శనివారం, ఆగస్టు 01, 2009

సిగలో.. అవి విరులో -- మేఘసందేశం

గత రెండు మూడు వారాలు గా ఈ పాట నన్ను వెంటాడుతుంది, ఎంతగా అంటే ఎక్కడో అడుగున పడిపోయిన నా కలక్షన్ లో వెతికి వెతికి వెలికి తీసి తరచుగా మళ్ళీ వినేంతగా. కారణం ఏమిటో తెలియదు కానీ ఈ ఆల్బం ఎందుకో సంవత్సరానికి ఒక్క సారైనా ఇలా బాగా గుర్తొస్తుంది. అప్పుడు ఒక నెల రెండు నెలలు వినేశాక కాస్త మంచి పాటలు ఏమన్నా వస్తే మళ్ళీ అడుగున పడి పోతుంది. కానీ అక్కడే అలా ఉండి పోదు మళ్ళీ హఠాత్తుగా ఓ రోజు ఙ్ఞాపకమొచ్చి మళ్ళీ తనివి తీరా వినే వరకూ అలా వెంటాడూతూనే ఉంటుంది. మంచి సంగీతం గొప్ప తనం అదేనేమో మరి !! ఈ సినిమా గురించి కానీ సంగీతం గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పగలిగినది ఏమీ లేదు. నాకు బాగా నచ్చే సినిమాల మొదటి జాబితా లో ఉంటుంది. కధ, సంగీతం, నటీనటుల నటన వేటికవే సాటి. ఈ సినిమా గురించి తెలియని వారుంటే తెలుసు కోడానికి నవతరంగం లో ఈ వ్యాసం చదవండి. ఈ ఆల్బం లో పాటలు అన్నీ ఒక దానిని మించి ఒకటి ఉంటాయి. సరే మరి నన్ను వెంటాడుతున్న ఈ పాట ని మీరూ ఓ సారి ఇక్కడ చిమట మ్యూజిక్ లో విని ఆనందించండి. మొన్నేమో కళ్యాణం, ఇప్పుడేమో సిగలు, విరులు, అగరు పొగలు అసలూ... "సంగతేంటి గురూ !!" అని అడగకండేం :-)


చిత్రం: మేఘసందేశం
గానం: కె. జె. ఏసుదాస్
సాహిత్యం :దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : రమేష్ నాయుడు.

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు..
ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు..
మదిలోనా గదిలోనా... మదిలోనా గదిలోనా...
మత్తిలిన కొత్త కోరికలూ...నిలువనీవు నా తలపులు..
మరీ మరీ ప్రియా..ప్రియా...
నిలువనీవు నా తలపులూ.. నీ కనుల ఆ పిలుపులూ..

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

జరిగి ఇటు ఒరిగీ... పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగీ... పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అర విడినా.. చిగురాకు పెదవుల మరిగీ..
చిరునవ్వుల అర విడినా.. చిగురాకు పెదవుల మరిగీ..
మరలి రాలేవు నా చూపులూ.. మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులూ.. మధువుకై మెదలు తుమ్మెదలూ...

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

16 వ్యాఖ్యలు:

 1. నేను లెక్కలేనన్నిసార్లు పాడుకున్న పాటల్లో ఇదొకటి, విన్న ప్రతిసారి ఇంకేపనీ చేయని పాటల్లో ఇదొకటి. అంత ఇష్టం, తాదాత్మ్యం. నిన్నటిదాకా శిలనైనా, ముందు తెలిసినా దీనికి తోడు చేస్తుంటాను. మొత్తంగా పిచ్చి ప్రేమ ఈ పాటలంటే...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి.. కానీ ఈ సినిమాలో నాకు బాగా ఇష్టమైన పాట మాత్రం 'ముందు తెలిసెనా ప్రభూ..' ఈ సినిమా పాటలు నేను కూడా తరచూ వింటూ ఉంటాను, ముఖ్యంగా ఏ అర్ధరాత్రి దాటాకో నిద్రనుంచి హఠాత్తుగా మెలకువ వచ్చినప్పుడు.. ..'నవతరంగం' లింక్ ఇస్తే, మీరు కూడా ఏమైనా రాశారేమో అనుకున్నా.. తీరా చూస్తే అది నేను రాసిందే.. ధన్యవాదాలండీ.. పాటకీ, లంకెకీ... అన్నట్టు 'సంగతేమిటి గురూ' అని అడగం లెండి.. ఏమన్నా ఉంటే మీరే చెబుతారు కదా :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ధన్య వాదాలు ఉష గారు. ఈ పాటలు అలాంటివండి ఎవరైనా అలా పిచ్చి ప్రేమ లో పడి పోవాల్సిందే..

  ధన్య వాదాలు మురళి గారు. నవతరంగం లో చూశాక మీదే అని తెలుస్తుంది కదా అని నేను ప్రత్యేకంగా మీ పేరు చెప్పలేదండీ :-) ఈ సినిమాలో ఏ పాట పేరు చెప్పినా రెండో దానికి అన్యాయం చేసినట్లే.. నాకు సీజనల్ గా ఒకో సారి ఒకో పాట మారు మ్రోగుతుంది మనసులో..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ సినిమా నాకూ ఇష్టమేనండీ....పాటలన్నీ బావుంటాయి కృష్ణ శాస్త్రిగారి ఆకులో ఆకునై పాట మరీనూ

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మంచి పాట అండీ వేణూ శ్రీకాంత్ గారూ!!
  ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మీరిలా మంచి పాటలు రాస్తూ ఉండండి నేను వాటిని కాపీ చెసుకుంటున్నాను :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఈ పాట కృష్ణ శాస్త్రి గారి సాహిత్యం అని ఎక్కడో చదివాను. ఈ సినిమా పాటలన్నీ దాసరి రాసానని చెప్పుకున్నాడు. అయితే ఖచ్చితగా ఎవరు రాశారో తెలియదు! :-)

  ఈ పాట నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఇది కృష్ణశాస్త్రి రచనే అనుకుంటా.
  నాకుకూడా దీనికన్నా "ముందు తెలిసినా..." పాట ఇష్టం. దానికన్నాకూడా, కొన్ని రికార్డులలో/కేసట్లలో ఉండి సినిమాలోలేని మరో కృష్ణశాస్త్రి పాట, "శీతవేళ రానీయకు..." ఇష్టం.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. పరిమళం గారు, రామరాజు గారు, నేస్తం నెనర్లు.

  రవిగారు నెనర్లు, అన్నీ ఆయన అని చెప్పుకోలేదనుకుంటానండీ.. నాకు సీడీ లో చాలా పాటలకి దేవులపల్లి గారి పేరే చూసిన గుర్తు.

  భైరవభట్ల గారు నెనర్లు. నాకు కూడా శీతవేళ రానీయకు పాట ఇష్టమండీ.

  ఫణీంద్ర గారు నెనర్లు. దేవులపల్లి వారిదే అని ధృవీకరించినందుకు ధన్యవాదాలు. టపా సరిచేశాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఒకానొక ఇంటర్వ్యూ లో ఈ సినిమా ప్రసంగం వచ్చి, దాసరి ఆ మాట అన్నారు. సీడీపైన అలా రాయించే సాహసం ఉండదు లెండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మీ కోసం కష్టపడి వెతికి మరీ మేఘసందేశం టైటిల్స్ వరకూ యూ ట్యూబ్ కు ఎక్కించా ! గీతరచయితల్లో ఎక్కడా దాసరి పేరు లేదు చూడండి
  ఇక్కడ---- http://www.youtube.com/watch?v=8e9QI-OKG9U

  ప్రత్యుత్తరంతొలగించు
 12. రవి గారు ఆయన ఇంటర్వ్యూ లో అయితే అనే ఉంటారు బహుశా.. రాజేంద్ర గారు అనుమానం నివృత్తి చేశారు, తన వీడియో లో చూడండి. పాటలు జయదేవ, వేటూరి, దేవులపల్లి వార్ల పేర్లు మాత్రమే ఇచ్చారు.

  లక్ష్మి గారు నెనర్లు :-) సంగతేంటి అని అడగొద్దన్నానని ఏంటి సంగతి అని అడుగుతున్నారా :-)

  రాజేంద్ర గారు బోలెడు నెనర్లు సార్.. ఇంత శ్రమ తీసుకుని వీడియో ఎక్కించినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. రమేష్ నాయుడి ఆణిముత్యం మేఘసందేశం. నాకైతే అన్ని పాటలూ సమానంగా నచ్చుతాయిందులో.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. అబ్రకదబ్రగారు నెనర్లు. నిజమేనండీ అన్ని పాటలు సమానంగా అలరిస్తాయి కానీ నా వరకూ మాత్రం మూడ్ ని పట్టి కొన్ని పాటలు కాస్త ఎక్కువ సమానంగా అలరిస్తాయి :-)

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.