అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శనివారం, నవంబర్ 27, 2010

శబ్బాసు రా భరణీ...

“ఎవడ్రావీడు భరణి గారంతటి వారిని ’రా’ అంటాడా ఎంత కండకావరం” అంటూ చొక్కా చేతులు మడిచి యుద్దానికి వస్తున్నారా ? రండి రండి నాకేం భయంలేదు. మీరేమన్నా అనుకున్నా మా దొరబాబుని, పాతసామాన్లోడ్ని, నానాజీని, తోటరాముడ్ని, మాణిక్యంగాడ్ని, చేపలక్రిష్ణగాడిని నేను రా అనే అంటాను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మా తనికెళ్ళ, ఎక్కడికి వెళ్ళినా తన మూలాలని మరచిపోని మా భరణి కూడా నన్నేమి అనడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్టార్ డమ్ సాంపాదించుకున్న విలక్షణమైన నటుడు తనికెళ్ళభరణి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన హాస్యపాత్ర పోషిస్తే నవ్వని వాళ్ళుండరు, ఓ తండ్రిగానో బాబాయ్ గానో చేస్తే హుందాగా...

ఆదివారం, నవంబర్ 21, 2010

బ్లాగ్వన భోజనాలకు నావంతు :-)

జ్యోతిగారు బ్లాగ్ వన భొజనాలకు ఆహ్వానాన్నందించారు బాగానే ఉంది కానీ మన వంతుగా మనం ఏం తీసుకు వెళ్దాం అని కాస్సేపాలోచించానా అంతలో మనల్ని పదో తరగతి నుండి ఇలాంటి వన భోజనాలు లేదా పాట్ లక్ లలో ఆదుకుంటున్న సరంజామా గుర్తొచ్చింది. అవును కదా మరి అందరూ వంటలే చేసుకొస్తే ప్లేట్లు, కట్లెరీ ఎవరు తెస్తారు అని వెంటనే అవి పట్టుకొద్దాం అని నిర్ణయించేసుకున్నా :-D మాములుగా ఇదివరకు అలవాటైన ప్లాస్టిక్ సామాగ్రి పట్టుకొద్దామంటే ఈ మధ్య పర్యావరణం పై మక్కువ పెరిగింది అదీకాక కాస్తంత గ్రాండ్ గా కూడా ఉంటుందని మన బ్లాగర్లందరి కోసం వెండి కంచాలు, బంగారు పూతపూసిన కట్లెరీ...

బుధవారం, నవంబర్ 17, 2010

రక్త చరిత్ర - 1

"నా సినిమాలో హింసా రక్తపాతం మాత్రమే ఉంటాయి అవి చూడాలనుకున్న వాళ్ళె ఈ సినిమాకు రండి మిగతావాళ్ళు చూడకపోయినా పర్లేదు" అంటూ వర్మ స్పష్తం చేశాక కూడా రక్త చరిత్ర సినిమా చూడాలా అసలే మనకి హింసాత్మక సినిమాలను భరించడం కష్టం. రక్త చరిత్ర సినిమా విడుదలైన రోజు నా ఆలోచనలు ఇవి కానీ వర్మ మీదున్న అపారమైన అభిమానం తో అసలు కథేమిటో ఎలా తీసాడో తెలుసుకోడానికి ఒక్క సారైనా చూడకపోతే ఎలా అని తెలుగు వర్షన్ కోసం వెతికాను కానీ బెంగళూరు లో రిలీజ్ అవ్వలేదు ఆహ సర్లే ఈ విధంగా తప్పించుకున్నాం అనుకుని ఇక ఆ ఆలోచన వదిలేశాను. అనుకోకుండా ఓవారం క్రితం షో టైమింగ్స్ చూస్తుంటే బెంగుళూరు...

సోమవారం, నవంబర్ 15, 2010

బెంగళూరు పుస్తకోత్సవం 2010

ప్రతి ఏడు ఈ పుస్తకోత్సవాల గురించి వినడమే కానీ వెళ్ళడానికి అస్సలు కుదిరేది కాదు. ఈ సారి ఎలాగైనా వెళ్ళాలి అని సెల్ లోనూ క్యాలెండర్ లోను రక రకాల రిమైండర్లు పెట్టుకుని ఎట్టకేలకు ఈవేళ వెళ్ళిరాగలిగాను. నిజంగా ఇదో మహా ఉత్సవం అద్భుత ప్రపంచం కొన్ని పాత పుస్తకాల స్టాల్స్ తోపాటు కొందరు పబ్లిషర్స్ స్టాల్స్, కొన్ని పుస్తకాల షాపుల స్టాల్స్, కొన్ని ఇంటర్నేషనల్ ప్రత్యేక స్టాల్స్, రామకృష్ణ మఠం స్టాల్, ఇస్కాన్ స్టాల్, ఖురాన్ కి సంభందించిన స్టాల్ మరియూ ఇస్లాం స్టూడెంట్స్ కు ప్రత్యేకమైన స్టాల్. ఇంకా మధ్యలో అక్కడక్కడ పుస్తక పఠనానికి సంబందించిన టూల్స్ స్టాల్, స్టేషనరీ...

శనివారం, నవంబర్ 13, 2010

ఓ రేంజ్ ఆడియో ఓ బేబి / ఓ బాబు

సాథారణంగా ఎలాంటి తెలుగు సినిమాఐనా ఆడియో రిలీజ్ ఐన వెంటనే సాధ్యమైనంత త్వరగా వినడం నాకు అలవాటు కనీసం ఒక్క పాట ఐనా బాగుండకపోతుందా అని ఒక ఆశ అనమాట. కాని ఒకోసారి కొన్ని ఆల్బంలు అనుకోని కారణాల వల్ల వెంటనే వినడానికి కుదరదు. అదేంటో నాకు అలా కుదరనపుడల్లా ఆ ఆడియో ఖచ్చితంగా హిట్ ఐ తర్వాత విన్నపుడు ఎలా మిస్ అయ్యాను ఇన్ని రోజులు అనిపిస్తుంది. అలా నేను మిస్ అయి ఆలస్యంగా విన్న ఆడియో ఆరెంజ్. ఆ మధ్య చాలా బిజీగా ఉండి అసలు ఈ సినిమా ఆడియో రిలీజ్ అయినది కూడా తెలుసుకోలేకపోయాను. కాస్త తీరిక దొరికాక చూస్తే పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నాకు ఒక ఆల్బంలో...

బుధవారం, నవంబర్ 03, 2010

రజని ఇష్టైల్ - సరదా యాడ్స్

రజనీ స్టైల్ యాడ్స్, టీవి అందుబాటులో లేని వారి కోసం, చూసి ఆనందించండి. మొదటిది ఈ మధ్య విడుదలైనది రెండవది చాలా పాతది మీరు ఇప్పటికే చూసి ఉండవచ్చు. కానీ మరో సారి చూసి నవ్వుకోదగిన వీడియో :-) ...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.