అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

ఆదివారం, అక్టోబర్ 31, 2010

హెచ్చవేత - చైనీయుల పద్దతి(ట)

ఇప్పటికే ఈ వీడియో మీలో చాలా మంది చూసి ఉండచ్చు, కానీ నేను నిన్నే చూశాను and felt amazing. నా స్కూల్ డేస్ లో నాకు ఈ ట్రిక్ తెలిసుంటే ఎంత బాగుండేది, ఎన్ని కష్టాలు తప్పేవి అని చాలా అనిపించింది :-) Show this to your kids at your own risk :-D...

బుధవారం, అక్టోబర్ 27, 2010

సుత్తి ఎవరి సొత్తు?

నిన్న రౌడి గారి బ్లాగ్ లో శంకరయ్య గారు సుత్తి ఎవరి సొత్తు? విశ్లేషణ ఇవ్వగలరా అని అడిగిన ప్రశ్న చూసి వెంటనే నేనెరిగిన నాలుగు ముక్కలు చెప్దామని వారి ప్రశ్ననే శీర్షిక గా చేసుకుని సుత్తి గురించి కాసేపు సుత్తి కొడదామని ఈ టపా మొదలెట్టాను. వారేదో ఆంగ్ల నవలలో "You had been hammering Mr. Lanslott for the money since longtime" అన్న వాక్యం చదివి ఈ పదం ఆంగ్ల రచయితలు ఇదివరకే వాడినట్లున్నారు మన జంధ్యాల గారి ఐడియా కాదేమో అనిపించింది అన్నారు. ఆంగ్లంలో hammering అన్న ఉపయోగం గురించి వెతికితే ఈ కింది జవాబిచ్చింది. ఆ వివరాలు ఈలింక్ లో చూడవచ్చు. >>"to interrogate...

గురువారం, అక్టోబర్ 21, 2010

మహేష్ ఖలేజా

పై సీన్ చూశారు కదా? అందులో "మరీ ఇంత over expectation తట్టుకోలేకపోతున్నాను భయ్యా" అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఈ సినిమా ఏవరేజ్ టాక్ దగ్గర సెటిల్ అవడానికి కారణం చెప్పకనే చెప్పినట్లయింది. మూడేళ్ళ సమయం, నలభై కోట్లు, భారీ తారాగణం, గంభీరమైన టైటిల్ సరిపోవన్నట్లు ఏకంగా క్లైమాక్స్ సీన్ తో కూడిన టీజర్, స్పష్టత కొరవడిన మహేష్ ట్వీట్లు వెరసి ఈ సినిమా అంచనాలను ఆకాశానికెత్తేసి బాగున్న సినిమాను కూడా ఏవరేజ్ దగ్గర సెటిల్ అయ్యేలా చేసింది. హీరో, దర్శకుడు, నిర్మాత ముగ్గురూ కూడా సినిమా పై సరైన అంచనాలను ప్రేక్షకులకు చేరవేయడంలో విఫలమయ్యారు. వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్ కాకుండా...

మంగళవారం, అక్టోబర్ 19, 2010

ఓంకార్ పై ఓ సరదా వీడియో

నాకు శతృవులు చాలా తక్కువ, అసలు లేరనే చెప్పచ్చేమో.. ఇదివరకు ఆఫీస్ లో కొందరు తెలుగు తెలిసిన కొలీగ్స్ నన్ను అజాతశతృవు అని పిలిచే వాళ్ళు. అలా ఉండగలగటానికి ముఖ్య కారణం నా కోపాన్ని అదుపులో ఉంచుకోవడం. ఒక రెండుమూడేళ్ళ క్రితంవరకూ చాలా కంట్రోల్డ్ గా ఉండగలిగే వాడిని ఈ మద్య ఆ నిగ్రహం కాస్త కొరవడిందనుకోండి. ఇలాంటి నాకు కూడా ఒకోసారి అకారణంగా ఎదుటి వాళ్ళేమీ చేయకుండానే కొందరు వ్యక్తులను చూస్తేనే ఒళ్ళంతా తేళ్ళు జెర్రులు పాకుతున్నంత కంపరం పుట్టి చిరాకు వస్తుంది. బహుశా వారు గతంలో నన్ను పెట్టిన హింస అలా అకారణ ద్వేషానికి కారణం కావచ్చు. అలాంటి వారిలో ప్రత్యక్షంగా పరిచయం...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.