శనివారం, ఏప్రిల్ 11, 2009

ఇది విన్నారా !! సూపర్ బ్రెయిన్ యోగా !!

ఇది విన్నారా !! ఈ సూపర్ బ్రెయిన్ యోగా గురించి విన్నారా... ఎంత వరకూ నిజమో నాకు తెలియదు కానీ ఈ వీడియో ఇది వరకు చూసి ఉండక పోతే ఓ సారి చూడండి. ఇది దదాపు ఒక సంవత్సరం క్రితం 2008 ఆగస్ట్ లోది, అయినా నేను ఇప్పుడే చూసాను, మీరూ ఇదివరకు చూసి ఉండక పోతే ఓ సారి చూడండి.



"ఓసోస్ ఇది మాకెందుకు తెలియదు చిన్నప్పటి నుండి ఎన్ని సార్లు తీయలేదు మనకి చిరపరిచితమైన గుంజీళ్ళేగా.." అంటారా. అదే మరి నాకూ అలా అనిపించి మన బడి లో ఇచ్చే సాధారణమైన పనిష్మంట్ వెనకాల ఇంత ప్రయోజనం ఉందా అని ఆశ్చర్య పడిపోయే ఇలా బ్లాగుతున్నా. ఈ ప్రయోజనం గుర్తెరిగే మన బడి లో ఉపాధ్యాయులు ఈ దండనని ప్రవేశ పెట్టారా లేకా ఇది చూసి దీని మీద పరిశోధనలు చేసి ప్రయోజనాన్ని బయటకి లాగారో తెలియదు కానీ వీడియో లో చూపిన ప్రకారం. ఆక్యూపంచర్ పద్దతి లో కుడి చెవితమ్మె(ear loab) పట్టుకోడం ద్వారా ఎడమ మెదడు, ఎడమ చెవి ద్వారా కుడి మెదడు ఉత్తేజితమై మైండ్ పవర్ పెరుగుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ కొందరు మానసిక వికలాంగులు ఈ యోగా తర్వాత కొన్ని పనులను సక్రమంగా చేయగలిగారు అనీ, ఇంకా ఈ యోగా చేసిన అనంతరం మెదడుకు చేసిన EEG Scanning లో కుడి ఎడమ మెదడుల మధ్య సంతులన కనిపించింది అని చూసాక నిజమే నేమో అనిపిస్తుంది.

అన్నట్లు మన బడి లోనూ, ఇంటిలోనూ పిల్లల కి దండన గానే కాదు, తమిళనాడు లో గణేశుని ఎదురుగా పెద్దలు సైతం ఇలా గుంజీళ్ళు తీసే పద్దతి ఉంది. ఈ మధ్య ఆంధ్రా లో కూడా మొదలు పెట్టారేమో తెలియదు కానీ నేను మొదట గమనించింది మాత్రం తమిళనాడు లోనే. బుద్ది కుశలత కోసం పూజించే దేవుడు విఘ్నేశ్వరుడే కనుక ఆ స్వామి ఎదురుగా ఇలా గుంజీళ్ళు తీయడం మొదలు పెట్టారేమో మరి. అంటే చాలా చోట్ల వినాయకుడి ఎదురుగా ప్రస్తుతం ఈ గుంజీళ్ళని మోడర్నైజ్ చేసి ఇలా క్రాస్ గా కొండక చో మాములుగా చెవులు పట్టుకొని స్టయిల్ గా కొద్దిగా మోకాళ్ళు వంచి తీస్తున్నారు, పూర్తిగా యోగా పద్దతి లో ఎవరూ తీయడం లేదు. సో కుడి చేత్తో ఎడమ చెవి తమ్మె(earloab) , ఎడమ చేత్తో కుడి చెవి తమ్మె పట్టుకొని, కిందకి కూర్చునేప్పుడు గాలి పీలుస్తూ కూర్చుని, పైకి లేచేప్పుడు ఆ గాలిని నెమ్మదిగా వదిలేయాలి. అదీ సంగతి, ఇంకెందుకు ఆలస్యం ? ఉదయం లేవగానే ఆపకుండా గబ గబ గబ ఓ ఫ్ఫదో ముఫ్ఫయ్యో గుంజీళ్ళు తీసేయండి ఇక :)

మరికొన్ని వివరాల కోసం సూపర్ బ్రెయిన్ యోగా వారి వెబ్ సైట్ కై ఇక్కడ క్లిక్ చెయండి.

13 కామెంట్‌లు:

  1. Interesting, but don't get excited.
    Your physical exercises only stimulates motor areas on the opposite side of the brain. this is no big secret.
    It has nothing to do with the cognitive abilities of the person or the brain.
    If the physical activity improves learning power, players and athlets should be super geiniuses.
    Autistic children are hyperactive most of teh times, their physical activity doesn't improve their cognitive abilities. These kind of reports are dime a dozen.

    రిప్లయితొలగించండి
  2. అయితే మరి నేను చిన్నప్పుడే జీవితానికి సరిపడ యోగా చెసేసానన్న మాట :)

    రిప్లయితొలగించండి
  3. Thanks Raman for sharing your thoughts.
    Neither the video nor my blog said physical activity improves learning power. It is only saying that this particular exercise pumps up cell and neuron activity in the brain, and it can be explainable through Acupressure technique.
    also it helped autistic children in controlling their hyper active behavior by balancing their mental energy.

    రిప్లయితొలగించండి
  4. హ హ అంతే అంటారా చైతన్య గారు :) కామెంట్ వ్రాసినందుకు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  5. అబ్బా ఇప్పుడు గుంజీలు తీయటం కష్టం ! ఎవరైనా చెస్తుంటే చుస్తే ఎమన్నా ఉపయోగముంటే చెప్పండి వేణు గారు !:)j/k

    రిప్లయితొలగించండి
  6. ఇంకెందుకు ఆలస్యం ? ఉదయం లేవగానే ఆపకుండా గబ గబ గబ ఓ ఫ్ఫదో ముఫ్ఫయ్యో గుంజీళ్ళు తీసేయండి ఇక :)

    50 aite round figure ;)

    రిప్లయితొలగించండి
  7. మీరు ప్రవాసంలో వున్న లోకసత్త అభిమానిలా వున్నారు. అచ్చం మీలాంటి వారికోసమే నేను ఒక టపా వేశాను. నా లోకసత్త ఉత్సాహాం ఏమైందో ఇక్కడ చదవండి.

    రిప్లయితొలగించండి
  8. హ హ శ్రావ్య గారు మీ ఐడియా బాగుంది చూద్దం దాని మీద కూడా ఎవరన్నా పరిశోధనలు చేసి రిపోర్ట్ ఇస్తారేమో.. వ్యాఖ్యకు నెనర్లు.

    నేను గారు నెనర్లు... సరే లేండి ఏదో బుడుగుని స్ఫూర్తి గా తీసుకుని ఫదో ముఫ్ఫయ్యో అన్నా కానీ యాభయ్ ఎక్కడ చేస్తాం ఐదు తీసే సరికే చుక్కలు కనిపిస్తాయ్..

    రాకేశ్వర గారు నెనర్లు తప్పకుండా మీ టపా చూస్తాను.

    రిప్లయితొలగించండి
  9. వావ్ .. చిన్నపుడు ఇలాంటి దండనలు విదించే టిచర్లను తెగ తిట్టేసుకున్నాను మరి :( పాపం

    రిప్లయితొలగించండి
  10. A నరసరావుపేట్రియాటిక్ gesture brother... ;-)

    http://narasaraopet-bloggers.blogspot.com/

    Visit it.

    రిప్లయితొలగించండి
  11. నేస్తం నెనర్లు :)

    గీతాచార్య గారు చాలా బాగుంది, మంచిప్రయత్నం మీ బ్లాగ్ లో కూడా కామెంట్ రాసాను.

    రిప్లయితొలగించండి
  12. చిన్నపుడు రోజూ గుంజీళ్ళు తీయించేవారు నాన్నగారు, క్రమంగా వినాయక చవితికి పరిమితమైంది. ఇపుడు అసలవేమిటో మరిచిపోయాను. కానీ ఒక తమిళుల ఇంట్లో చూసి ఓ పది రోజులు చేసి వదిలేసా. మన ఆచార వ్యవహారాలకి గ్రంథస్త రూపం వుండి వుంటే మరి కొన్ని తరాలకి సక్రమంగా అందేవేమో. గురు శిష్య పరంపరగానో, కుటుంబ పెద్ద జ్ఞాన సంపత్తిననుసరించో తరవాతి తరంలోకి సాగబట్టే అలా కొన్ని అంతరించిపోయాయి, చిత్రంగా మూడాచారాలు మాత్రం మిగిలున్నాయి.

    రిప్లయితొలగించండి
  13. ఉష గారు వ్యాఖ్యకు నెనర్లు. ఆచార వ్యవహారాలకన్నా మూఢాచారాలు కలిగించే భయమో/ఆనందమో ఎక్కువ కదండీ అందుకే అవి నిరంతరాయంగా ఓ తరంనుండి మరోతరానికి బదిలీ అవుతుంటాయి.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.