పౌరుషాలకు పుట్టినిల్లు అయిన పలనాటి నడిబొడ్డున ఉన్న ఒక గ్రామం. ఇప్పుడు బహుశా పెద్ద ఊరు అయి ఉంటుందేమో కాని నా చిన్నప్పుడు మాత్రం ఒక పెద్ద గ్రామం మాత్రమే. మాచర్ల నుండి ఒక 40 కి.మి. ఉంటుంది అనుకుంటాను, దుర్గి మీదుగా వెళితే వస్తుంది కారంపుడి. పల్నాటి యుద్దం జరిగింది ఇక్కడే అని అంటారు. అంతే కాక బ్రహ్మనాయుడు కట్టించిన చెన్న కేశవ ఆలయం కూడా బాగా ప్రసిద్ది. ఇంకా పల్నాటి యుద్దం లో వాడిన ఆయుధాలు ఇక్కడ ఇంకా భద్ర పరచబడి ఉన్నాయని వాటికి సంబందించి కొణతముల మహోత్సవం ఇప్పటికీ జరుగుతుంది అని ఈ మధ్యనే ఎక్కడో చదివాను. అప్పట్లో చిన్న తనం కదా ఈ చారిత్రిక ప్రాధాన్యం తెలిసేది కాదు కాకపోతే పీర్ల పండుగ అని జరిగేది దాని గురించి వినే వాడ్ని కాని మేము చిన్న పిల్లలం అని మాకు ఆ విషయాలు ఎక్కువ తెలియనిచ్చె వాళ్ళు కాదు.
అమ్మా నాన్న ల వృత్తి రీత్యా మేము ఉండేది నరసరావుపేట్ కావడం తో మేము అక్కడ నుండి నకిరికల్లు మీదుగా వెళ్ళేవాల్లం. ఊరు ప్రయాణం అంటే అందరు చిన్న పిల్లల్లానే నేను చాలా సరదా పడేవాడ్ని. అప్పట్లో ఎర్రబస్సు ఎయిర్‌బస్సు కన్నా అపురూపం గా కనిపించేది. బస్సు బయలుదేరేది నరసరావుపేట్ నుండే కావడం తో సాధారణం గా సీట్ కోసం ఇబ్బంది ఉండేది కాదు ఇక కిటికీ పక్కన సీట్ దొరికితే ఆ సంతోషం చెప్పనే అక్కర్లేదు. నేను బాగా చిన్నపుడు ఇలానే కిటికీ పక్క సీట్ లో కూర్చుంటే గురజాల లోనో లేక గుత్తికొండ లోనో బస్సు ఆగినప్పుడు అక్కడ షోడా సీసాలతో కొట్టుకుంటుంటే ఆ సీసాల గాజు పెంకు ఒకటి వచ్చి నా మెడకు గుచ్చుకుంది ఆ మచ్చ అలానే ఇప్పటికీ కనిపిస్తుంది అని అమ్మ చెప్తుంటుంది. అంటే ఈ మధ్య చూసుకో లేదు లెండి ఒక పది సంవత్సారాల క్రితం చెప్పింది అమ్మ ఈ విషయం.
సరె ఇక ఊరు కి వెళుతుంటే మొదట తగిలేది టూరింగ్ టాకీసు. పేరు సరిగా గుర్తు లేదు జయలక్ష్మి అనో ఇంకోటో ఉండేది. ఎప్పుడైనా మొదటి ఆట సినిమాకి వెళ్ళినపుడో లేదా ఆ టైముకి అటుగా బస్సు లో వెళ్ళినప్పుడో ఘంటసాల గారి "నమో వెంకటేశా" "ఏడుకొండలవాడా" పాటలు వినడం తప్పని సరి. మేము సినిమాకి వెళ్ళేప్పుడు ఈ పాట వినబడుతుంటే కొంచెం నడక వేగం పెంచే వాళ్ళం అమ్మో తెర లేస్తుంది సినిమా మొదలవుతుంది అని. సినిమా అంటే గుర్తొచ్చింది మీలో ఎంత మందికి గుర్తుందో కాని అప్పట్లో స్క్రీన్ కి ముందు ఎర్రని తెరలు వుండేవి ఈ మధ్య కాలం లో నేను ఎక్కడా చూడలేదు కాని అప్పట్లో తెర కి చివరన ఇంక మధ్య మధ్య లో అక్కడక్కడా లైట్లతో ఎర్రని రంగు లో కుచ్చుల కుచ్చుల తో అందం గా వయ్యరం గా మెల్ల గా అలా అలా తెర పైకి లేస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలేవి కాదు. ఒక పక్క సినిమా మొదలు పెట్టేస్తున్నారు అన్న ఆనందం కూడా తోడవగా చాలా బాగా ఎంజయ్ చేసేవాడ్ని.
సరే ఈ టూరింగ్ టాకీసు దాటిన వెంటనే నాగులేరు ఉండేది ఒకోసారి వర్షా కాలం లో బాగా పొంగు వచ్చి రాక పోకలకి అంతరాయం ఏర్పడినా మాములు సమయం లో నింపాదిగా ప్రవహిస్తూ కింద అంతా రక రకాల సైజులలో ఉన్న నాపరాళ్ళు కనిపిస్తూ చాలా అందం గా ఉండేది. మా ఊరు రోడ్డు అలా వేసారో లేకా ఊరే అలా అభివృద్ది చెందిందో కానీ రోడ్డు మీద నుండి చూస్తుంటే ఏటవాలు (diagonal) గా ప్రవహిస్తూ చూడటానికి చాలా బావుండేది. నాగులేరు ని ఆనుకుని కొంచెం దూరం లో బస్టాండ్ ఉండేది అక్కడ దొరికే తినుబండారాలంటే నాకు చాలా ఇష్టం వాటిలో బెండ్లు, పంచదార చిలకలు, బెల్లం పూసమిఠాయి ఐతే మరీ ఇష్టం.
మా తాత గారు ఉండేది NSP ఇరిగేషన్ కాలనీ లో అది ఊరికి కొంచెం దూరం లో చివరగా కాలవకి కొంచెం దగ్గర గా ఉండేది. ఐతే మేము ఎక్కిన బస్సు లు కొన్ని ప్రత్యేకం గా కాలనీ వరకు వెళ్ళేవి, కొన్ని మాత్రం బస్టాండ్ లోనే ఆపేసే వారు. కాలనీకి వెళ్ళే బస్సు లో ప్రయాణం ప్రత్యేకించి చెప్పుకోవాలి. బస్టాండ్ నుండి బయల్దేరాక ఊరిలో కొంచెం దూరం ఇరుకు సందులలోనుండి అంత పెద్ద బస్సు ని చాలా చాకచక్యం గా తీసుకు వెళ్ళేవాళ్ళు డ్రైవరు. వాళ్ళ గురించి ఇప్పుడు తలుచుకుంటే పద్మవ్యూహం లో అభిమన్యుడు గుర్తొస్తుంటాడు ఖచ్చితం గా వీళ్ళంతా అభిమన్యుడి వారసులే అయి వుండి వుంటారు :-) అలా నానా కష్టాలు పడి ఒక ఐదు నిముషాలలో ఊరు దాటిన మరుక్షణం రోడ్డుకి రెండు వైపులా పచ్చని చెట్లతో నల్లని తారు రోడ్డు ఆహ్వానం పలుకుతుంది.
నాకు ఆ రోడ్డు చాలా ఇష్టం కనుచూపు మేరా నల్లని పొడవైన రోడ్డు దానికి రెందు వైపులా అన్ని కాలాలలో పచ్చదనం నిండి ఉండే చెట్లు కొన్ని సార్లు పువ్వులు బాగా పూచె కాలం లో ఐతే చెట్టునుండి రాలి కింద పడిన పువ్వులతో నల్లని రోడ్డు కి రెండు వైపులా ఎర్రని తివాచీ పరిచినట్లు చాలా అందం గా ఉండేది. ఆ చెట్ల పేరు ఎంటో గుర్తు లేదు కానీ వాటి పువ్వులతో మేము పిల్లలం అందరం కలిసి కోడి పందాలు ఆడేవాళ్ళం. ఆ పువ్వులు విచ్చుకోడానికి సిద్దంగా ఉండే సమయం లోనే గాలికి రాలి కింద పడేవి అలా పడిన మొగ్గలని ఏరుకుని ఓపెన్ చేస్తే లోపల పొడవాటి కాండం దాని కొసన సన్నని బంధం తో బియ్యపుగింజ ఆకారం లో ఉండేది. వాటిని ఒకదానికి ఒకటి లంకె వేసి లాగితే ఎవరి పువ్వు విరిగి పోతే వాడు ఓడిపోయినట్లు. నిజం గా కోడి పందాలు గెలిచినంత గా ఫీల్ అయ్యేవాళ్ళం అందులో గెలిచి :-)
నాకు ఆ రోడ్ అంటే ఎంత ఇష్టం అంటే అప్పట్లోనే నేను ఎప్పుడైన ఇదే రోడ్ లో నా సొంత కారు లో నా అంతట నేనే చాలా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ ఈ రోడ్ ఉన్నంత దూరం అలానే వెళ్ళాలి అని అనుకునే వాడ్ని. కాని ఆ తర్వాత తాత గారు అక్కడ నుండి నరసరావు పేట్ వచ్చేయడం తో మళ్ళీ ఆ ఊరు వెళ్ళడమే కుదరలేదు ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడైనా కుదురుతుందేమో చూడాలి.
సరే లెండి ఈ రోజుకి బాగానే బుర్ర తిన్నట్లున్నాను కాదా.. కారెంపుడి లో మా యన్‌యస్పీ కాలనీ కబుర్లతో మళ్ళీ త్వరలో కలుద్దాం.
అంతవరకూ శలవా మరి...
--వేణు.
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
కారెం పూడి గురించి, పల్నాటి యుద్దం లో వాడిన ఆయుధాలను, కృష్ణ ' పలాంటి సిం హం ' అనే సినిమాలో చూపించారనుకుంటా.
రిప్లయితొలగించండినకరికల్లు పేరు చూడగానే, నేను హైస్కూల్ లో చదివేటప్పుడు బాల్ బాడ్మింటన్ టోర్నమెంట్ కి వెళ్ళిన రోజులు గుర్తొచ్చాయి. 5 రోజులు ఉన్నట్టు గుర్తు అక్కడ.
మీరు చెప్పే ఎర్రని పూల పేరు 'పొగడ పూలు ' అనుకుంటా !
చాలా బాగున్నాయి మీ టూరింగ్ టాకీస్ సంగతులు కూడా..నిజానికి, ఒక్కొక టాపిక్ కి ఒక్కో పోస్ట్ చెయ్యొచ్చు.
Venu A గారు మీకు బోలెడు నెనర్లు. చాలా చాల థాంక్స్ అండీ ఒకే సారి అన్ని కామెంట్స్ చూసి తొలిప్రేమ లో పవన్ కల్యాణ్ లా సిస్టం ముందు నుండి పక్కకి వెళ్ళీ డాన్స్ చేసి వచ్చాను.
రిప్లయితొలగించండిఅవునండి పొగడపూలు అని కూడా అంటారనుకుంటా మా వాళ్ళు దీని హిందీ పేరు "గుల్‌మొహర్" అని ఎక్కువగా పిలిచే వాళ్ళు. నా నేస్తం ఈ చెట్టూవి కొన్ని ఫోటో లు తీసి పంపించారు అవి త్వరలో పోస్ట్ చేస్తాను.
వేణూ శ్రీకాంత్,
రిప్లయితొలగించండిమీదీ నరసరావు పేటేనా! బాబోయ్, మాది కూడా! అమ్మ య్య, ప్రత్యేక పల్నాడు ఉద్యమం లేవదీస్తే నాకో తోడుందన్నమాట! అన్నట్టు నాగులేరు దాటడానికి ఇప్పుడు పెద్ద బ్రిడ్జ్ కట్టారు. నేను NRPT వెళ్ళినప్పుడు ఆ కారంపూడి ఏరియా అంతా జర్నీ బాగా ఎంజాయ్ చేస్తాను! అక్కడ జరిగే వీరుల పండగ కి కూడా ఒక సారి వెళ్ళాను.(కాలేజీ రోజుల్లో).
హాయ్..వేణూ శ్రీకాంత్ గారు.....
రిప్లయితొలగించండిచాలా బాగున్నాయి మీ కబుర్లు.....
ఇక పోతే...ఆ గుల్మోహర్ పూలు నిజంగా చాలా బాగుంటాయి......
మేము కూడా చిన్నప్పుడు ఆ ఆటలు ఆడుకునే వాల్లం....
ఆ పువ్వులతో.....
మీరు చెప్పే సంగతులు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి....
ఆ సంగతులన్నీ చదువుతూ నేను కూడా ఒకసారి అలా అలా ...ఊహాలోకాలకి వెల్లిపోయా.....
నల్లటి తార్ రోడ్...దాని పై..ఎర్రటి గుల్మోహర్ పూలు...నిజంగానే...ఎర్రటి తివాచి పరిచినట్టు ఉంటాయి......
మీరు చెప్పే కబుర్లు చాలా సింపుల్ గా ఉన్నాయి....కానీ..అవి చదువుతుంటే భలే బాగున్నాయి....మీను...
@సుజాత గారు,
రిప్లయితొలగించండిఅవునండీ నాదీ NRT నే నేను ఎక్కువ సంవత్సరాలు గడిపింది ఈ ఊరిలోనే. తప్పకుండా ప్రత్యేక పల్నాడు ఉద్యమానికి నేనూ తోడుంటాను, అసలు గుంటూర్ కూడా మనదే అనుకుంటే ఇంకా బోలెడు మంది బ్లాగర్లు కలుస్తారేమో మనతో :-) ఓ అవునా !! నాగులేరు పై బ్రిడ్జి కట్టేసారా, అప్పట్లో కేవలం చప్టా ఉండటం తో చిన్న వానొచ్చినా ట్రాఫిక్ ఆగిపోయేది. నేను ఆ ఊరు వెళ్ళి పది సంవత్సరాలు పైనే అయి ఉంటుందిలెండి.
@మీనూ
చాలా థాంక్స్. ఆ గార్లు బూర్లు నువ్వు కూడా పీకి పక్కన పడేయచ్చు కదా...
సింపుల్ గా ఉన్నంత వరకు నేనూ ఒప్పుకుంటాను కానీ నిజం గా ఇంట్రస్టింగ్ గా ఉన్నాయా... "గాల్లో తేలినట్లుందే..." అని పాడేసుకోవచ్చా ?... నా మటుకు నాకు ఎంత రిఫ్రెషింగ్ గా ఉంటుందో మాటల్లో చెప్ప లేను ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటుంటే...
హాయ్..వేణూ...గారు...
రిప్లయితొలగించండిఏదో...పిల్లకాయనండి....ఆ మాత్రం మీకు గౌరవం ఇవ్వాలి....లేకపోతే..ఎలా...
నిజంగానే..మీరు చెప్పే కబుర్లు బాఉన్నాయి...
బాలేకపోతే.....నేను కామెంట్ ఎందుకు రాస్తాను..చెప్పండి...
మీకో విషయం తెలుసా?...మీరు బా రాసారు కాబట్టే ..ఎంత మంది మీకు రెస్పాన్స్ ఇచ్చారో చూడండి...
మీరు చెప్పేవి మామూలు విషయాలే అయినా...మీరు చెప్తుంటే....వాటిలో....ఏదో...తేలీని అనుభూతి...
చూడండి...ఎంత పెద్ద ,గొప్ప విషయాలు చెప్తున్నాము అనేది కాదు ముఖ్యం...ఎంత చిన్న విషయాలనైనా....హత్తుకునేలా చెప్పగలగాలి.మీరు చెప్పే మీ ఊరి కబుర్లు....చదువుతుంటే...పల్లెటూరి..వాతావరనం...ఆ మట్టి వాసన...పొలాలు...బంతి పూలు..ఇంకా ఎన్నో..గుర్తొచ్చాయి....ఇంకా చిన్నప్పుడు ఊరికి వెల్తే...నేను చిర్రాగోనే.,తొక్కుడు బిల్ల,దొంగా పోలీస్,ఇసుకలో..ఒక కట్టెపుల్ల పెట్టి ఆడతారు చూడండి...అవన్నీ ఆడేదాన్ని..చిర్రగోనే..ఆటను మీరు ఏమంటారో..నాకు తెలీదు..కాని..అది నా..ఫేవరేట్..ఆట..
ఇక పోతే...మీరు ఆ పాట పాడుకుంటు డాన్స్ కూడా చేయండి....నేను కొంచెం ఎక్కువగా రాస్తే..క్షమించండి..మీను..
మీనూ "నిజమ" అన్న ఒక్క మాట కి ఇంత క్లాస్ పీకాలా !!..హతవిధీ!! కానీ, ఏదో పిల్లకాయనండి అంటూనే పెద్ద ఆరిందా లా కబుర్లు చెప్తుంటే భల్లే ముచ్చటేసింది.. నువ్వు సూపరో సుపరు...చాలా థాంక్స్...చిర్రాగోనే గురించి నేను ఎప్పుడూ వినలేదు మరి దానికి వేరే ఎమన్నా పేరుందేమో. నేను డాన్స్ చేస్తే మా బిల్డింగ్ లో జనాలు అంతా భూకంపమేమో అని ఝడుసుకుని ఛస్తారు లే అని క్షమించి వదిలేసా... ప్రస్తుతానికి కేవలం పాటే...
రిప్లయితొలగించండిచాలా మంచి టపా. నా చిన్ననాటి జ్ఞాపకాల్ని తట్టిలేపింది. అర్జంటుగా నా అనుభవాల్నీ టపాకట్టి బ్లాగులో పెట్టెయ్యాలి!
రిప్లయితొలగించండిThanks a lot Mahesh...
రిప్లయితొలగించండిఎర్రని పూలు = అగ్ని పూలు ;
రిప్లయితొలగించండిచిర్ర గోనె = గిల్లి దండ
అనుకొంటా. టపా బావుంది -ర
ra gaaru thanks for the comment.
రిప్లయితొలగించండినేను నరసరావుపేటలో మూడేళ్ళు ఉన్నాను. ఆ సంగతులను మీ టపా గుర్తు చేసి నిజంగా నన్ను బాధ పెట్టింది. ఈమధ్య వోల్వో బస్సులకు అలవాటు పడి ప్రశాంతిని మర్చిపోవడంతో, కనీసం నరసరావుపేట రైల్వే స్టేషన్ను చూసే అవకాశం కూడా లేదు. పల్నాడు (కారంపూడి) సెంటరు, ఆ మెస్సులు, పల్నాడు కారం ఎప్పటికీ మర్చిపోలేం మా సహాధ్యాయులంతా...........అప్పట్లో భయపడుతూ చదివే బాంబుల వార్తలు....ఇప్పుడు కొంచెం గొప్పలు చెప్పుకోవడానికి ఉపయోగపడుతున్నాయ్.
రిప్లయితొలగించండిsolo గారు థాంక్స్ అండీ
రిప్లయితొలగించండిఅయ్యో మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ... నిజమే వోల్వో లు వచ్చాక ప్రశాంతి కి కాస్త రష్ తగ్గింది అని విన్నాను.
థాంక్యూ సతీష్, నా బ్లాగ్ లో కామెంట్స్ చదివే వరకు నేను రాసేవి ఇంట్రస్టింగా వున్నయనే విషయం నాకే తెలీదు లెండి :-) ఖచ్చితం గా నాకు తీరిక మరియూ రాయడానికి విషయాలు వున్నంత వరకు వ్రాస్తూనే ఉండటానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిమీ కారెంపూడి కబుర్లు బావున్నాయండీ... నా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసాయి.....
రిప్లయితొలగించండిసరే గానీ బాబులూ మొత్తం మీపల్నాడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరొక ప్రత్యేకకూడలి పెట్టుకుంటే !! :) మిగతా గుంటూరు జిల్లావాళ్ళం పాతకూడలిలో ఉంటాం.
రిప్లయితొలగించండిఇంతకీ మీ ప్రత్యేక పలనాటి ఉద్యమం ఎంతవరకూ వచ్చింది?
పల్నాటి ఫొటోలు ముఖ్యంగా పాతకాలం నాటివి ఎవరన్నా ఎక్కించొచ్చు కదా??
నా పల్నాటి కనెక్షన్ తర్వాతఎప్పుడన్నా చెప్తా.
Thanks Gireesh గారు.
రిప్లయితొలగించండిరాజేంద్ర గారూ మీరు అలా అంటే ఎలా సారూ నేను గుంటూర్ వాళ్ళని కూడా కలుపుకుని పోదామని చూస్తున్నాను. కారంపుడి ఫొటోలకోసం వెతికానండీ ఎక్కడా దొరకలేదు నా దగ్గర ఏమీ లేవు. కనుక ప్రస్తుతానికి కబుర్లు చదువుకోడం వరకే :-)
రాజేంద్ర గారు,
రిప్లయితొలగించండిపల్నాడు గ్రూపు సరదాకి అన్నదేలెండి! ఇప్పటికే గుంటూరు జిల్లా వాళ్ళు బ్లాగుల్లో ఎక్కువైపోయారని టాకు! కానీ గుంటూరు జిల్లా వాళ్ళ ప్రత్యేకత ఏమిటంటే ఎంతమంది ఉన్నా ఎవరి అభిప్రాయం వారికుండడం! జిల్లా baseగా మూకుమ్మడిగా పోక పోవడం. ఇది నాకు నచ్చుతుంది. ప్రస్తుతం నేను హై..వచ్చేసాను, అనివార్య పరిస్థితుల వల్ల NRT చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్లలేదు. ఈ సారి వెళ్ళినపుడు కారం పూడి, గురజాల, మాచర్ల, సాగర్, కోటప్పకొండ, కోడెల గారి హాస్పిటల్ బాంబులు పేలిన వాళ్ళిల్లు, ఇంకా మీ పొన్నూరులో ఆంజనేయస్వామి విగ్రహం(చిన్నప్పుడు ఒక సారి చూశాను, ఎక్కడో పొన్నూరులో గుర్తులేదు) అన్నీ ఫొటోలు తీసి పట్టుకొస్తాను.
సోదర పల్నాటి వీరుడా
రిప్లయితొలగించండిఅందుకో నా జోహార్లు...
నీకు గుర్తుందా... కార్యమపూడి దగ్గర నాగార్జునసాగర్ కుడి కాల్వ, నాగులేరు perpendicular గా వెల్తాయి...కిందనుంచి నాగులేరు, పైనుంచి కుడికాల్వ....నేను పుట్టింది నాగులేరు ఒడ్డునే..అంటే ఇంటోనేలే...మాఇల్లు నాగులేరు ఒడ్డునే....వీరపల్నాడు కి జై...
Note: ఏంటో పల్నాడు పేరు చెప్తే రక్తం పొంగుతుంది...ఇప్పటికీ..
భాస్కర్ రామరాజు గారు నెనర్లు, నే శలవులో ఉండటం వల్ల మీకు జవాబు ఆలస్యం గా ఇవ్వడమైంది.
రిప్లయితొలగించండిమాది కారంపూడి.. నేను అక్కడే పుట్టి పెరిగాను.. ఇప్పటికి మేము తరచుగా వెళ్తూనే ఉంటాం.. కారంపూడి లో మీరు ఎక్కడ ఉండేవారు.. ఏ స్కూల్ లో చదువుకున్నారు.. హైస్కూల్ ఏ నా ?? మీకు ఆ పాఠశాలా గుర్తుందా? సరే మీరు రిప్లై పంపించండి కారంపూడి గురించి కావాల్సిన విషయాలు అందించటానికి నేను సదా సిద్దంగా ఉన్నాను..
రిప్లయితొలగించండిలక్ష్మణ్ గారు నెనర్లు, నేను అక్కడ చదవలేదండీ మా అమ్మమ్మ వాళ్ళు అక్కడ కాలనీ లో ఉండేవారు తరచుగా అక్కడికి వెళ్తూ ఉండేవాడ్ని అదికూడా నేను హైస్కూలు కు రాక పూర్వం అంతే. ఆ తర్వాత అమ్మమ్మవాళ్ళు నరసరావుపేట రావడం తో ఇక ఆ ఊరికి వెళ్ళింది లేదు.
రిప్లయితొలగించండిమురళి అన్నయ్య బ్లాగ్ లో పోస్ట్ చూసి ఇక్కడికి వచ్చానన్నయ్య. కారెంపూడి అనగానే ఎందుకో చదవాలనిపించింది...ఓసారి కారెంపూడి ని కళ్ళ ముందు చూసినట్టుంది. ధన్యవాదాలండి.
రిప్లయితొలగించండిప్రభంద్ గారు ధన్యవాదాలు.. నేను అప్పుడప్పుడు చదువుకుని అలా ఓ సారి కారంపుడి వెళ్ళి వస్తుంటానండీ..
రిప్లయితొలగించండి