మొన్న ఒక రోజున టీవీలో సొంతం సినిమా కామెడీ బిట్స్ చూస్తూ ఇలాంటి పదాలు ఇంకా ఎమున్నాయో అని ప్లస్ లో మిత్రుల సాయమడిగితే అందరూ కలిసి ఇదిగో ఈ లిస్ట్ తయారు చేశారు. పదాలను అందించిన మిత్రులు అందరికీ ధన్యవాదాలు. మీకు కూడా ఇంకా ఏవైనా కొత్త అర్ధాలు గుర్తోస్తే ఇక్కడ కామెంట్స్ లో పంచుకోండి. రెండ్రోజుల తర్వాత అన్నీ కలిపి బ్లాగ్ పోస్ట్ అప్డేట్ చేస్తాను.
దుర్గతి = దుర్గకి పట్టిన గతి
బీట్ రూట్ = బీటేసే రూటు
మేనత్త = మే నెల్లో పుట్టిన నత్త
--సొంతం సినిమా నుండి..
ఇంకా ఇలాంటి సరదా అర్ధాలు మీరు విన్నవీ అన్నవీ ఏమైనా ఉంటే చెప్పండి.. సరదాగా కలెక్ట్ చేద్దారి :-)
ఇంజనీర్ :: ఇంజన్లో నీరు పోసేవాడు
సైక్లోన్ :: సైకిల్ కొనడానికి తీసుకునే లోన్..
బాట్మేన్ :: బాట్ పట్టుకుతిరిగేటోడు...
భీరుడు :: బీరు తాగేటోడు
చందమామ :: చందాలు అడిగే మామ
సీతమ్మతల్లి :: సీత వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి.
సైలెన్స్ :: సైలు పెట్టుకునే లెన్స్.
భారతీయుడు :: భారతీ నువ్వు చెయ్యి. (భారతీ you do)
క్యాపిటలిస్టు :: క్యాప్ పెట్టుకునేవాడు
మార్క్సిస్ట్ :: మార్కులు వేసేవాడు
జీనియస్ :: జీన్స్ వేసుకున్న వాడు
లైట్ హౌస్ :: తేలికైన ఇల్లు
పంచ పాండవులు :: పంచె కట్టుకునే పాండవులు
డ్రాయర్ :: డ్రా చేసేవాడు
మార్క్సి(ర్క్స్+ఇ)స్ట్ :: మార్కులు ఇష్టపడి వాటికోసం కష్టపడేవాడు
మావోయిస్టులు :: మా ఆవుకి ఇష్టులు (కుమ్మడానికి)
షోలే :: (ఈరోజు) షో లేదు.
బ్లాగరు :: (వెబ్ లాగరు) - వెబ్బుని లాగే వాడు
ప్రసాదు :: ప్రభుత్వ.సారాయి.దుకాణం
వెదవ :: వెయ్యేళ్ళు దరిద్రంతో వర్ధిల్లు.
వెధవ :: వెయ్యేళ్ళు ధనంతో వర్ధిల్లు
షేక్స్పియర్ :: షేకు S పీరు సాయెబ్బు గారు
సాంబార్ :: సాములోరి బార్
కుక్కరు :: కుక్క అరుపు
రాంబస్ :: రాము గాడి బస్సు
దోమ :: రెండు 'మ' లు
బెంగాలి :: బెంగ పెట్టుకున్న ఆలి
బిల్ గేట్స్ :: బిల్లు కట్టకుండా గేట్ దూకి పారిపోయే వాడు.
దూర దర్శన్ :: దర్శనానికి దూరంగా ఉండవలసినది.
బుక్మార్క్ :: బుక్ షాప్ మార్క్ గాడు
డయేరియా :: చచ్చే ఏరియా or చచ్చిన జనాల ఏరియా (స్మశానం)
సోదరా :: సోది ఆపరా :-)
వైఫ్ :: వైట్ బ్లఫ్ (అంటే white lies అంటారు కదా, అలా అన్న మాట :-))
దూర్వాసుడు :: దూరంనుంచే వాసనొచ్చేవాడు...(బహుశ కోపం వాసననుకోవచ్చేమో)
కాంతారావు :: కాంతా రావూ?
హర్ నాథ్ :: హర్ (ప్రతీ ఒక్క) నాథుడు
బ్లాగు :: బాబు లాగు
ముంతాజ్ :: తాజాగా ఉన్న ముంత
బ్లాగ్ ఫ్రెండ్స్ చెప్పిన లిస్ట్ :
హోమియోపతి :: హోమ్ లోనే ఉండే పతి
కులాసా :: కుమారుడి వల్ల లాసు
కవి :: కనపడదు వినపడదు
పంచ దార :: ఐదుగురి భార్య
శ్రీకాంత్ :: శ్రీ కి అంతం
పాణి గ్రహణం :: పాణి కి గ్రహణం పట్టడం
పల్లె టూరు :: పల్లెకు టూరు వెళ్ళడం
సైకాలజీ :: సైకిలు గురించి చెప్పే శాస్త్రం
శిశుపాలుడు :: శిశువులకి పాలిచ్చేవాడు
ప్రియానందభోజా :: ప్రియ పచ్చడితో ఆనందంగా భోజనం చేసే వాడు
ఎగ్జాం :: ఎగ్గ్+జాం
లేపాక్షి :: పాక్షికంగా లేచినది.
మెడల్ :: మేడలో వేసుకోనేది.
ఆల్జీబ్రా :: అన్ని జీబ్రాలు
శ్రీశ్రీ గారు చెప్పిన అర్ధం
నిర్మాత :: మాత లేనివాడు.
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
2 సంవత్సరాల క్రితం
collection chaalaa baagundi.
రిప్లయితొలగించండిప్రసాదు,దూరదర్శన్,ముంతాజ్ బావున్నాయి :-)
రిప్లయితొలగించండిఈ వరసకి దగ్గర్లోవి జంధ్యాల చిత్రాలలో, ముళ్ళపూడి వారి మాటల్లో బోలెడు ఉంటాయి.
రిప్లయితొలగించండికులాసానా అంటే .. కుమారుడి వల్ల లాసే అంటాడు
కవి అంటే కనపడదు వినపడదు
పంచ దార = ఐదుగురి భార్య
రిప్లయితొలగించండిశ్రీకాంత్ = శ్రీ కి అంతం
పాణి గ్రహణం = పాణి కి గ్రహణం పట్టడం
పల్లె టూరు = పల్లెకు టూరు వెళ్ళడం
హ..హ..బావున్నాయండీ .
రిప్లయితొలగించండిబెంగాలి నాకు బాగా నచ్చింది
:)) చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండిదుర్వాసుడు :)
వనజ గారు, శ్రీకాంత్ గారు, వాసుగారు, గురూజీ, లలిత గారు, కృష్ణప్రియ గారు ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిబాగున్నయ్.
రిప్లయితొలగించండిధన్యవాదాలు కష్టేఫలే గారు..
రిప్లయితొలగించండిహహహ! చాలా బాగుందండీ!నాకు తెలిసిన మరికొన్ని (సినిమాలనుంచే)
రిప్లయితొలగించండిసైకాలజీ - సైకిలు గురించి చెప్పే శాస్త్రం
శిశుపాలుడు - శిశువులకి పాలిచ్చేవాడు
ప్రియానందభోజా - ప్రియ పచ్చడితో ఆనందంగా భోజనం చేసే వాడు
ఎగ్జాం - ఎగ్గ్+జాం
ఔరా...
రిప్లయితొలగించండిభలే ఉన్నాయి వేణు గారూ:) వాసు గారు చెప్పిన "కులాసా" భలేగా ఉంటుంది :D
రిప్లయితొలగించండిరసజ్ఞ గారు ధన్యవాదాలు ప్రియానందభోజ మార్చేపోయానండీ భలే గుర్తు చేశారు :)
రిప్లయితొలగించండిజ్యోతిర్మయి గారు, అప్పూ ధన్యవాదాలు..
లేపాక్షి - పాక్షికంగా లేచినది.
రిప్లయితొలగించండిమెడల్ - మేడలో వేసుకోనేది.
ధన్యవాదాలు సాధారణ పౌరుడుగారు.
రిప్లయితొలగించండికలెక్షన్ చాలా బావుంది వేణు గారూ...
రిప్లయితొలగించండికాపీ పేస్ట్ చేసేసుకున్నాను.
థ్యాంక్స్ గీతిక గారు :) లిస్ట్ అంతా మన మిత్రుల చలవే.
రిప్లయితొలగించండికొన్ని బాగా నవ్వించాయి.
రిప్లయితొలగించండిశ్రీశ్రీ చెప్పిన అర్ధం ఒకటి
నిర్మాత = మాత లేనివాడు.
(నిజమే వాళ్ళ అమ్మే గనక ఉంటే డబ్బుని సినిమాల్లో పెట్టనిస్తుందా?)
దూర్వాసుడు :: దూరంనుంచే వాసనొచ్చేవాడు...(బహుశ కోపం వాసననుకోవచ్చేమో)
రిప్లయితొలగించండి:))బాగుంది
ధన్యవాదాలు నారాయణస్వామి గారు, రాధిక గారు.
రిప్లయితొలగించండి