అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

బుధవారం, మార్చి 27, 2013

స్వామిరారా

సూర్య(నిఖిల్) తన మిత్రులతో(పూజ,కమెడియన్ సత్య) కలిసి ప్రొఫెషనల్ గా ప్లాన్ చేసి జేబులు కొట్టేయడం ఇంకా  చిన్న చిన్న దొంగతనాలూ చేస్తుంటాడు. చూడ్డానికి చాలా డీసెంట్ గా కనపడే ఈ బ్యాచ్ చేసే దొంగతనాలను గుర్తించడం ఎవరితరమూ కాదు. స్వాతి(స్వాతి) జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఉంటుంది. అనుకోకుండా స్వాతిని కలిసిన సూర్య ఆమెతో ప్రేమలో పడి తనో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నని ఆమెకి అబద్దాలు చెప్తూ దగ్గరవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా ఉండగా ఎన్నో ఏళ్ళ తర్వాత బయటపడ్డ అనంతపద్మనాభస్వామి సంపదని లెక్కించే సమయంలో ఒక చిన్న వినాయకుడి విగ్రహం దొంగిలించబడుతుంది. ఒక మంత్రిగారు...

ఆదివారం, మార్చి 24, 2013

గుండెల్లో గోదారి

శ్రీ బాపూ రమణ గార్లు ఆప్యాయంగా సీతారాముడు అని పిలుచుకునే బి.వి.ఎస్.రామారావు గారు దదాపు పుష్కరకాలం గోదారొడ్డున వివిధ ప్రాంతాలలో ఇంజనీరుగా వివిధ హోదాలలో పనిచేశారు. అలా తాను అతి దగ్గరగా గమనించిన జీవన విధానం నుండి విన్నవి కన్నవి ఊహించినవి కొన్ని సంఘటనలను కథలను అన్నిటినీ కలగలిపి ఈ గోదారి కథలు రాశానని చెప్తారు. తను పుష్కరాల రేవులో పుల్లట్లు కథ చెప్పబోతూ ఓ మాటంటారు... “ప్రవాహంలో తరంగాల్లా ఎన్నో జీవితాలు కాలప్రవాహంలో సాగిపోతుంటాయి. తరంగానికి దిగువ మనకి కనపడని మరొక తరంగం ఉంటుంది, ఆ తరంగ శక్తే మనం చూస్తున్న తరంగాన్ని నడిపిస్తుంది. అలాగే మనమెరిగిన వ్యక్తుల...

బుధవారం, మార్చి 13, 2013

భయం !!

చేస్తున్న పని ఆపి వేళ్ళు విరుచుకుంటూ సిస్టం ట్రే లో టైం చూశాను 1.36 AM. దదాపు గంటనుండి నిరంతరాయంగా మోగుతున్న ఇళయరాజా ప్లేలిస్ట్ ని పాజ్ చేసి రెండు చెవుల్లోనుండి ఇయర్ ఫోన్స్ తీసి తలతిప్పి గదిలో నాలుగు పక్కలకి చూశాను.. లోయస్ట్ బ్రైట్ నెస్ సెట్టింగ్ లో లాప్ టాప్ స్క్రీన్ నుండి వస్తున్న వెలుగు ఒక ప్రొజెక్టర్ లైట్ లా నా వెనక తెల్లని గోడ మీద నలుచదరంగా పలచగా పరచుకుంది.. స్క్రీన్ కి ఎదురుగా కూర్చున్న నానీడ గోడపై ఆ వెలుగులో అస్పష్టంగా తెలుస్తుంది. నేను తల తిప్పి తన వైపు చూడడంతో నానీడ కూడా తలతిప్పి నన్ను పరికించి చూస్తున్నట్లు అనిపించింది. ఇంకానయం...

గురువారం, మార్చి 07, 2013

బలరామ్మూర్తి అంకుల్

కొన్ని అనుబంధాలు ఎలా ఎందుకు ఏర్పడతాయో అస్సలు చెప్పలేం ఏ జన్మలోని ఋణానుబంధమో ఏ బంధుత్వం లేకపోయినా ఈ జన్మలో కూడా స్నేహం రూపంలో కొనసాగుతూ ఉంటాయి అనిపిస్తుంటుంది. అలాంటి అనుబంధమే మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు బలరామ్మూర్తి అంకుల్ ది మాదీనూ. మా ఈ అనుబంధం వయసు దదాపు పాతికేళ్ళు. మొదట్లో అమ్మవాళ్ళ ఆఫీస్ కొలీగ్ గా పరిచయమై మెల్లగా మా ఇంట్లో చిన్నా పెద్దా అందరికీ కూడా ఆత్మీయ మిత్రులై ఒక పెద్దదిక్కుగా క్రమం తప్పకుండా మా అందరి మంచి చెడ్డలు వాకబు చేస్తూ  నా స్కూల్ డేస్ నుండి కూడా నేను సాధించిన ప్రతి చిన్న విజయానికి అభినందిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.