ఆదివారం, జూన్ 15, 2008

జూనియర్.. జూనియర్

ఈ పాట ఇంకా అంతులేని కధ లో మిమిక్రీ పాట నచ్చని చిన్న పిల్లాడు వుండడేమో... ఈ పాట నాకు చాలా ఇష్టం చిన్నపుడు ఈ పాట పదే పదే వినే వాడ్ని కాని తీరా సినిమాకు తీసుకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ పాట వచ్చే సరికి నేను నిద్ర పోయానుట. నిద్ర లేపితే కూడ సరిగా చూడ లేదు అని చెప్పేది అమ్మ. అసలు మనం చిన్నప్పుడు కొంచెం వెరైటీ లెండి. మా ఇంట్లో సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళం. ఒక సారి నేను నిద్ర పోయాక అలానే నన్ను ఎత్తుకుని సెకండ్ షో కి ఏదో రాజుల సినిమా కి తీసుకు వెళ్ళారుట (అక్బర్ సలీం అనార్కలి అనుకుంటా). మనకి సినిమా మధ్యలో మెలకువ వచ్చి కొంచెం సేపు సినిమా చూసి, నాకు నచ్చ లేదు, అసలు నన్ను అడగకుండా ఇలాంటి చెత్త సినిమాకి ఎవరు తెమ్మన్నారు పదండి వెళ్ళిపోదాం అని గొడవ చేస్తే. పాపం మా నాన్న గారు నన్ను ఎత్తుకుని గేట్ కీపర్ స్టూల్ మీద కుర్చుని సరే నువ్వు నా భుజం మీద పడుకుని బయటకి చూడు నేను సినిమా చూస్తాను అని అక్కడే కుర్చుని సినిమా అంతా చూశారుట :-) అలా అప్పుడప్పుడు చాలా పెంకితనం చూపించే వాడ్ననమాట.

సరే ఇంక మన పాట లోకి వస్తే...మాట్లాడే బొమ్మ వుండటం తో చిన్న పిల్లల పాట అని ఓ తెగ సంబర పడి పోయేవాడ్ని కాని నిజానికి పాట ఎంతో లోతైన అర్ధం తో వుంటుంది. అప్పట్లో ఆ అర్ధం తెలిసేది కాదు అనుకోండి. పెద్దైన తర్వాత ఈ సినిమా చూసినప్పుడు కమల్, బాలచందర్, ఆత్రేయ గార్లని మెచ్చుకోకుండా వుండలేకపోయాను. ఆ పాట సాహిత్యం తెలుగు లిరిక్స్ లో పోస్ట్ చేసిన రవి గారికి థాంక్స్ చెప్పుకుంటూ... ఇక్కడ ఇస్తున్నాను.

<p><a href="http://musicmazaa.com/telugu/audiosongs/movie/Idhi+Katha+Kaadu.html?e">Listen to Idhi Katha Kaadu Audio Songs at MusicMazaa.com</a></p>

చిత్రం : ఇది కధ కాదు
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : యం.యస్. విశ్వనాథన్
గానం : బాలు, రమోల

జూనియర్.. జూనియర్.. జూనియర్...
Yes Boss
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు ||2||
అటు ఇటు తానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు ||2||
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ..
గడ్డిపోచా? నేనా? హి హి హి హి..
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ ఒద్దిక నదితో కోరేవు...

ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు
వుందని ఎందుకు ఒప్పుకోరాదు...
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటె ఎందుకు కారాదు..

జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...

సాగరమున్నా తీరనిదీ నీ దాహమురా..
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..
నీ మొహమురా హి హి హి హి హి...
సాగరమున్నా తీరనిది నీ దాహమురా..
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని ||2||

నీటిని చూసి దాహమువేస్తే తేనెకోసం తేటి వస్తే
పాపం గీపం అనడం ఛాదస్తం
No it's bad...
But I am mad...
మోడు కూడ చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
హ హ హ హ
what పక పక పిక పిక.. హూ...

జూనియర్..ఊ...
జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...


చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గసిరాన మండుటెండకై చూసేవు
Boss, Love has no season, not even reason
Shut up
చైత్రము లోన చినుకు పడాలని కోరేవు
మార్గిశిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు ||2||

ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
It is highly idiotic
No boss, it is fully romantic
హ హ హ హ
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా

ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

2 వ్యాఖ్యలు:

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.