ముందుగా తన టపా ద్వారా ఈ పాటను పరిచయం చేసిన సిరిసిరిమువ్వ గారికి నెనర్లు. ఆపై ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే నాదవినోదిని గురించి చెప్పి పాలగుమ్మి వారి ఫోన్ నంబరు ఇచ్చిన సి.బి.రావు గారికి నెనర్లు. నేను ఇండియా వెళ్ళినప్పుడు పాలగుమ్మి వారితో మాట్లాడి నాదవినోదిని నాగరాజు గారి నంబరు తీసుకుని, సరిగ్గా వచ్చే ముందు రోజు అప్పటికే 36 గంటలు గా స్వల్ప విరామం తో చేసిన ప్రయాణాన్ని లెక్క చెయ్యకుండా... మరుసటి రోజు అమెరికాకు చేయాల్సిన 20 గంటల ప్రయాణాన్ని కూడా మరచి బాగ్‌లింగంపల్లి లో నాగరాజు గారి ఇల్లు వెతికి పట్టుకుని ఈ కేసేట్ సంపాదించాను.
కానీ ఇంతా శ్రమపడి "తాళం వేసితిని కానీ గొళ్ళెం మరిచితిని" అన్న చందాన కేసెట్ సంపాదించాను కానీ నా దగ్గర ప్లేయర్ లేదన్న విషయం విస్మరించాను. అంటే నిజానికి అమెరికా లో ఓ కేసెట్ ప్లేయర్ కొనుక్కోడం ఎంత సేపు లే, ఇప్పుడు ఐపాడ్ లు గట్రా వచ్చాయ్ కాబట్టి కేసెట్ ప్లేయర్ లు తక్కువ ధర లో దొరుకుతుండి ఉంటాయ్, అనే నిర్లక్ష్యం కూడా ఒక కారణం లెండి. తీరా ఇక్కడికి వచ్చాక ఎక్కడ వెతికినా కేసెట్ ప్లేయర్ అని అడగగానే నన్నో ఆదిమానవుడ్ని చూసినట్లు చూసి ఇంకా అవి ఎక్కడ దొరుకుతున్నాయ్ అని నన్నే ఎదురు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఆఖరికి ఈ రోజే బెస్ట్‌బై లో చివరగా మిగిలి ఉన్న ఒకే ఒక్క కేసెట్ వాక్మన్ తెచ్చి ఇపుడే ఈ పాట వినగానే పడిన కష్టమతా మర్చిపోయాను. అందుకే వెంటనే టపాయించేస్తున్నాను.

Maa Uru okka saari... |
పాలగుమ్మి విశ్వనాథం గారు రచించి, స్వరపరచి గానం చేసిన ఈ పాట మనకోసం.
ఓహొ ఓ...ఓ...ఆ.ఆ...ఆ.ఆ...
పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.. ||పంట చేల||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..||మా ఊరు||
ఒయ్యారి నడకలతో ఆ ఏరు..
ఆ ఏరు దాటితే మా ఊరు ||ఒయ్యారి||
ఊరి మధ్య కోవెలా కోనేరు..
ఒక సారి చూస్తిరా తిరిగి పోలేరు..
ఊరి మధ్య కోవెలా కోనేరు..
ఒక సారి చూస్తిరా వదిలి పోలేరు..
||పంట చేల......తిరిగి రావాలి||
పచ్చని పచ్చిక పైనా మేను వాల్చాలి...
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి...||పచ్చని||
ఏరు దాటి తోట తోపు తిరగాలి...
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి... ||ఏరు దాటి||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..||2||
చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి...
మనసువిప్పి మాట్లాడే మనుషుల కలవాలి...||చిన్ననాటి||
ఒకరొకరు ఆప్యాయతలొలకబొయ్యాలి...
ఆగలేక నా కన్నులు.. చెమ్మగిల్లాలి...||ఒకరొకరు||
పంట చేల గట్ల మీద నడవాలి..
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి.. ||పంట చేల||
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి..
జ్ఞాపకాల బరువు తో తిరిగి రావాలి..||మా ఊరు||
ఓహొ హో...ఓ..ఒ..ఒ..ఒ..ఓ....||2||

నాదవినోదిని కేసెట్ మరియూ సిడీ ల కోసం సంప్రదించ వలసిన చిరునామా.
నాగరాజు 040-27676526
HIG Block 6, Flat 16.
Near Sundarayya park, Baglingampally Hyderabad-500044
Email : hemavathi_57@rediffmail.com
అంత శ్రమపడి అందరికోసం ఈ పాట సంపాదించినందుకు మరియు అంతకన్నా ఎక్కువ శ్రమపడి వినిపించినందుకు ధన్యవాదాలు. మీరు పడ్డ శ్రమ అంతా ఈ పాట వినగానే ఎగిరిపోయుండాలే!!
రిప్లయితొలగించండినాగరాజు గారి అడ్రస్సు ఫోను నుంబరు ఇవ్వగలరా?
ఎంతో వ్యయప్రయాసలు కూర్చి ఇంత మంచి పాటని సంపాదించి, మాకందించినందుకు మీకు బోల్డన్ని కృతజ్ఞతలు!! వింటూ అలా అలా మా నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చాను :-)
రిప్లయితొలగించండిthanks sir
రిప్లయితొలగించండిసిరిసిరిమువ్వ గారు, నిషిగంధ గారు, రాధిక గారు నెనర్లు.
రిప్లయితొలగించండిvery nice........
రిప్లయితొలగించండిదీపావళి శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిentandi chaala rojulaindi ee posting cheyaledu..........
రిప్లయితొలగించండిmee srisatya
మీరు కర్ణాటక సంగీతాభిమానులా? చాలా సంతోషం.
రిప్లయితొలగించండిషికాగో లో ఉంటున్నారని ఇప్పుడే గమనించాను. కొత్త పోస్ట్ రాయండి.
Excellent venu, thanks a lot!
రిప్లయితొలగించండిసుజాత గారు, శ్రీసత్య గారు, గీతాచార్య గారు నెనర్లు...
రిప్లయితొలగించండికొత్తపాళీ గారు నెనర్లు... అవునండీ కర్ణాటక సంగీతం వింటూ ఉంటాను అప్పుడప్పుడు కాకపోతే Music Today albums బాల మురళి గారి పాటలు తప్ప పెద్ద గా ఏమీ తెలియవు. ఆయన థిల్లానాస్ అంటే నాకు చెప్పలేనంత ఇష్టం
మీ అందరి ప్రోత్సాహానికి బోలెడు నెనర్లు.... బాగా బిజీ ఉండడం వల్ల కుదరడం లేదండీ... త్వరలో మళ్ళీ బ్లాగ్ ని లైవ్ లోకి తీసుకురావడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను..
చాలా బావుందండి
రిప్లయితొలగించండిThank you cartheek.
రిప్లయితొలగించండిచాలా రోజులు గా ఈ పాట కోసం వెతుకుతున్నాను. ధన్యవాదాలు
రిప్లయితొలగించండిథాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అజ్ఞాత గారు.
తొలగించండి