అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శుక్రవారం, డిసెంబర్ 15, 2017

మళ్ళీ రావా...

నూతన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సుమంత్ అండ్ ఆకాంక్ష జంటగా నటించిన కొత్త సినిమా మళ్ళీ రావా. ఈ సినిమా ట్రైలర్ ఇక్కడ చూడండి, పాటలు ఇక్కడ వినండి. ఇవి చూశాక సినిమా గురించి ఒక పాజిటివ్ ఫీల్ వచ్చి ఉంటే కనుక ఈ రివ్యూతో సహా మరే రివ్యూలు చదవకుండా సినిమా చూడండి. ఓ చక్కని ప్రేమకథని ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో మనసుకు హత్తుకునేలా చెప్పాడు గౌతమ్. శ్రవణ్ భరద్వాజ్ అందించిన ఆహ్లాదకరమైన సంగీతం, గౌతమ్ రాసుకున్న సంభాషణలు ఈ అందమైన ప్రేమ కథకు చక్కని సపోర్ట్ ఇచ్చాయ్. ఈ రోజు నుండీ రెండవ వారంలోకి అడుగుపెడుతున్న ఈ సినిమాకి మరికొన్ని థియేటర్స్ ను మల్టిప్లెక్స్...

మంగళవారం, నవంబర్ 28, 2017

మెంటల్ మదిలో...

సాధారణంగా ఒకటికన్నా ఎక్కువ ఆప్షన్స్ కనిపిస్తే మనందరం ఏది ఎన్నుకోవాలా అని అంతో ఇంతో కన్ఫూజ్ అవడం సహజం, మన అభిరుచి, అనుభవం, అవసరం ఇత్యాదులని బేరీజు వేసుకుని ఆలోచించి సరైన ఆప్షన్ ఎన్నుకుని ముందుకు సాగుతాం. ఐతే ఈ కన్ఫూజన్ మితిమీరిన మోతాదులో ఉన్న వ్యక్తే అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు). చిన్నతనం నుండీ కూడా ఆ రోజు ఏ డ్రస్ వేస్కోవాలో తల్లి డిసైడ్ చేసి ఇస్తే తప్ప రోజు మొదలవని అరవింద్ స్కూల్లో పరీక్షల్లో కూడా ఎస్సేటైప్ ఆన్సర్స్ పేజీలకు పేజీలకు రాసేసి మల్టిపుల్ ఛాయిస్ కొశ్ఛన్స్ కి మాత్రం తెల్లకాగితం ఇచ్చి వచ్చే రకం. ఎంతపెద్దైనా ఈ కన్ఫూజన్ అలా కొనసాగుతూనే...

శుక్రవారం, నవంబర్ 10, 2017

శమంతకమణి...

హైదరాబాద్ నగరంలోని అత్యంత ధనవంతులలో ఒకరు జగన్నాథ్(సుమన్). అతని కొడుకు మంచి మనసున్న కృష్ణ(సుధీర్ బాబు) తన పుట్టినరోజు పార్టీలో మిత్రులకి పరిచయం చేయడానికి తన తండ్రికి ఇష్టమైన రోల్స్ రాయిస్ వింటేజ్ కార్ "శమంతకమణి" ని అతనికి తెలియకుండా తీస్కెళతాడు. పార్టీ ముగిసే సరికి ఆ కార్ దొంగతనానికి గురవుతుంది. చిన్నపుడు తన తల్లి కొనిస్తానని మాటిచ్చిన ఆ కార్ ఇంటికి వచ్చిన దగ్గర నుండీ తనకి దూరమైన తల్లే తిరిగి వచ్చిందన్నంతగా సంబర పడుతున్న కృష్ణ ఆ కార్ ని వెతికి పట్టుకోవాలని పోలీస్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ సహాయం కోరతాడు.  రంజిత్ కుమార్ (నారా రోహిత్)...

శనివారం, నవంబర్ 04, 2017

PSV గరుడవేగ 126.18M

డాక్టర్ రాజశేఖర్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి ఎన్నాళ్ళవుతుందో అని లెక్కలేసుకుంటే అప్పుడెప్పుడో చూసిన అల్లరి ప్రియుడు గుర్తొస్తుంది ఆ తర్వాత ఇంక ఇంతవరకూ నేను థియేటర్లో చూసిన సినిమాలేవీ గుర్తు రావడమే లేదు. అలాంటిది ఇన్నాళ్ళకు ఒక పవర్ ఫుల్ ట్రయలర్ ప్లస్ ప్రవీణ్ సత్తార్ మీద ఉన్న నమ్మకం నన్ను థియేటర్ వైపు నడిపించింది. థియేటర్లో ఉన్న ఇతరులు కూడా "రాజశేఖర్ సినిమా మొదటి సారి థియేటర్లో చూస్తున్నా మామా" అని అనుకోవడం విని నవ్వుకున్నాను.  సినిమా మొదటిసగం పూర్తయే సరికి వావ్! వావ్! వావ్! వావ్! వాటే మూవీ! అనుకుని ఆశ్చర్యపోవడం నా వంతైంది. రెండవ సగం పూర్తయేసరికి...

బుధవారం, సెప్టెంబర్ 20, 2017

బిగ్ బాస్...

బిగ్ బాస్ అనే రియాలిటీ షో తెలుగులోనా.. అసలా షో ఫార్మాట్ చుట్టూ ఉండే కాంట్రవర్సీలు, ఆ కంటెంట్ మన తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తాయి... అసలదే కంటెంట్ ని యాజ్ టీజ్ గా తెలుగులో చూపించగలరా.. తారక్ ఏమాత్రం హోస్ట్ చేయగలరో.. సెలెబ్స్ ఎవరు వస్తారో ఇలా పలు అనుమానాల మధ్య షో స్టార్ట్ అయింది.. నిజం చెప్పాలంటే సెలెబ్రిటీస్ లిస్ట్ చూశాక వీళ్ళని ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడమేంటి ఏమొచ్చింది ఈ బిగ్ బాస్ టీమ్ కి ఈ సెలెక్షన్ ఎంటి అని షోమీద ఇంట్రస్ట్ పూర్తిగా తగ్గిపోయింది.  మొదటి వీకెండ్ ఇంట్రడక్షన్ అయ్యాక రెండవ వీకెండ్ తారక్ షో చూశాక  కేవలం తన...

మంగళవారం, జూన్ 13, 2017

అమీ తుమీ..

సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే సక్సెస్ ఫార్ములా వెనక పరుగెట్టడమనే జాడ్యానికి దూరంగా ఉండే అతి కొద్దిమంది దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ వేటికవే వేరు వేరు జెనర్స్ లో ఉంటాయి. సినిమాని ఎలా సక్సెస్ చేయాలా అనే ఆలోచనతో కాక ఒక మంచి కథను ఎలా చెప్పాలా అని ఆలోచించే వ్యక్తి తను. తెలుగు సాహిత్యం తన వారసత్వం దానికి తోడు చిన్నప్పటి నుండీ తను చదివిన సాహిత్యం అతనిని ఒక విశిష్టమైన దర్శకునిగా నిలబెట్టింది. భాష మీద పదాల మీద తనకున్న పట్టు ఈ సినిమా మాటల్లో అలవోకగా చిలకరించిన హాస్యాన్ని చూస్తే తెలుస్తుంది.  ఇంతకీ...

ఆదివారం, జనవరి 22, 2017

అమ్మ...

ఇంటికి పెద్ద నాన్నే అయినా అమ్మ ప్రేమ ముందు మాత్రం ఆయనతో సహా అందరం చిన్నవాళ్ళమైపోతాము కదా. ఎపుడైనా ఏ చిన్న అనారోగ్యం కానీ అసౌకర్యం కానీ కలిగితే అమ్మ తీసుకునే అన్ని జాగ్రత్తలు ఇంకెవరూ తీస్కోలేరు. అసలు అమ్మ అవగానే అమ్మాయిలకు ఆటోమాటిక్ గా ఒక ప్రత్యేకమైన ఆలోచనా విధానం అలవాటైపోతుందేమో. మిగిలిన వాళ్ళందరూ తీస్కునే జాగ్రత్తలు ఒక ఎత్తైతే మన అమ్మ చేసే పనులు మాత్రం ప్రత్యేకం. బహుశా మన చిన్నతనం నుండీ మనని నిరంతరం దగ్గిరగా గమనిస్తూ నిత్యం మన సంతోషం గురించే ఆలోచించడం వలన అమ్మ అలా అన్నీ మనకి మాక్సిమమ్ సౌకర్యాన్ని ఇచ్చే విధంగా ఏర్పాటు చేయగలుగుతుందేమో. నా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.