద్ర లేపిందో మరి సరిగా తెలియలేదు. కానీ అంత వర్షం చూసే సరికి లోపల కుదురుగా కూర్చోలేకపోయాను. బయట రోడ్ మీదకి వెళ్ళి తనివి తీరా తడిచి తదాత్మ్యం చెందాలనీ.. అక్కడక్కడా నీళ్ళు నిలిచిన చిన్ని చిన్ని గుంటల్లో ఎగిరి దూకి ఆ నీళ్ళని పక్కలకి చిందించి మళ్ళీ అవి తూచ్ తూచ్ అని హడావిడిగా గుంటల్లోకి వెళ్ళిపోడాన్ని ఆనందంగా చూడాలనీ.....

శనివారం, ఆగస్టు 01, 2009

సిగలో.. అవి విరులో -- మేఘసందేశం

గత రెండు మూడు వారాలు గా ఈ పాట నన్ను వెంటాడుతుంది, ఎంతగా అంటే ఎక్కడో అడుగున పడిపోయిన నా కలక్షన్ లో వెతికి వెతికి వెలికి తీసి తరచుగా మళ్ళీ వినేంతగా. కారణం ఏమిటో తెలియదు కానీ ఈ ఆల్బం ఎందుకో సంవత్సరానికి ఒక్క సారైనా ఇలా బాగా గుర్తొస్తుంది. అప్పుడు ఒక నెల రెండు నెలలు వినేశాక కాస్త మంచి పాటలు ఏమన్నా వస్తే మళ్ళీ అడుగున పడి పోతుంది. కానీ అక్కడే అలా ఉండి పోదు మళ్ళీ హఠాత్తుగా ఓ రోజు ఙ్ఞాపకమొచ్చి మళ్ళీ తనివి తీరా వినే వరకూ అలా వెంటాడూతూనే ఉంటుంది. మంచి సంగీతం గొప్ప తనం అదేనేమో మరి !! ఈ సినిమా గురించి కానీ సంగీతం గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పగలిగినది...

బుధవారం, జులై 29, 2009

కలవరమాయేమదిలో !!

కనులే కలిపే కథలే తెలిపే నాలోని భావాలేఅలలై మెదిలే కలలే కదిపే వేవేల రాగాలేపలికే.. స్వరాలే ఎదకే.. వరాలైపదాలు పాడు వేళలో కలవరమాయే.. మదిలో...కలవరమాయేమదిలో!! ఈ దశాబ్దపు ఉత్తమ చిత్రం అని ఖచ్చితంగా చెప్పను కానీ, మంచి తెలుగు చిత్రాలు రావాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కరు తప్పని సరిగా చూసి ప్రోత్సహించ వలసిన చిత్రం. హీరో గా కమల్ కామరాజు అందం :-) అక్కడక్కడా స్క్రీన్ ప్లే లోపాలూ పంటి కింద రాళ్ళ లా తగుల్తూ ఉన్నా... ఆకట్టుకునే స్వాతి నటన, ఆహ్లాదకరమైన మంచి సంగీతం, చక్కని కథాంశం, ఆలోచింప చేసే కొన్ని సంభాషణలు, పాటలలో వనమాలి గారి అర్ధవంతమైన సాహిత్యం తో ఓ ప్రత్యేకమైన...

శనివారం, జులై 25, 2009

సీతాకళ్యాణం - వాగ్దానం(1961) సాహిత్యం

ఘంటసాల మాష్టారి గాత్ర మాధుర్యమో, శ్రీ రామ కథ లోని మహత్తో, పెండ్యాల వారి సంగీత మహిమో లేదా అసలు హరికధా ప్రక్రియ గొప్పతనమే అంతో నాకు సరిగా తెలియదు కానీ, ఈపాట ఎన్ని సార్లు విన్నా ఒళ్ళు పులకరిస్తూనే ఉంటుంది. రేలంగి, నాగేశ్వరరావు, కృష్ణకుమారి లపై చిత్రీకరించిన ఈ పాట లో విశేషమేమిటంటే.. చిత్రీకరణ లో ఎక్కడా శ్రీరామ కళ్యాణాన్ని చూపించరు కానీ కనులు మూసుకుని పాట వింటుంటే మాత్రం కళ్యాణ ఘట్టం అంతా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది రాసినది శ్రీశ్రీ గారు అని మొదటి సారి తెలిసినపుడు చాలా ఆశ్చర్య పోయాను. ఇక పాట విషయానికి వస్తే రేలంగి గారి బాణి లో చిన్న చిన్న చెణుకు...

మంగళవారం, జులై 21, 2009

ఆటో చాహియే క్యా !! -- రెండు

బెంగళూరు ఆటోల క్రమబద్దీకరణ కోసం ఇక్కడి ట్రాఫిక్ పోలీసులు ప్రవేశ పెట్టిన మరో అంశం డ్రైవర్ లైసెన్స్ ప్రదర్శన. ప్రతి ఆటోలోనూ ఇక్కడ ఫోటోలో చూపించినట్లు డ్రైవర్ పేరు, పోలీస్ స్టేషన్ పరిధి, లైసెన్సు నంబరు అన్నీ కలిపి సాధారణంగా డ్రైవర్ సీటు వెనకాల ప్రయాణీకుల కు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలి. విధిగా ప్రతి ఆటోలోనూ ప్రదర్శితమయ్యే ఈ వివరాలు ఆటో వాలాలని కాస్తైనా కంట్రోల్ లో ఉంచుతాయి అనుకుంటున్నాను. అంటే క్షణం క్షణం లో శ్రీదేవి ని దబాయించినట్లు ఆ లిఖ్ లో.. నంబర్ లిఖ్ లో.. కంప్లైంట్ కరో.. అని లెక్క లేకుండా మాటాడే వాడు తగిల్తే మనం ఏమీ చేయలేమనుకోండి అది వేరే...

శనివారం, జులై 11, 2009

ఆటో చాహియే క్యా !! -- ఒకటి

వీడెవడండీ బాబు హిందీ శీర్షిక, అదీ తెలుగు స్క్రిప్ట్ లో పెట్టాడు అని ఆశ్చర్య పోతున్నారా.. చెప్తా చెప్తా అసలు ఎంత తెలుగు వాళ్ళమైనా హిందీ మన జాతీయ భాష అన్న విషయం మర్చిపోతే ఎలా? ఈ విషయం లో ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఆటో డ్రైవర్ ల దేశభక్తి ని మాత్రం మెచ్చుకోవాల్సిందే... ఊరేదైనా కానివ్వండి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఏదైనా సరే వీళ్ళంతా మాట్లాడే ఏకైక భాష హిందీ. ప్రాంతీయ భాష మాట్లాడని వాళ్ళుంటారేమో కానీ ఆటో డ్రైవర్ల లో హిందీ మాట్లాడవాళ్ళని నేను ఇంత వరకూ చూడలేదు. మన జాతీయ భాష ని ఇంతగా గౌరవించి ప్రాచుర్యాన్ని పెంపొందిస్తున్న వీళ్ళ దేశభక్తిని గుర్తించక పోతే...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.