మంగళవారం, జూన్ 30, 2009

అలక పానుపు ఎక్కనేల-శ్రీవారి శోభనం

ఈ సినిమా నాకు పూర్తిగా చూసినట్లు గుర్తు లేదు ఎపుడో ఒక సారి టీవీ లో ఈ పాట వేస్తుంటేనో లేక సినిమా వేస్తుంటే పాట మాత్రమే చూసానో కూడా సరిగా గుర్తు లేదు కాని అప్పట్లో రేడియో లో క్రమం తప్పకుండా నేను వినే కొన్ని పాటలలో ఇదీ ఒకటి. మొదట్లో అంటే మరీ చిన్న తనం లో బామ్మ గారి కామెంట్స్ విని నవ్వుకోడానికి వినే వాడ్ని, కాస్త పెద్దయ్యాక భామ గారి పాట్లు అవగతమై పాట పూర్తి గా అర్ధమయింది :-) ఇక జానకమ్మ గారి గాత్రం గురించి నేనేం చెప్పినా తక్కువే... ఆ దోర నవ్వు దాచకే అని అంటూ ఆవిడ నవ్వే నవ్వు మనకే తెలియకుండా మన పెదవులపై చిరుమందహాసాన్ని నాట్యం చేయిస్తుంది. అంతెందుకు ఆవిడ శీతాకాలం అంటూ గొంతు వణికించడం వింటే ఎంత మండు వేసవి లో ఉన్నా మనకీ చలి వేసి వణుకు పుట్టేస్తుందంటే అతిశయోక్తి కాదేమో... పాటంతా వేటూరి గారు ఎంత అందం గా రాశారో బామ్మ గారి చివరి మూడుపంక్తులు "నులకపానుపు నల్లి బాధ.." అంటూ అంతే కొంటె గా రాశారు. సరే మరి మీరూ ఓ సారి మళ్ళీ విని తరించేయండి.



చిత్రం : శ్రీవారి శోభనం (1985)
సాహిత్యం :వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : జానకి, ఆనితా రెడ్డి

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా...
బామ్మ: నాకలకేమిటే నీ మొహం ఊరుకో...
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా...
శీతాకాలం సాయంకాలం...మ్...
శీతాకాలం సాయంకాలం...మ్...
అటు అలిగిపోయే వేళా చలికొరికి చంపే వేళా...ఆఆ....
బామ్మ: అందుకే లోపలికి పోతానే తల్లి నన్నొదులు....

||అలకపానుపు||

రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదూ..!!
బామ్మ: హూ నువ్విట్టా ఇంతగొంతేసుకుని పాడితే నిద్దరెట్టాపడుతుందే...
రాతిరంతా చందమామ నిదరపోనీదు...ఊ..ఊ...
కంటి కబురా పంప లేనూ...ఊ...
ఇంటి గడపా దాటలేనూ..ఊ..
ఆ దోర నవ్వు దాచకే.. నా నేరమింకా ఎంచకే...
ఆ దోర నవ్వు దాచకే.. ఈ నవ్వు నవ్వి చంపకే...

||అలకపానుపు||

రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు...
రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ...
బామ్మ: ఆ రాతే రాసుంటే ఇంట్లో నే వెచ్చగా నిద్రబోయేదాన్ని కదా !!
రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు...
రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ...
నచ్చినా మహరాజు నీవూ...
నచ్చితే మహరాణి నేనూ...
ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా...

బామ్మ:
నులకపానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా... అల్లరాపమ్మా...
శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం...ఊ..||2||
నను చంపకే తల్లీ... జో కొట్టకే గిల్లీ...

||అలకపానుపు||

12 కామెంట్‌లు:

  1. జానకి గారి గొంతు గురించి యెంత చెప్పినా తక్కువేనండి.. నాక్కూడా చాలా ఇష్టం ఈ పాట.. పడుచుపిల్ల గొంతు వినాలంటే 'శ్రీవారికి ప్రేమలేఖ' లో 'శ్రీమన్ మహారాజ..' కూడా ఓసారి వినండి...

    రిప్లయితొలగించండి
  2. వేణుగారు,జంధ్యాలగారి సినిమాల్లో పాటలు చాలా వరకూ బాగుంటాయండీ.జానకి గారు తన వాయిస్ ని అన్ని వయసులవారికీ అన్వయించగలరు.సప్తపదిలో "గోవుల్లు తెల్లన" పాటలో చిన్నపిల్లాడి గొంతుకి ఎంతగా సరిపొయేలా పాడారో కద!అన్నట్లు నిన్న నేను లలితసంగీతం పాట "అమ్మదొంగా" గురించి రాసాను.ఆ పాట గురించి మీరు అదివరకే రాసినట్లు ఇవాళ చూసానండీ!:))

    రిప్లయితొలగించండి
  3. మురళి గారు నెనర్లు. అవునండి శ్రీవారికి ప్రేమ లేఖ లో ఆ పాట నేను కొన్ని వేల సార్లు విని ఉంటాను అదికూడా నాకు ఇష్టమైన పాటలలో ఒకటి.

    లక్ష్మి గారు నెనర్లు.

    తృష్ణ గారు నెనర్లు. మీ టపా చూశానండీ. బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. చిన్నప్పుడెప్పుడో చూసిన సినిమా, విన్న పాట. ఇన్నేళ్ల తర్వాత మీరు గుర్తు చేశారు. 'శ్రీవారి శోభనం, వినాయకుడి కల్యాణం' అంటూ సాగే టైటిల్ సాంగేదో ఉన్నట్లు గుర్తు. అనితారెడ్డి గొంతు మళ్లీ ఎన్నేళ్లకో మణిరత్నం 'అంజలి'లో వినిపించిందనుకుంటా.

    రిప్లయితొలగించండి
  5. ఈ పాట కనీసం నెలకు 4 ,5 సార్లన్నా పాడుకుంటాను అంత ఇష్టం..చాలా మంచి పాటను గుర్తు చేసారు

    రిప్లయితొలగించండి
  6. అబ్రకదబ్ర గారు నెనర్లు. ఏమోనండీ మరి ఆ పాట గురించి తెలియదు కానీ "చంద్ర కాంతి లో చందన శిల్పం" అని మరో మంచి పాట ఉంటుంది ఈ సినిమాలో.
    నెనర్లు నేస్తం గారు, ఉత్తినే పాడుకుంటే పర్లేదు కానీ సంధర్బోచితంగా అయితే ఆలోచించాల్సిందే సుమీ :-)

    రిప్లయితొలగించండి
  7. వావ్. మీ భావుకత మీద మీద మీకనుమానమేమో. నాకు మాత్రం లేదు. ఎలాంటి పాట వినిపించారండి. నేను ఇప్పుడే ఈ పాట మొదటిసారి చూడ్డం.

    రిప్లయితొలగించండి
  8. రవి గారు నెనర్లు. ఓ వీడియో ఇప్పుడే చూస్తున్నారా, సంతోషం... నేను ఈ పాట దొరుకుతుంది అనుకో లేదు. ఆడియో పెట్టాడానికి సిద్దపడుతూ ఓ సారి ప్రయత్నిద్దాం అని చూస్తే అనుకోకుండా దొరికింది.

    రిప్లయితొలగించండి
  9. మరి ఊరికే పాడతాననుకున్నారా :P

    రిప్లయితొలగించండి
  10. chala bagundi andii janaki gari gonthu ippatiki kuda chinna pilla gonthu la untundi adi ameku devudu ichhina varamu andi
    alage na blog kuda chi mee amulyamina coments ivvagalarani asishtuu nnau andi
    untanu andi
    http://mirchyvarma.blogspot.com

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.