శనివారం, మే 24, 2008

మా ఊరు

నేను పుట్టింది నరసరావుపేట అనే ఊరిలో నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత నా బాల్యం అంతా అక్కడే గడిచింది అనిచెప్పుకోవచ్చు. పుట్టింది ఇక్కడ అయినా అమ్మ నాన్న ఉద్యోగ రీత్యా మొదట చీరాల లో కొన్ని నెలలు తర్వాతగుంటూరు లో ఒకటి రెండు సంవత్సరాలు ఉండి తర్వాత నరసరావుపేట లో స్థిర పడ్డామాట. అంటె పెద్దగా స్థిరపడటంకాదు లే కాని ఎక్కువ సంవత్సరాలు ఉన్నాము అని చెప్పుకోవచ్చు. మధ్యలో ఒక 2 సంవత్సరాలు మినహాయిస్తేదాదాపు 25 యేళ్ళు పైనే అక్కడ వున్నాము. తరువాత అమ్మకి బదిలీ అవడం తో గుంటూరు వచ్చేసాము.

అసలు నాన్న గారి సొంత ఊరు మాచెర్ల దగ్గర లో ఉన్న పాలవాయి. పక్కా పలనాటి ఊరు ఎక్కడ చూసిన నాపరాళ్ళతోఎండిన చేలతో ఉండేది. ఊరితో పెద్దగా నాకు పరిచయం లేదు, నాన్న ఒక్కడే సంతానం అవడం తో ఎక్కువబంధువులు లేక కొన్ని సార్లు మాత్రమే ఊరికి వెళ్ళాను. ఊరి మొదట్లో వుండే పిల్ల కాలువ, ఇంటి పక్కన వున్న చిన్నరామాలయము, ఇళ్ళ మధ్య నుండి వెళ్ళే బండలు పరిచిన రోడ్డు, టవలు కట్టుకుని ఆరుబయట బావి దగ్గర స్నానంఅన్నింటిని మించి వెళ్ళిన ప్రతి సారి ఉన్న కొద్ది మంది బందువుల ఆత్మీయమైన పలకరింపు ఇవి తప్పించి పెద్దగా ఏమిగుర్తు లేవు.

ఇక పోతే నేను చిన్నపుడు మా అమ్మమ్మ వాళ్ళు కారంపుడి లో ఉండే వాళ్ళు నా ప్రతి సెలవల్లొ ఊరు వెళ్ళాలి అంటేఅక్కడికే వెళ్ళే వాళ్ళము. అల్లర్లతో బాగా పేరు పొందిన కారంచేడు మా ఊరు వేరు వేరు. నేను ఊరు పేరుచెప్పినప్పుడల్లా ఇలా కలిపేసి అడుగుతూ ఉంటారు లెండి అందుకే ప్రత్యేకం గా చెప్తున్నా. కారంపుడి కారంచేడు వేరు వేరు అని. సరే ఇక కారంపుడి తో నా బాల్య స్మృతులు చాలా పెనవేసుకుని ఉన్నాయి. అవన్ని ఒకటొకటి గా వివరిస్తాను.

బాల్యం అంతా నరసరావుపేట, కారంపుడి మధ్యలో 7 & 8 తరగతులు మాత్రం పిడుగురాళ్ళ లో గడిపాను. స్కూల్ చదువు అయ్యాక ఇంటర్ చదువు కోసం విజయవాడ వెళ్ళాను అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. మొదటి సారి ఒక పెద్ద ఊరితో పరిచయం అదీ కాక కాలేజీ చదువు కదా హీరో లా ఫీల్ అయ్యే వాడ్ని. ఊరు అక్కడి కాలేజీ అనుభవాలు కూడా చాలా ఉన్నాయి తలచుకుంటే రోజుల తరబడి అలా ఆలోచనల్లో గడిపేస్తానేమో. తరువాత ఇంజనీరింగ్ కోసం విశాఖ ప్రయాణం మొదటి సారి సముద్ర తీరాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం ఆనందం మాటలలో చెప్పలేను. కడలితీరాలలో చల్లని గాలులతో సేద దీరుతూ 4 సంవత్సరాలని 4 క్షణాల్లా గడిపేసాము. ఇక్కడే నాకు జీవిత కాలం నాతోనిలిచే నేస్తాలు పరిచయమయ్యారు. కాలేజీ వదిలి 12 సంవత్సరాలైనా ఇంకా మేము కొంత మందిమి దాదాపు రోజుమాట్లాడుకుంటాము అంటే మీలో చాలా మంది నమ్మలేరేమో కాని ఇది నిజం.

చదువు అయ్యాక హైదరాబాదు అమీరుపేట లో ట్రైనింగు, మినిస్టర్స్ రోడ్ లో జీవితం టిఫిన్ బండి లో ఉప్మా దోశ, ఇంట్లోక్రికెట్, ఎలుకల బాధ, నీటి కరువు, రెండో ఆట సినిమాలు, మా ఇంటి యజమాని గురించి చెప్పకుండా ఉండగలనా... తరువాత మకాం మదరాసు ఇక్కడి ఉద్యోగ ప్రయత్నాలు mansion జీవితాలు గురించి చెప్పుకోకపోతే చాలా మిస్అయినట్లే... అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్న తరువాత బెంగళూరు... పై అమెరికా లో అట్లాంటా తరువాతవాషింగ్టన్ తరువాత మళ్ళీ కొన్ని రోజులు బెంగళూరు చివరగా ప్రస్తుతం చికాగో ఇదీ నా ప్రస్థానం.

ఏవిటో నా ఊరు అని మొదలు పెట్టి నేను ఉన్న ఊళ్ళ గురించి అన్నీ రాసేసాను కదా. సరే లెండి నా బాల్యం లో నేనుఎక్కువ గడిపిన కారంపుడి కబుర్లతో మళ్ళీ కలుద్దాం.

అంత వరకూ శలవా మరి,

--వేణు.

2 కామెంట్‌లు:

  1. వేణు
    ఎమయ్యా..ఎందుకు ననిట్ట emotions కి గురి చేస్థున్నావ్. మా తాతగారిది పాలవాయే....

    రిప్లయితొలగించండి
  2. hello venu gaaru, okkasaarigaa gunde porallo gnapakaalanu thatti lepaaru, annattu maadi atchempeta sattenapalli daggara .mee anubhavaalanni chadivaaka nenu chaalaa garvamgaa feel aiyyya endukante nenu kooda achhu ilaane anubhavinhaa.polaala venta regu pandla kosam thiragatam, eetha kottadaaniki krishana nadhi ku vellatam, thalachukunte ilaanti madhuramaina gnaapakaalu enno

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.