అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

గురువారం, ఆగస్టు 20, 2020

బాలుగారి ఆరోగ్యం కోసం...

గత కొన్ని దశాబ్దాలుగా భారతీయులని తన సుమధుర గాత్రంతో ఆలరిస్తున్న బాలసుబ్రహ్మణ్యం గారు గత కొన్ని రోజులుగా కోవిడ్ తో పోరాడుతున్న విషయం అందరకూ తెలిసిందే. వారు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. ఈ రోజు అనగా గురువారం ఆగస్ట్ 20 వ తారీఖున సాయంత్రం ఆరుగంటలకు (ఇండియా టైమ్) ఐదు నిముషాల పాటు బాలుగారు పాడిన పాటలను వింటూ వారి ఆరోగ్యం కోసం సామూహిక ప్రార్థనలు చేయాలని అభిమానులు సంకల్పించారు. ఇందుకోసం #GetWellSoonSPBSIR అనే హాష్ టాగ్ ఉపయోగిస్తున్నారు. మరిన్ని వివరాలు ఈనాడు పేపర్ లో ఇక్కడ...

శుక్రవారం, ఆగస్టు 14, 2020

గుంజన్ సక్సేనా...

"కలలు కనండి సాకారం చేసుకోండి" అనే అబ్దుల్ కలాం గారి కొటేషన్ కు నిలువెత్తు రూపం ఫ్లైట్ లెఫ్ట్ నెంట్ గుంజన్ సక్సేనా. భారతవాయుసేన తరఫున యుద్దంలో పాల్గొన్న తొలి మహిళా పైలట్ తను. 1999 లో జరిగిన కార్గిల్ యుద్దంలో తన చీతా హెలికాప్టర్ సాయంతో శత్రు స్థావరాలను గుర్తించడం, సైనికులకు ఆహారం, ఆయుధాలను సరఫరా చేయడమే కాక ఎందరో క్షతగాత్రులను యుద్దభూమినుండి సురక్షిత ప్రాంతాలకు తరలించి రక్షించారు. తన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం శౌర్య చక్ర బిరుదుతో సత్కరించింది, ప్రజలు మరియూ డిపార్ట్మెంట్ కార్గిల్ గర్ల్ గా పిలుచుకునే ఆ గుంజన్ కథే ఇటీవల నెట్ఫ్లిక్స్ లో విడుదలైన...

మంగళవారం, ఆగస్టు 04, 2020

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..

సహజత్వానికి ఒరిజినాలిటీకీ కేరాఫ్ అడ్రస్ అనదగ్గ "కేరాఫ్ కంచరపాలెం" లాంటి సినిమా తీసిన దర్శకుడు "వెంకటేష్ మహా" రెండో సినిమా "ఉమామహేశ్వర ఉగ్రరూపస్య". ఇది "మహేషింటె ప్రతీకారం" అనే మలయాళ సినిమాకి రీమేక్ అని విన్నపుడు ఇంత ఒరిజినాలిటీ ఉన్న దర్శకుడు రీమేక్ ఎందుకు ఎన్నుకున్నాడో అని ఆశ్చర్యపోయాను. ఒరిజినల్ సినిమా చూడలేదు కనుక పోల్చి చెప్పలేను కానీ ఈ సినిమా చూశాక మాత్రం "ఈ కథకు తను తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరనిపించేలా తీశాడు" అనిపించింది టైటిల్ చూసి ఇదేదో యాంగర్ మానేజ్మెంట్ లాంటి సినిమా అని పొరబడకండి. ఎప్పుడూ ఎవరినీ కనీసం గట్టిగా కోప్పడి కూడా ఎరుగని మహేష్...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.