ఆదివారం, జూన్ 21, 2009

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె...

సంగీతాభిమానులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ (June 21st) శుభాకాంక్షలు...

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం అని ఉదయాన్నే తన విషెస్ తో తెలియచేసిన నేస్తానికీ, ఇంకా ఈ పాట తో విషెస్ చెప్పిన మరో నేస్తానికి థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ కోసం ఈ పాట.

ఇక్కడ వినండి

చిత్రం : అమ్మచెప్పింది
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : ప్రణవి

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతం తో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం...

||మాటల్తో||

కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే..
కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..
పాటల్లె ఎగిరి రాదా.. నీ గుండె గూడైపోదా..
సంగీతం తో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం...

||మాటల్తో||

గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాటా
ఊయలని ఊపును పాటే
దేవుడిని నేర్పును పాటే..
సంగీతం తో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం...

||మాటల్తో||

7 కామెంట్‌లు:

  1. వేణూ గారు, మంచి పాటని గుర్తు చేసారు. నిజమే కదా "శిశుర్వేత్తి పశుర్వేత్తి
    వేత్తి గానరసం ఫణిః" అన్న నానుడిని కాదనగలమా? ఇంకా ఎన్నో గుర్తుకి వస్తున్నాయి. ఈమధ్యనే మా పాపకి వివరిద్దామని సప్త స్వరాల గురించి చదివాను. ఎంత విశిష్టతవుందో కదా అని అనిపించింది. సంగీతం,నాట్యం కలిసి అభ్యసించి 3 నెలలకి సంగీతాన్ని విడిచేసానెందుకో అని బాధ కలిగింది. "బ్రతుకంతా ఓ గీతం..." - "ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడనూ" గుర్తుకి తెచ్చింది. మీకు కూడా ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  2. సంగీతం లేని జీవితానికి అర్థం లేదు వేణూ! జీవితంలో మిగతా కళల సంగతేమో గానీ సంగీతాన్ని ఆస్వాదించని హృదయం, పరవశించని మనిషీ ఉంటాడా అసలు! పాట పాడకుండా(తీయగా పాడామా లేదా అన్నది తర్వాత సంగతి),పాటల తోటలో విహరించకుండా ఎవరి జీవితమైనా గడుస్తుందా?

    సంగీతాన్ని విడిచి ఉండమంటే అంతకంటే ప్రాణాన్ని విడవడం సులభమని భావిస్తాను.అలాంటి అనుబంధం నాకు సంగీతంతో! మంచి పాట. సంగీతాభిమాని ఐన మీకు సంగీతాభిమానిగా శుభాకాంక్షలు!మంచి సంగీతాన్ని ఎప్పుడూ వింటూ ఉండాలని కోరుతూ......

    రిప్లయితొలగించండి
  3. సంగీతం తో చేస్తే స్నేహం
    పలికిందల్లా గీతం...

    గీతాలతో జ్ఞాపకాలను పెనవేసిన ప్రతి నేస్తానికి....ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  4. ఉష గారు నెనర్లు, సాధన చేసారు కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదండీ పదును పెట్టండి.

    సుజాత గారు నెనర్లు, "సంగీతం లేని జీవితానికి అర్థం లేదు" అని ఒక్క మాటలో భలే చెప్పారు సుమా !!.

    నేను గారు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  5. తత్వ సాధనకు సత్య శోధనకు... ఇకంతా మీకు తెలుసు కదా.

    సినిమా ఆడకపోవటం వల్ల పాట కాస్తంత మరుగున పడిపోయింది.
    *** *** ***

    ఇక్కడ మా బ్లాగులో ’సుజాత’ గారు ఒక మంచి బుక్ రివ్యూ అందించారు చూడండి.

    రిప్లయితొలగించండి
  6. Sorry link miss ;-)

    http://booksandgalfriends.blogspot.com/2009/07/blog-post.html

    రిప్లయితొలగించండి
  7. మీ బ్లాగ్ చూసాను గీతాచార్య గారు బాగుంది... పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
    ఆ పాట మరుగున పడటమేమిటండీ... అది ఎవర్ గ్రీన్..

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.