నా పేరు వేణూ శ్రీకాంత్..అందం గా వుంది కదూ. నీ మొహం అందులో అందమేముంది రా అంటారా. ఆంగ్లం లో రాసినపుడు పెద్ద గా అనిపించదు కాని నాకు నా పేరు ని తెలుగు లో చూసుకున్నపుడు మాత్రం చాలా ముచ్చటేస్తుంది. ఆ ఒంపు సొంపులు మరే పేరులొనూ వుండవేమో అనిపిస్తుంది. కావాలంటే మళ్ళీ మీరు ఒకసారి చూడండి. ఎంత అందం గా వుందో కదూ...
నాకు అసలు ఈ పేరు ఎలా పెట్టారు అని మా అమ్మని అడిగాను చిన్నపుడు. చాల మంది వేణు లు వుంటారు వేణు గోపాల్, వేణు మాధవ్ ఇలా. లేదంటే శ్రీకాంత్ లు వుంటారు కాని అసలు ఈ రెండు పేర్లు కలిపి పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది అని అడిగాను. నన్ను కూడా చాలా మంది ఇదే ప్రశ్న అడిగేవారు లెండి. అంతెందుకు ఇన్ని రోజులలో నాకు ఇంత వరకు నా లాంటి పేరే వున్న వ్యక్తి తారస పడలేదు. ఆన్‌లైన్ లో ఐతే నా పేరు కు వుండే సౌకర్యం చెప్పనే అక్కర్లేదు నేను ఎప్పుడైనా ఎక్కడైనా యూజర్ ఐడి కావాలంటే నా పేరు తో వెంటనే దొరుకుతుంది నేను తప్ప మరి ఇంకెవరూ ఉండరు కదా.
సరే ఇంతకీ నా పేరు వెనక రుద్రవీణ చిత్రం లో లా పే...ద్ద కధ ఏమి లేదు లెండి. అమ్మ నాన్న వాళ్ళకి శ్రీకాంత్ అనే పేరు నచ్చిందట అందుకని శ్రీకాంత్, మా పెద్ద మామయ్య గారికి వేణూ అనే పేరు ఇష్టం అట సరేలే అని రెండు పేర్లు కలిపేసి పెట్టారు. కాని ఇంట్లో అందరూ నన్ను వేణు అనే పిలుస్తారు. ఒక్క మా పిన్ని మాత్రం శ్రీకాంత్ ని కుదించేసి సిరి అని పిలుస్తుంది.
సరే ఇంత అందమైన పేరు పెట్టారు అంతా బాగానె ఉంది కదా అనుకునేరు, నేను అమెరికా వచ్చాక అసలు కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడ వాళ్ళకి నా పేరు నోరు తిరగక ఖూని చేయడం మొదలు పెట్టారు. అసలే నా పేరు అంటే నాకు ఇష్టం కదా మరి ఖూని చేస్తే ఎలా భరించడం చెఫ్ఫండి అందుకనే వీళ్ళకి కొంచెం పలకడానికి సులువైన నా ఇంటి పేరు "దార్లా" తో పిలవండి బాబులు అని అనుమతి ఇచ్చేసాను. అలా నా ఆఫీసు పేరు దార్లా గా స్థిర పడిపోయింది అనమాట.
సరే లెండి ఇప్పటికే చాలా బోరు కొట్టించేసాను కదా నా పేరు కధ చెప్పి ఇంక ఆపేస్తాను మరో రోజు మరో విషయం మీద మాట్లాడుకుందాం.
శలవు...
--వేణు.
కుహు కుహూ.. కూసే..
-
డబ్బు డబ్బు డబ్బు చిత్రంలోని ఒక మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట
ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
ఎంబెడెడ్ వీడి...
3 సంవత్సరాల క్రితం
ఏదో బ్లాగ్ లో మీ కామెంట్స్ చూసి క్లిక్కితే ఇదుగో..ఇలా మీ 'నాతో నేను ' తెలిసింది.
రిప్లయితొలగించండిమీ పేరు గురించి నేనూ ఎప్పుడో అడగాలనుకున్నాను. Yes, you have an unique name. తెల్ బాగున్నాయి మీ కబుర్లు. చాలా మంది బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో చాలా ఎక్కువ వ్రాస్తారు. తరువాత ఆసక్తి సన్నగిల్లి అప్డేట్స్ ఉండవు. మీరు అలా కాకుండా..వ్రాస్తూ ఉండండి మీకు వీలు కుదిరినప్పుడల్లా..
థాంక్స్ వేణు గారు, తప్పకుండా నేను regular updates continue చేయడానికి ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండి