దుబాయ్ లో పని చేసొచ్చి ఇండియా లో స్థిరపడిన భుజంగయ్య (ప్రకాష్ రాజ్) కి డబ్బూ అధికారం తెచ్చిపెట్టిన గౌరవం పలుకుబడీ చూసుకుని మురిసి పోతూ ఉంటాడు. ఊరంతా అంత గౌరవం ఇస్తున్న తనకి తన ఇంట్లో ఏమాత్రం విలువ ఇవ్వడం లేదనీ తన కూతురు, భార్య, అత్త గారు తన మాట వినడం లేదనే కోపంతో అస్తమానం అరుస్తూ వారి మీద అజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఆటో నడుపుకుంటూ ఎప్పటికైనా ఇతని సాయంతో దుబాయ్ వెళ్ళాలని కలలుగనే శివ(సత్యదేవ్) ఇతనికి నమ్మిన బంటు.
గరుడ(పృథ్వీ) ఓ సినిమా డైరెక్టర్ ఇదే ఊరిలో షూటింగ్ జరుపుకుంటున్న హీరోకి కథ చెప్పడానికి వచ్చి దారిలో తన స్క్రిప్ట్ ను శివ ఆటోలో మర్చిపోతాడు. అదే రోజు రాత్రి ఇంట్లోవాళ్ళతో గొడవపడి వచ్చి తన కొట్లో ఫ్రెండ్స్ తో సిట్టింగ్ వేసిన భుజంగయ్య మరింత మందుకోసం వెళ్తుండగా ఓ వేశ్య(ప్రియమణి) కనిపిస్తుంది. ఆ బలహీన క్షణంలో ఎప్పుడూ ఇటువంటి తప్పు చేయని అతను ఆమెతో ఆ రాత్రి గడపాలనుకుంటాడు.
వాళ్ళిద్దరిని డైరెక్టర్ స్క్రిప్ట్ తో సహా కొట్లో పెట్టి బయట నుండి తాళం వేసి వెళ్ళిన శివ అనుకోని పరిస్థితులలో గరుడతో కలిసి ఓ చోట చిక్కుకు పోతాడు. తెల్లారితే చుట్టూ ఉన్న కొట్లు తెరిచి జనంతో సందడిగా ఉండే ఆ ఏరియా నుండి భుజంగయ్య పరువు పోకుండా బయటపడ గలిగాడా లేదా ? తను ఎంతగానో అభిమానించే తన గురువుని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలోకి నెట్టిన శివ గరుడ సాయంతో ఏం చేశాడు ? గరుడకి తన స్క్రిప్ట్ దొరికిందా ? ఇలాంటి సంఘటన తర్వాత భుజంగయ్య ప్రవర్తనలోనూ ఆలోచనల్లోనూ ఏమైనా మార్పొచ్చిందా ? అనేవి తెలుసుకోవాలంటే ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో 2016 లో విడుదలైన "మన ఊరి రామాయణం" అనే సినిమా చూడాలి.
విడుదలైనపుడు అక్కడక్కడ సినిమా గురించి మంచి మాటలు వినీ ప్రమోషన్ కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించి చూద్దామనుకుని కూడా వీలు పడక చూడలేక పోయాను. నిన్న యాథాలాపంగా ప్రైమ్ లో టైటిల్స్ చూస్తూ అనుకోకుండా చూసిన ఈ సినిమా నాకో పెద్ద ప్లజెంట్ సర్ ప్రైజ్, ఇంత బావుంటుందని అస్సలు ఊహించలేదు, చాలా చాలా నచ్చేసింది. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా పాటలు ఫైట్లు లేకుండా కథమీద మాత్రమే ఫోకస్ చేసిన సినిమా ఇది. పేజీల కొద్దీ డైలాగులు చెప్పకుండానే సున్నితమైన మానవ సంబంధాల గురించీ విలువల గురించీ వీపుపై ఛెళ్ళుమనిపించి ఆలోచింపజేసే సినిమా.
కొన్ని సినిమాలు కథ తెలుసుకోడానికి, కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం మరికొన్ని సినిమాలు విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నట్లే కొన్ని సినిమాలు నటీనటుల నటన కోసం సినిమా టేకింగ్ కోసం చూడాల్సినవి ఉంటాయి. మన ఊరి రామాయణం సరిగ్గా అలాంటి సినిమానే. రెండు గంటలకు పావుగంట తక్కువే ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ అనే మాట గుర్తు కూడా రానీయదు. ఉన్నది అతి తక్కువ పాత్రలూ పరిమితమైన లొకేషన్స్ అయినప్పటికీ నటీనటులు సన్నివేశాలు కట్టిపడేస్తాయి.
చిత్రీకరణ సన్నివేశాలు ఎమోషన్స్ ఎంత సహజంగా ఉన్నాయంటే ప్రతి పాత్రా నిజజీవితంలో మనకు పరిచయమైనదే అనిపిస్తుంటుంది ఇలాంటి వాళ్ళని మనం ఎక్కడో చూశాం అని అనిపించక మానదు. అసలు మనం ఒక సినిమా చూస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి ఆ ఊరు మధ్యలో ఉండి వాళ్ళతో పాటు శివ ఆటో ఎక్కి తిరిగేస్తున్నట్లుగా ఫీలవుతాం. భుజంగయ్య లోటు పాట్లు తెలిసినప్పటికీ పాపం అతను త్వరగా బయటపడితే బావుండు అని అనిపిస్తుందంటే దానికి ముఖ్య కారణం రాసుకున్న సన్నివేశాలు వాటిని రక్తికట్టించిన నటులు దానికి తోడైన ఇళయరాజా నేపధ్య సంగీతం.
ప్రకాష్ రాజ్ ఎంత విలక్షణమైన నటుడో అందరికీ తెలిసిందే కానీ ఈ సినిమాలో పూర్తిగా భుజంగయ్యగా మారిపోయాడు. పెద్దమనిషిగా దర్పం, అహం, కోపం, ఓ బలహీన క్షణంలో తప్పువైపు మొగ్గుచూపినా ఆ తర్వాత తను పడే సంఘర్షణ, పరువు గురించి పడే తపన, స్నేహితుల అభిప్రాయాలు వింటున్నపుడు నిస్సహాయత, అహం దిగిపోయాక కుటుంబంపై కూతురిపై ప్రేమ అన్నీ తన హావభావాలతోనే మనకర్థమయేలా చేయడమే కాక తన ఎమోషన్స్ తో కనెక్ట్ అయి తన వైపు నుండి ఆలోచించేంతగా ప్రేక్షకులని ప్రభావితం చేశాడు.
ఇక జాతీయ అవార్డ్ గ్రహీత ప్రియమణిని తెలుగు సినిమా గ్లామర్ కు పరిమితం చేసింది కానీ తన ప్రతిభ ఈ పాత్ర పోషణలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది. వేశ్య పాత్ర అయినప్పటికీ ఎక్కడా అసభ్యతకి తావులేకుండా హుందాగా పోషించిన తీరు అనితరసాధ్యం అనిపిస్తుంది. అంత పెద్దమనిషిని రా అంటున్నా అతని మంచితనం గుర్తించిన తీరు చివరికి అతని ఇబ్బందిని గ్రహించి చివరికి మారి అతన్నీ మార్చిన తీరు హావభావాల్లోనే కాక బాడీలాంగ్వేజ్ లో కూడా చూపించి కట్టి పడేస్తుంది. భుజంగయ్య పరువు గురించి ఆలోచించకుండా అలవాటుగా ఫోన్ లో పెద్దగా మాట్లాడుతున్న ఆమెని చూసి మనకే "అమ్మాయ్ కాస్త చిన్నగ మాట్లాడు" అని చెప్దామా అనిపిస్తుందంటే మనకి ఆ విషయాన్ని అంతగా రిజిష్టర్ చేసిన ఈ ఇద్దరి నటనే కారణం.
అలాగే సత్యదేవ్ ఇప్పుడంటే ఎస్టాబ్లిష్డ్ నటుడుగా పేరు తెచ్చేసుకున్నాడు కానీ తన కెరీర్ మొదట్లోదనుకుంటాను ఈ సినిమా. తను కూడా ఆటో డ్రైవర్ గా భుజంగయ్య నమ్మిన బంటుగా ఒదిగిపోయాడీ సినిమాలో. తన గురు సమానంగా అభిమానించే భుజంగయ్య తన వల్ల ఇబ్బందిలో పడ్డాడని ఎలాగైనా కాపాడాలని అతను చేసే ప్రయత్నాలు చూస్తే తన తరఫున మనం కూడా దేవుడ్ని వేడుకుంటాం. సినిమా దర్శకుడు గరుడ గా చేసిన తర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా తనకి అలవాటైన లౌడ్ నెస్ ని పక్కన పెట్టి సటిల్ గా చేశాడు. ఎదుటి వారి పరిస్థితిని పట్టించుకోకుండా తన ధోరణిలో తను పిచ్చి జోకులేసే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో రఘుబాబు కూడా ఆకట్టుకుంటాడు. ప్రకాష్ రాజ్ కూతురుగా చేసిన అమ్మాయి కూడా మెప్పిస్తుంది.
టెక్నికల్ డిపార్మెంట్ లో ముందుగా చెప్పుకోవలసింది ఇళయరాజా గారి నేపథ్య సంగీతం. సినిమాలో ఎక్కడా ప్రత్యేకంగా తెలియకుండా అంతర్లీనంగా కలిసిపోయి సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ ఎమోషన్స్ ని మనకి కనెక్ట్ చేయడానికి దోహద పడింది ఈ సంగీతమే. అలాగే థీం సాంగ్ గా చివర్లో వచ్చే పాట కూడా గుర్తుండి పోతుంది. ఆ తరువాత స్థానం ఛాయగ్రహణం అందించిన ముఖేశ్ గారిది మనల్ని థియేటర్ల నుండీ సోఫాసెట్ ల నుండీ అలా అలవోకగా తీస్కెళ్ళి ఈ ఊరి మధ్యలో నిలబెట్టేశాడంటే ఆ గొప్పతనం ఇతనిదే. సినిమా ఏదైనా నిజమైన ఊర్లో చిత్రీకరించారో స్టూడియో సెట్స్ లోనా అన్నది తెలియదు కానీ సెట్స్ అయితే మాత్రం ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడవి నీ మెచ్చుకుని తీరాలి.
మొత్తం మీద చూసినంత సేపూ ఉత్కంఠతో నటులతో పాటు ప్రయాణించి ముగిసాక ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని మిగిల్చే సినిమా "మన ఊరి రామాయణం". 2016 లో విడుదలైనపుడు మిస్సయిన వాళ్ళు ఈ సినిమా ఈ వారమే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది తప్పక చూడండి. రొటీన్ మాస్ మసాలా కమర్షియల్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చేమో కానీ వైవిధ్యమైన సినిమాలు ఇష్టపడే ప్రతి ఒక్కళ్ళూ మిస్సవకుండా చూడవలసిన సినిమా ఇది. ఈ సినిమా థియాట్రికల్ ట్రైలర్ ఇక్కడ చూడవచ్చు.
ఈ సినిమా లో ఉన్న ఒకే ఒక్క పాట భాస్కరభట్ల గారు చాలా చక్కగా రాశారు. థీమ్ సాంగ్ అనవచ్చు ఇది కూడా ఎండ్ క్రెడిట్స్ లో వస్తుంది. ఆ సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. మేకింగ్ వీడియో లో ఈ పాట ఇక్కడ చూడవచ్చు.
వాళ్ళిద్దరిని డైరెక్టర్ స్క్రిప్ట్ తో సహా కొట్లో పెట్టి బయట నుండి తాళం వేసి వెళ్ళిన శివ అనుకోని పరిస్థితులలో గరుడతో కలిసి ఓ చోట చిక్కుకు పోతాడు. తెల్లారితే చుట్టూ ఉన్న కొట్లు తెరిచి జనంతో సందడిగా ఉండే ఆ ఏరియా నుండి భుజంగయ్య పరువు పోకుండా బయటపడ గలిగాడా లేదా ? తను ఎంతగానో అభిమానించే తన గురువుని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలోకి నెట్టిన శివ గరుడ సాయంతో ఏం చేశాడు ? గరుడకి తన స్క్రిప్ట్ దొరికిందా ? ఇలాంటి సంఘటన తర్వాత భుజంగయ్య ప్రవర్తనలోనూ ఆలోచనల్లోనూ ఏమైనా మార్పొచ్చిందా ? అనేవి తెలుసుకోవాలంటే ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో 2016 లో విడుదలైన "మన ఊరి రామాయణం" అనే సినిమా చూడాలి.

కొన్ని సినిమాలు కథ తెలుసుకోడానికి, కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ కోసం మరికొన్ని సినిమాలు విజువల్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నట్లే కొన్ని సినిమాలు నటీనటుల నటన కోసం సినిమా టేకింగ్ కోసం చూడాల్సినవి ఉంటాయి. మన ఊరి రామాయణం సరిగ్గా అలాంటి సినిమానే. రెండు గంటలకు పావుగంట తక్కువే ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ అనే మాట గుర్తు కూడా రానీయదు. ఉన్నది అతి తక్కువ పాత్రలూ పరిమితమైన లొకేషన్స్ అయినప్పటికీ నటీనటులు సన్నివేశాలు కట్టిపడేస్తాయి.
చిత్రీకరణ సన్నివేశాలు ఎమోషన్స్ ఎంత సహజంగా ఉన్నాయంటే ప్రతి పాత్రా నిజజీవితంలో మనకు పరిచయమైనదే అనిపిస్తుంటుంది ఇలాంటి వాళ్ళని మనం ఎక్కడో చూశాం అని అనిపించక మానదు. అసలు మనం ఒక సినిమా చూస్తున్నామన్న విషయాన్ని మర్చిపోయి ఆ ఊరు మధ్యలో ఉండి వాళ్ళతో పాటు శివ ఆటో ఎక్కి తిరిగేస్తున్నట్లుగా ఫీలవుతాం. భుజంగయ్య లోటు పాట్లు తెలిసినప్పటికీ పాపం అతను త్వరగా బయటపడితే బావుండు అని అనిపిస్తుందంటే దానికి ముఖ్య కారణం రాసుకున్న సన్నివేశాలు వాటిని రక్తికట్టించిన నటులు దానికి తోడైన ఇళయరాజా నేపధ్య సంగీతం.
ప్రకాష్ రాజ్ ఎంత విలక్షణమైన నటుడో అందరికీ తెలిసిందే కానీ ఈ సినిమాలో పూర్తిగా భుజంగయ్యగా మారిపోయాడు. పెద్దమనిషిగా దర్పం, అహం, కోపం, ఓ బలహీన క్షణంలో తప్పువైపు మొగ్గుచూపినా ఆ తర్వాత తను పడే సంఘర్షణ, పరువు గురించి పడే తపన, స్నేహితుల అభిప్రాయాలు వింటున్నపుడు నిస్సహాయత, అహం దిగిపోయాక కుటుంబంపై కూతురిపై ప్రేమ అన్నీ తన హావభావాలతోనే మనకర్థమయేలా చేయడమే కాక తన ఎమోషన్స్ తో కనెక్ట్ అయి తన వైపు నుండి ఆలోచించేంతగా ప్రేక్షకులని ప్రభావితం చేశాడు.
ఇక జాతీయ అవార్డ్ గ్రహీత ప్రియమణిని తెలుగు సినిమా గ్లామర్ కు పరిమితం చేసింది కానీ తన ప్రతిభ ఈ పాత్ర పోషణలో ప్రస్ఫుటంగా తెలుస్తుంది. వేశ్య పాత్ర అయినప్పటికీ ఎక్కడా అసభ్యతకి తావులేకుండా హుందాగా పోషించిన తీరు అనితరసాధ్యం అనిపిస్తుంది. అంత పెద్దమనిషిని రా అంటున్నా అతని మంచితనం గుర్తించిన తీరు చివరికి అతని ఇబ్బందిని గ్రహించి చివరికి మారి అతన్నీ మార్చిన తీరు హావభావాల్లోనే కాక బాడీలాంగ్వేజ్ లో కూడా చూపించి కట్టి పడేస్తుంది. భుజంగయ్య పరువు గురించి ఆలోచించకుండా అలవాటుగా ఫోన్ లో పెద్దగా మాట్లాడుతున్న ఆమెని చూసి మనకే "అమ్మాయ్ కాస్త చిన్నగ మాట్లాడు" అని చెప్దామా అనిపిస్తుందంటే మనకి ఆ విషయాన్ని అంతగా రిజిష్టర్ చేసిన ఈ ఇద్దరి నటనే కారణం.
అలాగే సత్యదేవ్ ఇప్పుడంటే ఎస్టాబ్లిష్డ్ నటుడుగా పేరు తెచ్చేసుకున్నాడు కానీ తన కెరీర్ మొదట్లోదనుకుంటాను ఈ సినిమా. తను కూడా ఆటో డ్రైవర్ గా భుజంగయ్య నమ్మిన బంటుగా ఒదిగిపోయాడీ సినిమాలో. తన గురు సమానంగా అభిమానించే భుజంగయ్య తన వల్ల ఇబ్బందిలో పడ్డాడని ఎలాగైనా కాపాడాలని అతను చేసే ప్రయత్నాలు చూస్తే తన తరఫున మనం కూడా దేవుడ్ని వేడుకుంటాం. సినిమా దర్శకుడు గరుడ గా చేసిన తర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా తనకి అలవాటైన లౌడ్ నెస్ ని పక్కన పెట్టి సటిల్ గా చేశాడు. ఎదుటి వారి పరిస్థితిని పట్టించుకోకుండా తన ధోరణిలో తను పిచ్చి జోకులేసే పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్రలో రఘుబాబు కూడా ఆకట్టుకుంటాడు. ప్రకాష్ రాజ్ కూతురుగా చేసిన అమ్మాయి కూడా మెప్పిస్తుంది.
టెక్నికల్ డిపార్మెంట్ లో ముందుగా చెప్పుకోవలసింది ఇళయరాజా గారి నేపథ్య సంగీతం. సినిమాలో ఎక్కడా ప్రత్యేకంగా తెలియకుండా అంతర్లీనంగా కలిసిపోయి సన్నివేశాలని ఎలివేట్ చేస్తూ ఎమోషన్స్ ని మనకి కనెక్ట్ చేయడానికి దోహద పడింది ఈ సంగీతమే. అలాగే థీం సాంగ్ గా చివర్లో వచ్చే పాట కూడా గుర్తుండి పోతుంది. ఆ తరువాత స్థానం ఛాయగ్రహణం అందించిన ముఖేశ్ గారిది మనల్ని థియేటర్ల నుండీ సోఫాసెట్ ల నుండీ అలా అలవోకగా తీస్కెళ్ళి ఈ ఊరి మధ్యలో నిలబెట్టేశాడంటే ఆ గొప్పతనం ఇతనిదే. సినిమా ఏదైనా నిజమైన ఊర్లో చిత్రీకరించారో స్టూడియో సెట్స్ లోనా అన్నది తెలియదు కానీ సెట్స్ అయితే మాత్రం ఆర్ట్ డైరెక్టర్ శశిధర్ అడవి నీ మెచ్చుకుని తీరాలి.

ఈ సినిమా లో ఉన్న ఒకే ఒక్క పాట భాస్కరభట్ల గారు చాలా చక్కగా రాశారు. థీమ్ సాంగ్ అనవచ్చు ఇది కూడా ఎండ్ క్రెడిట్స్ లో వస్తుంది. ఆ సాహిత్యం ఇక్కడ ఇస్తున్నాను. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. మేకింగ్ వీడియో లో ఈ పాట ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మన ఊరి రామాయణం (2016)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : ఇళయరాజా, నిహాల్
ఏవేవో ఏవేవొ
చూస్తూనే ఉంటాం
మనలోని లోపం తప్పా
ఏమేమొ ఏమేమొ
మాటాడుతుంటాం
పనికొచ్చే విషయం తప్పా...
భలే చెప్పావ్
చెవులారా వినుకోండి
మనసారా చెబుతా
మన ఊరి రామాయణం ఆఆఆఆఆ..
ఇది మనలోని రామాయణం ఆఆఆఆఆ..
మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం
పైకేమో శ్రీరామచంద్రుడులా ఉంటాం
ఎనలేని దయ చూపుతాం
అవకాశం దొరికిందో అవతారం మార్చి
రావణుడై చెలరేగుతాం
సహనంలో శాంతంలో కరుణించడంలో
కనిపిస్తాం సీతమ్మలా
సాదింపులు వేదింపులు బెదిరింపుల్లోన
సరిపోతాం శూర్పణఖలా
లోనొక్కటి బయటొక్కటి తైతక్కల వేషం
ఈ తప్పులు ఈ తిప్పలు మన పొట్టల కోసం
ఉసురే కసిరే వరకూ తెగదీ జంఝాటం
మన ఊరిరామాయణం ఆఆ...ఆఅ
ఇది మనలోని రామాయణం ఆఆఆ...
మన శక్తిని మనకెవ్వరొ చెప్పేంతదాకా
కూర్చుంటాం హనుమంతుడిలా
మసిపూసే మంధరల మాటలకే బాగా
ఊ కొడతాం కైకేయిలా
ఆ కుంభకర్ణుడిలా నిదురోతు ఉంటాం
మన చుట్టూ ఏమైనా కాని
మధమెక్కిన మైకంలో తెగవాలిపోతాం
వావీవరసలు అన్నీ మాని
మెరపెట్టిన తిరిగొచ్చున పరిగెట్టిన కాలం
పగపట్టద పనిపట్టద పడగెత్తిన లోకం
మనలో చెడుపై మనమే చేద్దాం పోరాటం
మన ఊరి రామాయణం
ఇది మనలోని రామాయణం
ఏమేమొ ఏమేమొ
మాటాడుతుంటాం
పనికొచ్చే విషయం తప్ప
చెవులారా వినుకోండి
మనసారా చెబుతా
మన ఊరి రామాయణం ఆఆ...
ఇది మనలోని రామాయణం ఓఓఓ...
మన ఊరి రామాయణం ఆఆ..
ఇది మనలోని రామాయణం ఓఓఓ..
ఔనండీ..చాలా చక్కని సినిమా..ఇప్పటివరకూ ప్రకాష్ రాజ్ డైరెక్ట్ చేసిన అన్ని మూవీస్ చాలా సోల్ ఫుల్ గా ఉన్నాయి..వన్ మోర్ థాట్ ఫుల్ మూవీ..
రిప్లయితొలగించండిథ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ. ఔనండీ తన సినిమాలన్నీ బావుంటాయి తన అభిరుచి కనపడుతూ ఉంటుంది.
తొలగించండివేణుశ్రీకాంత్ గారు,
రిప్లయితొలగించండి“సరిలేరు నీకెవ్వరూ” సినిమా చూశారా? చూసుంటే మీ అభిప్రాయం చెప్పగలరా ఇక్కడ (ఆల్రెడీ వ్రాశారా?) ? థాంక్స్.
(ఇవాళే చూశాను. నా అభిప్రాయమైతే ఇప్పుడే చెప్పేస్తున్నాను ..... అంత పరమ కంగాళీ సినిమా నేనెప్పుడూ చూడలేదు.)
చూశాను నరసింహారావు గారు.. నాకూ అంత గొప్పగా ఏం అనిపించలేదండీ అందుకే రాయలేదు..
తొలగించండిInko manchi movie introduce chesaru kada...inthakumundu baga bore anipinchi a cinema chudalo decide chesukolenappudu mee blog, nemalikannu murali gari blog Loki thongi chusi edo oka movie pick chesukuni chusedanni. I wish you to introduce many more this kind of good movies.
రిప్లయితొలగించండిథ్యాంక్స్ ప్రియరాగాలు గారూ.. తప్పకుండా రాస్తానండీ..
తొలగించండిఇది తమిళంలో తీసినపుడు చూశా. బాగుండింది. ఈ తెలుగు వర్షన్ కూడా చూడాలి అనిపించేలా రాశారు.
రిప్లయితొలగించండిథ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండీ.. తమిళ్ తెలుగు ఒకేసారి రిలీజ్ చేశారండీ.. నటీనటులు కూడా సేమ్..
తొలగించండివేణు శ్రీకాంత్ గారు, ఈ సినిమా backgorund గురించి చిన్న విశ్లేషణ. అన్యధా భావించరని మనవి
తొలగించండి2012 లో వచ్చిన షట్టర్ అనే మలయాళ సినిమాని 2015 లో 'ఒరు నాళ్ ఇరవిల్' గా తమిళ్ లో సత్యరాజ్ తో తీశారు. ఆ తర్వాత తెలుగు, కన్నడ లో తీశారు, మరి దీన్ని కూడా తమిళ్ మూవీ గా డబ్బింగ్ చేసి ఉండచ్చు అనుకుంటాను. ఇదే సినిమాని హిందీ తో సహా చాలా భాషల్లో తీశారు.
ఈ సినిమా గురించి ఒక సారి నా బ్లాగ్ లో రాశాను
http://naakaburulu.blogspot.com/2019/09/blog-post.html
థ్యాంక్స్ పవన్ గారు.. అయ్యో అనుకోడానికి ఏం ఉందండీ.. నేనే పొరబడ్డాను. తమిళ్ తెలుగు ఒకేసారి విడుదలైందనుకున్నానండీ.. మీరు కరెక్ట్ తెలుగు అండ్ కన్నడ వర్షన్స్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి ప్రకాష్ రాజ్ చేసినది వీటిలో..
తొలగించండిఐతే ఈ సినిమాకి అసలు మాతృక మళయాళ సినిమా ’షట్టర్’ అనమాట. దాని గురించీ ఇంకా తమిళ్ అండ్ మిగిలిన వర్షన్స్ గురించి నాకు తెలియదండీ. మీకు తెలిసిన వివరాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. సత్యరాజ్ అంటే తమిళ్ వర్షన్ కూడా చూడాలని ఉంది కుదిరితే చూస్తాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ పవన్ గారు.
“మన ఊరి రామాయణం” సినిమా ఇవాళ చూశానండి (ప్రైమ్ లో) వేణుశ్రీకాంత్ గారూ. అక్షరాలా మీరు వ్రాసిన రివ్యూను గుర్తుకు తెచ్చేలాగానే ఉంది 👌.
రిప్లయితొలగించండికొన్ని బలహీన క్షణాల్లో వేసిన అడుగు ఒక్కోసారి ఎలా వికటిస్తుందో బాగా చిత్రీకరించాడు ప్రకాష్ రాజ్. అతనిలో ఇంత దర్శకత్వ ప్రతిభ ఉందనుకోలేదు.
ఒక మంచి సినిమా చూసిన తృప్తి కలిగింది, thanks to you (మీ రివ్యూ చదవకపోతే చూసుండేవాడిని కాదేమో బహుశః.)
సినిమా చూసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు నరసింహారావు గారూ. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.
తొలగించండిఈవ్యాసం చదివే, మొన్న రాత్రి అమెజాన్ ప్రైమ్‌లో ఈ 'మన ఊరి రామాయణం' సినిమాను చూసాను. బాగుంది. ఎవ్వరూ నటనలో అతి చేయకపోవటం, స్టార్ హీరోల బోరింగ్ నటనలు లేకపోవటంతో పాటు వాళ్ళకోసం ఇరికించే పిచ్చి పాటలూ పిచ్చి పోట్లాటలూ లేకపోవటం కారణంగానూ మంచి ప్రవాహంలా కథను దర్శకుడు నడపటం వలనా సినిమా చాలా చక్కగా అనిపించింది. మనుషులంతా రంగులబొమ్మల్లా కాకుండా కాస్త మనుషుల్లాగా కనిపించారు.
రిప్లయితొలగించండిచక్కగా క్లుప్తంగా భలే చెప్పారండీ సినిమా గురించి. చూసొచ్చి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు శ్యామలీయం గారు.
తొలగించండిసినిమా బాగుందండి.ముఖ్యంగా కథ, నటినటుల నటన, క్లైమాక్స్ చాలా బాగున్నాయి.
రిప్లయితొలగించండికాని సగటు ఆర్ట్ సినిమాలా నెమ్మదిగా సాగింది.
ఈ సినిమా కన్నడ వెర్షన్ పోస్టర్లు ఇక్కడ బెంగళూరులో చూసాను. తెలుగులో వచ్చిందని మీరు వ్రాసాకే తెలిసింది.
చూసి మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు బోనగిరి గారు.. ఒకప్పటి ఆర్ట్ సినిమాలు మరీ స్లోగా ఉండేవండీ వాటికి కమర్షియల్ సినిమాకి మధ్యన నిలుస్తుందనిపించిందండీ నాకైతే. థ్యాంక్స్ ఫర్ ద కామేంట్.
తొలగించండి