అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శనివారం, జూన్ 28, 2008

అనగనగా ఓ హిచ్...

ఆయ్!! మీరు సరిగానే చదివారండి అప్పుతచ్చులేం లేవు...లేదూ నేనింకేదో చెప్పబోయి తుమ్మనూ లేదు... అది హచ్(తుమ్ము) కాదు హిచ్చే... అనుమానమేం లేదు వీడికి పిచ్చే... అని మీరు నిర్ధారించే లోపు టాపిక్ లోకి వచ్చేస్తాను. మొన్నీ మధ్యన నా ఫ్రెండ్ మా ఊరి నుండి వేరే ఊరికి మూవ్ అయ్యాడు అని చెప్పాను కదా... తనకి ఒక చిన్ని కారు తో పాటు బోలెడంత సామాను ఉంది. సామాను అంటే ఇక్కడ అమ్మేసి వెళ్ళి అక్కడ కొనుక్కునే టైపు సామాను కాదండోయ్... బట్టలు, పుస్తకాలు ఇతరత్రా చిన్ని చిన్ని ఎలెక్ట్రానిక్ సామన్లు ఇంకా మోజు పడి కొనుక్కున్న జిం సామాగ్రి గట్రా అనమాట. సొ అవన్నీ కారు తో సహా తను వెళ్ళే...

శుక్రవారం, జూన్ 27, 2008

గుల్మొహర్

ఈ టపా టైటిల్ చూసి ఇదేదో ఈనాడు వారి విపుల పుస్తకం లో అనువాద కధ లా ఉందే అని వచ్చిన వారికి సారీ అండీ, మిమ్మల్ని disappoint చేసినందుకు. ఏదో నోటికి వచ్చినట్లు బ్లాగమంటే సరే కానీ మనకీ కధలూ కవితలు రాసే అంత దృశ్యము లేదు. అప్పటికీ ఆ మధ్య హైస్కూల్ లో చదువుకునే రోజులలో "ఆకుపచ్చని కన్నీరు", "మెత్తని గుండ్రాయి" అని కొన్ని తవికలు రాసాను కానీ జంధ్యాల గారు ఆయన చంటబ్బాయి సినిమా లో వాడుకుంటాను అంటే కాదనలేక ఇచ్చేసాను, మళ్ళీ ప్రయత్నించలేదు :-)సరే ఇక నా టపా విషయానికి వస్తే, ఇదిగో పైన కనిపిస్తున్న గుల్మొహర్ చెట్టు గురించి, దాని పువ్వుల అందం గురించి వాటి మొగ్గలతో మేము...

గురువారం, జూన్ 26, 2008

అయ్యోలూ..హమ్మోలు..ఇంతేనా!!

మనకున్న సీరియలోఫోబియా !! (అలా హశ్చర్యపడిపోయేస్తే కష్టం, మాయాబజార్ లో్ "ఎవరూ పుట్టించక పోతే మాటలెలా పుడతాయ్" అన్న ఘటోత్కచుడ్ని ఆదర్శం గా తీసుకుని నేనే కనిపెట్టా ఈ పదం). సరే ఏదో ఒకటి ఏడూ... అని అనేసారని నాకు వినపడిందిలే. సో మనకున్న సీరియలోఫోబియా తో మొదట్లో ఈ అమృతం సీరియల్ జోలికి వెళ్ళే వాడ్ని కాదు. కానీ కొంచెం పాపులర్ అయిన తర్వాత ఇంట్లో బలవంతం గా కూర్చో పెట్టేసి చూయించారు.మొదట్లో నేను చూసిన ఎపిసోడ్స్ లో కామెడీ కధ కన్నా పాటలకి పేరడీ లు కట్టి వెటకారం చేయడం ఎక్కువ ఉండేది కొన్ని ఎంత బాగా నచ్చేవో కొన్ని అంత చిరాకూ తెప్పించేవి. తర్వాత కొన్ని రోజులకి అన్నీ...

బుధవారం, జూన్ 25, 2008

వంట-తంటా (కామన్‌సెన్స్ కరువైన ఓ వంట కధ)

ఆ మధ్య కొన్ని బ్లాగులలో మగ వాళ్ళే వంటింటికి అసలు సిసలు హక్కు దారులు అని అనడం చూసి నా అనుభవాన్ని తెలియచేయాలి అని ఈ టపా మొదలు పెట్టాను....ఇక చదవండి.ఈ మధ్యే నా పాత తెలుగు రూమ్మేట్ వేరే ఊరికి మారిపోడం తో సులేఖా, ఏక్‌నజర్ లాటి వెబ్‌సైట్ల లో ప్రకటనలు ఇచ్చి మళయాళీ యువతరానికి ప్రతినిధి అయిన ఒక అతనికి నా అపార్ట్మెంట్ లో ఓ గది అద్దెకిచ్చాను. పేరు బాబి :-) అలా నవ్వకండి అతని పేరు కృష్ణ సినిమాలో బ్రహ్మానందానికి పెట్టి కామెడీ చేస్తే అతనేం చేస్తాడు చెప్పండి. నాకూ మొదట్లో పిలిచినప్పుడల్లా నవ్వు ఆపుకోడం కొంచెం కష్టమైందనుకోండీ.సరే ఇక సోది ఆపి విషయం లోకొస్తే ఇతను...

సోమవారం, జూన్ 23, 2008

వాసంత సమీరం లా

ఏవో కొన్ని ప్రోగ్రాం లు, పండగల కి ప్రత్యేకించి తీసిన టెలీఫిల్మ్ లు తప్ప అంత గా ఆకట్టుకోని కార్యక్రమాల మధ్య బాగా ప్రాచుర్యాన్ని పొందిన మొదటి తెలుగు ధారా వాహిక ఋతురాగాలేనేమో. అప్పట్లో నాకు తెలిసి ఆదివారం ఉదయం వచ్చే రామాయణం తర్వాత మా ఊరిలో దాదాపు ప్రతి ఇంట్లోను ఒకే సమయం లో high volume లో పెట్టుకుని చూసే ప్రోగ్రాం లో ఇది ఒకటి. ఋతురాగాలు దూర దర్శన్ లో సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేది అనుకుంటాను, స్కూల్ / కాలేజి నుండి ఇంటికి వచ్చే టైము. నాకు ఇంకా బాగా గుర్తు, ఇంటికి వస్తుంటే దారి పొడవునా ప్రతి ఇంట్లోనూ ఈ పాట మార్మోగిపొతుంటుంది. నేను ఈ సీరియల్ ఎప్పుడూ చూడక...

గురువారం, జూన్ 19, 2008

బండి కాదు మొండి ఇదీ

"అప్పట్లో" అని అంటూ ఈ రోజు పోస్ట్ మొదలు పెడుతుంటే, హఠాత్తుగా "అహ నా పెళ్ళంట" సినిమా లో "మా తాతలు ముగ్గురు..." అని అంటూ ఆటో బయోగ్రఫీ చెప్పే నూతన్ ప్రసాద్ గారు గుర్తొచ్చి నాకే నవ్వు వచ్చింది, నేను కూడా అలా తయారవుతున్నానా అని. అయినా స్వగతం అంటూ బ్లాగడం మొదలు పెట్టాక తప్పదు కదా. అయినా ఇంచు మించు అదే రేంజ్ లో సుత్తి కొట్టినా కనీసం అందులో నూతన్ ప్రసాద్ గారి లా కట్టేసి కూర్చో పెట్టి వినింపించడం లేదు కదా అని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను :-)సరే ఇక విషయానికి వస్తే మొన్న ఒక రోజు ఆన్‌లైన్ లో ఏదో న్యూస్ క్లిప్పింగ్ విడియో చూస్తుంటే, దానిలో పెరుగుతున్న పెట్రోల్...

సోమవారం, జూన్ 16, 2008

తాళి కట్టు శుభవేళ

నిన్నటి జూనియర్ పాట తర్వాత ఈ పాట కూడా బాగా గుర్తొచ్చింది సరే అని పోస్ట్ చేస్తున్నాను. ఈ పాట ప్రభావమో లేకా మిమిక్రీ కి మామూలు గానే అంత క్రేజ్ వుందో తెలీదు కాని, అప్పట్లో మా ఇంట్లో చిన్న టేప్ రికార్డర్ వుండేది దాని లో రక రకాల శబ్దాలు మిమిక్రీ చేయడానికి ప్రయత్నించి రీకార్డ్ చేసే వాడ్ని. చేతి బొటన వేలు, చూపుడు వేలు కి మధ్య వుండే గాడి ని నోటికి perpendicular గా పెట్టుకుని "కూ...చుక్ చుకు" అంటూ వేసే ట్రైన్ కూత, ఇంకా ట్రైన్ రన్నింగ్ సౌండ్ ఒకటి చాలా బాగా వచ్చేది అప్పట్లో. మా చిన్న మామయ్య గారు "నాయనా శుయోధనా" అంటూ శకుని డైలాగులు , ఇంకా వేటగాడు లో రావు గోపాల...

ఆదివారం, జూన్ 15, 2008

జూనియర్.. జూనియర్

ఈ పాట ఇంకా అంతులేని కధ లో మిమిక్రీ పాట నచ్చని చిన్న పిల్లాడు వుండడేమో... ఈ పాట నాకు చాలా ఇష్టం చిన్నపుడు ఈ పాట పదే పదే వినే వాడ్ని కాని తీరా సినిమాకు తీసుకు వెళ్ళినప్పుడు మాత్రం ఈ పాట వచ్చే సరికి నేను నిద్ర పోయానుట. నిద్ర లేపితే కూడ సరిగా చూడ లేదు అని చెప్పేది అమ్మ. అసలు మనం చిన్నప్పుడు కొంచెం వెరైటీ లెండి. మా ఇంట్లో సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళం. ఒక సారి నేను నిద్ర పోయాక అలానే నన్ను ఎత్తుకుని సెకండ్ షో కి ఏదో రాజుల సినిమా కి తీసుకు వెళ్ళారుట (అక్బర్ సలీం అనార్కలి అనుకుంటా). మనకి సినిమా మధ్యలో మెలకువ వచ్చి కొంచెం సేపు సినిమా చూసి, నాకు నచ్చ లేదు,...

బుధవారం, జూన్ 04, 2008

కలిసి వుంటే కలదు సుఖము

నేను చిన్నపుడు నరసరావుపేట్ లో ఉండే వాళ్ళం అని చెప్పాను కదా. అమ్మ ట్రైన్ లొ వర్క్ కోసం గుంటూరు వెళ్ళి వచ్చేది, రోజూ రెండు గంటల పైనే జర్నీ పాపం వెళ్ళి రావడానికి. సో లంచ్ కి బాక్స్ తీసుకు వెళ్ళి వచ్చేప్పుడు స్టేషన్ లో నాకు మెలొడీ ఇంకా రక రకాల చాక్లేట్లు తెచ్చేది. అవి ఎంజాయ్ చేసి ఊరికే ఉండకుండా సాయంత్రం అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఆ బాక్స్ తీసుకుని కమల్‌హాసన్ లాగా స్టైల్ కొడుతూ "కలిసి వుంటే కలదు సుఖము" అని మరోచరిత్ర సినిమా లో పాట పాడుతూ బాక్సు మీద దరువు వేస్తూ డాన్సు వెస్తుంటె అమ్మా నాన్న అందరూ చూసి తెగ నవ్వుకునే వాళ్ళు (ఈ పాటలో కమల్ కూడా అలానే సరిత...

కారంపుడి a.k.a కారెంపుడి

పౌరుషాలకు పుట్టినిల్లు అయిన పలనాటి నడిబొడ్డున ఉన్న ఒక గ్రామం. ఇప్పుడు బహుశా పెద్ద ఊరు అయి ఉంటుందేమో కాని నా చిన్నప్పుడు మాత్రం ఒక పెద్ద గ్రామం మాత్రమే. మాచర్ల నుండి ఒక 40 కి.మి. ఉంటుంది అనుకుంటాను, దుర్గి మీదుగా వెళితే వస్తుంది కారంపుడి. పల్నాటి యుద్దం జరిగింది ఇక్కడే అని అంటారు. అంతే కాక బ్రహ్మనాయుడు కట్టించిన చెన్న కేశవ ఆలయం కూడా బాగా ప్రసిద్ది. ఇంకా పల్నాటి యుద్దం లో వాడిన ఆయుధాలు ఇక్కడ ఇంకా భద్ర పరచబడి ఉన్నాయని వాటికి సంబందించి కొణతముల మహోత్సవం ఇప్పటికీ జరుగుతుంది అని ఈ మధ్యనే ఎక్కడో చదివాను. అప్పట్లో చిన్న తనం కదా ఈ చారిత్రిక ప్రాధాన్యం తెలిసేది...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.