అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, జూన్ 30, 2009

అలక పానుపు ఎక్కనేల-శ్రీవారి శోభనం

ఈ సినిమా నాకు పూర్తిగా చూసినట్లు గుర్తు లేదు ఎపుడో ఒక సారి టీవీ లో ఈ పాట వేస్తుంటేనో లేక సినిమా వేస్తుంటే పాట మాత్రమే చూసానో కూడా సరిగా గుర్తు లేదు కాని అప్పట్లో రేడియో లో క్రమం తప్పకుండా నేను వినే కొన్ని పాటలలో ఇదీ ఒకటి. మొదట్లో అంటే మరీ చిన్న తనం లో బామ్మ గారి కామెంట్స్ విని నవ్వుకోడానికి వినే వాడ్ని, కాస్త పెద్దయ్యాక భామ గారి పాట్లు అవగతమై పాట పూర్తి గా అర్ధమయింది :-) ఇక జానకమ్మ గారి గాత్రం గురించి నేనేం చెప్పినా తక్కువే... ఆ దోర నవ్వు దాచకే అని అంటూ ఆవిడ నవ్వే నవ్వు మనకే తెలియకుండా మన పెదవులపై చిరుమందహాసాన్ని నాట్యం చేయిస్తుంది. అంతెందుకు ఆవిడ...

శుక్రవారం, జూన్ 26, 2009

పాప్ సంగీత సామ్రాట్‍కు కన్నీటి వీడ్కోలు !!

మరణం ఎంత చిత్రమైనది, ఎంత దయలేనిది ! తన పర, పేదా గొప్ప బేధాలు లేకుండా ఎంతటి వారినైనా ఎప్పుడైనా ఎక్కడైనా తన కబంద హస్తాలతో కబళించి వేసి, నీ శక్తి అల్పము పరిమితమూనూ రా ఓ వెర్రి మానవుడా అని పరిహసిస్తుంది. యాభైవసంతాల ప్రపంచ పాప్ సంగీత సంచలనం మైఖేల్ జాక్సన్ ఇంత అర్ధంతరంగా, అదీ ప్రపంచ వ్యాప్తంగా అతని అభిమానులు లండన్ లో జరగనున్న అతని comeback షో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం లో తిరిగిరాని లోకాలకు పయనమవ్వడం అత్యంత విషాద భరితం. మొదట మార్చి లో ప్రకటించిన తేదీల ప్రకారం అయితే అతని మొదటి లండన్ షో జులై ఎనిమిదిన జరగాల్సి ఉంది.సంగీతానికి నేను చిన్నతనం నుండే...

ఆదివారం, జూన్ 21, 2009

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె...

సంగీతాభిమానులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ (June 21st) శుభాకాంక్షలు...ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం అని ఉదయాన్నే తన విషెస్ తో తెలియచేసిన నేస్తానికీ, ఇంకా ఈ పాట తో విషెస్ చెప్పిన మరో నేస్తానికి థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ కోసం ఈ పాట. ఇక్కడ వినండి చిత్రం : అమ్మచెప్పిందిసంగీతం : కీరవాణిసాహిత్యం : సుద్దాల అశోక్ తేజగానం : ప్రణవిమాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతంఅందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతంసంగీతం తో చేస్తే స్నేహంపలికిందల్లా గీతం...||మాటల్తో||కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే..కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..పాటల్లె ఎగిరి రాదా.. నీ గుండె గూడైపోదా..సంగీతం...

శుక్రవారం, జూన్ 19, 2009

పల్లెటూరి పిల్లగాడా...పశులగాసే మొనగాడ..

ఒకో సారి హఠాత్తుగా, కారణం తెలియకుండా ఎప్పుడో విన్న పాట, చాలా రోజులుగా అసలు వినని పాట ఒకసారిగా గుర్తొచ్చి అలా ఒకటి రెండు రోజులు వెంటాడుతూ ఉంటుంది. మన మూడ్ కాని ఉన్న పరిసరాలు కానీ పట్టించుకోకుండా పదే పదే అదే హమ్ చేసేస్తాం. నన్ను గత రెండు రోజులుగా అలా వెంటాడుతున్న పాట "మాభూమి" చిత్రం లోని "పల్లెటూరీ పిల్లగాడ.." పాట. నిజానికి ఈ సినిమా గురించి గానీ పాట గురించి గానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాల కార్మిక వ్యవస్తనంతటినీ కాకున్నా పల్లెల్లో సాధారణంగా కనిపించే పిల్లల గురించి వాళ్ళ శ్రమని కూడా ఎలా దోచుకుంటారో తెలియచేస్తూ హృద్యంగా రాసిన సాహిత్యం...

సోమవారం, జూన్ 15, 2009

మరికొన్ని తిరుగు టపా కబుర్లు..

చికాగో నుండి ఫ్రాంక్‍ఫర్ట్ కు చేసిన ప్రయాణం కన్నా అక్కడ నుండి హైదరాబాద్ వరకు చేసిన ప్రయాణం కాస్త సౌకర్యవంతంగా అనిపించింది. ప్రయాణం లో రెండు సినిమాలు కవర్ చేసేసాను. విమానం ఎక్కే సమయం లో ప్రవేశ ద్వారానికి దగ్గరగా వార్తా పత్రికలు, వార, మాస పత్రికలు ఉంచారు కావాలి అనుకున్న వారు వాటి నుండి ఏదైనా ఎన్నుకుని ఉచితంగా ప్రయాణం లో చదువుకోడానికి తీసుకు వెళ్ళవచ్చు. నాకు ఇండియాటుడే మరో ఇండియన్ న్యూస్ పేపర్ కనిపించేసరికి సరె అని అవి అందుకుని లోపలికి వెళ్ళాను. నా సీటు దగ్గరకు చేరుకున్న వెంటనే ఆ పత్రికలు సీట్ లో పడేసి సామాను పైన పెట్టడానికి ప్రయత్నిస్తుండగానే పక్క...

శనివారం, జూన్ 13, 2009

జర్మనీ లో... విమానం లో...

ఎయిర్ లైన్స్ కి నాకు ఎందుకో మొదటి నుండీ చుక్కెదురు, ఆహా ఎక్కితే ఈ విమానమే ఎక్కాలిరా అని అనిపించేలా నాకు నచ్చే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇంత వరకూ తారసపడలేదు. ఈ సారి చికాగో నుండి వచ్చేప్పుడు లుఫ్థాన్సా లో వచ్చాను, ఆది లోనే టిక్కట్టు రేటు విషయం లో చాలా ఎక్కువ అనిపించింది, సరేలే రిసెషన్ టైం ఇప్పుడు ఏది చూసినా రేట్లు ఇలానే ఉంటున్నాయ్ అని సరిపెట్టుకున్నాను. ఇక చికాగో విమానాశ్రయం కి చేరుకున్నాక, అంతర్జాతీయ విమానాలన్నీ ఒక టెర్మినల్ లో అయితే లుఫ్థాన్సా ఒకటే వేరే టెర్మినల్ మనకా విషయం తెలియక అంతర్జాతీయ టెర్మినల్ కి వెళ్ళి వాడు ఛీ కొడితే తిరిగి సామాను అంతా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.