అప్పట్లో ఓ సినిమా కోసం "భయపడడం లోనే పడడం ఉంది మనం భయపడద్దు" అని త్రివిక్రమ్ గారు రాశారు కానీ అది ఆ సందర్భానికి మాత్రమే సూటవుతుంది. అలా అంటే జాగ్రత్తపడడంలో కూడా పడడం ఉందని వదిలేయలేం కదా. అందుకే భయపడి జాగ్రత్తపడదాం డూడ్ దాని వలన పోయేదేం లేక పోగా మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సహా ఆరోగ్యంగా ఉంటాం.
కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది పత్రికల భాషలో చెప్పాలంటే కోరలు చాచి ప్రజలపై విరుచుకు పడుతుంది. పరిస్థితి ఆల్రెడీ మన చేతుల్లోనుండి జారిపోయేలా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ జారిపోయింది. ఇపుడు మనం చేయగలిగిందల్లా జాగ్రత్తపడడమే.
గత సంవత్సరం ఇదే సమయానికి లాక్ డౌన్ లో ఎంత అప్రమత్తంగా ఉన్నామో ఇపుడూ స్వచ్ఛందంగా అలా జాగ్రత్తలు తీస్కోవాల్సిన సమయం ఇది. నిజానికి అంతకన్నా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంతో అవసరమైతే తప్ప బయటికి రావద్దు. ఇంటికి తెచ్చుకునే ప్రతీదీ శానిటైజ్ చేస్తూ రూల్స్ పాటిద్దాం. స్వచ్ఛందంగా లాక్ డౌన్ సెల్ఫ్ ఐసోలేషన్ పాటిద్దాం.
పండగలు పబ్బాలు ప్రతిఏడాదీ వస్తాయి. మల్లెపూలైనా, పనసతొనలైనా, మామిడి పళ్ళైనా, తాటి ముంజలైనా ప్రతీ వేసవి కాలంలోనూ వచ్చేవే మనిషి ప్రాణంకన్నా ఇవేవీ విలువైనవి కావు. ముందు బ్రతికుంటే మళ్ళా మళ్ళా ప్రతి ఏడూ ఎంజాయ్ చేయచ్చు కనుక మిత్రులందరూ జాగ్రత్తగా ఉండండి.
ఆ వచ్చాక మందులేస్కోవచ్చు అనో మనకేంటీ డబ్బులున్నాయ్ ఇన్సూరెన్స్ లు ఉన్నాయ్ ఎలాగో ట్రీట్మెంట్ తీస్కోవచ్చు అనో నిర్లక్ష్యం చేయద్దు. అందరం అప్రమత్తంగా ఉండి అసలు ఆ అవసరం రానివ్వకుండా జాగ్రత్త పడి మెడికల్ సిస్టం మీద లోడ్ తగ్గిద్దాం. ఇప్పటికే చాలా హాస్పిటల్స్ లో బెడ్స్ కరువై ట్రీట్మెంట్ కరువై ఏం చేయాలో అర్ధం కాని పరిస్తితుల్లో ఉన్నవారి హృదయవిదారక కథలు వింటూనే ఉన్నాం. ముందు జాగ్రత్త ఒకటే దీనిని కట్టడి చేయడం లేదా నివారించగలిగే మార్గం.
అలాగే "వ్యాక్సీన్ వచ్చింది కదా ఇంకెక్కడి కరోనా" అనే మాటలని ఎవరు చెప్పినా నమ్మకండి. మనకి దొరికింది వ్యాక్సీన్ మాత్రమే అతీంద్రియ శక్తుల మంత్రదండం కాదు. ఇది ఓ తాత్కాలిక ఉపశమనం మాత్రమె అది వేయించుకున్నా కొన్ని సార్లు మనకీ రావచ్చు లేదా వైరస్ వాహకాలుగా వ్యవహరించి మనింట్లోనే మనకి తెలియకుండా మనం మన ఆత్మీయులకి ఇతరులకి అంటిస్తూ ఉండచ్చు.
కనుక అప్రమత్తంగా ఉంటూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, అనవసరంగా చేసే విహారాలని అరికడుతూ, శానిటైజేషన్ అండ్ శుభ్రతని నూటికి రెండొందల శాతం పాటిస్తూ కరోనా వ్యప్తిని అరికడదాం. దిస్ టూ షల్ పాస్. ఓపిక గా ఎదురు చూద్దాం.
సెకండ్ వేవ్ సిప్టమ్స్ అంటూ కొన్ని లక్షణాలు అదనంగా సర్క్యులేట్ అవుతున్నాయి. వీటి అథెంటిసిటీ గురించి నాకు తెలియదు కానీ అప్రమత్తంగా ఉండడం మంచిదే. ఆ వివరాలు టైంస్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ లో ఇక్కడ క్లిక్ చేసి చూడండి. వీటిలో కొన్ని కళ్ళు పింక్ కలర్ కి మారడం, ఊపిరాడకపోవడం, స్టమక్ అప్సెట్, మానసిక అస్థిరత, గుండె వేగంగా కొట్తుకోవడం లాంటివి ఉన్నాయ్.
కరోనా గురించి పొయినేడాది నేను పంచుకున్న సమగ్రమైన సమాచారం ఈ పోస్ట్ లో ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి చూడవచ్చు.
వెరీ ట్రూ అండి..అలానే పాజిటివ్ వస్తే వెంటనే..దాచకుండా..తమతో కనెక్టడ్ గా ఉన్నావారందరినీ హెచ్చరించడం కూడా చాలా ముఖ్యం..
రిప్లయితొలగించండికరెక్ట్ అండీ చాలా ముఖ్యమైన పాయింట్ యాడ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.
తొలగించండి