తప్పునాన్న ఇప్పుడో పెద్దరికం ఒకటి ఏడ్చింది కదా ఇవన్నీ చేస్తే చుట్టూ ఉన్న జనాలు వింతగా చూసే అవకాశం ఉంది కనుక నువ్వు సైలెంట్ అయిపో అని బుద్ది చెప్పి కూర్చో పెట్టేశాను అనుకోండి కాకపోతే పోర్టికోలో ఏదో పని ఉన్నట్లు అక్కడ అవి ఇవీ సర్ధుతూ కాస్త వర్షం లో తడిచా :-) అప్పటి వరకూ తలుపులు బిగించి నిద్ర పోవడం వల్ల వేడిగా ఉన్న ఒంటి పై చల్లని వాన చినుకు పడగానే ... జిల్లు మని ఎంత హాయి గా ఉందో.. ఈ ఆనందం ఇంకెక్కడా దొరకదేమో ఈ వర్షం లో తప్ప అనిపించింది (షవర్ తిప్పుకున్నా దొరుకుతుంది బాస్ అని అంటే నేనేం చెప్పలేను:). అలా కాసేపు బయటే నిలబడి గోడ పై బడి విచ్చిన్నమౌతున్న వాన చినుకులనీ, ఉధృతమైన వాన చినుకుల తాకిడికి కిందకి వాలిపోయి అంత లోనే మేమేమీ తక్కువ తినలేదు అంటూ తిరిగి పైకి రావడానికి ప్రయత్నించే చెట్ల ఆకులనీ సున్నితమైన పూవులనీ చూస్తూ.. ఆకులపై పడుతూ అల్లరి గా వాన చేసే చప్పుడుని చెవులప్పగించి వింటూ, చల్లటి గాలినీ, అప్పుడప్పుడూ తనువును తడిమి పలకరించిన వాన తుంపరనీ మనస్పూర్తిగా అస్వాదిస్తూ కాసేపు బయటే గడిపి మెల్లగా తిరిగి లోపలికి వచ్చాను.
లోపలికి వచ్చి ఫ్యాన్, టీవీ లాటి శబ్ధ కాలుష్య కారకాలన్నిటినీ ఆపేసి కిటికీ లు తలుపులు పూర్తిగా తెరచి బయట కురుస్తున్న వర్షాన్ని వింటూ ఆ సాయంత్రాన్ని ఆనందంగా గడిపాను. ఈసారి మీరూ ప్రయత్నించి చూడండి వర్షాన్ని వినడం ఎంత బాగుంటుందో... వాన ఉధృతిని పట్టి ఒకో రకమైన శబ్దం వస్తుంది. మొక్కలపై కురిసే చిరుజల్లులు ఒకలా వినిపిస్తే, కొబ్బరాకులపై కురిసే వాన మరొకలా వినిపిస్తుంది. మెత్తటి మట్టిపై నిశ్శబ్ధం గా కురిసే వాన అద్భుతమైన అద్వితీయమైన కమ్మటివాసనని అందిస్తే, రాళ్ళపై కురిసే వాన చేసే హడావిడి చప్పుళ్ళుకి అంతే లేదు, ఇక వడగళ్ళ వాన చేసే శబ్దం గురించైతే ఇంక చెప్పనే అక్కరలేదు. మీరెపుడైనా నది దగ్గర కానీ కాలవ దగ్గర కానీ ఉన్నపుడు వర్షపడటం చూశారా.. నీళ్ళపై పడే వాన పలికించే టప టప ల సంగీతం ఒక ఎత్తైతే అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న నీటిపై చినుకులు సృష్టించే వేల కొద్దీ అలలు ఒకదాని తో ఒకటి పోటీ పడుతూ, ఒకదానిలో ఒకటి కలిసి పోతూ కలిగించే అలజడి చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. ఇక సముద్రం పై వాన పడటం ఎపుడైనా విన్నారా / చూశారా... నేను వైజాగ్ యూనివర్సిటీ లో ఉన్నరోజులలో నాకు ఈ ఆనందం దక్కింది. అనంతమైన నీటి పై జోరు గా పడుతున్న వాన చినుకులు సృష్టించే హోరు ఇంతా అంతా కాదు, హడావిడిగా ఉండే బీచ్ నుండి కాస్త ప్రశాంతమైన చోటికి వెళ్ళి శ్రద్దగా వింటే ఒక చిత్రమైన హోరు తో కలిసిన లయబద్దమైన సంగీతాన్ని వింటున్నట్లే అనిపిస్తుంది.
సరే మొన్న ఒక్క సారిగా ఇంత వర్షాన్ని వినీ, ఆస్వాదించి, ఆనందించీ.. ఆహా వర్షాన్ని వినడం చాలా బాగుంది కదా.. ఓ టపా రాసేద్దాం వీలైతే ఈ సారి వర్షాన్ని రికార్డ్ కూడా చేసేద్దాం అని తీర్మానించుకున్నాను. అంతలో అసలు ఈ వీడియోలు యూట్యూబ్ లో ఇప్పటికే ఉండి ఉంటాయేమో అని వెతికితే వేలకొద్ది దొరికాయి. వాటిలో మొదట కన్పించి ఉరుముల అలజడి లేకుండా కేవలం వర్షాన్ని మాత్రమే రికార్డ్ చేసిన ఈ వీడియో నాకు బాగా నచ్చింది ప్రజంటేషన్ కూడా మంచి చిత్రాల తో తయారు చేశారు. సో అది మీ అందరి కోసం ఇక్కడ ఇస్తున్నాను. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ కురిసిన వర్షపాతాన్ని గమనిస్తే... మన భావి తరాల వారు ఇక వర్షాన్ని ఇలాటి వీడీయోల లోనే చూసుకోవలసిన పరిస్తితి వస్తుందేమో !!
చాలా బాగు౦ది మీ పొస్ట్...మాటలు రాన౦తా బాగు౦ది.
రిప్లయితొలగించండినాకు వాన చాలా నచ్చుతు౦ది...
మీరు ఎ౦జాయ్ చెసిన౦తా చెయలెక పోయాను.
మీ పొస్ట్ చదువుతూ అన్ని వాన అనుభవాలు గుర్తు తెచ్చుకున్నా..
కాని అని నొట్ చెస్కున్నా... నాకోస౦ ఒకసారి పెద్ద వానా,వానా రామ్మ.
వర్షం గురించి కాదనుకోండి, అయినా అలాంటి చప్పుడు మీద ఓ జ్ఞాపకం. బొమ్మరిల్లులో చమత్కార శ్లోక కథ అని ఒకటి వచ్చేది. అందులో ఓ కథ గుర్తొచ్చింది. ఆ కథలో భోజరాజు ఓ సమస్య చెబుతాడు. ఆ సమస్య ఖచ్చితంగా గుర్తులేదు, "గుగ్గుళుం గుళుం గుళుః" ...ఇలాంటిదేదో.. ఎవరూ చెప్పలేకపోతారు, కాళిదాసుతో సహా. ఓ రోజు కాళిదాసు క్షిప్రా నది ఒడ్డున వ్యాహ్యాళికెళితే, అక్కడ నది ఒడ్డున ఓ పెద్ద నేరెడు చెట్టు. ఇంతలో ఆ చెట్టుపైన కోతి ఒకటి వచ్చి, ఆ పళ్ళను తింటూ, మధ్యమధ్యలో కొన్ని పళ్ళను నీళ్ళలోకి జారవిడుస్తూంటుంది. ఇంకేం! ఆ శబ్దం విని, ఆయన మరుసటి రోజు సమస్యను పూర్తి చేస్తాడు. ఆ కథ ఎక్కడైనా దొరికితే బావుణ్ణు.
రిప్లయితొలగించండిఇంటి ముందు వర్షం వల్ల ఏర్పడిన కాలువపై వర్షం పడే చప్పుడూ, దృశ్యమూ వర్ణించడానికి మాటలు చాలవు. సౌందర్యానుభూతి వస్తువులో లేదు, అనుభవించే మనసులో ఉంటుంది.
వీడియొ అద్భుతం ..చా ............లా .....................బాగుంది. చిన్న చిన్న సరదాలకి పెద్దరికమా !...ఎవరేం అనుకుంటేనేం ఆ క్షణాన నేను చిన్న పిల్లనే ..నేనెవరో తెలియని చోట ఇంకా అల్లరిపిల్లనే .మీ టపా చాల బాగుంది .
రిప్లయితొలగించండిఎంత బాగా రాసారు వేణూ. నిజం గా నాకైతే ఇక్కడే నా పక్కనే వర్షం పడుతున్నట్టు దానిలో నేను మైమరిచిపోయి అనుభూతి చెందుతున్నట్టు అనిపించింది. అద్భుతమైన టపా, హృద్యమైన వర్ణన.
రిప్లయితొలగించండి"ఇక సముద్రం పై వాన పడటం ఎపుడైనా విన్నారా / చూశారా... నేను వైజాగ్ యూనివర్సిటీ లో ఉన్నరోజులలో నాకు ఈ ఆనందం దక్కింది"....నాకు చాలా కుళ్ళుగా ఉంది, ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ చెప్పేది వైజాగు హాస్టల్ లో ఉన్నప్పుడు కిటికీ లోంచి చూస్తే సముద్రం కనబడేది..పౌర్ణమి రోజైతే ఎంత బావుండేదో అని, ఇప్పుడు A.Uలో చదువుతున్న నేస్తం ఏమో "వైజాగ్ లో బీచ్ తప్ప ఏం లేవే బాబు" అంటుంది, ఉన్న వారికి విలువ తెలీదుగా....ఏమిటో మిగతా అనుభూతులన్నీ ఉన్నందుకు ఆనందం కాదు ఆ ఒక్కటీ లేనందుకు వెలితి..., పిచ్చిమనసు...
రిప్లయితొలగించండివర్షం పడినప్పుడు ఆ అమృత ధారలో తడిసి ముద్దైన ప్రకృతి పులకింతను వర్ణించడానికి ఎన్ని పదాలూ సరిపోవు.... వర్షం లో తడిసిన పిట్టలు, కొమ్మపై ఆకుల కింద తలదాచుకొని ఒక్కసారి మెడంతా విదిల్చి నీటిని అన్ని వైపులా చిమ్మినప్పుడు చూడాలి...ఆహా ఎనత బావుంటుందో, ఇప్పటి djల పిచ్చి జుట్టులా నించున్న వాటి ఈకలు, ఎంత బుజ్జిగా ఉంటాయో, నీటి ముత్యాలతో అలంకరించిన సుమబాలల సొగసు
http://naachitraalu.blogspot.com/
చాలా బాగుంది .
రిప్లయితొలగించండి" ఒంటి పై చల్లని వాన చినుకు పడగానే ... జిల్లు మని ఎంత హాయి గా ఉందో.. ఈ ఆనందం ఇంకెక్కడా దొరకదేమో ఈ వర్షం లో తప్ప అనిపించింది (షవర్ తిప్పుకున్నా దొరుకుతుంది బాస్ అని అంటే నేనేం చెప్పలేను)"
రిప్లయితొలగించండిఇది మాత్రం నిజం ...ఎంత ఎండ ఉన్నా షవర్ లో వేడి నీరే చేస్తా స్నానానికి కాని వర్షం లో మాత్రం ఎంత చలిగా ఉన్నా తడుస్తాను .. బాగా రాసారు :)
చాలా బాగు౦ది వేణూ గారు !
రిప్లయితొలగించండివర్షంలో తడిపేశారండీ.. 'భారతీయుడు' చూసినప్పటి నుంచీ నాకో కొత్త సమస్య.. వర్షం మొదలవ్వగానే కరెన్సీ నోట్లతో పడవలు చేసి ఆడుకోవాలనిపిస్తోంది :-) ;-)
రిప్లయితొలగించండివర్షం ఒక్కటే కాదు, ప్రకృతి ధ్వనులు చాలా ఇలాంటి భావోద్వేగాలకి గురి చేస్తాయి మనల్ని, వినే మనసుంటే!
రిప్లయితొలగించండిమంచి టపా
చినుకేలేని సీమలోఉన్న మాకు వర్షంలోనాట్యమాడింపజేసారు.రవిగారన్నట్లు సౌందర్యానుభూతి వస్తువులో లేదు, అనుభవించే మనసులో ఉంటుంది.
రిప్లయితొలగించండిసుబద్ర గారు నెనర్లు, చాలా సంతోషం అండీ అనుభూతుల జల్లుల్లో తడిచారనమాట.
రిప్లయితొలగించండిరవి గారు నెనర్లు, భలే ఉందండీ కధ, నాకు కూడా ఎక్కడో విన్నట్లు ఉంది, చూద్దాం ఎవరన్న తెలియచేస్తారేమో. "సౌందర్యానుభూతి వస్తువులో లేదు, అనుభవించే మనసులో ఉంటుంది" నిజం అక్షర సత్యం చెప్పారు.
చిన్ని గారు నెనర్లు, మీరు అదృష్టవంతులండీ.. ఈ మొహమాటం ఉంది చూశారూ.. ఒకో సారి ఇలాటి చిన్ని చిన్ని ఆనందాలకి అలా చాలా అడ్డం పడి పోతుంది. అప్పుడపుడు నేను కూడా దాన్లో నుండి బయటపడి మనసారా ఆనందిస్తాను లెండి.
లక్ష్మి గారు నెనర్లు, నేను రాసిందేమీ లేదండీ ప్రకృతీ, వర్షం నాచేత అలా రాయించింది, అందుకే మీకంత మంచి అనుభూతిని అందించింది:-)
నేను, నెనర్లు. మీరు తీసే వానలో తడిచిన సుమబాలల చిత్రాలు నేను తరచుగా చూస్తుంటాను చాలా బాగుంటాయి. ఈ సారి మీనేస్తం అడిగితే వైజాగ్ లో బీచ్ ఉంది కదా అదొక్కటే చాలు ఇంకేమి అవసరం లేదు అని చెప్పండి. నిజంగా వెన్నెల్లో సముద్రాన్ని, ఎగసిపడే కెరటాలనూ చూస్తూ హోరు మని అలలు చేసే అల్లరిని వింటుంటే జీవితం లో ఇంకేమీ అవసరం లేదనిపిస్తుంది.
చైతన్య గారు నెనర్లు.
నేస్తం నెనర్లు. మీరు చెప్పినది నిజం ఎంత చలిలోనైనా వర్షం లో తడవాలనే అనిపిస్తుంది.
శ్రావ్య గారు నెనర్లు.
మురళి గారు నెనర్లు. సినిమాలు చూసి అంత ఖరీదైన అలవాట్లు నేర్చేసుకుంటే కష్టమండీ బాబు :-)
కొత్తపాళీ గారు నెనర్లు. టపా నచ్చినందుకు చాలా సంతోషం, నిజమేనండీ వినే మనసుంటే చాలా ప్రకృతి ధ్వనులు ఇలాటి మధురానుభూతులను అందిస్తాయి.
విజయమోహన్ గారు నెనర్లు. త్వరలో మీ సీమ వర్షపు జల్లులతో పులకించాలనీ, మీరు నిజమైన వర్షం లో నాట్యమాడాలని మనసారా కోరుకుంటున్నాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅడ్బుతమ్ వేను గారు నాకు కుడ చిన్నతనమ్ గుర్తు చేసరు. నీను, తమ్ముడు కిటికిలొనిన్చి ఇన్ద్ర దనస్సుని చుస్తు వేడి వేడి పకొడీ లు తిన్న రొజులు నాకు కూడ మి బ్లగు చడువు తున్నప్పుడు ఆ మట్టి వసన వస్తొన్ది. వాన అన్దమ్ ఒక యెతితె వాన తర్వత ప్రక్రుతి అన్త తడిసి అప్పుడె తలార స్ననమ్ చెసిన పిల్ల ఎన్కి ల చిన్న తడి గుర్తులతొ చెప్పలెను ఇక మిరు ఉహిన్చుకొవలసిన్డె.........
రిప్లయితొలగించండిశిరీష గారు తెలుగులో కామెంట్ రాయాలని మీరు చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాను. శ్రద్దగా కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు. కానీ చాలా తప్పులున్నాయండీ. ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వల్ల అనుకుంటా ఒకసారి ప్రూఫ్ రీడ్ చేసుకోండి. అలానే మీ ఇలాటి అనుభూతులను పంచుకోవడానికి చక్కగా ఒక బ్లాగ్ కూడా మొదలెట్టేయండి మరి ఆలశ్యమెందుకు :-)
రిప్లయితొలగించండి