పవన్ కళ్యాణ్ పవర్ పాక్డ్ పెర్ఫార్మెన్స్ తో బ్లాక్ బస్టర్ గా నడుస్తున్న తన కొత్త సినిమా వకీల్ సాబ్ ఈ పాటికే అందరూ చూసే ఉంటారు. లేకుంటే కనుక చూసేయండి. ఈ సినిమా గురించి నా అభిప్రాయం ఇక్కడ చదవవచ్చు. ఓ మంచి సినిమా చూశామనే అనుభూతి కోసం, మహిళల పట్ల దృక్పధాన్ని సరిదిద్దుకోవడం కోసం ప్రతి ఒక్కరూ చూసి తీరవలసిన సినిమా వకీల్ సాబ్.
ఈ సినిమా విడుదలై విజయవంతంగా నడుస్తూ వారం గడిచింది కనుక స్పాయిలర్స్ అయినా నాకు నచ్చిన కొన్ని సంభాషణలు ఇక్కడ పొందు పరుస్తున్నాను. ఇంకా సినిమా చూడని వారు దయచేసి సినిమా చూసిన తర్వాత చదవగలరు.
"రాముడు అయోధ్యలో ఉన్నా అడవిలో ఉన్నా ఆనందంగానే ఉంటాడు. కానీ చూడ్డానికి భక్తుల మనసుకే కష్టంగా ఉంటుంది.""అడుక్కుంటే అన్నం దొరుకుతుంది కష్టపడితే నీడ దొరుకుతుంది కానీ ఏం చేసినా సామాన్యులకి న్యాయం మాత్రం దొరకడం లేదు.""కాళ్ళ క్రింద యాక్సిలేటర్ ఉంది కదా అని తొక్కితే రూల్సే కాదు బోన్స్ కూడా బ్రేక్ అవుతాయి.""ఆడవాళ్ళు మనకు ఆనందాన్ని మాత్రమే ఇవ్వాలి, హక్కుల గురించి అడిగితే.. ఇలా బోన్ లో నిలబెట్టి వేశ్య అని ముద్ర వేస్తాం. ఇదేం న్యాయం ?""ఆడది అంటే వాడి బాత్ రూం గోడమీద బొమ్మ కాదు వాడిని కనిపెంచిన అమ్మ కూడా.""చీడ పురుగులు మగవాళ్ళ తలలో పెట్టుకుని మందు ఆడవాళ్ళ మీద కొడితే ఎలా.""ఓటమి అంటే అవమానం కాదు, మనల్ని మనం తెలుసుకునే గొప్ప అవకాశం.""మద్యం తాగడం హానికరం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. మగవాళ్ళు తాగితే పడిపోతారు ఆడవాళ్ళు తాగితే పడుకుంటారు అనుకోవద్దు.""ఒక మనిషికి ఉన్న అలవాట్లను బట్టి క్యారెక్టర్ ని ఎలా డిసైడ్ చేస్తాం.""మన ఇంట్లో ఉండే గడియారంలో చిన్న ముల్లు కూడా అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది.""రాత్రి పూట ఓ అమ్మాయి ఒంటరిగా వెళ్తే బైకులూ, కార్లు ఆటోలు అన్నీ స్లోడౌన్ అవుతాయ్. సైడ్ విండోలు కిందకి దిగుతాయ్, జిరాఫీల్లా తలలు పొడుచుకొస్తాయి.. చూపులు సూదులవుతాయి..""అబ్బాయిలు బయటకొస్తే సరదా.. అమ్మాయిలు బయటకొస్తే మాత్రం తేడా!""అమ్మాయిలు మనస్ఫూర్తిగా అబ్బాయితో నవ్వుతూ మాట్లడకూడదు, మాట్లాడేప్పుడు అసలు టచ్ చేయకూడదు, హింట్ ఇచ్చేసింది సిగ్నల్ ఇస్తుంది అని ఫీలైపోతారు. ఇదేం న్యాయం.""అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యునికేషన్ ఆడబిడ్డలు నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూల్చే క్యారెక్టర్.""నవ్వడమనే ఒక సహజ ప్రవర్తన కూడా ఒక అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది బరితెగించిన క్యారెక్టర్ అని ముద్ర వేస్తుంది.""అమ్మాయి ఒంటరిగా అబ్బాయిలతో ఎక్కడికీ వెళ్ళకూడదు, వెళ్తే దేనికైనా రెడీ అని ఊహించుకుంటారు, తనని ఆ అబ్బాయి ముట్టుకోడానికి, పట్టుకోడానికి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేసింది అని ఫిక్సయిపోతారు.""అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికీ లేదు. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఫ్రెండ్ అయినా, బోయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా ఏ మగాడైనా.""ఆశతో ఉన్నోడికి గెలుపు ఓటములు ఉంటాయి. ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది.""నిజం ఎప్పుడూ ఒంటరిదే కానీ దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే.""నువ్వు గెలుపుకోసం వచ్చావు.. నేను న్యాయం కోసం వచ్చాను. నీది స్వార్ధం నాది ధర్మం.""వాళ్ళు సామాన్యులు నీలాంటోడు పెడతా అంటే ఆశపడ్తారు బెదిరిస్తే భయపడతారు. ఆశకీ భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళవి.""కోర్టులో వాదించడమూ తెలుసు. కోటు తీసి కొట్టడమూ తెలుసు.""జనం కోసమే ప్రాణం ఇచ్చేవాడు. తనే ప్రాణం అనుకుని వచ్చిన దాన్ని నన్నింక ఎంత బాగా చూసుకుంటాడు.""బలహీనంగా ఉన్నదాని గురించి బలంగా నిలబడతాడు. తనకి ఏది ఉందో అందరికీ అదే ఉండాలి అనుకుంటాడు.""ఆయన ఒక మాటన్నాడంటే దానికో విలువుంటుంది. ఏదన్నా జేసిండంటే అందరికీ ఉపయోగం ఉంటది.""ఒకప్పుడు ఊళ్ళకోసం రోడ్లేసేటోళ్ళు ఇపుడు రోడ్లకోసం ఊళ్ళే ఖాళీ చేయిస్తున్నారు.""మనిషి బతికేది ఆశతో.. ఆ ఆశే సచ్చినాక మనిషికి చావే సుఖమనిపిస్తుంది.""ఆవేశంతో చేస్తే కొందరికే న్యాయం చేయగలం అదే ఆలోచనతో చేస్తే అందరికీ న్యాయం చేయగలం.""మీరు జనం కోసం చాలా కోల్పోయారు. కానీ మీరు దూరమై జనాలు జీవితాల్నే కోల్పోతున్నారు, మీ మౌనం సమాన్యులకు శాపం కాకూడదు.""ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నాలో ఆవేశం తగ్గదు ఆశయం మారదు. నల్లకోటు వేస్కున్నానంటే వేస్కోటనికి పిటీషన్లు తీస్కోటానికి బెయిళ్ళు ఉండవు."
బాబూ వేణూశ్రీకాంత్,
రిప్లయితొలగించండిమీరు వ్రాసే సినిమా సమీక్షలు చదివినప్పుడల్లా నాకొక సందేహం కలుగుతుంటుంది. అదేమిటంటే -
ఆ సినిమాలో మీకు నచ్చిన కొన్ని సంభాషణల లిస్టు కూడా ఇక్కడ వ్రాస్తుంటారు కదా. సినిమా హాల్లో కూర్చుని చూసిన సినిమాలోని ఆ సంభాషణలన్నీ యధాతథంగా ఎలా గుర్తుంటాయి మీకు? అదే OTT లో చూస్తుంటే ఇబ్బంది ఉండదు - కావలసిన చోట pause చేసి rewind చేసుకుని కావలసినంత సేపు వినచ్చు. తాపీగా కాగితం మీద వ్రాసుకోవచ్చు. కానీ సినిమా హాల్లో ఎలా వీలవుతుంది, స్వామీ 🤔? మరి ఆ కిటుకేమిటి?
(ఏమనుకోకండి గానీ సినిమా విడుదల అయిన వెంటనే చూసేసే కుర్రతనపు ఉత్సాహం మీలో ఇంకా ఉన్నట్లుందే 🙂? మరీ మొదటిరోజు మొదటాట మొదటి టిక్కెట్ లెవెల్ కాకపోయుండచ్చేమో గానీ మొత్తానికి మొదటి వారంలోనే సమీక్ష వ్రాసేస్తుంటారు కదా 🙂🙂)
హహహ థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ విన్నకోట గారు. గుర్తుపెట్టుకుని అలాగే రాయడం ఏ రజనీ రోబో కో మాత్రమే సాధ్యమయే విషయమండి :-) నాకు కొన్ని గుర్తుంటాయ్ కొన్నిటి కోసం ఇతర మార్గాలను ఉపయోగిస్తాను.
తొలగించండిఅనుకోడానికేం లేదండీ.. కరోనా వల్ల కాస్త ఆగాను కానీ నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రేక్షకుడినేనండీ. ఉదయం ఐదుగంటల వరకూ నైట్ షిఫ్ట్ లో పని చేసి పదిన్నరకి మోర్నింగ్ షోకి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి :-)
తొలగించండిమొబైల్ లో ఎమ్ పీ థ్రీ రికార్డింగ్ ఏమైనా మొత్తం సినిమా చేసేస్తారాండీ కొంపదీసి ? :)
నాకొక సందే హంబగు!
మీకెట్లాగండి గుర్తు మీగడ తెరలై
రాకెట్లా దూకుచు నల
వోకగ వరలు డవిలాగులున్? శ్రీకాంతా!
జిలేబి
అదొక టాప్ ట్రేడ్ సీక్రెట్ జిలేబి గారు :-) విన్నకోట వారితో వివరించి చెప్పలేకనే ఇతర పద్దతులు అన్నది :-)
తొలగించండి