అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, జనవరి 24, 2011

విరామం

నా బ్లాగులకు కొంతకాలం విరామం ప్రకటిస్తున్నాను. నా ఙ్ఞాపకాలు, అనుభూతులు, అనుభవాలు, ఆలోచనలు మళ్ళీ మీ అందరితో పంచుకోవాలని అనిపించినపుడు మళ్ళీ వస్తాను. అంతవరకూ శల...

శనివారం, జనవరి 22, 2011

ఒక్కసారి మాట్లాడాలని ఉంది..

“అమ్మా నేను హాస్టల్ కు వెళ్ళక తప్పదా !! ఇక్కడే ఉండి బాగా చదువుకుంటానమ్మా.. ఇంటర్మీడియేట్ కే హాస్టల్ ఏమిటీ? హాస్టల్ లో నేను ఉండలేనమ్మా.. పంపించద్దు..” కళ్ళ నిండుగా నీళ్ళు ఎపుడు దూకుదామా అని రడీగా ఉన్నాయ్ వాటిని బలవంతాన ఆపుకుంటూ బిక్కమొహం వేసుకుని అమ్మని బతిమిలాడుతున్నాను.. “ఇక్కడ ఉండి చదవవని కాదురా.. అక్కడ ప్రత్యేక శ్రద్ద తీసుకుని చదివిస్తారు నీ ఫ్యూచర్ కే మంచిది. ఈ రెండేళ్ళు కష్టపడి చదివావనుకో స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది అప్పుడు ఇంక నీ ఇష్టం.. అయినా నీకు చెప్తున్నాం కానీ మేం మాత్రం ఉండగలమా.. ప్రతి ఆదివారం వస్తావు కదా. మధ్యలో ఒక రోజు పక్కింట్...

శుక్రవారం, జనవరి 14, 2011

హాస్టల్ – 10 (జిల్ జిల్ జిలాని)

ప్రతి స్కూల్లోనూ ఆమాటకొస్తే ప్రతి క్లాస్ లోనూ సకలకళావల్లభుడు ఒకడుంటాడు.. వీడు మంచి హుషారైన వాడుంటాడు వాడులేకపోతే క్లాస్ లో సందడే ఉండదు, వాడికి లేని మంచి అలవాటంటూ ఉండదు :-P గోడలు దూకడం, అల్లరి చేయడం, జనాలని ఏడిపించడం, అపుడపుడు తమ తింగరి చేష్టలతో క్లాసు మొత్తాన్ని మూకుమ్మడిగా నవ్వించడం ఈ ఒక్క మహానుభావుడికి మాత్రమే చెల్లుతుంది అలాంటోడే మా జిలానీ. వాడేం చేసినా ఎంత బుద్దిగా ఒద్దికగా చేద్దామన్నా అది చిరిగి చేటంత అవుద్ది. అలాగని రాముడు మంచి బాలుడులా బుద్దిగా ఉండరా అని చెప్తే ఒక రోజు మహా అయితే రెండు రోజులు ఉంటాడు అంతే మళ్ళీ మాములే... ఉదయం స్టడీ అవర్ కోసం...

గురువారం, జనవరి 13, 2011

హాస్టల్ - 9 (రాకుమారుని రాఖీ చెల్లి)

సహజ.. మూడక్షరాల ఆ పేరు తలచుకోగానే మదిలో వీణలు మోగినట్లుగా, దేవుడిగది తలుపులు తీస్తుంటే తలుపులకున్న చిరుగంటలు ఒక్కసారిగా ఘల్లుమన్నట్లుగా, సుతిమెత్తగా అడుగులచప్పుడు వినపడకుండా నడిచే ఇంతి కాలి మువ్వలు లయబద్దంగా చేసే సవ్వడి వింటున్నట్లుగా, మనసంతా ఓ తీయనైన అనుభూతితో నిండిపోతుంది. అందానికి మరో పేరు సహజ.. మూర్తీభవించిన సౌందర్యం సహజ.. పదహారణాల అచ్చతెలుగుదనానికి చక్కని రూపం వస్తే అది ’సహజ’. కుదురుగా పొడవుగా అల్లిన జడలో ఒదిగిన ఒత్తైన నల్లని కురులు, పొందికగా కట్టుకున్న లంగాఓణీ, సదా పెదవులపై ఉండీలేనట్టు తొణికిసలాడే సన్నని చిరునవ్వు. విఙ్ఞానం, అమాయకత్వం, అణుకువ...

శనివారం, జనవరి 08, 2011

ఎల్విస్ ది కింగ్

ఆంధ్రాయూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లోచేరిన మొదటి సంవత్సరం.. చేరి రెండునెల్లై ఉంటుంది.. సాయంత్రం నాలుగున్నర సమయం ల్యాబ్ వర్క్ ఫినిష్ చేసుకుని నా క్లాస్మేట్స్ అంతా వేరేదారిలో వాళ్ళ 7th బ్లాక్ వైపు వెళ్ళగా ఒంటరిగా నేనుండే 4th బ్లాక్ హాస్టల్ వైపు తలవంచుకుని వడివడిగా అడుగులేస్తున్న నాకు “రేయ్ ఇలా రారా..” అంటూ ఓ సింహఘర్జన వినిపించింది. భయం భయంగా చుట్టూ చూస్తూ.. హస్టల్ ముందున్న సిమెంట్ బెంచీల మీద కూర్చున్న సీనియర్స్ ని “నన్నా సార్” అని అడిగాను. “ఆ నిన్నేరా.. నువ్వుకాకుండా ఇంకెవరున్నారు అక్కడ.. బాగా తెలివిమీరారురా” ఒకతను జవాబిచ్చాడు. నా కాళ్ళలో శక్తి...

మంగళవారం, జనవరి 04, 2011

హాస్టల్ - 8 (అనగనగా ఓ రాత్రి!!)

“వేణుగా వర్మ సినిమారా.. చాలా బాగుందంటరా.. అసలు సౌండ్ ఎఫెక్ట్స్ కోసమైనా చూసితీరాలంటరా..” అంటూ ఉదయం క్లాసుల మధ్య ఇచ్చిన బ్రేక్ లో మా భరత్ గాడు మొదలెట్టాడు. “అవునంటరా మొన్న క్యాంటీన్ లో పేపర్ లో చూశాను ఏదో కొత్త సౌండ్ సిస్టం అన్నారు అదేంట్రా..” అడిగాను నేను. “6 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ బే, అదికూడా తెలియదు సినిమా చూట్టానికి రెడీ ఐపోయాడు..” నవ్వుతూ అంటూ ఇంకో పక్కనుండి బాజీ గాడు ఓ టెంకిజెల్ల ఇచ్చాడు. “తెలుసా సినిమాలో బస్సు కుడిపక్కనుండి ఎడంపక్కకు మన వెనకగా నిజంగా వెళ్తున్నట్లు అనిపిస్తుందంట.. ఇలాంటి ఎఫెక్ట్స్ ఇంకాబోలెడంట..” అంటూ భరత్ కంటిన్యూ చేశాడు. ఆరోజే...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.