బుధవారం, నవంబర్ 23, 2016

జ్యో అచ్యుతానంద...

ఈ సినిమా జ్యో అచ్యుత్ ఆనంద్ అనే ముగ్గురి మధ్య కథ... ఆగండాగండి ముగ్గురు అనగానే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఫిక్స్ అయిపోకండి.. అంటే ఈ సినిమాలో ప్రేమ లేదా అని పెదవి విరిచేస్తున్నారా.. భలే వారండీ బాబు ఈ సినిమాలో ప్రేమ కూడా ఉందండీ అంటే అది పెళ్ళికి దారితీసే ప్రేమ కాదండీ... అంటే అది కూడా ఉందనుకోండి కాకపోతే అది ఉండీ లేనట్లుంటుందండీ.. 

ఒక అబ్బాయి అమ్మాయి కలుసుకోవడం ప్రేమించుకోవడం పెళ్ళిచేస్కోవాలనుకోవడం వాళ్ళ పెళ్ళికి నానా రకాల అడ్డంకులు వచ్చేయడం అవన్నీ దాటుకుని చివరికి వాళ్ళిద్దరూ కలవడమో లేదా విడిపోవడమో తొంభై శాతానికి పైగా తెలుగు సినిమాలు ఈ ప్రేమ చుట్టూనే కదండీ తిరుగుతుంటాయ్.. ఈ సినిమా వాటికన్నిటికి కాస్త వైవిధ్యంగా సాగుతుందండీ.. 

అలా రొటీన్ అయిపోయిన అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ కథ కాకుండా ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథండీ.. వాళ్ళ మధ్య ప్రేమా అభిమానం అప్యాయతలు గొడవలు అనుభంధాలు వాటన్నిటి గురించి రెండుగంటల్లో శ్రీనివాస్ అవసరాల సినిమా అంతటా బోల్డు సటిల్ హ్యూమర్ ని చిలకరించి చక్కని సంభాషణలతో ఒక హాయైన అనుభూతిని ఇచ్చేలా తీర్చి దిద్దిన సిన్మా అండీ.. 

సినిమా మూడ్ కి తగిన పాటలు నేపధ్య సంగీతం నటీ నటుల నటన సినిమాటోగ్రఫీ అన్నీ చక్కగా ఆస్వాదించడానికి దోహదం చేస్తాయ్.. అసలు ఇన్ని మాటలెందుకండీ ఈ చక్కని సినిమా రేపు ఆదివారం అంటే నవంబర్ 27 న మధ్యాహ్నం రెండున్నరకు(2:30PM) జెమినీ టీవీలో టెలికాస్ట్ అవుతుందండీ.. సో ఈ సువర్ణావకాశాన్ని వదులుకోకుండా చూసి ఎంజాయ్ చేసేయండి.

సినిమా పేరు వినడానికి అనడానికి ఎంత హాయిగా ఉందో సినిమా అంతకన్నా హాయిగా ఉంటుంది. శ్రీని మిమ్మల్ని నిరుత్సాహ పరచడు నాదీ గ్యారెంటీ. సినిమా గురించి తెలియకపోతే ట్రైలర్స్ ఇక్కడ చూడవచ్చు.

3 కామెంట్‌లు:

  1. యీగర్లీ యెవైటింగ్ ఫర్ దిస్ మూవీ వేణూజీ..మీ ఆర్టికల్ మా ఆతృతని రెట్టింపు చేసింది.

    రిప్లయితొలగించండి
  2. కౌంట్లెస్ గంటల్లో తీసేసి..యెడిటింగ్ లో బాగా కన్ ఫ్యూజ్ అయ్యి..నందమూరి అభిమానుల మనోభావాలు దెబ్బ తినకూడదని జాగ్రత్తగా తాపత్రయపడి..కొంచం ఇంటెలిజెన్స్ తో కూడిన ఈస్థటిక్ సెన్స్ కోసం తాపత్రయ పడితే వచ్చిన రిజల్టే ఈ మూవీ..దీనినే స్టైలిష్ మేకింగ్..డిఫరెంట్ కైండ్ ఆఫ్ టేకింగ్ అని చెప్పుకున్నా యెపీలే లేదు..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సినిమా చూసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థాంక్స్ శాంతి గారు.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.