మంగళవారం, నవంబర్ 11, 2008

Potluck !! మన వన భోజనాలేనండీ...

మా టీం లో మూడొంతుల పైగా భారతీయులు ఉండటం తో మొన్నీమధ్య దీపావళి సంధర్భం గా మా ఆఫీస్ లో పాట్ లక్ అరేంజ్ చేసాము సరదాగా ఆ ఫోటోలు దాని ప్రిపరేషన్ కోసం నే పడ్డ పాట్లు మీతో పంచుకుందామని ఈ టపా...

అమెరికా జీవన విధానం గురించి పెద్ద గా పరిచయం లేని వారికోసం అసలు potluck అంటే ఏంటో ముందు చూద్దాం. నేను అమెరికా వచ్చిన కొత్త లో అందరితో కలిసి పాట్‌లాక్ (potlock) అని అనే వాడ్ని తర్వాత తర్వాత మెల్ల గా అది pot lock కాదు potluck అని తెలుసుకున్నాను. దీని డిక్షనరీ మీనింగ్ ఏమిటా అని వెతికితే అనుకోని అతిధి కి కుండలో ఉన్నదేదో వడ్డించడం అని ఒక అర్ధం అట అంటే నిఖార్సైన తర్జుమా అనమట pot luck కి కుండ అదృష్టం :-) సరే ఇక వేరే అర్ధానికి వస్తే అతిధులు అంతా ఎవరి వంట వారే వండుకుని తెచ్చుకుని అంతా కలిసి ఒకే చోట పంచుకుంటూ తినడం. దీనినే కొంచెం ఆర్గనైజ్డ్ గా అంటే అంతా కలిసి ఒకే వంటకం తేకుండా ముందే మెనూ లిస్ట్ లా ఒక సైనప్ షీట్ పెట్టి బఫే కి కావాల్సిన సరంజామా అంతా తలా ఒకటి చొప్పున అందులో వ్రాసి తీసుకు వస్తారు.

potluck table, బిర్యాని ప్రెజెంటేషన్ బాగుంది కదా

వంశీ గారి పసలపూడి కధలో లేకా శంకరమంచి గారి అమరావతి కధలో చదివిన వారికి వాటిలో వర్ణించిన వన భోజనాలు అందులోకి ప్రత్యేకం గా వంట వాడితో చేయించి పెట్టే వంటలు గుర్తొచ్చి నోరు ఊరుతుందా :-) నేను 10 వ తరగతి లో ఉన్నపుడు మా నరసరావుపేట ఊరి చివర్లో ఉన్న మామిడి తోటలో వనభోజనాలకి వెళ్ళిన గుర్తు అప్పుడు అక్కడే వంటమనిషి తో వండించి తిన్న గుర్తు. ఆ తర్వాత కాలేజ్ లో ఒకటి రెండు సార్లు వెళ్ళినా కేటరింగ్ వాడికి చెప్తే వాడే మంచి నీళ్ళ తో సహా ఏర్పాట్లు చేసే వాడు. అంతే కాని అమెరికా కి వచ్చే వరకు ఇలా ఎవరికి వారే వంట చేసుకుని తీసుకు వచ్చి తినడం అనే ప్రక్రియ పరిచయం అవ్వలేదు. నాకు ఇక్కడి అలవాట్ల లో నచ్చిన వాటిలో ఇది ఒకటి. ఇండియా లో ఏమో కానీ ఇక్కడికి వచ్చాక మన వాళ్ళు బాగానే అరేంజ్ చేస్తుంటారు ఇంటి దగ్గర ఎప్పుడైనా వెళ్ళినా బేచిలర్ గా cool drinks, paper napkins or plates లాంటివి పట్టుకెళ్ళడం తప్ప వంట చేసే పని పెట్టుకునే వాడ్ని కాదు.

ఎప్పుడో ఒక సారి నేను అట్లాంటా లో ఉన్నపుడు మా ఆఫీస్ వాళ్ళకి మన ఆలూ ఫ్రై కాస్త నెయ్యి అదీ దట్టించి రుచి చూపించా... అప్పుడు ఎక్కువ మంది అమెరికన్స్ ఉండే వారు టీం లో, వీళ్ళకి mashed potato తప్ప ఇంకోటి తెలీదు కనుక wow potato can be cooked like this ? who made it ? its wonderful !! అని అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ బాగానే ఆస్వాదించారు అప్పుడు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక ఆ పప్పులు ఉడకవ్ "ఏంట్రా ఎదవా ఇంటికి వచ్చిన అనుకోని అతిధుల కోసం అయిదు నిముషాల్లొ చేసి పడేసే ఆలూ ఫ్రై తెస్తావా" అని తిట్లు లంకించుకుంటారేమో అని అనుమానపడి, మనకి తేలికగా అయిపోయే వంటకం ఏమిటా అని అలోచించి... ఫైనల్ గా ష్రింప్ (American name for prawns) కర్రీ అదేనండి రొయ్యల ఇగురు చేద్దాం అని డిసైడ్ అయిపోయా...


ఇదే మనం వండి పట్టుకెళ్ళిన సాల్ట్ కర్రీ.. ఓ సారీ !! ష్రింప్ కర్రీ...

మరీ ముందు రోజు ఏం చేస్తాం లే అని ఆ రోజు తెల్లవారు ఝామునే లేచి వంట మొదలు పెట్టాను. మంచి నిద్రమత్తులో marinate చేసేప్పుడు వేసిన ఉప్పు సంగతి మర్చిపోయి మాములు గా కూరలో మళ్ళీ రెండో సారి ఉప్పు వేసేసాను చివరికి కూర అంతా అయిపోయే టైం లో రుచి చూస్తే "ఉప్పు బ్రహ్మాండం గా సరిపోయింది కాకపోతే కూరే కాస్త తక్కువైంది" అన్న బాపు గారి సెటైరు గుర్తొచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి రా దేవుడా !! అని ఆలోచిస్తుంటే అంతకు కొద్ది రోజుల ముందే ఓ ఫ్రెండ్ చెప్పిన బంగాళదుంప చిట్కా గుర్తొచ్చింది. కూర చివర్లో ఒక పచ్చి దుంప ని పెద్ద ముక్కలుగా కోసి వేస్తే ఉప్పు పీల్చేస్తుంది అని అన్నారు సరే ప్రయత్నిద్దాం అని చూస్తే ఇంట్లో ఆలూ లేదు.. వెంటనే ఉదయాన్నే ఏ మొహం పెట్టుకుని అడగడం అని కూడా ఆలోచించ కుండా... ఎదురింటి తలుపు కొట్టి "పిన్ని గారు ఓ బంగాళదుంప ఉంటే అప్పిప్పిస్తారా " అని అడిగి తీసుకు వచ్చి ఎక్కువ సర్ఫేస్ ఏరియా వచ్చేలా చెక్కు తీసి నిలువు గా రెండు ముక్కలు కోసి కూర లో వేసాను. లక్కీ గా అది చాలా వరకు ఉప్పుని అంతే కాకుండా ఎక్కువైన నీటినీ కూడా పీల్చేయడం తో కూర కాస్త తినగలిగే స్టేజ్ కి వచ్చింది.

సరే ఏదేమైనా ఒప్పుకున్నాక తప్పదు కదా తిన్నవాడి దురదృష్టం అని అనుకుని అలానే పట్టుకుని వెళ్ళాను. మా వాళ్ళంతా కూడా కొంచెం ఉప్పు తక్కువైతే ఇంకా బాగుండేది అని అంటూనే మొత్తం గిన్నె ఖాళీ చేసేయడం తో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. అదనమాట నా పాట్‌లక్ కధ....

Some Desserts

అన్నట్లు నా కూర లో ఉప్పు ఎక్కువవ్వడం వల్ల ఇటువంటి పొరపాట్లని ఫిక్స్ చేయడానికి ఉపాయాల పై ఓ చిన్నపాటి డిస్కషన్ జరిగింది. కొందరు బంగాళ దుంప వేయమంటే కొందరు కొబ్బరి కోరు వెయ్యమన్నారు ఇంకొందరు dough bolls అంటే ఆటా గొధుమపిండి లాంటివి ఉండల్లా చేసి వెయ్యమని చెప్పారు. మీకు కూడా తెలిసిన చిట్కాలేమన్నా ఉంటే కామెంట్ల లో షేర్ చేసుకోండి.

24 కామెంట్‌లు:

  1. హిహి... బాగుంది వంటలూ-చిట్కాలు. పాటలతో పాటు వంటలూ రాస్తే.. wud be great! :-))

    రిప్లయితొలగించండి
  2. ఎందుకో ఈ కాన్సెప్ట్ నాకు నచ్చదు. ఒకళ్ళు చేసిన వంట తినటం ఓ రకం, బాగోలేకపోయినా కడుపు సర్దుకుంటుంది. ఇంతమంది చేతులు పడ్డ వంటకాలని పాపం బుజ్జి కడుపు ఎలా హరాయించుకోగలదు?

    అలాగే ఎన్నో మంచి రుచుల్ని కొన్ని రుచులు చెడగొట్టే అవకాశాలున్నాయి, అలానే మరో రకంగా కూడా వర్తిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. వేణూ శ్రీ...

    మనూర్లో ఊరి చివరి తోటంటే...లింగంగుంట్ల లో ఉన్న తోటేనా? ఎన్ని వనభోజనాలో అందులో..లెక్కే లేదు. ఇప్పుడు ఆ తోట ఉందా లేదా అని ఇంట్లో ఎవరినైనా అడగాలంటే భయం! "లేదు, కొట్టేసి, ప్లాట్స్ వేశారు," అని చెప్తారేమోనని!

    అమెరికా జీవన విధానంలో పాట్ లక్ పాత్ర ఏమిటో కానీ ఇక్కడ ఈ దిక్కుమాలిన హైదరాబాదు మరియు ఇతర చోట్ల పాట్ లక్ అనగా అందరికీ తెలుసు. ఎక్కువగా జరుగుతుంటాయి కూడా...ముఖ్యంగా డిసెంబర్ 31న ఫ్లాట్స్లో జరిగే పార్టీల్లో!

    మొత్తానికి ఎదురింటి పిన్నిగార్ని అప్పడగటం తో సహా ఆంధ్రా రుచులు తెప్పించారన్నమాట. చాలా కలర్ ఫుల్ గా ఉందబ్బా మీ మెనూ!

    రిప్లయితొలగించండి
  4. మెన్యూ చాలా కలర్ ఫుల్ గా నోరూరిస్తూ బాగుంది.

    రిప్లయితొలగించండి
  5. సుజాతగరూ
    లింగంగుంట్లతోటలు ఇంకా కొట్టేయ్యలేదు.బాధ పడకండి.మా అమ్మమ్మగారి వూరవటంవలన చిన్నప్పుడు నేను ఆతోటలకు వెళ్ళేవాడిని మొన్ననే రైల్లో వస్తూ చూసాను.
    వేణూ చాలా బాగా కష్టపడ్డావయ్యా ,ఏదేమయినా నీవంట ఎవరి వంటికి ప్రమాదం తేకుండా గట్టెక్కింది. మేము చదువుకున్నేటప్పుడయితే రూములో మాగురవారెడ్డిగాడు,గోవిందరాజులు మొదలయిన వంటమాశ్ట్ర్లర్ల దెబ్బకు మాకు ఆహారనాళం సుద్దయిపోతుండేది తరచూ .ఆ బాధ పడలేక హోటల్ లోమాట్లాడుకున్నాము కూరలు.

    రిప్లయితొలగించండి
  6. yum, yum..ఇవన్నీ తిన్నాక, మధ్యానం పనెలా చేశారండీ బాబూ :)

    రిప్లయితొలగించండి
  7. భలే ఉంది మీ పాట్లక్ తంటా. ఫొటోలూ నోరూరిస్తున్నాయి.

    అమెరికన్లకి మన పాట్ లక్ సరుకు అమ్మాలంటే ఓ చిట్కా ఉంది. sugar free అనో, fat free అనో ఓ చీటీ రాసేసి అక్కడ పెట్టేస్తే రుచెలా ఉన్నా పట్టించుకోకుండా లాగించేస్తారు. నేనెప్పుడూ అంతే చేస్తా :-) organic కూడా ప్రయత్నించొచ్చు.

    రిప్లయితొలగించండి
  8. రాజేంద్ర గారూ,
    మా వూరంటే ఏమిటనుకుంటున్నారు మీరు? పొన్నూరు కంటే పెద్దది, నిడుబ్రోలుకంటే గొప్పది. బీచ్ లేకపోయినా ఇసాపట్నంలో పుట్టినోళ్ళకంటే ఎక్కువమంది సాహితీ మూర్తులూ మా వూళ్ళోనూ పుట్టారండో! మా వూరోళ్ళు కనపడితే నాకు బోల్డంత సంతోషం..చివరికి మొద్దు శీనైనా సరే!(ఇంకేం కనపడతాడు లెండి పాపం, మొద్దు శీనూ,అందుకో నా నివాళి)


    దుర్గేశ్వర గారు,
    చల్లని కబురు చెప్పారు. ధన్యవాదాలు!

    అబ్రకదబ్ర,
    రాజేంద్ర గారూ,
    మా వూరంటే ఏమిటనుకుంటున్నారు మీరు? పొన్నూరు కంటే పెద్దది, నిడుబ్రోలుకంటే గొప్పది. బీచ్ లేకపోయినా ఇసాపట్నంలో పుట్టినోళ్ళకంటే ఎక్కువమంది సాహితీ మూర్తులూ మా వూళ్ళోనూ పుట్టారండో! మా వూరోళ్ళు కనపడితే నాకు బోల్డంత సంతోషం..చివరికి మొద్దు శీనైనా సరే!(ఇంకేం కనపడతాడు లెండి పాపం, మొద్దు శీనూ,అందుకో నా నివాళి)

    దుర్గేశ్వర గారు,
    చల్లని కబురు చెప్పారు. ధన్యవాదాలు!

    అబ్రకదబ్ర,
    sugar free ప్లాను భలే ఉంది. నేనైతే low fat అనే చీటీ పెడతా...దేనికో తెలుసా..పనీర్ బటర్ మసాలాకి, స్వచ్చమైన నెయ్యితో చేసిన మైసూర్ పాక్ కి!

    రిప్లయితొలగించండి
  9. రెండు సార్లు చెప్తారు కాబోలు :)

    రిప్లయితొలగించండి
  10. ఆహా! నలపాకమన్నమాట.
    చూస్తుంటే నోరూరుతున్నాయి. కాస్త ట్రెయినింగివ్వరాదూ ?

    రిప్లయితొలగించండి
  11. రాజేంద్ర కుమార్ దేవరపల్లి గారు,

    ఏమండీ మా నరసరావుపేట వాళ్ళకి ఏమి తక్కువ. ఇప్పుడే గూగుల్ transliterate లో ఊరి పేరు ఆంగ్ల స్పెల్లింగ్ కొడితే చక్కగా తెలుగులో వచ్చింది. అంత గొప్పది మా ఊరి పేరు. ఏదో కాస్త కల్తీ ఎక్కువ అని కానీ... రాష్ట్రానికి ముఖ్య మంత్రిని కూడా ఇచ్చింది. ఓ ఓమూ ఉన్నాడు. హి. హి. హి.

    @సుజాత గారు,

    బీచెండుకండీ చీపుగా. మన పెద చెరువు చాలదూ. ఉన్నా పోయినా పేరు మాత్రం అదే కదా. గడియార స్థంభం సెంటర్ లాగా. మన ఊరి మీద ఆమాత్రం అభిమానం ఉండాలి. థాంక్స్.

    @వేణు శ్రీకాంత్ గారు,

    మీ కాఫీ నిన్ననే ఆన్లైన్లో అందింది. రుచి... రుచి... సర్ఫింగ్ లాగా ఉందండీ. ;-) (మనం నెట్ సర్ఫ్ చేస్తాం కదా). కాస్త ఆ స్వీట్లూ పంపితే నేను మీకు కరివేపాకు కాఫీ పంపుతా. :-)

    రిప్లయితొలగించండి
  12. ఇక్కడ మా కాకినాడ గురించెవరూ మాట్లాడటంలేదేమిటి చెప్మా?

    రిప్లయితొలగించండి
  13. Thanks పూర్ణిమా, నావన్నీ survivor series type of వంటలు అవి రాస్తె నన్ను ఈ బ్లాగ్ లోకం నుండి తరిమి కొడతారు :-)

    వికటకవి గారు నెనర్లు, నాకు అందుకే నచ్చుతుందండీ.. చాలా రకాల వంటలు రుచి చూడచ్చు, ప్రతి సారీ ఒకటి రెండు కొత్త వంటలు పరిచయమవుతాయి.. ముందు కాస్త రుచి చూసి ఆ తర్వాత దాడికి దిగితే అంత ప్రమాదమేమి కూడా ఉండదు. :-)

    కొత్తపాళీ గారు నెనర్లు

    సుజాత గారు నెనర్లు, అవునండీ లింగంగుంట్ల తోటే... రైలు పట్టాల దగ్గరలో ఉంటుంది ఇంకో పక్క చిన్న చిన్న చేపల చెరువులు కూడా ఉండేవి... చాలా బాగుంటుంది... ఓహ్ హైద్ లో కూడా వచ్చేసాయా ఏమో లెండి నాకు తెలీదు నేను మొదటి సారి ఇక్కడికి 2000 లో వచ్చినపుడు ఇక్కడే మొదటి సారి వినడం.

    ఉమాశంకర్ గారు నెనర్లు

    దుర్గేశ్వర గారు నెనర్లు చల్లని వార్త చెప్పారండీ తోటల గురించి.. హ హ అవును రూం మేట్స్ వంట తంటాల గురించి నన్నడక్కండి బాబు మరో బ్లాగు స్టార్ట్ చేయాల్సొస్తుంది ప్రత్యేకం గా...

    తెరెసా గారు నెనర్లు ఇంకా ఎవరూ ఈ ప్రశ్న అడగలేదేంటా అనుకుంటున్నా అండీ :-) ఆ రోజు మధ్యాహ్నం మా పాట్లు చూడాల్సిందే... 10 నిముషాలకోసారి మొహం కడుక్కుని నిద్ర వదిలించుకోడానికి ఆపసోపాలు పడ్డాం.

    రజేంద్ర గారు నెనర్లు సొంత ఊరు లేకుండా మనం లేము కదండీ నా బ్లాగ్ లో మా నరసరావుపేట మీరు చూస్తూనె ఉంటారు :-) భరించక తప్పదు.

    అబ్రకదబ్ర గారు నెనర్లు. మీ ఐడియా భలే ఉందండీ కాకపోతే మన వంటలకి Fatfree అంటే Fat ఉచితం గా లభించును అనే అర్ధం వస్తుందేమో :-) మరి మసాలాలు నూనెలు లేకపోతే రుచి రాదాయె...

    ప్రవీణ్ గారు నెనర్లు, అబ్బే మన దగ్గర ట్రైనింగ్ ఇచ్చేంత విషయం లేదండీ... ఏదో accidental గా అప్పుడప్పుడూ ఒకో కూర బాగా వస్తుంది అంతే... జ్యోతి గారు భాస్కర్ గారు లాంటి వారు వంటల బ్లాగ్ తో మనలాంటి వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా అటు వైపో లుక్కెయ్యండి.

    గీతాచార్య గారు నెనర్లు... ఇంతకీ ఈ ఓమూ ఎవరు ?

    బాబాగారు నెనర్లు, ఎవరూ మాట్లాడకపోతే ఏముంది మీరు మొదలెట్టేయండి...

    రిప్లయితొలగించండి
  14. Thanks గీతాచార్య గారు, మీ సత్యాన్వేషి బ్లాగ్ చూసే వరకు మీ ఇష్టైల్ నాకు అర్ధం కాలెదు :-)

    రిప్లయితొలగించండి
  15. ఆయ్..నేనున్నా "బాబా" నీకు తోడు బెంగెట్టుకోకు..ఈళ్ళందర్కీ.మన ఊరి మట్టగిడసలు,కొర్రమీనులు,బొమ్మిడాయిలు,పులసలు,పిత్తపరికలు గట్రా వండించి పంపిద్దాంలే..

    పోతే ఈ తెల్ల చీమలకి ఇలాగే ఒకసారి "పూర్ణం బూరి" పెడితే చాలా బాగుంది కానీ ఇందులోకి ఆ (పూర్ణం)స్వీట్ ఎలాగ పెట్టారు అంటూ బుర్ర కొట్టుకున్నాడు వెధవ. అదేరా వెధవా ఇండియా టెక్నాలజీ అంటే అని చెప్పా...

    చాలా బాగా రాశారు ఆచార్యా..

    రిప్లయితొలగించండి
  16. నెనర్లు శ్రీనివాస్ గారు... మీరు కామెంట్ ఇరగ తీస్తున్నారు :-)

    రిప్లయితొలగించండి
  17. ఈ పాట్లక్ అంటే బోరు కొట్టేసిందండి.మాకు వారానికి రెండు వుంటాయి.ఒకటి వీక్డేలో మధ్యాహ్నం ఆడాళ్ళ స్నాక్ పాట్లాక్,వారాంతంలో ఫేమిలీ పాట్లాక్.ఇవి కాక ఆఫీసులకి సరఫరా చెయ్యాలి.మళ్ళా స్కూల్ లో పాట్లాక్.ఏమాటకామాటే బోల్డు రుచులు.డైటింగు లో వున్నామంటే కుదరదు.అందరూ నాది తిన్నావా తిన్నావా అని నోటిలో కుక్కుతారు.నేను కూడా అంతే అనుకోండి.మీరు చిట్కాల గురించి నాకు తెలియదు.మీరు చెప్పింది కూడా అర్ధం కాలేదు.బంగాలాదుంప పెద్ద ముక్కలు కోసి కూరలో వేసి తరువాత తీసేయాలా?లేక కూరతో పాటూ ఉడికించేయాలా?కాస్త వివరం గా చెపుతారా?

    రిప్లయితొలగించండి
  18. రాధిక గారు నెనర్లండీ... బాబోయ్ అన్ని పాట్లాక్‌లంటే అంతే కదండీ మరి కొంచెం కష్టమే నాకు ఆఫీస్ లో తప్ప ప్రస్తుతానికి మిగతావేవి లేవు కనుక నేనింకా బోర్ అనే స్టేజ్ కి రాలేదు లెండి.

    ఇక ఉప్పు విషయానికి వస్తే కూర చివరి స్టేజ్ కి వచ్చాక పెద్ద ముక్కలు గా కోసి వేసి ఒక 5 నిముషాలు ఉంచి తీసేయచ్చు అని అన్నారండీ, పూర్తిగా ఉడకాల్సిన పని లేదు. నేనైతే ఎంత సేపు ఉంచితే అంత పీలుస్తుందిలే అని అంతే వదిలేసి జస్ట్ సర్వ్ చేసే ముందు తీసి పడేశాను. ఇది ఒక్కటే కాస్త కూర రుచిని మార్చని చిట్కా, కొబ్బరి కానీ dough bolls కానీ అయితే కూర రుచి మారుతుంది అని నా అనుమానం.

    రిప్లయితొలగించండి
  19. శ్రీకాంత్ గారు : బలే ఫన్నీ గా ఉంది. అనుకోకుండా మీ పోస్ట్ సంక్రాంతి రోజు చూశాను (భుక్తాయసంతో) :-)

    శ్రీనివాస్ పప్పుగారు : శ్రీకాంత్ గారు చెప్పినట్లు కామెంట్ తొ అదరగొట్టేస్తున్నారండి. అవునింతకీ బూరెల్లోకి పూర్ణం ఎలా వెళ్ళిందంటారు. ఈరోజు అవే చేసాను కాని నాకు తట్టడం లేదు. :-) (అనుకోకుండా పొద్దున్నే ఎవరో ఒక విదేశీ ఇలాగే అదిగాడటమ్మా అని పిల్లలికి చెప్పాను. ఇలా చదవడం తటస్థించింది విచిత్రం కదా!)

    రిప్లయితొలగించండి
  20. రమణి గారు పాత టపా ఓపికగా చదివి కామెంటినందుకు నెనర్లు. హ హ మరే ఒకో సారి యాదృశ్చికంగా అలా భలే కలుస్తుంటాయ్. సంక్రాంతి బాగా ఎంజాయ్ చేసారనమాట.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.