అలా మరో రెండు అడుగులు ముందుకు వేశామో లేదో "డుగ్ డుగ్ డుగ్ డుగ్.." అని లీలగ మొదలై మాకు మెల్లగా చేరువవుతున్న శబ్దం వినబడింది. మనకి బాగా ఇష్టమైనా నచ్చిన వాటిని చూసినా విన్నా తిన్నా ఏదో తెలియని మధురమైన అనుభూతికి లోనవుతాము, కళ్ళలో మెరుపు మొహం లో వెలుగు ఇత్యాది మార్పులు మనకి తెలియకుండానే జరిగిపోతుంటాయ్. అదిగో నాలో ఆలాంటి మార్పులకు కారణమయ్యే వాటిలో ఒకటి బుల్లెట్ మోటార్ సైకిల్. అసలు ఠీవీగా నిలబడే దాని రూపం చూస్తేనే ముచ్చటేస్తుంది. ఇక అది చేసే శబ్దం వింటే గుండెల్లో మృదంగం మోగిన అనుభూతి నాకారోజుల్లో.
ఆహా ఎక్కడా అని ఆసక్తిగా చూస్తే ఎదురుగా బుల్లెట్ బండి మీద ఒక భారీ ఆకారం వస్తూ కనిపించింది. ఆయన టీవీ భీముడు అంత ఉన్నారు, వయసు యాభై దగ్గరలో ఉండచ్చు, ఇంచు మించు ఏడు అడుగులు ఎత్తు ఉంటారేమో. ఎత్తుకు తగ్గ లావు, కాస్త ఎక్కువే లావు అనచ్చేమో. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన బుల్లెట్ బండి వేసుకు వస్తుంటే ఆయన భారీ ఆకారం కింద అది ఏదో లూనా లా కనిపించింది. గుండెల్లో మృదంగం ఆగిపోయి చెవుల్లో "మహాభారత్.." అని టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ మోగుతుండగా, ఆయన బండి మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయింది. నాకు ముచ్చెమట్లు పోశాయి, వామ్మో హాస్టల్ లో ఈయనేంటండీ బాబు ఒక్క చిటికెన వేలితో ఎత్తి అవతల పడేస్తారేమో సరిగా చదవక పోతే అనుకున్నాను. (తను మాకు కెమిస్ట్రీ చెప్పేవారు మనిషి ఎంత భారీనో మనసు అంత మెతక మమ్మల్ని ఎప్పుడైనా కాస్త గదమడమే కానీ ఎప్పుడూ చెయి చేసుకోలేదు:-)
నాకు అప్పటికే ఉన్న దిగులుకు భయం కూడా తోడవగా మెల్లగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ కి వెళ్ళాం. అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని AO(Administration Officer) గారిని కలవాలి ఆ బెంచ్ మీద కూచుని కాసేపు ఎదురు చూడండి అని చెప్పారు. AO గారి పేరు ప్రభాకర్ మా హాస్టల్ లో తనంటే టెర్రర్. చూడటానికి కాస్త పొట్ట ఎక్కువ పెంచిన మమ్ముట్టీ లా ఉంటారు. మొహానికి కళ్ళద్దాలు మరింత హుందాతనాన్ని తెచ్చిపెట్టి మాకు భయాన్ని గౌరవాన్ని మరింత పెంచేవి. హాస్టల్ కు సంభందించిన అన్ని విషయాలు తనే చూసుకునే వారు. ఆయన్ని కలిసాక నాన్న "మా వాడు మాకు దూరంగా ఉండటం ఇదే మొదటి సారి కాస్త జాగ్రత్తగా చూడండి" ఇత్యాది జాగ్రత్తలు అన్నీ ఆయనకు చెప్పేసి నాకు కొనాల్సిన సామాన్ల లిస్ట్ ఇస్తే అది పట్టుకుని ఆఫీస్ నుండి బయట పడ్డాం.
వెంట తెచ్చుకున్న పెట్టె రూం లో పెట్టేసి వెళ్దాం ఒక సారి రూం చూసినట్లు కూడా ఉంటుంది అని బిల్డింగ్ లోపలికి నడిచాం. పొడవాటి కారిడార్ కు అటు ఇటు రూంస్ ఉన్నాయ్ మొదట ఉన్న కొన్ని రూములు చిన్నవిగా ఉన్నాయ్ ఒకో దానిలో 6-7 మంచాల వరకూ వేసి ఉన్నాయ్. ఒకవైపు రూములన్నీ N1, N2 ఇలా నంబర్లు వేసి ఉంటే వాటి ఎదురుగా మరో వైపు ఉన్న రూములకు S1, S2 ఇలా నంబర్లు వేసి ఉన్నాయి. నాకు అలాట్ చేసిన రూమ్ చాలా పెద్దది ఒక రూంలో 15-20 వరకూ మంచాలు ఉన్నాయి. అంతమందితో కలిసి ఒకే రూంలో ఉండాలా ఎవరెవరు ఎలాంటి వారో ఎలా ఉండబోతుందో ఇక్కడ అని ఆలోచిస్తూ ఒక బెడ్ ఆక్రమించుకుని నా సామాన్లు పెట్టేసి, ఊరి మీద పడ్డాం. నా దిగులు పోగొట్టడానికి అని నాన్న రాఘవయ్య పార్క్, బీసెంట్ రోడ్ అన్ని ఏరియాలు తిప్పి చూపించారు. ఒక మంచి హోటల్లో భోజనం చేసి కొత్తగా కొన్న సామాన్లతో చీకటి పడ్డాక మళ్ళీ హాస్టల్ చేరుకున్నాం.
సామాన్లు రూం లో ఉంచాక నాన్నకు మా బిల్డింగ్ గుమ్మం దగ్గరే వీడ్కోలు ఇచ్చి తిరిగి రూం లోకి వచ్చాను. ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదు. అప్పటివరకూ ఉన్న దిగులు రెట్టింపు అయింది, దానికి బెరుకు కూడా తోడయ్యింది. అదేమిటో అంతమంది మధ్యన ఉన్నా ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది. ఒకరిద్దరు నన్ను చూసి పలకరింపుగా నవ్వారే కానీ అంతకు మించి ఎవరూ మాట్లాడలేదు. (పాపం వాళ్ళకూ కొత్త అన్న విషయం నాకు అప్పట్లో స్పురించలేదు). అప్పటికే పరిచయం అయిన వాళ్ళనుకుంటా కొంతమంది ఒక గ్రూప్ గా రూమ్ కు ఆ చివర కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఒక సారి నా సామాన్లు చూసుకున్నాను నా సొంతంగా ఒక పరుపు, దిండు, దుప్పట్లు, బక్కెట్, మగ్, ప్లేట్, గ్లాస్, ఒక ట్రంక్ పెట్టె. బట్టలకు విలువైన వస్తువులు డబ్బులు పెట్టుకోవడానికి ఒక విఐపి సూట్ కేస్. ట్రంక్ పెట్టె తీసి చూస్తే నా కోసం ప్రత్యేకంగా సర్ధిన కొన్ని నిత్యావసరాలు పేస్ట్, సబ్బులు లాంటివి చూసుకుని బోలెడు దిగులు పడిపోయాను. మొన్నటి వరకూ ఇంట్లో సరుకులు తెచ్చినపుడు తప్ప వీటిగురించి అసలు పట్టించుకునే వాడ్ని కాదు ఇప్పుడు నాకోసం అన్నీ ప్రత్యేకంగా నేనే మెంయింటెయిన్ చేసుకోవాల్సినవి. బట్టలు కూడా నేనే ఉతుక్కోవాల్సి వస్తుందేమో అని చెప్పారు. ఏమిటో ఈ కష్టాలు అసలు ఇలా ఇంటినుండి ప్రత్యేకంగా వచ్చి నా సామాన్లతో నేను బతకడం ఏమిటో అని ఏడుపు వచ్చేసింది. కాసేపు ఎవరికీ కనపడకుండా ఏడ్చేసి మెల్లగా అలానే నిద్ర లోకి జారుకున్నాను.
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
హాస్టల్ లో నా మొదటి రోజు అలా గడిచిందండీ . నిన్న టపాలో చెప్పినట్లు ఇక పై ఒక సీక్వెన్స్ లో కాకపోయినా నాకు గుర్తున్న కొన్ని సంఘటనలను అపుడపుడూ మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను.
మీ జ్ఞాపకాలు బాగున్నాయి.
రిప్లయితొలగించండి>> గోశాల అనే ఊర్లో ఉండాలి
మేము ఆ ఊరిని "గోసాల" అని పిలుస్తాము.
nice man............
రిప్లయితొలగించండిబాగుందండి...చదవడానికి ఆసక్తి కలిగేలా నేరేట్ చేస్తున్నారు...
రిప్లయితొలగించండిఇంటర్లో మా లెక్కల మాస్టారు మీ లావుపాటి కెమిస్ట్రీ సార్ లానే ఉండేవారు..ఆయన్ని మేం ప్రేమగా 'గజం మావయ్య' అని పిలిచేవాళ్ళం. :-)
గణేష్ గారు నెనర్లు. నిజమేనండీ రాసేప్పుడు అనుమానం వచ్చింది కానీ ఫ్లో లో శా వాడాను.
రిప్లయితొలగించండివినయ్ గారు నెనర్లు.
శేఖర్ గారు నెనర్లు, హ హ మీ లెక్కల మాష్టారి పేరు బాగుందండి :-)
హాస్టల్లో ఉండటానికి మనస్పూర్తిగా ఇష్టపడి ఎవరూ పోలేరేమొ కదూ! చదువుతూ ఉంటే నాకూ దిగులేస్తుంది. ఇప్పుడు ఇంటర్ పిల్లలు ఎంతో మంది హాస్టల్స్ లో దిగులుపడుతూ కాలం గడుపుకుంటూ ఒస్తున్నారో! ఇంటర్ లెవల్ దాటినాకా హాస్టల్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. మీ మిగతా అనుభవాలు తొందరగా చెప్పేయండి మరి.
రిప్లయితొలగించండి>>అసలు ఇలా ఇంటినుండి ప్రత్యేకంగా వచ్చి నా సామాన్లతో నేను బతకడం ఏమిటో అని ఏడుపు వచ్చేసింది.
రిప్లయితొలగించండిSo sad :)
నిన్న ఇంక కూర్చునే ఓపికలెక చదవలేదండి...బాగున్నాయి మీ హాస్టల్ కబుర్లు. అరే మా బెజవాడ...సిధ్ధార్ధా లో చదివారా...భావనగారు,నిషిగంధగారు కూడా మా విజయవాడ అంటున్నారు..భలె భలే...పదవ క్లాస్లొ పిల్లలను రెందు నెలలు హాస్తల్లొ ఉంచుకుని చదివించె అలవాటు మా స్కూల్లొ ఉందెదండి..అలాగ నాకూ ఒక రెండు నెలలు హాస్టల్ లైఫ్ అనుభవమే..!
రిప్లయితొలగించండిరాస్తూండండి..వీలైనప్పుడు వ్యాఖ్యలు రాయలేకపోయినా తప్పక చదువుతూ ఉంటాను...:)
చెవుల్లో "మహాభారత్.." అని టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ మోగుతుండగా..
రిప్లయితొలగించండిhahahaha
:)
రెండు భాగాలూ ఇప్పుడే చదివానండీ.. touching.. ఇంతకన్నా ఏం రాయాలో అర్ధం కావడం లేదు.. ఇల్లు విడిచిపెట్టిన రోజులు ఒక్కసారిగా గుర్తొచ్చి నన్ను గతం లోకి లాక్కెళ్ళి పోతున్నాయి...
రిప్లయితొలగించండిజయ గారు నెనర్లు, నేను కూడా అదే అనుకునేవాడ్నండీ హాస్టల్ లో ఇష్టంగా ఎవరూ చేరరు అని. కానీ ఇంటికన్నా హాస్టల్ పదిలమనే కొంతమందిని చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను మెజారిటీ మాత్రం ఇష్టం లేకుండానే చేరతారు.
రిప్లయితొలగించండిమేధ గారు నెనర్లు :-)
తృష్ణ గారు నెనర్లు, మీ కామెంట్ చూసి సంతోషం బాధ రెండూ ఒకేసారి కలిగాయండీ :-) అంత కష్టపడుతూ కూడా చదువుతున్నందుకు ధన్యవాదాలు. మీరు కామెంట్ రాయకపోయినా ఏం పర్లేదు. ఆరోగ్యం ముఖ్యం కదండీ. నిజమే చాలామంది విజయవాడ అంటున్నారు.
నేస్తం గారు నెనర్లు :-)
మురళి గారు నెనర్లు, ఇల్లు విడిచిన కొత్తలో రోజులు చాలా బాధాకరమండీ నిజమే.
పాపం వేణు గారు. అవును ఎవరూ ఇష్ట పడి వెళతారు కదా ఆ ఏజ్ లో హాస్టల్ కు. బాగా రాసేరు మీ కబుర్లు. నేను విజయవాడ లో చదవలేదు కాని చదువు అవ్వగానే వున్నా, ఇంకా మెట్టిన వూరు కూడా. చాలా ఇష్టం ఆ వూరంటే. అందుకే మా వూరు అయ్యింది. :-) ఆ బుల్లెట్ శబ్ధం ఇష్టమా. అమ్మో అదేదో గుండెల మీద కొట్టినట్లు వుంటుంది నాకైతే.
రిప్లయితొలగించండి@తృష్ణ గారు: మాది కూడా విజయవాడే! అదే బెజవాడ.. నా చదువంతా సాగింది అక్కడే..
రిప్లయితొలగించండినాకు కుళ్ళుగా ఉందబ్బా! ఎందుకంటే నాకు జీవితంలో తీరని కోరికేదైనా ఉందంటే(ఇక తీరే ఛాన్స్ కూడా లేదు) అది హాస్టల్లో ఉండి చదువుకోవడమే! స్కూలు, కాలేజీ అన్నీ నడిచెళ్ళే దూరమే!
రిప్లయితొలగించండిమీరు చూస్తే హాస్టల్లో ఎవరూ ఇష్టంగా చేరరు అంటున్నారు.
అది సరే, ఇక్కడేంటి, విజయవాడ వాళ్ళ హగ్గులు ఎక్కువైపోయాయి? హన్నా!
భావన గారు నెనర్లు, విజయవాడ తో మీ అనుభందం బాగుందండి. మరే మరే అలా గుండెల మీద కొట్టినట్లు ఉంటుంది కనుకే నాకు ఇష్టమండి.
రిప్లయితొలగించండిసుజాత గారు నెనర్లు, హ హ నిజమా సూపరండీ... మరే మరే నేను కూడా అదే చెప్పాను కొంతమందికి హాస్టల్ కూడా ఇష్టమే అని :-) హ హ మరి విజయవాడ ఙ్ఞాపకాలు కదా మరి అందరిని ఒకటి చేయడం సహజమే మరి :-)
boddeda suryaprakash@gmail.com
రిప్లయితొలగించండి