శుక్రవారం, డిసెంబర్ 05, 2008

ఆకాశం నవ్వింది !!!

శీర్షిక చూసి మీకు ఏ 80 ల లోని ఓ తెలుగు నవల పేరో గుర్తొస్తే తప్పు నాది కాదు. నా చిన్న తనం లో నా పక్కన కూర్చుని నన్ను చదివించడానికి అమ్మ తెప్పించుకుని చదివి పక్కన పడేసిన నవలలు చూస్తూ అవి నేను చదివే రోజు ఎప్పుడొస్తుందో అని అనుకున్న నా బాల్యానిది . యద్దనపూడి సులోచనా రాణి , వాసిరెడ్డిసీతాదేవి , మైనంపాటి భాస్కర్, ఇంకా యండమూరి, యర్రంశెట్టి శాయి, మల్లాది గారి గురించి చెప్పనే అక్కరలేదనుకోండి. అ నవలలు అన్నీ చదవాలని ఉన్నపుడు చదవడానికి అనుమతి లేదు అనుమతి దొరికి ఒక వయసుకి వచ్చే సరికి యండమూరి గారి నవలలకి మాత్రం అతుక్కు పోయాను. అప్పుడప్పుడూ మల్లాది గారి రచనలు మాత్రం చదివే వాడ్ని. నే చదివిన మొదటి నవల ఆయనదే నత్తలొస్తున్నాయ్ జగ్రత్త !! అని.

సరే ఇక అసలు విషయానికి వస్తే మీలో చాలా మంది రక రకాల వార్తా పత్రికలలో ఈ వార్త చూసే ఉంటారు మొన్న డిశంబర్ 1-2 తారీఖులలో ఆకాశం లో ఈ చిత్రం ఆవిష్కరింప బడింది. దీని వెనుక కధ ఏంటంటే జ్యూపిటర్ మరియూ వీనస్ గ్రహాలు రెండూ ఒకే సరళ రేఖలో భూమికి కాస్త దగ్గరగా రావడం వారిద్దరికీ మన చందమామ కూడ తోడవడం తో అదీ ఓ చక్కని చిక్కని చీకటి పరచుకున్న రాత్రి వేళ జరగడం తో ఎటువంటి పరికరం సాయం లేకుండా సాధారణమైన కంటి తో చూసేలా నీలి నింగి లో ఈ అందమైన దృశ్యం ఆవిష్కరించబడింది. దీన్ని ఓ ఔత్సాహికుడు తన కెమేరా కంటి తో బంధించి ఆ ఫోటోలు నాతో పంచుకుంటే నేను నా బ్లాగ్ లో పెట్టి మీ అందరితో పంచుకుంటున్నా అనమాట. అదీ సంగతి.



మూడూ గ్రహాల మధ్య అనంతమైన దూరమున్నా అన్నీ కలిసి ఇలా చక్కని స్మైలీ గా ఫార్మ్ అవడం చూడ చక్కగా లేదు. టైంస్ ఆఫ్ ఇండియా న్యూస్ ఆర్టికిల్ ప్రకారం మళ్ళీ మే 11, 2011 లో ఓ పగటి పూట ఇలా జరుగుతుంది కాకపోతే పగలు కనుక ఇలా సాధారణ కంటికి కనిపించదు. తరువాత మళ్ళీ ఈ అద్భుతం నవంబర్ 18, 2052 లో రాత్రి పూట ఆవిష్కృతమవుతుందట కనుక మిస్ అయిన వారు, నాలా చికాగో లాంటి చలి ప్రదేశం లో ఉంటూ చూడలేని వారు ఓ సారి సరదాగా లుక్కేస్కోండి. హ్మ్!! ఇక్కడ ప్రస్తుతం ఉన్న వింటర్ వాతావరణాం వల్ల ఒక అరమైలు ముందున్న కారే కనపడటం లేదు ఇంక ఆకాశం లో ఏంకనపడుతుంది నా మోహం !!

8 కామెంట్‌లు:

  1. ఆ రోజు నుండి చంద్రుడు దూరంగా వెళుతున్నాడు కానీ జూపిటర్,వీనస్ దగ్గిర దగ్గిరగానే కనిపిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  2. Nice captures! ఆకాశం స్మైల్ బాగుంది కదూ?! :-)

    రిప్లయితొలగించండి
  3. ఆరోజు మేమూ చూశాము. చాలా సరదాగా అనిపించింది. మర్నాడు మా చెల్లి కి ఫోన్ చేసి 'భలే ఉంది కదూ?' అనగానే చచ్చే తిట్టింది.. మాకు చూసే ముందు చెప్పలేదు అని :-)
    Thanks for sharing these pictures.

    రిప్లయితొలగించండి
  4. కృష్ణప్రియ గారు నెనర్లు, ఓ సూపర్ అండీ మీరు డైరెక్ట్ గా చూశారనమాట, నాకు ఆ భాగ్యం కలగలేదు. హ హ మీ సిస్టర్ కోపం అర్ధం చేసుకోదగినదే :-).

    రిప్లయితొలగించండి
  5. చాలా బావుంది. పంచుకున్నందుకు నెనర్లు

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.