బ్లాగ్లోకానికి బ్లాగ్‌మిత్రులకు నమస్సుమాంజలి... గత నెల రోజులు గా నా నుండి కొత్త టపా లేక పోయినా అపుడపుడు ఇటు విచ్చేసి వ్యాఖ్య లతో పలకరించి ప్రోత్సహంచిన మిత్రులందరికీ శతకోటి నమస్సులు. నేను మధ్యలో ఒకటీ అరా టపా లు అతికష్టం మీద చదివినా వ్యాఖ్య వ్రాసే సమయం లేకపోయింది. కంప్యూటరు తో గడప గలిగిన కాస్త సమయం లో ఏదో ఒక ఆఫీసు పని ఉండటం తో పాటు Internent Speed సరిగా లేక పోడం తో ఎక్కువ సమయం వెచ్చించ లేకపోయాను.
ఏదేమైనా నెల రోజుల శలవులు ముగించుకుని ఈ రోజే తిరిగి చికాగో చేరుకున్నాను. నేను డిల్లీ నుండి బయలుదేరే రోజే అక్కడ పేలుళ్ళు జరగడం బాధాకరం, Aug 11th ఉదయం అభినవ్ బింద్రా బంగారు పతకం గెలుచుకున్నాడన్న వార్త తో భారత మీడియా నాకు స్వాగతం పలికిందని సంతోషించే లోపే Sept 13th డిల్లీ పేలుళ్ళ వార్త తో వీడ్కోలు పలకడం బాధాకరమైన విషయం.
మొత్తం మీద నా ట్రిప్ అద్యంతమూ దేవుడి పాలనలో వరుణదేవుడు కురిపించిన ఎడతెరిపి లేని వర్షాలలోను, మా బంధువులు ఆత్మీయులు కురిపించిన అత్మీయ, అనురాగ వర్షపు జల్లులలోనూ, ఇంకా అకాల వర్షాల వల్ల పంట చెడిపోయిందనో సకాలం లో ఎరువులు అందలేదనో రైతన్నల ఆగ్రహ జల్లులలోనూ తడిసి ముద్దయి పోయా... ఇక నా అభిమాన హీరో "ప్రజారాజ్యం" ఆవిష్కరణని అందరితో కూర్చుని ప్రత్యక్ష ప్రసారం చూడటం కూడా ఓ మరువలేని అనుభూతి. ఈ నెల రోజులలోనూ మోయలేనన్ని బోలెడు అనుభూతులు, జ్ఞాపకాల వల్లనో :-) లేకా అనునిత్యం తిన్న విందు భోజనాల వల్లనో (ఇదే అసలు కారణం లెండీ) కానీ ఓ 3 కిలోల బరువు కూడా పెరిగాను.
రానున్న పది రోజులలోనూ మెల్లగా ఆఫీసు లోనూ, బ్లాగ్లోకం లోనూ ఉన్న back log లను కవర్ చేసి తిరిగి టపాయించడం మొదలు పెడతాను అంతవరకూ నిన్న ప్రయాణమయ్యేప్పుడు నా మదిలో మెదిలిన ఈ పాట మీకోసం.
చిత్రం : సిరివెన్నెల
గానం : యస్ పి బి, పి సుశీల
సంగీతం : కె వి మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
ఆ... ఆ...
పొలిమేర దాటిపోతున్నా, ఓ గువ్వలచెన్నా!
పొరుగూరికి చేరిపోతున్నా, ఓ గువ్వలచెన్నా!
కధ మారే రోజులు మారేనూ, ఓ గువ్వలచెన్నా!
కల తీరే దారులు వెతికేనూ, ఓ గువ్వలచెన్నా!
ఆ... ఆ...
ఆ... ఆ...
గుళ్ళో నిను చూడలేకున్నా, ఓ గువ్వలచెన్నా!
గుండెల్లో దాచుకున్నాలే, ఓ గువ్వలచెన్నా!
ఏ సీమలొ తిరుగాడినా, ఓ గువ్వలచెన్నా!
నీ దీవెనలందించాలన్నా, ఓ గువ్వలచెన్నా!
ఓ..ఓ..ఓ...ఒ.ఒ.ఒ.ఓ..
ఆ..ఆ..ఆ..అ.అ.అ.ఆ..