శుక్రవారం, జూన్ 26, 2009

పాప్ సంగీత సామ్రాట్‍కు కన్నీటి వీడ్కోలు !!

మరణం ఎంత చిత్రమైనది, ఎంత దయలేనిది ! తన పర, పేదా గొప్ప బేధాలు లేకుండా ఎంతటి వారినైనా ఎప్పుడైనా ఎక్కడైనా తన కబంద హస్తాలతో కబళించి వేసి, నీ శక్తి అల్పము పరిమితమూనూ రా ఓ వెర్రి మానవుడా అని పరిహసిస్తుంది. యాభైవసంతాల ప్రపంచ పాప్ సంగీత సంచలనం మైఖేల్ జాక్సన్ ఇంత అర్ధంతరంగా, అదీ ప్రపంచ వ్యాప్తంగా అతని అభిమానులు లండన్ లో జరగనున్న అతని comeback షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం లో తిరిగిరాని లోకాలకు పయనమవ్వడం అత్యంత విషాద భరితం. మొదట మార్చి లో ప్రకటించిన తేదీల ప్రకారం అయితే అతని మొదటి లండన్ షో జులై ఎనిమిదిన జరగాల్సి ఉంది.


సంగీతానికి నేను చిన్నతనం నుండే అలవాటు పడినా, మైఖేల్ పాటని నాకు మొదట పరిచయం చేసింది మా హరిగాడు. వాడు నా ఇంటర్మీడియేట్ మరియూ బీటెక్ క్లాస్ మేట్ అప్పటి రోజుల్లోనే మా వాడు వాళ్ళ తాడేపల్లి గూడెం లో సత్యన్నారణ షాప్ లో అప్పుడప్పుడే కొత్తగా రిలీజ్ అవుతున్న సీడీ ల నుండి రికార్డ్ చేయించుకుని వచ్చిన BAD ఆల్బం నుండి మొదటి సారి "Man in the mirror" పాట వినిపించాడు తరువాత స్మూత్ క్రిమినల్ ఆ తర్వాత అంబా..అంబా అని టైటిల్ సాంగ్ (అంటే జాగ్రత్తగా విన్న తర్వాత అది i am bad అని అర్ధమైంది లెండి) అప్పట్లో ఆ అమెరికన్ యాస లో పాట ఎక్కువగా అర్ధమయ్యేది కాదు కానీ మ్యూజిక్ మాత్రం నన్ను అత్యంతగా ఆకట్టుకుంది. అదే సమయం లో అంటే ఇంటర్ చదివేప్పుడు ఒక సారి శలవల్లో ఇంటికి వచ్చినపుడు పెద్ద మామయ్య గారి ఇంటిలో చూసిన BAD క్యాసెట్ ఆల్బం కవర్ మీదున్న మైఖేల్ బొమ్మని, తళ తళలాడే క్యాసెట్ ఇన్లే కార్డ్ ని ఎంత అపురూపంగా ఎన్ని సార్లు తడిమి తడిమి చూసుంటానో లెక్క లేదు. ఆ తర్వాత ఆంగ్లం లో పాటలు విన్నది చాలా తక్కువ కానీ మైఖేల్ పాటలు మాత్రం తప్పకుండా వింటూ ఉండే వాడ్ని ఎవరన్నా నీకు ఎలాంటి పాటలు ఇష్టం అంటే క్లాసిక్, ఫిల్మీ ప్లస్ మైఖేల్ అని ప్రత్యేకంగా చెప్పే వాడ్ని అంత ఇష్టం ఇతని పాటలు.


ఇతని వీడియోల లో ఏది ఇక్కడ పెడదాం అని ఆలోచించినపుడు ఏది ఎన్నుకున్నా మరో దానికి అన్యాయం చేసిన వాడిని అవుతాను అనిపించింది అందుకే నేను మొదటి సారి విన్న "Man in the mirror" from Bad
ఇక్కడ ఇస్తున్నాను.
సగటు అమెరికన్ జీవిత వయోః పరిమితి తో పోల్చి లెక్క వేసినప్పుడు యాబైవసంతాలు పెద్ద వయసు కాదు. అతని ఆరోగ్యం పై వచ్చిన పుకార్లు స్కిన్ క్యాన్సర్, డ్రగ్స్ వాడకం లాటివి కృంగ తీసినా... డ్యాన్సింగ్ ఐడల్, అంత సన్నగా, చలాకీగా, చురుకుగా, స్టేజ్ పై ఒక అలలా, మెరుపులా కదిలే మైఖేల్ జాక్సన్ హార్ట్ అటాక్ తో చనిపోయాడన్న విషయం ఇంకా నేను నమ్మ లేక పోతున్నాను. అంత చురుకైన వాడికి కార్డియాక్ అరెస్ట్ ఏ కారణం వలన వచ్చి ఉంటుందో ఊహించడానికి చాలా కష్టం గా ఉంది. అటాప్సీ ఫలితాలు వెలువడితే కానీ పూర్తి వివరాలు తెలియవేమో.. కానీ కొలెస్ట్రాల్ కారణమైతే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే.. మందీ మార్బలానికీ, డబ్బు కీ కొరత లేని మైఖేల్ జాక్సన్, ప్రపంచ వ్యాప్తం గా కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న అతను కూడా ఇంత అర్ధంతరం గా మృత్యువు కోరలకి బలికావడం విధి రాత కాక మరేమిటీ.. అందుకే మృత్యువు చిత్రమైనది !!

9 వ్యాఖ్యలు:

 1. baaga raasaru manchi neevali mee post ataniki..........excellent dancer tanu........

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వేణూ,
  ఎంత టచింగ్ గా రాశారు! ఎన్ని టపాలు చదివినా స్పందించాలనే ఉంది మైక్ గురించి! అన్నయ్య మైఖేల్ కాసెట్లను ముట్టుకోనిచ్చేవాడే కాదు.ఆ మెరుపుతీగ ఇక లేడంటే నాకూ ఆశ్చర్యంగానే ఉంది. నమ్మాలని లేదు. యదార్ధ జీవిత వ్యధార్త దృశ్యానికి ప్రతీక అయిన మైఖేల్ జీవితం ఇంత అర్థాంతరంగా ముగుస్తుందని అనుకోలేదు.మీ బాధను పంచుకుంటున్నాను!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వేణూ గారు,చాలా బాగా రాసారు.ఇవాళ నేను కూడా నా బ్లాగులో జాక్సన్ గురించి రాసాను.వీలుంటే చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వినయ్ గారు, సుజాత గారు తృష్ణ గారు నెనర్లు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. నిజమే..మృత్యువు చిత్రమైనది ..బాగా రాసారు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను :(

  ప్రత్యుత్తరంతొలగించు
 7. జాక్సన్ మరణాన్ని గురించి కాకుండా అతని సంగీతం మనకి పంచిన ఆనందాన్ని ఆస్వాదించి అతనికి నిజమైన నివాళినర్పిద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అలా కష్టం గీతాచార్య గారు. సహజ మరణమైతే మీరు చెప్పిన దానితో ఏకీభవిస్తాను కానీ ఇలా అకాల మరణం చెందడం ఆవేదనకి గురిచేస్తుంది... తను మరికొన్ని రోజులు బతికి ఉంటే మరికొంత మంచి సంగీతం వినగలిగే వాళ్ళం కదా అన్న ఆలోచనలో నుండి పుట్టే ఆవేదన అది. వ్యాఖ్య రాసినందుకు నెనర్లు.

  ప్రత్యుత్తరంతొలగించు

పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీకామెంట్ రెండు వారాలకు ముందు ప్రచురించిన టపాలో ఐతే పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. Google Chrome Browser లో కామెంట్స్ పబ్లిష్ అవడంలేదు అని కంప్లైంట్ వచ్చింది. సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.