అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, నవంబర్ 26, 2014

రౌడీఫెలో...

నారా రోహిత్ నాకు నచ్చే నటులలో ఒకరు. తెలుగులో ఇతర కమర్షియల్ హీరోలకి భిన్నంగా తనకంటూ ఒక పంథా సృష్టించుకోవాలని తపనపడే ఇతని స్టోరీ సెలక్షన్ బాగుంటుంది. మొదటి చిత్రం 'బాణం' లోనే తన ప్లస్ పాయింట్స్ ని సరిగా క్యాచ్ చేసి వాటిని హైలైట్ చేసే కథతో వచ్చి మంచి మార్కులేయించుకున్నాడు. తరువాత ఒక లవ్ స్టోరీ (సోలో), ఒక ఫ్యామిలీ రివెంజ్ డ్రామా(ఒక్కడినే), ఒక సోషల్ మెసేజ్ ఫిల్మ్ (ప్రతినిధి) ఇలా ఏం చేసినా మినిమమ్ గ్యారెంటీ ఔట్ పుట్ ఇచ్చే ప్రామిసింగ్ హీరో అనిపిస్తాడు నాకు. కమర్షియల్ సక్సెస్ ఎలా ఉన్నా కానీ ఇతని సినిమాలు ఖచ్చితంగా వైవిధ్యంగా తప్పక ఒకసారైనా చూడాలనిపించేలా...

శనివారం, అక్టోబర్ 25, 2014

కార్తికేయ

జవాబులేని ప్రశ్నలు అంటూ ఉంటే అది ప్రయత్నలోపమే తప్ప తగినవిధంగా ప్రయత్నిస్తే సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదని నమ్మే క్యూరియస్ అండ్ డేరింగ్ మెడికో కార్తీక్. తను మెడికల్ కాంప్ లో భాగంగా సుబ్రహ్మణ్యపురం అనే చిన్న ఊరికి వెళ్తాడు. అక్కడ ఎంతో పురాతనమైన ఒక సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంటుంది కానీ ఇటీవల మూసి వేయబడిన ఆ గుడి తలుపులు తెరవడానికి ఎవరు ప్రయత్నించినా అసలు ఆ గుడి గురించి మాట్లాడినా కూడా చనిపోతూ ఉంటారు. ఈ విషయం తెలిసిన కార్తీక్ తన సహజమైన క్యూరియాసిటీ తో ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడనేదే "కార్తికేయ" సినిమా. నిఖిల్ తన ట్రెండ్ మార్చి చేసిన గత...

శుక్రవారం, ఆగస్టు 22, 2014

ఊహలు గుసగుసలాడే...

ప్రేమ !... రెండక్షరాల పదం... ఒక చిన్న ఫీలింగ్ / ఎమోషన్... సినిమాలు మొదలయినప్పటినుండీ... ఆమాటకొస్తే కథలు చెప్పడం మొదలైన దగ్గర నుండి కూడా ఇప్పటికి కొన్ని వేల సార్లు కథా వస్తువుగా ఉపయోగపడింది ఈ ప్రేమ, ఇక ముందు కూడా ఉపయోగపడుతుంది. ప్రేమ కథలు ఎన్ని సార్లు విన్నా చూసినా బోర్ కొట్టవని కొత్తగానే ఉంటాయని పదే పదే హిట్ అయ్యే ఎన్నో ప్రేమకథలు ఇప్పటికే ప్రూవ్ చేశాయి. అలాంటి ఒక ప్రేమకథకి ఆకట్టుకునే కథనం, చక్కని సంభాషణలు, సున్నితమైన హాస్యం కూడా తోడైతే... ఆ సినిమా చూడడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది. అలాంటి ఓ మంచి సినిమానే "ఊహలు గుసగుసలాడే" సినిమా... ఈ...

శుక్రవారం, ఆగస్టు 15, 2014

మార్పు మనతోనే మొదలవ్వాలి...

  "మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించడం కూడా దేశభక్తే... మార్పు మనతోనే మొదలవ్వాలి.." అని తెలియజేస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవానికి ఒక చక్కని లఘు చిత్రాన్ని కానుకగా అందించారు హీరో అల్లూ అర్జున్. ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ నీ, అల్లూ అర్జున్ నీ మరియూ ఈ చిత్రానికి పని చేసిన టీం అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇటువంటి సందేశాత్మకమైన లఘుచిత్రాన్ని నిర్మించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చిత్రానికి సంబందించిన ప్రెస్ మీట్ ఇక్కడ చూడవచ్చు. ఈ లఘు చిత్రాన్ని క్రింది ఎంబెడ్ వీడియోలో లేదా ఇక్కడ చూడవచ్చు. మిత్రులందరికీ...

బుధవారం, మే 07, 2014

ఎన్నికల కబుర్లు..

ఆదివారం కాకపోయినా ఆ రోజు అందరికీ సెలవు ఉండేది... సెలవు అయినాకానీ నాన్న మాత్రం ఇంట్లో ఉండేవారు కాదు.. ఒకరోజు ముందుగానే ప్రయాణమయి ఎక్కడో దూరంగా ఉండే ఊరికి స్పెషల్ డ్యూటీ మీద వెళ్ళేవారు... నాన్న వెళ్ళిన దగ్గర నుండీ అమ్మ రేడియో, టీవీ అన్నీ ఎదురుగా పెట్టుకుని వింటూ చూస్తూ నాన్న డ్యూటీకి వెళ్ళిన ఊరిలో ఏ గొడవలూ రాకూడదని అందరు దేవుళ్ళకీ మొక్కులు మొక్కుకుంటూ గడిపేది... తెల్లారి ఎన్నికల రోజు పది పదకొండు గంటల సమయంలో వంట పనులన్నీ అయ్యాక పార్టీ కార్యకర్తలు అరేంజ్ చేసిన వాహనాల్లో అమ్మ ఇంకా పక్కింటి ఆంటీలందరూ వెళ్ళి ఓటు వేసి వచ్చేవాళ్ళు. ఇంట్లో ఓటుహక్కులేని...

శనివారం, ఫిబ్రవరి 01, 2014

కౌముది లో నేను...

కౌముది సాహితీ మాసపత్రికలో పాఠకులు పాల్గొనే శీర్షికలో ఈ ఏడాది థీం "టెంత్ క్లాస్ జ్ఞాపకాలు" అని మీరు చూసే ఉంటారు. ఈ నెల(ఫిబ్రవరి 2014) కౌముదిలో ఈ శీర్షికన నేను రాసిన వ్యాసం ప్రచురితమైంది. నా వ్యాసం ప్రచురణకి స్వీకరించిన కిరణ్ ప్రభ గారికీ, కాంతి గారికీ ధన్యవాదాలు.  వ్యాసం చూడాలంటే ఇక్కడ పత్రిక లింక్ పై క్లిక్ చేసి ఇండెక్స్ కిందకి స్క్రోల్ చేస్తే పాఠకులు పాల్గొనే శీర్షిక అన్న దానిమీద క్లిక్ చేస్తే నా వ్యాసం చూడవచ్చు. లేదా ఇక్కడ క్లిక్ చేస్తే నా వ్యాసం డాక్యుమెంట్ డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది. మీ స్పందన కౌముదిలో కామెంట్స్ రూపంలో ఇక్కడ తెలియచేయవచ్చు....

బుధవారం, జనవరి 22, 2014

అమ్మ పెంపకం...

నాకున్న సినిమా పిచ్చి వారసత్వంగా వచ్చినదే... నా చిన్నతనంలో అమ్మా నాన్న ఇద్దరూ కూడా విపరీతంగా సినిమాలు చూసేవారట. నేను చిన్నపిల్లవాడ్ని కదా సో ఒకోరోజు తొందరగా నిద్రపోయినా కూడా అలాగే నన్ను రిక్షాలో వేసుకుని సినిమాకి తీస్కెళ్ళే వాళ్ళట. అప్పట్లో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అవి ట్రాన్సిస్టర్లు లైసెన్సులు రద్దయ్యి మాములుగా ఛలామణి అవుతున్న రోజులు కనుక రేడియో వినడం ఒక హాబీ అంతే తప్ప క్రేజ్ ఉండేది కాదు టీవీలు ఎవరో కోటీశ్వరుల ఇంట్లో వీసీఆర్ తో చూడ్డానికి మాత్రమే ఉండేవి. నాటకాలు ఇంకా నడుస్తూనే ఉండేవి కానీ సినిమాలంత విరివిగా లభ్యత ఉండేది కాదు...

బుధవారం, జనవరి 01, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు :-)

హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారూ... న్యూ ఇయర్ ఈవ్ అని నిన్న ఉదయం నుండి మొదలుపెట్టి ఈ రెండు రోజులు ఎడతెరిపి లేకుండా పార్టీలలో, గెట్ టుగెదర్ లలో, ఈమెయిల్స్, ట్వీట్స్, ప్లస్ పోస్ట్స్, ఫేస్బుక్ వాల్ పోస్ట్స్, ఎస్సెమ్మెస్, వాట్సాప్ లాంటి మెసెంజెర్స్, ఫోన్ కాల్స్, ఛాట్స్, ఇతరత్రా అందుబాటులో ఉన్న ప్రతిమాధ్యమం ద్వారానూ మీ మిత్రులకి, ఆత్మీయులకి, పరిచయస్తులకి అందరికి శుభాకాంక్షలందించేసి అందుకుని ఉంటారు కదా. ఇక ఈ వేళ్టికి చాలని పడుకునేముందు ఈ బ్లాగ్ ద్వారా కూడా మరొక్కమారు విషెస్ అందుకోండి. మిత్రులందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.