ఆదివారం, ఫిబ్రవరి 12, 2012

పదాలకు సరదా అర్ధాలు

మొన్న ఒక రోజున టీవీలో సొంతం సినిమా కామెడీ బిట్స్ చూస్తూ ఇలాంటి పదాలు ఇంకా ఎమున్నాయో అని ప్లస్ లో మిత్రుల సాయమడిగితే అందరూ కలిసి ఇదిగో ఈ లిస్ట్ తయారు చేశారు. పదాలను అందించిన మిత్రులు అందరికీ ధన్యవాదాలు. మీకు కూడా ఇంకా ఏవైనా కొత్త అర్ధాలు గుర్తోస్తే ఇక్కడ కామెంట్స్ లో పంచుకోండి. రెండ్రోజుల తర్వాత అన్నీ కలిపి బ్లాగ్ పోస్ట్ అప్డేట్ చేస్తాను. 

దుర్గతి = దుర్గకి పట్టిన గతి
బీట్ రూట్ = బీటేసే రూటు
మేనత్త = మే నెల్లో పుట్టిన నత్త
--సొంతం సినిమా నుండి..

ఇంకా ఇలాంటి సరదా అర్ధాలు మీరు విన్నవీ అన్నవీ ఏమైనా ఉంటే చెప్పండి.. సరదాగా కలెక్ట్ చేద్దారి :-)

ఇంజనీర్ :: ఇంజన్లో నీరు పోసేవాడు
సైక్లోన్ :: సైకిల్ కొనడానికి తీసుకునే లోన్..
బాట్‌మేన్ :: బాట్ పట్టుకుతిరిగేటోడు...
భీరుడు :: బీరు తాగేటోడు
చందమామ :: చందాలు అడిగే మామ
సీతమ్మతల్లి :: సీత వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి.
సైలెన్స్ :: సైలు పెట్టుకునే లెన్స్.
భారతీయుడు :: భారతీ నువ్వు చెయ్యి. (భారతీ you do)
క్యాపిటలిస్టు :: క్యాప్ పెట్టుకునేవాడు
మార్క్సిస్ట్ :: మార్కులు వేసేవాడు
జీనియస్ :: జీన్స్ వేసుకున్న వాడు
లైట్ హౌస్ :: తేలికైన ఇల్లు
పంచ పాండవులు :: పంచె కట్టుకునే పాండవులు
డ్రాయర్ :: డ్రా చేసేవాడు
మార్క్సి(ర్క్స్+ఇ)స్ట్ :: మార్కులు ఇష్టపడి వాటికోసం కష్టపడేవాడు
మావోయిస్టులు :: మా ఆవుకి ఇష్టులు (కుమ్మడానికి)
షోలే :: (ఈరోజు) షో లేదు.
బ్లాగరు :: (వెబ్ లాగరు) - వెబ్బుని లాగే వాడు
ప్రసాదు :: ప్రభుత్వ.సారాయి.దుకాణం
వెదవ :: వెయ్యేళ్ళు దరిద్రంతో వర్ధిల్లు.
వెధవ :: వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లు
షేక్స్పియర్ :: షేకు S పీరు సాయెబ్బు గారు
సాంబార్ :: సాములోరి బార్
కుక్కరు :: కుక్క అరుపు
రాంబస్ :: రాము గాడి బస్సు
దోమ :: రెండు 'మ' లు
బెంగాలి :: బెంగ పెట్టుకున్న ఆలి
బిల్ గేట్స్ :: బిల్లు కట్టకుండా గేట్ దూకి పారిపోయే వాడు.
దూర దర్శన్ :: దర్శనానికి దూరంగా ఉండవలసినది.
బుక్‌మార్క్ :: బుక్ షాప్ మార్క్ గాడు
డయేరియా :: చచ్చే ఏరియా or చచ్చిన జనాల ఏరియా (స్మశానం)
సోదరా :: సోది ఆపరా :-)
వైఫ్ :: వైట్ బ్లఫ్ (అంటే white lies అంటారు కదా, అలా అన్న మాట :-))
దూర్వాసుడు :: దూరంనుంచే వాసనొచ్చేవాడు...(బహుశ కోపం వాసననుకోవచ్చేమో)
కాంతారావు :: కాంతా రావూ?
హర్ నాథ్ :: హర్ (ప్రతీ ఒక్క) నాథుడు
బ్లాగు :: బాబు లాగు
ముంతాజ్ :: తాజాగా ఉన్న ముంత
బ్లాగ్ ఫ్రెండ్స్ చెప్పిన లిస్ట్ :
హోమియోపతి :: హోమ్ లోనే ఉండే పతి
కులాసా :: కుమారుడి వల్ల లాసు
కవి :: కనపడదు వినపడదు
పంచ దార :: ఐదుగురి భార్య
శ్రీకాంత్ :: శ్రీ కి అంతం
పాణి గ్రహణం :: పాణి కి గ్రహణం పట్టడం
పల్లె టూరు :: పల్లెకు టూరు వెళ్ళడం
సైకాలజీ :: సైకిలు గురించి చెప్పే శాస్త్రం
శిశుపాలుడు :: శిశువులకి పాలిచ్చేవాడు
ప్రియానందభోజా :: ప్రియ పచ్చడితో ఆనందంగా భోజనం చేసే వాడు
ఎగ్జాం :: ఎగ్గ్+జాం
లేపాక్షి :: పాక్షికంగా లేచినది.
మెడల్ :: మేడలో వేసుకోనేది.
ఆల్జీబ్రా :: అన్ని జీబ్రాలు
శ్రీశ్రీ గారు చెప్పిన అర్ధం
నిర్మాత :: మాత లేనివాడు.

20 వ్యాఖ్యలు:

 1. ఈ వరసకి దగ్గర్లోవి జంధ్యాల చిత్రాలలో, ముళ్ళపూడి వారి మాటల్లో బోలెడు ఉంటాయి.

  కులాసానా అంటే .. కుమారుడి వల్ల లాసే అంటాడు
  కవి అంటే కనపడదు వినపడదు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పంచ దార = ఐదుగురి భార్య
  శ్రీకాంత్ = శ్రీ కి అంతం
  పాణి గ్రహణం = పాణి కి గ్రహణం పట్టడం
  పల్లె టూరు = పల్లెకు టూరు వెళ్ళడం

  ప్రత్యుత్తరంతొలగించు
 3. హ..హ..బావున్నాయండీ .
  బెంగాలి నాకు బాగా నచ్చింది

  ప్రత్యుత్తరంతొలగించు
 4. వనజ గారు, శ్రీకాంత్ గారు, వాసుగారు, గురూజీ, లలిత గారు, కృష్ణప్రియ గారు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. హహహ! చాలా బాగుందండీ!నాకు తెలిసిన మరికొన్ని (సినిమాలనుంచే)
  సైకాలజీ - సైకిలు గురించి చెప్పే శాస్త్రం
  శిశుపాలుడు - శిశువులకి పాలిచ్చేవాడు
  ప్రియానందభోజా - ప్రియ పచ్చడితో ఆనందంగా భోజనం చేసే వాడు
  ఎగ్జాం - ఎగ్గ్+జాం

  ప్రత్యుత్తరంతొలగించు
 6. భలే ఉన్నాయి వేణు గారూ:) వాసు గారు చెప్పిన "కులాసా" భలేగా ఉంటుంది :D

  ప్రత్యుత్తరంతొలగించు
 7. రసజ్ఞ గారు ధన్యవాదాలు ప్రియానందభోజ మార్చేపోయానండీ భలే గుర్తు చేశారు :)
  జ్యోతిర్మయి గారు, అప్పూ ధన్యవాదాలు..

  ప్రత్యుత్తరంతొలగించు
 8. లేపాక్షి - పాక్షికంగా లేచినది.
  మెడల్ - మేడలో వేసుకోనేది.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. కలెక్షన్ చాలా బావుంది వేణు గారూ...

  కాపీ పేస్ట్ చేసేసుకున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. థ్యాంక్స్ గీతిక గారు :) లిస్ట్ అంతా మన మిత్రుల చలవే.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. కొన్ని బాగా నవ్వించాయి.
  శ్రీశ్రీ చెప్పిన అర్ధం ఒకటి
  నిర్మాత = మాత లేనివాడు.
  (నిజమే వాళ్ళ అమ్మే గనక ఉంటే డబ్బుని సినిమాల్లో పెట్టనిస్తుందా?)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. దూర్వాసుడు :: దూరంనుంచే వాసనొచ్చేవాడు...(బహుశ కోపం వాసననుకోవచ్చేమో)
  :))బాగుంది

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ధన్యవాదాలు నారాయణస్వామి గారు, రాధిక గారు.

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.