అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

ఆదివారం, జనవరి 22, 2012

అమ్మ లేని మరో ఏడాది.

నేనున్నానని భరోసానిస్తూ... గట్టిగా పట్టుకుంటే నా చేయి ఎక్కడ కందిపోతుందోనని మృదువుగా నా మణికట్టును తన అరచేతిలో పొదవి పట్టుకున్న అమ్మచేతి నులి వెచ్చని స్పర్శను ఇంకా మరువనేలేదు... మా అమ్మ అచ్చంగా నాకే సొంతమని లోకానికి చాటి చెబుతూన్నట్లుగా.. నా అరచేతిని బలంగా తనచేతివేలి చుట్టూ బిగించి పట్టుకున్న బిగి సడలినట్లే లేదు... తను ఎప్పుడూ నాతోనే ఉండాలన్న నా ఆలోచన గమనించలేదో ఏమో!! అమ్మ నా చేతిని విడిపించుకుని  నన్ను వీడి వెళ్ళిపోయి అప్పుడే మూడేళ్ళు గడిచిపోయాయి !! గడచిన ఈ మూడేళ్ళలోనూ ఏరోజుకారోజు రేపటికన్నా అలవాటౌతుందిలే అని అనుకుంటూ పడుకుంటానే కానీ...

ఆదివారం, జనవరి 15, 2012

సంక్రాంతి శుభాకాంక్షలు

గిలిగింతలు పెట్టే చలిలో వెచ్చని భోగిమంటలు, చలికి వణుకుతూనే తెల్లవారుఝామున చేసే తలస్నానాలు, పిల్లలకు పోసే పుల్ల భోగిపళ్ళు తీయని చెఱకు ముక్కలు, నిండు అలంకరణతో ఇంటింటికీ తిరుగుతూ అలరించే గంగిరెద్దులు, కమ్మని గానంతో ఆకట్టుకునే హరిదాసులు, ప్రతి ఇంటిముందూ తీర్చి దిద్దిన రంగురంగుల రంగవల్లులు. చిక్కుడు, గుమ్మడి కూరల్తో తినే పెసర పులగం, అరిసెలు, చక్రాలు ఇతర పిండివంటలు, కొత్తబియ్యంతో చేసిన పాయసాలు, పులిహారలూ, కనుమ రోజు మినప గారెలు కోడి కూరలూ. తెలుగింట  మూడురోజులు ఏరోజుకారోజు ప్రత్యేకతతో నిజంగా పెద్ద పండుగ పేద్ద పండుగే అనిపించేలా జరుపుకునే భోగి, సంక్రాంతి...

ఆదివారం, జనవరి 01, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా చిత్తవుదువురా... మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా హ్మ్.. ఏంటో ఘంటసాల గారి కమ్మటి గొంతులో ఈ పాటింటుంటే జోలపాడుతున్నట్లుండి నాకే నిద్రొస్తుంది ఇంక నిద్రపోయే పాండా గాడేం లేస్తాడు... ఇది కాదు కానీ ఇంకోపాటతో ట్రైచేద్దారి... తెల్లారేదాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదూ..గింజా గింజా ఏరకుంటే కూత తీరదూ..ఓ గురువా సోమరిగా ఉంటే ఎలా?బద్దకమే ఈ జన్మకు వదిలి పోదా..?గురకలలో నీ పరువే చెడును కద...దుప్పటిలో నీ బతుకే చిక్కినదా?  వీడేంటీ నిద్రలేవమంటే చిత్రమైన ఆసనాలేస్తున్నాడు లేవర..లేవరా.. “అబ్బా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.