డిశంబర్ అంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నెల అయిపోయింది నాకు. అసలు ఈ కోర్స్ చేయడం వెనక ఓ పిట్ట కథ ఉంది కానీ దాని వివరాలు మళ్ళీ ఎపుడైనా సమయం కుదిరినపుడు చెప్తాను. బేసిక్ కోర్స్ చేసిన ఆనందం సద్దుమణగక ముందే పార్ట్ 2 కోర్స్ చేద్దాం అని నిర్ణయించుకున్నాను. దానికోసమని మళ్ళీ ఆశ్రమం కి వెళ్ళిన వెంటనే శలవల్లో ఇంటికి వెళ్ళిన అనుభూతి కలిగింది. అక్కడి వైబ్రేషన్స్ మహిమో ఏమిటో తెలియదు కానీ ఆశ్రమం లో ఉన్నంత సేపూ బయటి ఇబ్బందుల గురించి కానీ సమస్యలగురించి కానీ ఆలోచనలు ఏమాత్రం రావు. ఎపుడూ ఒకటే ధ్యాస.. ధ్యానం.. సేవ.. అదో మధురమైన అనుభూతి. అనుకోకుండా నాతో కలిసి పార్ట్ 1 చేసిన ఒకతను నాతోపాటు పార్ట్ 2 చేయాలి అని నిర్ణయించుకున్నాడు ఇద్దరమూ అనుకోకుండా కలిసాము. ఇందులో మౌనవ్రతం ఉంటుంది అని తెలుసు బేసిక్ లో మేమిద్దరం నవ్వులతో కాస్త అల్లరి చేశాం మన వల్ల అయ్యె పని కాదు బాబు ఈ మౌనవ్రతాలు అవీ అదీకాక ఇంచుమించు మూడురోజులు ఉండాలిట సాధ్యమయ్యే పనేనా అదీ మనలాటి కోతులకు అని అనుకుంటూ మొదలుపెట్టాము. మొదటిరోజు అంతా ఏవో ప్రాసెస్ లు చేయించారు.
ఇక్కడ వీళ్ళ ప్రాసెస్ ల గురించి కొంచెం చెప్పుకోవాలి నిత్యజీవితంలో మనకి ఎదురుపడే వాటినుండే కొన్ని ప్రాసెస్ లను సృష్టించారు అవి చాలా ఎఫెక్టివ్ గా ఉన్నాయి అనిపించింది. ఉదాహరణకి పెద్దవాళ్ళకి జ్వరమో లేదో తీవ్రమైన అస్వస్థత కలిగినపుడు హ్మ్ హ్మ్ అని శబ్దం చేస్తూ మూలగడం వింటూ ఉంటాం. ఆ మూలుగు వల్ల బోలెడంత నెగటివ్ ఎనర్జీ బయటకి పోయి కాస్త శక్తివచ్చినట్లు ఫీల్ అవుతారు. వయసులో ఉన్నవారు అలా మూలగడానికి జంకడం గమనిస్తాం కానీ దానివలన చాలా ఉపయోగాలు ఉన్నాయ్. ఉదాహరణకి మీరు టెన్షన్ పడుతున్నపుడు అంటే ప్రజంటేషన్ ఇవ్వాల్సి వచ్చినపుడో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే ముందో ఇలా రెండుచేతులు పైకెత్తి వేగంగా ముందుకు జారవిడుస్తూ పెద్దగా శబ్దం చేస్తూ మూలుగు ద్వారా గాలి బయటకి వదిలారనుకోండి అప్పుడు మీలో నెగటివ్ ఎనర్జీ అంతా బయటకి వెళ్ళి తెలియని శక్తి వచ్చిచేరినట్లు ఫీల్ అవడమే కాక టెన్షన్ తగ్గి మరింత సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. ఇలాటివే కొన్ని ప్రాసెస్ లు మెడిటేషన్ టెక్నిక్స్ తో మొదటి రోజు గడిచింది.
అదే రోజు అంటే గురువారం రాత్రి 9 గంటలనుండి మా మౌనవ్రతం మొదలైంది, అప్పటినుండి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు మా మౌనవ్రతం కొనసాగింది అంటే దదాపు రెండున్నరరోజులు అంటే 63 గంటలు ఎవరితోనూ మాట్లాడకుండా సేవ చేసేప్పుడు ఒకటి రెండు సార్లు తప్పనిసరి పరిస్థితులలో కేవలం సంఙ్ఞల ద్వారా మాత్రమే సంభాషించి గడిపేశాము. మొదట్లో ఎలారా ఉండటం అనుకున్నాము కానీ శుక్రవారం మధ్యాహ్నానికి మాములు గా అనిపించింది ఏమాత్రం ఇబ్బంది కలగలేదు అసలు మాట్లాడాల్సిన అవసరం కానీ ఆలోఛన కానీ కలగలేదు. బహుశా కోర్స్ జరిగినంతసేపు నిశ్శబ్దంగా అయినా టీచర్ తో కమ్యునికేట్ చేయడం ఒక కారణం అయి ఉండవచ్చు లేదా కోర్స్ లో భాగంగా చేసిన మెడిటేషన్స్ కూడా ఒక కారణమై ఉండవచ్చు. మొత్తానికి చాలా కష్టమేమో అనుకున్నాం కానీ అవలీలగా పూర్తిచేసేశాం. ఎప్పటిలాగే ఆశ్రమం దినచర్యని, ఉదయాన్నే ఐదుగంటలకి నిద్రలేవడం, ఆరుగంటలకి యోగా, పగలంతా మెడిటేషన్ మరియూ సేవ తో అలసిపోవడం, సాయంత్రం గురూజీతో సత్సంగ్, కిచెన్ లో సాత్వికాహారం అన్నీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను.
అదే రోజు అంటే గురువారం రాత్రి 9 గంటలనుండి మా మౌనవ్రతం మొదలైంది, అప్పటినుండి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు మా మౌనవ్రతం కొనసాగింది అంటే దదాపు రెండున్నరరోజులు అంటే 63 గంటలు ఎవరితోనూ మాట్లాడకుండా సేవ చేసేప్పుడు ఒకటి రెండు సార్లు తప్పనిసరి పరిస్థితులలో కేవలం సంఙ్ఞల ద్వారా మాత్రమే సంభాషించి గడిపేశాము. మొదట్లో ఎలారా ఉండటం అనుకున్నాము కానీ శుక్రవారం మధ్యాహ్నానికి మాములు గా అనిపించింది ఏమాత్రం ఇబ్బంది కలగలేదు అసలు మాట్లాడాల్సిన అవసరం కానీ ఆలోఛన కానీ కలగలేదు. బహుశా కోర్స్ జరిగినంతసేపు నిశ్శబ్దంగా అయినా టీచర్ తో కమ్యునికేట్ చేయడం ఒక కారణం అయి ఉండవచ్చు లేదా కోర్స్ లో భాగంగా చేసిన మెడిటేషన్స్ కూడా ఒక కారణమై ఉండవచ్చు. మొత్తానికి చాలా కష్టమేమో అనుకున్నాం కానీ అవలీలగా పూర్తిచేసేశాం. ఎప్పటిలాగే ఆశ్రమం దినచర్యని, ఉదయాన్నే ఐదుగంటలకి నిద్రలేవడం, ఆరుగంటలకి యోగా, పగలంతా మెడిటేషన్ మరియూ సేవ తో అలసిపోవడం, సాయంత్రం గురూజీతో సత్సంగ్, కిచెన్ లో సాత్వికాహారం అన్నీ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను.
నేను ఆశ్రమంలో ఉన్న అయిదురోజులూ గురూజీ తో విశాలాక్షిమంటపంలో పాల్గొన్న సత్సంగ్ చిత్రం
మౌనవ్రతం ఆచరించిన అంత సేపు నాతోనేను ఎక్కువసమయం గడపగలిగాను ప్రతిపనిని అస్వాదిస్తూ చేశాను. మొత్తం మీద పార్ట్ 2 అయ్యాక నాలో నేను గమనించిన స్ఫుటమైన మార్పు ఏమిటంటే ఫ్లెక్సిబిలిటీ. ఇదివరకు నాలుగు అడుగులు వేయడానికి బద్దకించే నేను ఇప్పుడు కిలోమీటర్ పైనే ఉన్న ప్రదేశాలకు కూడా అవలీలగా నడిచి వెళ్ళి రాగలుగుతున్నాను. ఈ ప్రాక్టీస్ ఇలానే కొనసాగిస్తే నాకు మంచి మేలు జరుగుతుందనే భావిస్తున్నాను. కానీ కోర్స్ చివరిరోజు విపరీతమైన జలుబు దగ్గు పట్టుకుంది వారమైనా ఇంకా తగ్గుముఖం పట్టలేదు. ప్రస్తుతం నిన్నటినుండే హోమియో చికిత్స మొదలెట్టాను ఏమైనా సత్ఫలితాన్ని ఇస్తుందేమో చూడాలి.
శ్రీశ్రీ రవిశంకర గురూజీ సన్నిధానంలో మీ ప్రత్యక్ష అనుభవాలను అత్యంత సుందరంగా విపులీకరించారు. మేమూ మీతో ఆ అనుభవాలను పంచుకున్న అనుభూతి. అభినందనలు....నూతక్కి
రిప్లయితొలగించండినైస్ వేణు శ్రీకాంత్ గారు. నేను విన్నాను కాని ఎప్పుడు వెళ్ళలేదు. పండిట్ రవి శంకర్ గారి భగవద్గీత వీడియో చూసారా. చాలా బాగుంటాయి.
రిప్లయితొలగించండివేణు, ముందుగా అభినందనలు. ఇక ఆ కిలోమీటర్ నడకని పరుగ్గా మార్చి, చురుగ్గా నాలా పదమూడు మైళ్ళ మారథాన్ పరుగుకి సిద్దమవాలని దీవిస్తున్నాను. జలుబుకి విశ్రాంతిని మించిన మందు లేదు. ఏ పద్దతి లోనైనా సంకల్పం ముఖ్యం. మనసుని బంధించక, నిగ్రహం నేర్పితే చాలు. సత్సంగ్ ఎప్పుడూ ఉపయోగకరమే. ఒకటొకటిగా కడిగే కన్నా, కూరగాయలన్నీ ఒక సంచిలోనో, గిన్నెలోనో వుంచి శుభ్రం చేస్తే ఒకదాని రాపిడికి మరొకటి శీఘ్రంగా శుభ్రపడతాయి. సూక్షంగా సత్సంగ్ చేసే మేలు అదే. ఇక ఆయన చుట్టూ కాంతివలయం అన్నది సాధన చేత మనసు తెచ్చుకునే ఉన్నతస్థితి. ఒకసారి కబీర్, మరి కొందరు ఒక శవయాత్రలో వెళ్ళినపుడు అందరి శిరసుల వెనుకా ఒక కాంతివలయం వుందట. అదే శ్మశానవైరాగ్యం. తిరిగి వచ్చేప్పుడు కేవలం కబీరు మాత్రమే ఆ వలయాన్ని నిలుపుకున్నాడట, ఎందుకంటే ఆయనది జ్ఞానవలయం. సాధారణ వ్యక్తుల్లో ఆయా సంఘటలననుసరిమ్చి వచ్చే ఆ క్షణిక భావనలు శాశ్వతంగా నిలవటానికి ఈ ధ్యానం, సాధన, వైరాగ్యం అలవడాలి. ఇక మీరు వెళ్ళినటువంటి ప్రదేశాల్లో అంతా నిస్సార్థంగా మాత్రం వుండరు. అభినందనలు, ఇంకా ముందుకు సాగటానికి ఆకాంక్షలు. :)
రిప్లయితొలగించండివేణు గారూ, మీరు మీ ధ్యానాన్ని, ఈ కొద్ది రోజుల్లో నేర్చుకున్న ఆత్మవిశ్లేషణని [ మౌనవ్రతంలో తప్పక ఆలోచించి వుంటారని నా నమ్మకం] ఇలాగే కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిఅదృష్టవంతులు వేణు గారు, నేను పోయిన వారం సెలవు పెట్టా ఎలాగైనా పార్ట్ 1 చేరాలని, కానీ మూడు బందులు, ఆరు విధ్వంసాలతో హైదరాబాదు కళకళలాడిపోతోంది, దానితో కుదరలేదు. చూడాలి ఆ భాగ్యం ఎప్పటికి కలుగుతుందో
రిప్లయితొలగించండిబావుంది వేణు గారు, చక్కగా వివరించారు.
రిప్లయితొలగించండిటెన్షన్ తగ్గించే ప్రాసెస్ బావుంది వేణు గారు.
కానీ చుసిన వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచిస్తున!
చూస్తా ప్రయత్నించి చూస్తా
నూతక్కి గారు ధన్యవాదాలు, మొదటిసారి అడుగుపెట్టినట్లున్నారు నా బ్లాగు ముంగిట.. సుస్వాగతం.
రిప్లయితొలగించండిభావన గారు నెనర్లు. లేదండీ చూడలేదు అవకాశం దొరికిన వెంటనే చూస్తాను. వివరాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు.
ఉషగారు నెనర్లు. సుదీర్ఘమైన వ్యాఖ్యకు, మారథాన్ ఆశీస్సులకు ధన్యవాదాలు. సత్సంగ్ మరియూ కూరగాయల లాజిక్ బాగుందండి :-)
భారారె గారు నెనర్లు. నేనూ అదే కోరుకుంటున్నానండీ కాని మనసు చంచలం :-) దానిని అదుపులో పెట్టడానికి ప్రయత్నించే కొద్దీ మరింత అల్లరి చేస్తుంది.
లక్ష్మి గారు నెనర్లు. నిజమేనండీ హైదరాబాద్ పరిస్థితి కష్టంగానే ఉంది. నేను అవతార్ ఐమాక్స్ 3D కోసం వద్దామని అనుకుని కూడా వాయిదా వేసుకున్నాను. మీకు నూతన సంవత్సరం లోనైనా వీలు చిక్కుతుందని ఆశిస్తున్నాను.
ఫణి గారు నెనర్లు. మొదట మనం బయట పడాల్సింది ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అనుకునే ఆలోచన నుండేనండీ, కానీ మీరు స్టేజ్ మీదచేయాల్సిన పనిలేదు స్టేజ్ వెనకో, గ్రీన్ రూంలోనో, బాత్ రూంలోనో దొరికే ఏకాంతంలో చేసేయచ్చు.
బాగుందండి , మీరు రాసినది చదువుతుంటే ఇప్పుడే చేరాలనిపిస్తోంది .
రిప్లయితొలగించండిమాలా కుమార్ గారు నెనర్లు.
రిప్లయితొలగించండిమీ ఈ టపాలు చదువుతుంటే మాల గారు చెప్పినట్లు ఈ కోర్స్ లో వెంటనే చేరాలనంత ఇన్స్పిరేషన్ వస్తుంది వేణు గారు .
రిప్లయితొలగించండివేణు
రిప్లయితొలగించండిచాలా చాలా బాగున్నాయి మీ ఆర్ట్ ఒఫ్ లివింగ్ ముచ్చట్లు. మీ అనుభవాలను, అభిప్రాయాలను వర్ణిన్చిన తీరు అమోఘం..నాకు మీ బ్లోగ్ లు చదివే దాకా ఇటువంటి వాటి మీద ఎప్పుడూ ఇంట్రెస్ట్ కలగలేదు..కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ ఉరుకుల పరుగుల జీవితం లో అలాంటి ఒక్క రోజైన చాలు అని.
ఇంత మంచి విషయాలు ఇక్కడ ఇలా షేర్ చేస్కున్నదుకు ధన్యవాదాగళు..:-) God bless you!!
-గీత
శ్రావ్య గారు నెనర్లు. ఇకనేం మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేయండి. 165 దేశాల్లో ఉంది ఆర్ట్ ఆఫ్ లివింగ్.
రిప్లయితొలగించండిగీత గారు నెనర్లు. నిజమేనండీ మీరు చెప్పినట్లు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాటి ఒక్కరోజు చాలు.
@ Usha! wonderful thought...
రిప్లయితొలగించండి'ఒకటొకటిగా కడిగే కన్నా, కూరగాయలన్నీ ఒక సంచిలోనో, గిన్నెలోనో వుంచి శుభ్రం చేస్తే ఒకదాని రాపిడికి మరొకటి శీఘ్రంగా శుభ్రపడతాయి. సూక్షంగా సత్సంగ్ చేసే మేలు అదే.'
great Idea....Nutakki
Jai Gurudev :)
రిప్లయితొలగించండిమౌళిగారు జయ్ గురుదేవ్ :-)
రిప్లయితొలగించండివేణుగారూ నేను పార్ట్ ఒన్ చేశాను. ఏదో కొత్త ఉత్సాహం నిండినట్లు అనిపించిది. కొంత కాలం కంటిన్యూ చేశాను కాని తరువాత తరువాత చెయ్యలేక పోయాను. కోర్స్ మాత్రం ఓ కొత్త అనుభూతి. అభినందనలు.
రిప్లయితొలగించండిఅవును జ్యోతిర్మయి గారు, ప్రత్యేకించి ఆ కోర్స్ లో చేసే ప్రతి క్రియ శరీరంలో కొత్త శక్తిని చేరుస్తాయి. కామెంటినందుకు నెనర్లు(Thanks).
రిప్లయితొలగించండిGood one... :)
రిప్లయితొలగించండిథాంక్స్ అమృత గారు :-)
తొలగించండి