శనివారం, ఆగస్టు 15, 2009

ఈటీవీ --> ఝుమ్మంది నాదం2

మొన్న సోమవారం రాత్రి 9:20 కి హడావిడిగా ఆఫీసులో అన్నీ ఎక్కడివక్కడ వదిలేసి ఇంటికి పరిగెట్టుకు వచ్చాను. కారణం ముందు రోజు చూసిన ఈటీవి ఝుమ్మంది నాదం వాణిజ్య ప్రకటన. ఆ ప్రోగ్రాం సోమవారం రాత్రి 9:30 కి ప్రసారమవుతుంది. మొన్న సోమవారం బాలమురళీ కృష్ణ గారి తో ప్రోగ్రాం. ఈ సోమ వారం తరువాయుభాగం కూడా ప్రసారమౌవుతుంది. కానీ ఈ రోజు నా స్కెడ్యూల్ ప్రకారం వీలవుతుందో లేదో అని గాబరాగా ఉంది. కానీ ఏంచేస్తాం లైఫ్ ఈజ్ జిందగీ.. అనుకున్నామనీ జరగవు అన్నీ.. అనుకోలేదనీ ఆగవు కొన్నీ.. అని పాడేసుకోడం అంతే.. అసలు సుమన్ వదిలేసాక మళ్ళీ ఈటీవి కి మంచి రోజులు వచ్చాయి. నేను తిరిగి ఆ చానల్ చూడటం మొదలు పెట్టాను. ఈ ప్రోగ్రాం గాయని సునీత ఆధ్వర్యం లో సాగుతుంది. మాములుగానే బాగుంటుంది ఇక మొన్న బాలమురళి గారంటే చెప్పనే అఖ్కర్లేదు కదా.
పండుటాకు లా ఆ మహానుభావుడు కళ్ళెదురుగా అక్కడ కూర్చుని మాటే పాట లా మాట్లాడుతూ మధ్య మధ్య లో కొన్ని పాటలు పాడుతూ ఉంటే నాకు ఒళ్ళంతా కళ్ళు చెవులూ ఉంటే ఇంకా ఎంత బాగా ఆస్వాదించవచ్చో కదా అనిపించింది. నేను ఒక ఇరవైనిముషాలు ప్రోగ్రాం మిస్ అయ్యాను కానీ విన్నా ఆ కాస్తా చాలు అని అనిపించే లాటి పాటలు పాడారు ఆయన. నర్తనశాల నుండి "సలలిత రాగ సుధా రస.." పాట కి సునీత కూడా గొంతు కలిపి, తన అదృష్టానికి పొంగి పోయింది. తత్వాలు పాడుతూ ఆయన మాదేవ శంభో... అన్న చోట భో అంటూ దీర్ఘం తీసినపుడు సాక్షాత్తూ శంఖం నుండి వచ్చే ఓంకార నాదాన్ని పలికించి అబ్బుర పరచారు. ఈ వయసు లో కూడా ఆయన గాత్ర ధాటి ఏమాత్రం తగ్గలేదు. నా అదృష్టమో లేక తను కూడా సమయం తక్కువ కనుక ఆ థిల్లాన ఎంచుకున్నారో కానీ నా బ్లాగ్ లో లిరిక్స్ ఇచ్చిన బృందావని తిల్లానా ని ఆ కార్యక్రమం లో పాడారు, నాకు చాలా సంతోషం వేసింది.

ఇక మధ్య మధ్య లో చిన్న చిన్న చతురోక్తుల తో ఆసక్తికరంగా సాగింది. మీరు సినిమాల లో ఎక్కువ ఎందుకు చేయలేదు అంటే .. "ఏం చేయమంటావమ్మా ఒక సారి నారద పాత్ర చేశా కదా అని అన్ని అవే వస్తున్నాయ్, హీరోయిన్ లేకుండా నేను ఎందుకు చేయాలి? నేను చేయను.. హీరోయిన్ ఉన్న పాత్ర తీసుకురండి తప్పకుండా చేస్తాను అన్నాను అంతే నన్ను పిలవడం మానేశారు...ఇప్పుడైనా సరే అదే చెప్తున్నాను హీరోయిన్ ఉన్న పాత్ర చూపించండి ఎందుకు చేయనూ.. ఏం చేయలేనా.. " అంటూ హాస్యమాడటం ఆయనకే చెల్లింది. మొత్తం మీద కార్యక్రమం అంతా వొళ్ళంతా చెవులు చేసుకుని విని అనందించాను. మీకు కుదిరితే ఈ రోజు రాత్రి ప్రోగ్రాం మిస్ అవకండి, నేను కూడా సాధ్యమైనంత వరకూ మిస్ అవకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను.

ఈ కార్యక్రమం నాకు ఇంతగా నచ్చడం వెనుక యాంకర్ గా సునీత పాత్ర కూడా లేకపోలేదు. గాయనీ మణుల్లో అత్యంత అందమైన, అందం కంటే కూడా మంచి కంఠస్వరం, చక్కని చీర కట్టు తో ఆకట్టుకునే సునీత గారి ప్రోగ్రాం చూస్తూ నన్ను నేను మరచిపోతుంటాను.. తన నవ్వు కూడా ఇంత లా నోరంతా తెరచి మనస్పూర్తిగా నవ్వు తూ ఎంత స్వచ్చంగా ఉంటుందో. అన్నట్లు ఎప్పటి నుండో ప్రారంభించాలి అనుకుంటున్న నా పాటల బ్లాగ్ కు మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక రూపం ఇచ్చాను. ఒక సారి అక్కడకు కూడా విచ్చేసి మీ ఆశీస్సులు అందించండి. బ్లాగ్ పేరు సరిగమల గలగలలు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడవచ్చు.

12 వ్యాఖ్యలు:

 1. "ఈ కార్యక్రమం నాకు ఇంతగా నచ్చడం వెనుక యాంకర్ గా సునీత పాత్ర కూడా లేకపోలేదు." బుద్ధిగా నిజం ఒప్పేసుకున్నందుకు అభినందనలు :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. venuji,
  ee kinda link lo 2nd song ye movie nuncho cheppi punyam kattukondi.daya chesi veelaithe audio kooda postandi.

  http://www.youtube.com/watch?v=jrp-OAQSI8g&feature=related

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నేను నెనర్లు మొన్న సోమవారం చూడటం కుదరలేదండీ..
  మురళి గార నెనర్లు :-)
  అఙ్ఞాత జి
  ఆ వీడియో లో మొదటి పాట "అందమా నీ పేరెమిటి" అనేది అల్లరి ప్రియుడు సినిమా లోనిది. రెండో పాట "ఒక్క మగాడు" అనేది సీతయ్య అనే సినిమా లోది. youtube లింక్ ఈజీగా దొరికిందని అది ఇస్తున్నాను. మీక్షేమం కోరి చెప్తున్నాను ఎందుకైనా మంచిది కళ్ళు మూసుకుని వినండి. ఈ పాట లో హరోని చూస్తే జివితం మీద విరక్తి వచ్చే అవకాశం లేకపోలేదు :-) http://www.youtube.com/watch?v=b_isHh5JAZY

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Very nice. I too watch it, but have no much time like. You expressed the same feeling of me.

  BTW,

  వినాయక చవితి శుభాకాంక్షలు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నిజమే సునీత అందమైన గాయని ..ఈ వేళ లో నీవు నాకు తను పాడిన పాటల్లో నచ్చిన సాంగ్

  ప్రత్యుత్తరంతొలగించు
 6. వేణుజీ , చాల థాంక్స్ అండి, లింక్ ఇవ్వటమే కాకుండా, నా సంక్షేమం కోరి చెప్పారు. అప్పట్లో ఎప్పుడో ఈ సినిమా చూసినట్టు గుర్తు ( మొదటి పది నిమిషాలకే అవుట్ నేను ), ఈ పాట కూడా వినుంటాను, అంతగా నచ్చలేదు, ఆ పాప గొంతులో ఎంత బాగుందో.
  అన్నట్టు మా ఫ్రెండ్స్ లో ఒకరు, ఈ సిన్మా చివరి దాక చూసారు, నమ్మగలరా ? మేమేమో అతి కష్టం మీద పది నిమిషాలకే, జడుపు జ్వరం తెచ్చుకోన్నాం.ఈయన కంటే బాలకృష్ణ కోటి రెట్లు బెటర్ అనిపిస్తుంది, కనీసం చూడతానికైనా కొంత ఒకే బాలయ్య.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. వేణూజీ,అప్పుడా పాట చూసుండటం వల్ల నచ్చలేదేమో, ఇప్పుడు ఎంచక్కా ఆడియో మాత్రమే వింటుంటే బాగుంది. అన్నట్టు మీ సరిగమల గలగలలు బ్లాగ్ చాలా బాగుంది. పాటల గురించి మీకు మంచి అభిరుచి ఉన్నట్లుంది, ఇంకో పాట రిక్వెస్ట్, " జయ జయ జయ జననీ, విజయీభవ భారత జనని, భాసిల్లుము? ఉషస్వినీ, శోభిల్లుము మనస్వినీ ...
  హిమగిరి శిఖరాల ఉయ్యాలలూగి, ఉయ్యాల లూగి, కావేరి సలిలాల సంగీతము నేర్చి,
  విశ్వ వ్యాప్తముగా నీ జాతి కీర్తినీ, ..... ( గుర్తు లేదు )
  జయ జయ జయ జననీ ...
  ఇది వరకు రేడియో లో చిత్తరంజన్ గారు నేర్పించే వారు ఈ పాటని, గుర్తుందా ? ఎంత వెదికినా దొరకలేదు, ఎంతో హాయయిన ట్యూన్ ...

  ప్రత్యుత్తరంతొలగించు
 8. చాలా మంచి ప్రోగ్రాం గురించి వ్రాసారు.
  నేను రెండు వారాలూ చూసాను.
  బాలమురళీకృష్ణ గారి గాత్రం అద్భుతం.
  ఇంకా ఎంత మంది మహానుభావులని చూపిస్తారో అనుకున్నాను.
  తరువాయి భాగంలో కోటి గారని చెప్పారు.
  చూడాలి ఎలా ఉంటుందో?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. గీతాచార్య గారు, నెనర్లు. మీకు కూడా వినాయకచవితి శుభాకాంక్షలు.

  నేస్తం నెనర్లు.

  అఙ్ఞాతజి హ హ పెద్దగా అనకండి ఆయన ఫ్యాన్స్ వింటే వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయ్ :-) మీరు చెప్పిన పాట నాకు పరిచయం లేదండీ.. కొన్ని ప్రైవేట్ దేశభక్తి గీతాలు నా దగ్గర ఒక ప్రత్యేకమైన సిడి లో ఉండాలి వాటిలో ఉందేమో మరి. నేను వెతికి దొరికితే తప్పక ప్రచురిస్తాను.

  బోనగిరి గారు నెనర్లు. అందరూ బాలమురళి గార్లు కాలేరు కదండీ.. :-) కోటి లో కూడా కాస్తో కూస్తో ప్రతిభ ఉంది. సునీత గారు మంచి పాటలు పాడిస్తారేమో మరి ఎదురు చూద్దాం. నాకు పొయిన వారం కుదరలేదు కానీ ఈ వారం ఖాళీ నే బాల మురళి గారి ప్రోగ్రాం మళ్ళీ వేస్తే బాగుండు అని అత్యాశ :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఝుమ్మంది నాదం- ఈ టీవి లో నిజంగానే మంచి ప్రోగ్రాం

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.