ఈ రోజు ఆకాశం లో ఓ అద్భుతం జరిగిందండి. మీరు పసిడి మబ్బులు ఎప్పుడన్నా చూసారా (బస్ మబ్బులు, రైలు మబ్బులు కాదమ్మా :-) . ఈ రొజు ఉదయం నేను station లొ train కోసం ఎదురు చూస్తుండగా చూసాను. వాతావరణం చల్ల గా ప్రశాంతం గా వుంది, సూర్యుడు కూడా తీక్షణమైన కిరణాలతో చలిని తరిమేయడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు.
ఆకాశం అంతా నీలం రంగులో చాలా నిర్మలం గా వుంది. తూర్పున మాత్రం పలచగా అక్కడక్కడ వెండి మెఘాలు ఉన్నాయి వాటిలో సూర్యుడికి కాస్త దగ్గరగా వున్న ఒక చిన్ని వెండి మీఘం మీద సూర్య కాంతి పడి బంగారు రంగులో మెరిసి పోతు కనిపించింది. సూర్యుడి వైపు వున్న సగం బంగారు రంగులోను మిగతా సగం వెలిగి పొతున్న వెండి రంగులోనూ చివర చిన్న తోక లా సాధారణ వెండి రంగుతో వుండి చూడటానికి చాలా అద్భుతం గా అనిపించింది. జీవితం లో మొదటి సారి camera phone వాడనందుకు చాలా బాధ పడ్డాను.
అదీ ఈ రోజు జరిగిన విశేషం. సరే మరి ఈ రోజంతా ఎదో ఒక పని లో తీరిక లేకుండా గడపడం వల్ల ఎక్కువ వ్రాయ లేక పోతున్నాను. మళ్ళీ మరో రోజు కలుద్దాం.
--మీ వేణు.

ఇలాంటి చిన్న చిన్న observations, అనుభూతులూ చాలా ఆనందానిస్తాయి వేణుగారు. నిన్నరాత్రి మేం స్నేహితులం ఛాయ్ కోసమని కాంటీన్ వెళ్ళాం.చంద్రుడికి ఒక వైపు ఒక వరసలో అమరిన మేఘాలు మరోవైపు అంతా క్లియర్‌గా చుక్కలతో మెరుస్తున్న ఆకాశం....కెమెరా ఉంటే బాగుందనిపించింది మాక్కూడా
రిప్లయితొలగించండినిజమే నాగార్జున గారు, ఒకోసారి కెమేరా ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ ఒకో సారి కెమేరాలు సర్దుకోవడం కన్నా ప్రపంచాన్ని మరిచి అలా ఆ అందాన్ని ఆస్వాదించేస్తుంటే బాగుంటుంది అనికూడా అనిపిస్తుంది.
రిప్లయితొలగించండి