సంగీతాభిమానులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ (June 21st) శుభాకాంక్షలు...
ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం అని ఉదయాన్నే తన విషెస్ తో తెలియచేసిన నేస్తానికీ, ఇంకా ఈ పాట తో విషెస్ చెప్పిన మరో నేస్తానికి థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ కోసం ఈ పాట.
ఇక్కడ వినండి
చిత్రం : అమ్మచెప్పింది
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : ప్రణవి
మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతం తో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం...
||మాటల్తో||
కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే..
కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..
పాటల్లె ఎగిరి రాదా.. నీ గుండె గూడైపోదా..
సంగీతం తో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం...
||మాటల్తో||
గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాటా
ఊయలని ఊపును పాటే
దేవుడిని నేర్పును పాటే..
సంగీతం తో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం...
||మాటల్తో||
ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం అని ఉదయాన్నే తన విషెస్ తో తెలియచేసిన నేస్తానికీ, ఇంకా ఈ పాట తో విషెస్ చెప్పిన మరో నేస్తానికి థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ కోసం ఈ పాట.
ఇక్కడ వినండి
చిత్రం : అమ్మచెప్పింది
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : ప్రణవి
మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతం తో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం...
||మాటల్తో||
కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే..
కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..
పాటల్లె ఎగిరి రాదా.. నీ గుండె గూడైపోదా..
సంగీతం తో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం...
||మాటల్తో||
గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాటా
ఊయలని ఊపును పాటే
దేవుడిని నేర్పును పాటే..
సంగీతం తో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం...
||మాటల్తో||
వేణూ గారు, మంచి పాటని గుర్తు చేసారు. నిజమే కదా "శిశుర్వేత్తి పశుర్వేత్తి
రిప్లయితొలగించండివేత్తి గానరసం ఫణిః" అన్న నానుడిని కాదనగలమా? ఇంకా ఎన్నో గుర్తుకి వస్తున్నాయి. ఈమధ్యనే మా పాపకి వివరిద్దామని సప్త స్వరాల గురించి చదివాను. ఎంత విశిష్టతవుందో కదా అని అనిపించింది. సంగీతం,నాట్యం కలిసి అభ్యసించి 3 నెలలకి సంగీతాన్ని విడిచేసానెందుకో అని బాధ కలిగింది. "బ్రతుకంతా ఓ గీతం..." - "ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడనూ" గుర్తుకి తెచ్చింది. మీకు కూడా ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు...
సంగీతం లేని జీవితానికి అర్థం లేదు వేణూ! జీవితంలో మిగతా కళల సంగతేమో గానీ సంగీతాన్ని ఆస్వాదించని హృదయం, పరవశించని మనిషీ ఉంటాడా అసలు! పాట పాడకుండా(తీయగా పాడామా లేదా అన్నది తర్వాత సంగతి),పాటల తోటలో విహరించకుండా ఎవరి జీవితమైనా గడుస్తుందా?
రిప్లయితొలగించండిసంగీతాన్ని విడిచి ఉండమంటే అంతకంటే ప్రాణాన్ని విడవడం సులభమని భావిస్తాను.అలాంటి అనుబంధం నాకు సంగీతంతో! మంచి పాట. సంగీతాభిమాని ఐన మీకు సంగీతాభిమానిగా శుభాకాంక్షలు!మంచి సంగీతాన్ని ఎప్పుడూ వింటూ ఉండాలని కోరుతూ......
సంగీతం తో చేస్తే స్నేహం
రిప్లయితొలగించండిపలికిందల్లా గీతం...
గీతాలతో జ్ఞాపకాలను పెనవేసిన ప్రతి నేస్తానికి....ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు...
ఉష గారు నెనర్లు, సాధన చేసారు కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదండీ పదును పెట్టండి.
రిప్లయితొలగించండిసుజాత గారు నెనర్లు, "సంగీతం లేని జీవితానికి అర్థం లేదు" అని ఒక్క మాటలో భలే చెప్పారు సుమా !!.
నేను గారు నెనర్లు.
తత్వ సాధనకు సత్య శోధనకు... ఇకంతా మీకు తెలుసు కదా.
రిప్లయితొలగించండిసినిమా ఆడకపోవటం వల్ల పాట కాస్తంత మరుగున పడిపోయింది.
*** *** ***
ఇక్కడ మా బ్లాగులో ’సుజాత’ గారు ఒక మంచి బుక్ రివ్యూ అందించారు చూడండి.
Sorry link miss ;-)
రిప్లయితొలగించండిhttp://booksandgalfriends.blogspot.com/2009/07/blog-post.html
మీ బ్లాగ్ చూసాను గీతాచార్య గారు బాగుంది... పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఆ పాట మరుగున పడటమేమిటండీ... అది ఎవర్ గ్రీన్..