మొదట్లో నేను చూసిన ఎపిసోడ్స్ లో కామెడీ కధ కన్నా పాటలకి పేరడీ లు కట్టి వెటకారం చేయడం ఎక్కువ ఉండేది కొన్ని ఎంత బాగా నచ్చేవో కొన్ని అంత చిరాకూ తెప్పించేవి. తర్వాత కొన్ని రోజులకి అన్నీ నచ్చడం మొదలు పెట్టాయి మెల్లగా నేను కూడా Addict అయిపోయాను. మరీ పనులు మానుకుని కాక పోయినా ఆదివారం ఖాళీ వుంటే మాత్రం వదలకుండా చూసే వాడ్ని. మామూలు సాగతీత సీరియల్స్ లా లేకుండా ఇది ఏ వారానికి ఆ వారం చిన్న చిన్న పిట్టకధల లా ఉండటం తో బాగా నచ్చేసింది.
అన్నట్లు ఆదివారం అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఇంకా వేస్తున్నాడో లేదో కానీ అప్పట్లో ఈటీవీ లో ఆదివారం రాత్రి 9:30 కి జంధ్యాల గారి సినిమాలు వేసే వాడు. శ్రీవారికి ప్రేమలేఖ సినిమా అందులో చాలా సార్లు వేసేవాడు అది టెలికాస్ట్ అయిన ప్రతీ సారీ చూసే వాడ్ని. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని హాస్యం ఆ సినిమాకే సొంతం.
ఇక సిరివెన్నెల గారు రాసిన ఈ సీరియల్ టైటిల్ సాంగ్ ఎంత ఇష్టమంటే, Just Yellow banner ఈ పాటా, లిటిల్ సోల్జర్స్, ఐతే మూడూ కలిపి CD రిలీజ్ చేస్తే నాకు బెంగళూరు లో దొరకడం లేదు అని హైదరాబాద్ నుండి ఒక ఫ్రెండ్ వస్తుంటే తనతో తెప్పించుకున్నా :-) అంత ఇష్టం అనమాట.
సీరియల్ : అమృతం
సంగీతం : కల్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కల్యాణి మాలిక్
అయ్యోలూ హమ్మోలు..ఇంతేనా బ్రతుకు హు హు హు.....
ఆహాలూ ఓహొలు..ఉంటాయి వెతుకు హ హ హ.....
మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోలు....
ఇట్టే మార్చేద్దాము ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు.....
వార్తల్లొ హెడ్ లైన్సా... మన కొచ్చే చిలిపి కష్టాలు......
అయొడిన్ తో అయిపోయే.. గాయాలే మనకు గండాలు....
ఎటో వెళ్ళి పోతూ..నిన్ను చూసింది అనుకో ఓ ట్రబులు..
hello..how do u do.. అని అంటోంది అంతే నీ లెవెలు.
ఆతిధ్యం ఇస్తానంటె మాత్రం వస్తుందా...
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా..
గాలైనా రాదయ్యా..నీదసలే ఇరుకు అద్దిల్లు....
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు...
ఒరేయ్ ఆంజినేలు .. తెగ ఆయస పడిపొకు చాలు....
మనం ఈదుతున్నాం..ఒక చెంచాడు భవ సాగరాలు..
కరెంటు రెంటు etc., మన కష్టాలు...
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ.. ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే.. టెన్షన్ లేం పడకు గోలీ మార్.
సంగీతం : కల్యాణి మాలిక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కల్యాణి మాలిక్
అయ్యోలూ హమ్మోలు..ఇంతేనా బ్రతుకు హు హు హు.....
ఆహాలూ ఓహొలు..ఉంటాయి వెతుకు హ హ హ.....
మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోలు....
ఇట్టే మార్చేద్దాము ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు.....
వార్తల్లొ హెడ్ లైన్సా... మన కొచ్చే చిలిపి కష్టాలు......
అయొడిన్ తో అయిపోయే.. గాయాలే మనకు గండాలు....
ఎటో వెళ్ళి పోతూ..నిన్ను చూసింది అనుకో ఓ ట్రబులు..
hello..how do u do.. అని అంటోంది అంతే నీ లెవెలు.
ఆతిధ్యం ఇస్తానంటె మాత్రం వస్తుందా...
తీరిగ్గా నీతో కాలక్షేపం చేస్తుందా..
గాలైనా రాదయ్యా..నీదసలే ఇరుకు అద్దిల్లు....
కాలైనా పెడుతుందా నీ ఇంట్లో పెను తుఫానసలు...
ఒరేయ్ ఆంజినేలు .. తెగ ఆయస పడిపొకు చాలు....
మనం ఈదుతున్నాం..ఒక చెంచాడు భవ సాగరాలు..
కరెంటు రెంటు etc., మన కష్టాలు...
కర్రీ లొ కారం ఎక్కువ ఐతె కన్నీళ్ళు
నైటంతా దోమల్తొ.. ఫైటింగే మనకి గ్లోబల్ వార్..
భారీ గా ఫీల్ అయ్యే.. టెన్షన్ లేం పడకు గోలీ మార్.
nice one manchi song ni parichayam chesinaduku thanks andi
రిప్లయితొలగించండినమస్తే అండి. నేనూ మొదట్లో మీ లాగే ఎన్నో వుండగా ఆర్డినరీ సీరియల్ అనుకొని చూడటానికి ఇష్టపడకున్నా ఇంట్లో నవ్వులను చూసి ఓపిక పట్టి కూర్చుంటే అర్దమైంది రొటీన్ లైఫ్ కు దగ్గరలో కామెడీగా సాగే సన్నివేశాలు పాత్రలు చాలా నవ్వించాయి. సీరియల్ చూడనిది సన్డే కాస్త ఫన్ని డే కాకుండా వుంటుండె. సాంగ్ పెట్టి మరి ఇంట్లో పిల్లలు రాత్రిబోజనమ్ చేసేవారు. మీరు మల్లీ ప్రస్తావించడం, మంచి జ్జాపకాని గుర్తు చేయడం నచ్చింది.
రిప్లయితొలగించండినిజంగా ఏడుపుగొట్టు ప్రోగ్రాముల మధ్య అమృతం నిజంగా అమృతమే… సిరివెన్నెల గారు తేలికైన పదాలతో మిడిల్ క్లాస్ కష్టాలని ఈజీగా చెప్పారో…
రిప్లయితొలగించండిపాట ఉన్నంత బాగా సీరియల్ ఉండదండి.మొదట్లో అమృతం కారెక్టర్ ని శివాజిరాజా వేసాడు.అప్పుడు బాగుండేది.తరవాత విష్ణువర్ధన్ వేసాడు.అప్పుడు పరవాలేదనిపించింది.కాని ఇప్పుడు నరేష్ వేస్తున్నాడు.ఆయనగారి ఓవర్ యాక్షన్ చూసి నాకు జీవితం మీద విరక్తి వచ్చి సీరియల్ చూడటం మానేసాను.
రిప్లయితొలగించండి@క్రాంతి,
రిప్లయితొలగించండిఅవునండి, శివాజి రాజా వేసినన్నాళ్ళు బాగా నవ్వొచ్చేది. ఆదివారం 8-30 కి ఇంట్లో ఉండాలనిపించేది. తర్వాత హర్ష వర్ధన్ ఓకే!నరేష్ మొదలెట్టాక 8-30 కి బయటికెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సొచ్చేది.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి@నాని, @పృధ్వి, @రవి
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యలకు నెనర్లు
@క్రాంతి గారు
అవునండి నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయాను నరేష్ చెడగొట్టాడు నేను అతనివి ఒకటో రెండో ఎపిసోడ్స్ చూసాను అంతే. JY team కూడా ఆ విషయాన్ని త్వరగానే గుర్తించి మళ్ళీ హర్షవర్ధన్ తో replace చేసారు తర్వాత బానే ఉన్నాయి. సో కొన్ని వారాలు ఆగి హర్ష వచ్చాక మళ్ళీ చూడండి. సిరివెన్నెల గారి పాట తో పోల్చలేం కానీ బావుంటాయ్.
@సుజాత గారు
మీ హాస్య చతురత(Sense of humor) కి జోహార్లండీ "8-30 కి బయటికెళ్ళేలా ప్లాన్ చేసుకోవాల్సొచ్చేది." సూపర్.
నేను ఈ సీరియల్ చూడటం మొదలు పెట్టింది, హర్షవర్ధన్ అమృతం అయినప్పటినుంచి. ఏడుపుగొట్టు సాగతీత సీరియల్స్ మధ్యలో కాసేపు నవ్వుకోవటానికి హాయిగా అనిపించేది. మధ్యలో కొన్నాళ్ళు తెలుగు చానల్స్ నుంచి బ్రేక్ వచ్చాక మళ్ళీ ఇప్పుడు చూస్తే నరేష్ వచ్చి చేరాడు. ఎందుకో ఇప్పుడు అంతగా నచ్చటం లేదు. ఇంతకు ముందు జెమినీ లో వచ్చేది, ఇప్పుడు మా టివి లో వస్తుంది.
రిప్లయితొలగించండినాకు ఈ పాటంటే చాలా ఇష్టం. "మనం ఈదుతున్నాం..ఒక చెంచాడు భవ సాగరాలు.." ఈ లైను వింటే అన్ని టెన్షన్స్ పోయి మనసంతా భలే తేలికగా అయిపోతుంది.
రిప్లయితొలగించండినరేష్ తరువాత మళ్ళా హర్షవర్ధన్ వస్తాడు చూడండి.అప్పటి నుండి బాగుంటుంది.మొదట్లో జెమినిలో,తరువాత మాటీవీలో,ఇప్పుడు జీ టీవీలో వస్తుంది.నాకు ఈ పాటంటే చాలా ఇష్టం.మనకొచ్చే కష్టాలు నిజం గా చాలా చిన్నవి కదా అని అనుకోకుండా వుండలేను విన్న ప్రతి సారీ.
రిప్లయితొలగించండి@Venu గారు
రిప్లయితొలగించండినెనర్లు, ఇప్పుడు జీ తెలుగు లో వస్తుందండీ... నరేష్ ఎపిసోడ్స్ తప్ప మిగిలినవి బాగానే ఉంటాయ్.
@శ్రీవిద్య గారు
నెనర్లు, నిజమేనండి కష్టం అనిపించినపుడు నేనూ ఈ చెంచాడు భవసాగరాలని :-) గుర్తు తెచ్చుకుంటా...
@రాధిక గారు
నెనర్లు, అవునండీ సిరివెన్నెల గారు మంచి హ్యూమర్ టచ్ తో చెప్తారు మన కష్టాలు ఏపాటివి అని.
అన్ని సీరియల్స్ ఒకలా ఉండవు అని నిరూపించిన ధారావాహికం ఇది. పనులు మానుకుని మరీ చూసే ఏకైక టీవీ ప్రోగ్రాం. మళ్ళీ గుర్తు చేసినందుకు థాంక్స్!!
రిప్లయితొలగించండిpurnima
@పూర్ణిమ
రిప్లయితొలగించండిమీ వ్యాఖ్యకు నెనర్లు.