అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, జూన్ 13, 2017

అమీ తుమీ..

సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే సక్సెస్ ఫార్ములా వెనక పరుగెట్టడమనే జాడ్యానికి దూరంగా ఉండే అతి కొద్దిమంది దర్శకులలో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ వేటికవే వేరు వేరు జెనర్స్ లో ఉంటాయి. సినిమాని ఎలా సక్సెస్ చేయాలా అనే ఆలోచనతో కాక ఒక మంచి కథను ఎలా చెప్పాలా అని ఆలోచించే వ్యక్తి తను. తెలుగు సాహిత్యం తన వారసత్వం దానికి తోడు చిన్నప్పటి నుండీ తను చదివిన సాహిత్యం అతనిని ఒక విశిష్టమైన దర్శకునిగా నిలబెట్టింది. భాష మీద పదాల మీద తనకున్న పట్టు ఈ సినిమా మాటల్లో అలవోకగా చిలకరించిన హాస్యాన్ని చూస్తే తెలుస్తుంది.  ఇంతకీ...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.