మంగళవారం, నవంబర్ 25, 2008

కార్పొరేట్ ట్రావెల్ !!!

నాకు సాధారణం గా లంచ్ నా డెస్క్ దగ్గరకే తెచ్చుకుని ఇంటర్నెట్ లో వార్తలో, వికీ నో, మరోటో చూస్తూ తినడం అలవాటు. మొన్న గురువారం అలాగే లంచ్ టైం లో CNN news చదువుతుంటే ఈ వార్త నన్నాకర్షించింది. దాని గురించే ఈ టపా….

మీ ఊహా శక్తి కి కొంచెం పని కల్పించి ఒక చిన్న దృశ్యం ఊహించుకోండి. మీరో గంపెడు పిల్లలు బోలెడు జనాభా మరియూ భాధ్యతలతో నిండి ఉన్న ఒక ఉమ్మడి కుటుంబానికి పెద్ద అయి ఉండి నెలాఖరు రోజులలో కడుపు నిండా తింటానికి కూడా డబ్బులు లేని పరిస్తితులలో కష్ట పడి పచ్చడి మెతుకులతో కడుపు నింపుకుని అరుగు మీద సేద దీరుతుంటే మీ ముందు ఒక ఖరీదైన బెంజ్ కార్ వచ్చి ఆగి అందులో నుండి సూటు బూటూ వేసుకున్న ఓ వ్యక్తి చేతిలో సత్తు బొచ్చె తో దిగి బాబు కాస్త ధర్మం చేయండయ్యా నేను చాలా ధీనమైన పరిస్తితి లో ఉన్నాను అని అంటే మీకేం అనిపిస్తుంది.




సరీగ్గా ఈ అమెరికను రాజకీయనాయకుడి కి కూడా అదే అనిపించింది. వివరాల కోసం CNN లో
ఈ వార్త చదవండి. దీని సారాంశమేమంటే… ఈ మధ్య వచ్చిన ఆర్ధిక మాంద్యాన్ని తట్టుకోడానికి గాను అమెరికా ప్రభుత్వం bailout money అని కొంత ధనాన్ని మర్కెట్ లోకి పంపడానికి నిర్ణయించుకుంది. ఆ డబ్బులో నుండి మాకు ఓ పాతిక బిలియను డాలర్లు ఇవ్వండి బాబూ మేము పూర్తిగా మునిగిపోయే పరిస్తితి లో ఉన్నాం అని దాదాపు chapter 11 bankruptcy file చేయడానికి సిద్దపడుతున్న GM ఇంకా Ford and Chrysler అనే మూడు Detroit కార్ల కంపెనీల CEO లు వాషింగ్టన్ కి వచ్చారు కాకపోతే వాళ్ళు చేసిన తప్పల్లా ఏంటంటే… “మేం అప్పుల్లో ఉన్నాం మాకు డబ్బు సాయం చేసి మా కంపెనీలని బ్రతికించండి అని ప్రభుత్వాన్ని అడగడానికి వారి వారి అలవాట్ల ప్రకారం తలా ఓ ప్రైవేట్ జెట్ లో Detroit నుండి Washington కి వచ్చారు.

దానికి గాను అయిన ఖర్చు రమా రమి 60 వేల డాలర్లు. commercial jets ఉపయోగిస్తే ముగ్గురుకీ కలిపి 2 వేల లో అయిపోయేది ఖర్చు అలా కాకుండా జెట్ పూల్ చేసుకుని ముగ్గురూ కలిసి ఒకే జెట్ లో వచ్చినా 20వేల తో అయిపోయేది. ఇటువంటి పరిస్థితి లో కూడా ఇలా వృధా గా ఖర్చు పెడుతున్న వీళ్ళకి చూస్తూ చూస్తూ డబ్బు సాయం ఎలా చేయమంటారు అని అడిగారు. అంతే కాదు ఆ రోజు నిర్ణయం తీసుకోడానికి జరపాల్సిన వోటింగ్ ని కూడా రద్దు చేసారుట.

కంపెనీ లేమో ప్రోటోకాల్స్ సెక్యూరిటీ ఇబ్బందులు కారణాలు గా చూపించి, ఇక్కడ కంపెనీలు మూత పడితే Detroit లో నిరుద్యోగులయ్యే అనేక మంది జీవితాల గురించి పట్టించుకోకుండా అనవసరమైన విషయానికి ప్రాముఖ్యత నిచ్చి విషయాన్ని పక్క దారి పట్టిస్తున్నారు రాజకీయనాయకులు అని అంటున్నాయి. వీరిద్దరి వాదనలో ఎవరిదీ కొట్టి పారేయలేనివి గానే ఉన్నాయనిపిస్తుంది కాని నన్ను ఆకర్షించిన విషయమేంటంటే రాజకీయాలు ఏ దేశం లో నైనా ఎక్కడైనా రాజకీయాలే సుమా అనే విషయం.

ఇవ్వన్నీ పక్కన పెడితే అసలు there is a lot of saving potential in corporate travel అని నా అభిప్రాయం, నా వృత్తి రీత్యా మా account లోని అన్ని Travel and living expenses నేను గమనిస్తూ ఉంటాను, చాలా అడ్డదిడ్డం గా బుక్ చేసి పడేస్తుంటారు టిక్కెట్స్. కొద్దిగా డీల్స్ వెతికితే నో కాస్త సర్ధుకోగలిగితేనో రెండువందల డాలర్లకి అయిపోయే tickets కోసం ఆరేడు వందల డాలర్లు ఖర్చు పెడుతుంటారు. ఇవే ఎయిర్లైన్స్ కి అసలైన లాభసాటి బేరాలనుకోండీ ఇవి కట్ చేస్తే అక్కడ బోలెడు ఉద్యోగాలు పోతాయంటారేమో.

7 కామెంట్‌లు:

  1. వేణు గారు, మీరన్నది కొన్ని కార్పొరేట్లకు వర్తిస్తుంది. అయితే, ఇక్కడ భారద్దేశం లో చాలా కార్పోరేట్ సంస్థలు ఇలాంటి వాటి మీద కోతను బానే అమలుపరుస్తున్నాయి. ఆ మాటకొస్తే, ఓ పిసరు ఉద్యోగులను ఇబ్బంది పెట్టే స్థాయిలో కూడాను :-). అయితే, అనవసర పటాటోపాలు తగ్గించుకుందుకు ఈ ఆర్థిక మాంద్యం దోహదం చేస్తే, అది మంచిదే.

    రిప్లయితొలగించండి
  2. మీరు చివర్లో అన్నట్లు, ఓ చోట కోత పడితే ఇంకోచోట ఉద్యోగాలు పోతాయి. అంతగా ఒకళ్ల బ్రతుకులతో మరొకటి ముడిపడిపోయాయి మరి. ఓ వందమంది ఉన్నట్టుండి పొదుపు చెయ్యటం మొదలెట్టేస్తేనో, దుబారా ఆపెయ్యాలనుకుంటేనో దెబ్బకి లోకమంతా ఛైన్ రియాక్షన్ మొదలైపోద్ది. ఇప్పుడీ ఆర్ధిక మాంద్యం గొడవొచ్చిందే అందుక్కదా. ఇంకో ఏడాదికో రెండేళ్లకో ఇది పోద్ది, మరో ఆరేడేళ్లు అంతా బ్రహ్మాండంగా నడుస్తుంది .. తర్వాత మళ్లీ షురూ.

    అందుకే నా సిద్ధాంతం .. ఎకానమీ బూమ్‌లో ఉన్నప్పుడు మరీ రెచ్చిపోయి ఖర్చు చెయ్యొద్దు, రిసెషన్‌లో ఉన్నప్పుడు కాస్త ఎక్కువగా ఖర్చు పెట్టు .. ఎకానమీకి దోహదం చెయ్యి.

    ఇక రాసింది చాలు. బయటికెళ్లి కాఫీ ఒకటి కొని స్టార్‌బక్స్‌ని, ఎకానమీని కాపాడాలి :-)

    రిప్లయితొలగించండి
  3. VJ and Aswin thanks for your comments.

    రవి గారు మీరు చెప్పినది కూడా నిజమేలెండి కొందరు మరీ ఫ్రీ గా వదిలేస్తే మరికొందరు చాలా ఎక్కువ నిభందనలు పెడుతున్నారు. భారతం లో ఈ దుబారా కొంచెం తక్కువే అని చెప్పచ్చులెండి కానీ ఇక్కడ మరీ దారుణం అనిపిస్తుంది ఒకోసారి.

    అబ్రకదబ్ర గారు మీ సిద్దాంతం బావుందండి.

    రిప్లయితొలగించండి
  4. బాగుంది!

    అబ్రకదబ్ర, మీరు చెప్పింది ఆచరించాల్సిందే! 'ఎకానమీ బూం లో ఉన్నప్పుడు రెచ్చిపోయి ఖర్చు పెట్టద్దు,..." ప్చ్...! అవునూ..మీరు లేఖిని లో వత్తు లేని మ్మ్ ఎలా రాస్తున్నారు? మీరు వాడేది లేఖినా కాదా?

    రిప్లయితొలగించండి
  5. నెనర్లు సుజాత గారు,

    లేఖిని లో "మ్" కోసమ్ ma^ అని టైప్ చేసి చూడండి వస్తుంది.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.