అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శనివారం, మే 31, 2008

ఇందువదన కుందరదన - ఛాలెంజ్

అప్పుడు నేను పిడుగురాళ్ళ జడ్పీ హైస్కూల్ లో 7 లేదా 8 వ తరగతి చదువుతున్నాను. నాకు మొదటి నుండి సాధారణమైన పాటలకన్నా ఏదో ఒక ప్రత్యేకత ఉన్న పాటలు ఎక్కువ ఇష్టం. దానికి తోడు మనం చిరంజీవి కి వీరాభిమనులం. నిజం చెప్పొద్దూ, నేనేంటి లెండి మా ఇంట్లో ఇంటిల్లి పాది చిరు అభిమానులమే. మాలాంటి కుటుంబాలు అంధ్రాలో ఎన్నో... అవి చూసుకునె కదా మా బాసు కి రాజకీయాలు అనే ఆలోచన వచ్చింది. సరే ఆ టైము లో ఛాలెంజ్ సినిమా విడుదలైంది అందులోని "ఇందువదన కుందరదన" అనే పాట కొంచెం హడావిడి గా ప్రాసలతో నోరు సరిగా తిరగని వాళ్ళు పాడటం కొంచెం కష్టం గా వుండేది. పాట సాహిత్యం పెద్ద గా లేక పోయినా...

శుక్రవారం, మే 30, 2008

కాఫీ(Kauphy)...కబుర్లు

వీడేంటి కారంపూడి గురించి చెప్తాను అని కాఫీ గురించి మొదలు పెడుతున్నాడు అనుకుంటున్నారా. అసలు బ్లాగడానికి వాగడానికి చాలా దగ్గర సంబందం వుంది కదా. ఉచ్చారణలోనే కాదు అర్ధం లో కూడా ఒకటే అనుకోవచ్చు. అందుకని ఏదొ వాగుతున్నాను అబ్బ అలా విసుక్కోకుండా వినండి సార్ ...ఓ సారీ చదవండి సార్.కాపీ అనగానే ముందు నాకు గుర్తొచ్చేది ఏదో సినిమాలో ఒక్క అక్షరం కూడా కలవకుండా...KAUPHY... అని చెప్పిన స్పెల్లింగ్ నాకు అప్పట్లో అది చాలా నచ్చేసింది. బావా బావా పన్నీరు సినిమా అనుకుంటా... బావుంటుంది. ఇక పోతే నాకు ఇంటర్ వరకు ఇలాటి కాఫీ, టీ లు లాటివి అలవాటు లేవు. కొంచెం పెద్ద అయిన తర్వాత...

ఆదివారం, మే 25, 2008

పొలాల నన్నీ, హలాల దున్నీ...

పొలాల నన్నీ, హలాల దున్నీ...ఇలా తలంలో హేమం పిండగ జగాని కంతా సౌఖ్యం నిండగ...విరామమెరుగక పరిశ్రమించే....బలం ధరిత్రికి బలికావించే..కర్షక వీరుల కాయం నిండా...కాలువ కట్టే ఘర్మ జలానికి...ఘర్మ జలానికి...ధర్మ జలానికి...ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్...నరాల బిగువూ, కరాల సత్తువ,వరాల వర్షం కురిపించాలని,ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని...గనిలో, పనిలో, ఖార్ఖానాలోపరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ ధనిక సామికి దాస్యం చేసే,యంత్ర భూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణ కణ మండే, గల గల తొణికే విలాపాగ్నులకు, విషాదాశృవులకు ఖరీదు కట్టే షరాబు లేడోయ్.......

శనివారం, మే 24, 2008

మా ఊరు

నేను పుట్టింది నరసరావుపేట అనే ఊరిలో నాకు కొంచెం ఊహ తెలిసిన తర్వాత నా బాల్యం అంతా అక్కడే గడిచింది అనిచెప్పుకోవచ్చు. పుట్టింది ఇక్కడ అయినా అమ్మ నాన్న ఉద్యోగ రీత్యా మొదట చీరాల లో కొన్ని నెలలు ఆ తర్వాతగుంటూరు లో ఒకటి రెండు సంవత్సరాలు ఉండి తర్వాత నరసరావుపేట లో స్థిర పడ్డామాట. అంటె పెద్దగా స్థిరపడటంకాదు లే కాని ఎక్కువ సంవత్సరాలు ఉన్నాము అని చెప్పుకోవచ్చు. మధ్యలో ఒక 2 సంవత్సరాలు మినహాయిస్తేదాదాపు 25 యేళ్ళు పైనే అక్కడ వున్నాము. ఆ తరువాత అమ్మకి బదిలీ అవడం తో గుంటూరు వచ్చేసాము.అసలు నాన్న గారి సొంత ఊరు మాచెర్ల దగ్గర లో ఉన్న పాలవాయి. పక్కా పలనాటి ఊరు ఎక్కడ...

విధాత తలపున

అప్పుడు నేను 9 వ తరగతి చదువుతున్నా అనుకుంటా. నాకో నేస్తం వుండే వారు చిత్తరంజన్ అనీ ఇప్పుడు ఎక్కడ వున్నారో తెలీదు. అప్పట్లో మా ఇంటికి దగ్గరలో ఒక రికార్డింగ్ షాపు పెట్టారు. నాకు పేరు పెట్టి పిలిచే చనువు వున్నా నాకంటే కొంచెం పెద్ద లెండి. తన గురించి తన కుటుంబం తో నా అనుబంధం గురించి తర్వాత వ్రాస్తాను. నాకు తీరిక దొరికినప్పుడల్లా నేను ఎక్కువ సమయం ఆ షాపు లోనే పాటలు వింటూ గడిపే వాడ్ని. తను రికార్డింగ్ తో పాటు చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తుండే వాడు. నేను చాలా ఆసక్తి గా గమనించే వాడ్ని. పాడైపోయిన టేప్ రికార్డరు మోటారు తో ఒక చిన్న ఫేన్ తయారు చేసారు తను అప్పట్లో...

గురువారం, మే 22, 2008

పసిడి మబ్బులు

ఈ రోజు ఆకాశం లో ఓ అద్భుతం జరిగిందండి. మీరు పసిడి మబ్బులు ఎప్పుడన్నా చూసారా (బస్ మబ్బులు, రైలు మబ్బులు కాదమ్మా :-) . ఈ రొజు ఉదయం నేను station లొ train కోసం ఎదురు చూస్తుండగా చూసాను. వాతావరణం చల్ల గా ప్రశాంతం గా వుంది, సూర్యుడు కూడా తీక్షణమైన కిరణాలతో చలిని తరిమేయడానికి తన వంతు ప్రయత్నం తను చేస్తున్నాడు.ఆకాశం అంతా నీలం రంగులో చాలా నిర్మలం గా వుంది. తూర్పున మాత్రం పలచగా అక్కడక్కడ వెండి మెఘాలు ఉన్నాయి వాటిలో సూర్యుడికి కాస్త దగ్గరగా వున్న ఒక చిన్ని వెండి మీఘం మీద సూర్య కాంతి పడి బంగారు రంగులో మెరిసి పోతు కనిపించింది. సూర్యుడి వైపు వున్న సగం బంగారు రంగులోను...

బుధవారం, మే 21, 2008

బ్లాగు వెనుక కధ

అసలు ఈ బ్లాగు ఎందుకు? అని ఎవరైనా ప్రశ్నించక ముందు నేనే వివరించేస్తే "ఓ పనైపోతుంది బాబు" అనుకుని ఈ రోజు పోస్ట్ మొదలు పెట్టానండి. సరే ఇంక విషయానికి వస్తే ఈ బ్లాగు పేరు చెప్పినట్లు గా ఇది పూర్తి గా నా స్వగతం, నాతో నేను నా గురించి చెప్పుకునే కబుర్లు. డైరీ అనుకోవచ్చేమో కానీ అందులో ఏ రోజు కబుర్లు ఆ రోజే రాస్తామేమో కదా. ఇందులో మరి అలా కాదు కదా... ఎదేమైనా ప్రతి ఒక్కరికీ తన బాల్య స్మృతులు అంటె అపారమైన ఇష్టం వుంటుంది. అది కాదనలేని నిజం, ఆ స్మృతులు కష్టమైనవి కావచ్చు అందమైనవి కావచ్చు ఎలాంటివైనా, "కాకి పిల్ల కాకి కి ముద్దు" అన్న చందాన ఎవరి బాల్య స్మృతులు వాళ్ళకి...

సోమవారం, మే 19, 2008

నా షోలాపూర్ చెప్పులు

ఈ పాట ముద్దమందారం సినిమా లోనిది.నా చిన్నపుడు పెళ్ళిలో మాకు అదో పెద్ద విచిత్రం... మైక్ సెట్ ఆపరేటర్ దగ్గర పిల్లలమంతా మూగి వాడు రికార్డ్ ప్లేయర్ కి కీ ఇచ్చి పాటలు ప్లే చెస్తుంటే అబ్బురం గా చూసే వాళ్ళం... చిన్న పెద్ద రెండు సైజుల్లో రికార్డ్ లు, వాటి కవర్ల పై సినిమా బొమ్మలు, చూడటం అదో సరదా. భలే వుండేవి ఆ రోజులు.... ఏ సమస్యలు భాధ్యతలు తెలియకుండ ప్రతి పని లోను అనందాన్ని మాత్రమే అస్వాదించే రోజులు... మళ్ళీ వస్తే ఎంత బావుండునో..... ముద్దమందారం Listen to Mudda Mandaram Audio Songs at MusicMazaa.comరచన : వేటూరి గారు అనుకుంటాను నాకు ఖచ్చితం గా తెలీదుగానం :...

నా పేరు

నా పేరు వేణూ శ్రీకాంత్..అందం గా వుంది కదూ. నీ మొహం అందులో అందమేముంది రా అంటారా. ఆంగ్లం లో రాసినపుడు పెద్ద గా అనిపించదు కాని నాకు నా పేరు ని తెలుగు లో చూసుకున్నపుడు మాత్రం చాలా ముచ్చటేస్తుంది. ఆ ఒంపు సొంపులు మరే పేరులొనూ వుండవేమో అనిపిస్తుంది. కావాలంటే మళ్ళీ మీరు ఒకసారి చూడండి. ఎంత అందం గా వుందో కదూ...నాకు అసలు ఈ పేరు ఎలా పెట్టారు అని మా అమ్మని అడిగాను చిన్నపుడు. చాల మంది వేణు లు వుంటారు వేణు గోపాల్, వేణు మాధవ్ ఇలా. లేదంటే శ్రీకాంత్ లు వుంటారు కాని అసలు ఈ రెండు పేర్లు కలిపి పెట్టాలి అని మీకు ఎందుకు అనిపించింది అని అడిగాను. నన్ను కూడా చాలా మంది ఇదే...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.