శనివారం, ఆగస్టు 02, 2008

పూవులేవి తేవే చెలీ

అదే సమయం లో వచ్చిన మరో అందమైన లలిత గీతం.. సురస.నెట్ నుండి మనందరికోసం.

Poovulevi Teve Che...


పూవులేవి తేవే చెలీ పోవలే కోవెలకూ ||3||

తుమ్మెద కాలూననివీ, దుమ్ము ధూళి అంటనివి ||2||
కమ్మగ వలచేవి, రకరకమ్ముల వన్నెలవీ ||2||

|| పూవులేవి ||

ఆలసించెనా, పూజా వేళ మించిపోయెనా ||2||
ఆలయమ్ము మూసి పిలుపాలింపడు నా విభుడూ ||2||

|| పూవులేవి ||

మాలలల్లుటెపుడే? నవమంజరులల్లేదెపుడే ||2||
ఇక పూలే పోయాలి తలబ్రాలల్లే స్వామి పైన ||2||

|| పూవులేవి ||

19 కామెంట్‌లు:

  1. వేణూ,
    అమ్మదొంగా పాట పోస్టులో ఇందాకే ఈ పాట గురించి కామెంట్ పెట్టాను. కానీ నేను చెప్పిన పాట ద్వారం లక్ష్మి(ఇప్పుడు ఈమె పద్మావతీ యూనివర్సిటీ తాలూకు సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నారని గుర్తు) పాడింది. వేదవతి గారి ట్యూన్ కంటే నాకు ఆ ట్యూన్ బాగా ఇష్టం.

    రిప్లయితొలగించండి
  2. కారణం తెలియదు కానీ మీ బ్లాగు నేను సరిగా చదవలేను. కొంత భాగం బానే కనిపిస్తుంది, మిగిలినదంతా గజిబిజిగా వుంటుంది. (ఇతర బ్లాగులతో నాకీ సమస్య లేదు.) ఉదాహరణకి మీరిచ్చిన లలిత గీతపు పాఠం మాత్రమే చదవగలిగను, పైన, క్రిందున్న పాఠం, ఎడమ వైపునున్న కామెంట్లు(?) ఏవీ కనపడటం లేదు.

    సరే, విషయానికొస్తే, మంచి పాట గుర్తుకు తెచ్చారు. కాసింత modern రికార్డింగు లా వుంది. ఎవరు పాడారో చెప్తారా? నా దగ్గరిదే పాట రేడియో నుండి యెప్పుడో రికార్డు చేసుకున్నదుంది. వేరే గొంతుకలో. ట్యూన్ఒకటే కానీ, ఆర్కెస్ట్రేషన్ వేరు.

    బ్లాగర్ల ప్రపంచానికి లలిత సంగీతం పరిచయం చేస్తున్నందుకు అభినందలతో :-)

    శ్రీనివాస్

    రిప్లయితొలగించండి
  3. @ సుజాత గారు నెనర్లు
    అవునండీ కానీ నాకు వేదవతి గారి పాట మాత్రమే దొరికింది. లక్ష్మి గారి పాట లేదు.

    @ శ్రీనివాస్ గారు నెనర్లు
    ఈ పాట వేదవతీ ప్రభాకర్ గారు పాడినదండీ....బహుశా మీ దగ్గర ఉన్న పాట ద్వారం లక్ష్మి గారు పాడినదై ఉంటుందండీ... నాకు పంపించ గలరా లేదూ లింక్ ఇచ్చినా సరే.

    ఇక నా బ్లాగ్ విషయానికి వస్తే అది నా టెంప్లేట్ సమస్య అయి ఉండచ్చు. I tested this template in IE, Firefox 3 and Safari browsers and i don't have any issue. May be you are using Firefox 2 or Netscape. I know FF2 have got problems with telugu font spacing of my template, but i am not sure of Netscape. Also I never tested on Mac or Linux OS. So if you are using Windows please use IE6 or FF3 to browse, it shouldn't give any trouble.

    రిప్లయితొలగించండి
  4. వేణు గారు, ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం ! గుర్తు చేసినందుకు మీకు బోల్డు థాంకులు ! ఎన్ని సార్లు టీవీ లో వచ్చినా చెవులు కోసుకుంటూ వినొచ్చు ! లక్ష్మి గారు చాలా అందంగా పాడతారు ! ఇక పోతే చిన్న సవరణలు ...
    పూవు లేవి కాదండి ... పూవులేరి ( పూవులు ఏరి తెమ్మని ) చెలి పూవలె కోవెలకు,
    తర్వాత ఒక లైన్ మిస్ అయ్యారు... నీ వలె సుకుమారములు, నీ వలెనె సుందరములు
    "ఆలయమ్ము మూసి పిలుపాలింపడు నా విభుడూ " --- పిలు పాలింపడు కాదు అండి ...ఆలయమ్ము తలుపులు మూసి, నిను పాలింపడు ప్రభువు --- ద్వారం లక్ష్మి గారి పాటలో ప్రభువు అని ఉంటుంది !

    ఇక పోతే నాదొక విన్నపం అండి ... శ్రీనివాస్ గారు కాని మీకు ఆ పాట ని పంపిస్తే, బాబ్బాబు కాస్త upload చేసి పుణ్యం కట్టుకోరు? లేదంటే నా email address ఇస్తాను ! ఇంతకీ ఆయన పంపారా ?

    రిప్లయితొలగించండి
  5. @Sreenivas Paruchuri / వేణూ శ్రీకాంత్ :

    Firefox 2.* does not support "justified" and "letter-spaced" Telugu text. Those sites (or that part of text) that use these styles will not be shown properly in Firefox 2. (Of course Firefox 3 does not have this problem.)

    The solution for Firefox 2 is Unjustify! bookmarklet. If you have GreaseMonkey Extension you can try unjustify user script.

    [ Info shared by Veeven ]

    రిప్లయితొలగించండి
  6. సీ గాన పెసూనాంబ గారు వ్యాఖ్యకు నెనర్లండీ...

    మీరు చెప్పిన సవరణలు అన్నీ లక్ష్మి గారి పాటలోవండీ. ఈ పాట వేదవతి గారు పాడారు. మరి ఎందుకు అలా మార్చారో తెలీదు కానీ ఈ పాట సాహిత్యం ఇదే. మొదటి లైన్ లో ఒక్క సారి మాత్రం పూవులేరి తేవే అని పాడారు మిగిలిన అన్ని సార్లు పూవులేవి అనే పాడతారు నేనూ ఒకటికి రెండు సార్లు విని పాట అంతా పూవులేవి అనే ఉంది కదా అని అదే ఉంచేసాను.

    శ్రీనివాస్ గారికి ఇంకా నా పై దయ కలగ లేదు, మళ్ళీ ఓ సారి గుర్తు చేస్తానండీ... లక్ష్మి గారి పాట ఇంకా ఎక్కడైనా దొరుకుతుందేమో అని చూసాను కాని దొరకలేదు.

    రిప్లయితొలగించండి
  7. తెలుగు'వాడి'ని గారు నెనర్లు, మరో సందేహం నేను టెంప్లేట్ అప్డేట్ చెసి ఏమైనా సరిచేయగలనా లేదా FF2 ఉపయోగించే వారు వారి బ్రౌజర్ లో సరిచేయాలా ?

    రిప్లయితొలగించండి
  8. శ్రీకాంత్ గారు చక్కటిపాట,ఇలాంటి మంచిమంచి పాటలు మరిన్ని పంచుతూ ఉండండి.
    నేను మొట్ట మొదట ఈ పాట ద్వారం లక్ష్మి గారు పాడగా విన్నాను, అందుకేనేమో ఇంకెవరు పాడినా అంతా అందగాలేదనిపిస్తుంది.
    ఇది కూడా బాగుంది,లక్ష్మి గారి గొంతులో ఈ పాట లో ఏదో తెలియని తాజా దనం,ఆర్ద్రతా ఉన్నట్టనిపించేది.
    ఈ పాట నేను పాడి బ్లాగులో పెడదామానన్న భయంకరమైన ఆలోచన గతం లో ఓసారి చేసాను కానీ...విన్న వారు తట్టుకోగలరోలేదో ఆ పాపం మనకెందుకులెమ్మని మానేసా!

    రిప్లయితొలగించండి
  9. @వేణూ శ్రీకాంత్ :

    1. ఏదైనా ఒక్క బ్లాగ్ లో అయినా ఇలా సరిగా కనపడని వారు (ముఖ్యంగా FireFox v2x వాడే వారు) వారి Browser లోనే నేను పైన చెప్పిన రెండింటిలో ఏదో ఒక Script Install చేసుకుంటే మంచిది. అప్పుడు సమస్య అన్ని బ్లాగ్స్/సైట్స్ కు పరిష్కారం అయిపోతుంది.

    2. మీరు మీ టెంప్లేట్ లో కూడా మార్చచ్చు. text-align అనే property కి justify అని ఉంటుంది చూడండి. దానిని మార్చండి.

    రిప్లయితొలగించండి
  10. సిరిసిరిమువ్వ గారు నెనర్లు,

    రమ్య గారు నెనర్లు, హ్మ్ మీరంతా చెప్తుంటే నాకు లక్ష్మి గారి పాట వినాలనే కోరిక రెట్టింపవుతుందండీ... మీరన్నా ఆట్యూన్ లో పాడి బ్లాగ్ లో పెట్టండి.

    తెలుగు'వాడి'ని గారు నెనర్లు, నా టెంప్లేట్ అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  11. క్షమించాలి శ్రీకాంత్ గారు, నేను పాట వినకుండా ఆవేశ పడ్డాను ! అప్పుడు play కాలేదు. బాబొయ్, వినలేకున్నా ఈ పాట !!! లక్ష్మి గారి పాట వింటే, ఇది అస్సలు నచ్చదు ఎవ్వరికీ !
    శ్రీనివాస్ గారు దయ తలిస్తే బాగుండు, తనని ఎలా అడగాలి చెప్మా ! ఈమైల్ లేదు గా !

    రిప్లయితొలగించండి
  12. Belated birthday wishes !

    ఈ పాట వినండి శ్రీకంత్ గారు !
    http://www.dishant.com/jukebox.php?songid=28697

    రిప్లయితొలగించండి
  13. ఈ పాట video youtube లొ ఉండేది కొన్ని రొజుల కింద ! ఇప్పుడు తీసేసారు , దేనికో మరి ! నాకు ఈ పాట చిత్రీకరణ అన్నా చాల ఇష్టం !

    రిప్లయితొలగించండి
  14. సీ గాన పెసూనాంబ గారు అంతలేసి మాటలెందుకండీ నేనూ అదే అనుకున్నా మీరు పాట విని ఉండరు అని. అయ్యో ఈ ట్యూన్ అంత ఘోరం గా ఉందా, నేను లక్ష్మి గారి పాట విననే లేదు అందుకే ఇది పర్లేదు కదా అనిపిస్తుంది.

    సిరివెన్నెల లో ప్రకృతి కాంతకూ ఎన్నెన్ని హొయలో పాట నాకు ఇష్టమైన పాటలలో ఒకటండీ చాలా బాగుంటుంది, అవును నేను ఈ మధ్యే గమనించాను Youtube లో ఈ పాట, పొలిమేర దాటిపోతున్నా పాట రెండూ తొలగించారు ఎందుకో. బహుశా ఎవ్వరు చూడటం లేదనేమో.

    అన్నట్లు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  15. నన్నెక్కడికో తీసుకు పోయారు సారూ! మీకిది న్యాయం కాదు. మీకు ఎన్ని వీర తాళ్ళేసినా తక్కువే. లలిత సంగీతం ఒక్క నా మనసుపొరల్లోనే దాక్కుందనుకుంటున్నా ఇన్నాళ్లూ! మీ బ్లాగులో ఉన్న పాటలు చూసాక నాకు మాటలు లేవు. (నాకూ ద్వారం లక్ష్మి పాడిన పాటే ఇష్టం. ఆవిడ కలువ కళ్ళు, తేనెలూరే గాత్రం గుర్తొస్తుంది ఈ పాట తలుచుకుంటే!) రాసినది కృష్ణ శాస్త్రి గారని గుర్తు. పూవులేరి తేవే చెలి పోవెలె కోవెలకు..

    రిప్లయితొలగించండి
  16. కొత్తావకాయ గారు... ధన్యవాదాలండీ.. లలితసంగీతం నాకూ చాలా ఇష్టమేనండి.. కాకపోతే వెతుక్కుని వినడం కష్టమవుతుంది.. ఆ మధ్య కొన్ని కొని విందామనుకుంటే భాషాదోషాలు భరించలేక పూర్తిచేయలేకపోయాను. ఈ పాట కూడా ఇక్కడ పెట్టింది వేదవతిగారు పాడినది. సాహిత్యం కొంచెం మార్చి ఉంటుంది. ద్వారం లక్ష్మి గారు పాడిన ఒరిజినల్ వర్షన్ ఇంతవరకూ దొరకలేదు.

    రిప్లయితొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.