శుక్రవారం, ఆగస్టు 08, 2008

ఈ మాసపు పాట :-) నా జన్మ భూమి

ఓ వారం క్రితం వరకూ రోజులో చాలా భాగం బ్లాగులోనే గడిపిన నేను గత వారం రోజులు గా అంతా కలిపి ఒక గంట రెండుగంటలకన్న ఎక్కువ గడిపి ఉండను. ఏదో వెలితిగా వుంది కానీ హటాత్తు గా ఆఫీస్ పని ఎక్కువవడం నా ఇండియా ట్రిప్ దగ్గర పడటం తో ఆ ఏర్పాట్లు... వెరసి బ్లాగ్లోకం లో గడిపే సమయానికి కోత విధించక తప్ప లేదు. నేను ఆగస్ట్ 11 నుండి సెప్టెంబరు 13 వరకు ఇండియా లో ఉంటాను మధ్య లో ఒక 10 రోజులు అక్కడ నుండే పని చేసినా ఇండియా లో ఉంటున్నా కాబట్టి నెల రోజులు శలవు గానే పరిగణించాలేమో. ఇక నేను ఇండియా లో ఉన్న అన్ని రోజులు బ్లాగు రాసే తీరిక ఉండక పోవచ్చు. శలవుల మధ్యలో అప్పుడప్పుడూ వ్యాఖ్యల ద్వారా పలకరించడానికి ప్రయత్నిస్తాను. మళ్ళీ ఇక్కడికి వచ్చాక అంటే సెప్టెంబర్ 15 తర్వాత వింతలూ విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు శలవు. ప్రస్తుతానికి I am busy with arrangements and pretty excited about my India trip అందుకే ఈ మాసపు పాట (Song of the month) సిపాయి చిన్నయ్య నుండి "నా జన్మ భూమి" విని ఆనందించండి.

1 Naa Janma Bhoomi...


చిత్రం : సిపాయి చిన్నయ్య
సంగీతం : యం.యస్.విశ్వనాథన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

నా జన్మ భూమి...భూమి...భూమి...
నా జన్మ భూమి...భూమి...భూమి...
నా జన్మ భూమి ఎంత అందమయిన దేశము
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగ

||నా జన్మ||

నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
అహహా అహా అహహా ||2||
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
పచ్చనీ పంటలు వెచ్చనీ జంటలు
చల్లనీ జీవితం ఇదే నవభారతం
హాయ్ హాయ్ నా సామిరంగ హొయ్ హొయ్ నా సామిరంగ

||నా జన్మ||

బతకాలందరు దేశం కోసమె
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులె
అహహా అహా అహహా ||2||
బతకాలందరు దేశం కోసమె
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులె
స్వార్ధమూ వంచనా లేనిదే పుణ్యమూ
త్యాగమూ రాగమూ మిశితమే ధన్యమూ
హాయ్ హాయ్ నా సామిరంగ హొయ్ హొయ్ నా సామిరంగ

||నా జన్మ||
నా సామిరంగ హాయ్ హాయ్ నా సామిరంగా

12 వ్యాఖ్యలు:

 1. స్వాగతం, సుస్వాగతం

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సందర్భానికి తగ్గ పాటను పాడుకొంటూ వచ్చేయండి.
  మీకు ఇక్కడ (హైదరాబాదులో) మా అభినందనల జల్లులతో (అంటే ఇక్కడ వానలు పడుతున్నాయి లెండి. కాబట్టి వాటినే మా అభినందనలు అనుకొనగలరని మనవి.) స్వాగతం పలుకుతాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Hey.. Happy Journey!! Hope you carry loads and loads of memories from here.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. EnTi kompadeesi modaTi saarigaa vastunnaaraa/veLutunnaaraa? andukae naa janma bhoomi paaTa gurtuku vastoendi. naakkooDaa modaTloe renDu mooDu saarlu gurtochchindi.

  vachchina taruvaata daevuDi paalana elaa vundoe raayanDi.

  -- vihaari

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @ మీనూ Thank you.

  @ కల గారు నెనర్లు

  @ శ్రీవిద్య గారు అవునండీ Excited

  @ ప్రతాప్ గారు స్వాగతానికి నెనర్లు.

  @ నిషిగంధ గారు Thanks a lot

  @ పూర్ణిమా Thank you

  @ విహారి గారు నెనర్లు, లేదండి ఇప్పటికే చాలా సార్లు అటు ఇటు తిరిగేసాను కానీ ఎప్పుడూ 7-8 నెలలోపే వెళ్ళే అవకాశం వచ్చేది ఈ సారి ఒకటిన్నర సంవత్సరం ఏకధాటి గా ఈ చికాగో వాతావరణాన్ని భరిస్తూ ఇక్కడే ఉండాల్సి వచ్చింది. బహుశా అందుకే ఆపాట గుర్తొచ్చిందేమో... తప్పకుండా దేవుడి పాలన ఎలా ఉందో గమనించడానికి ప్రయత్నిస్తాను :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Has been a truly long break. Hope you are having a blast.

  Awaiting your return. :-)

  ప్రత్యుత్తరంతొలగించు

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.