అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శుక్రవారం, డిసెంబర్ 31, 2010

హాస్టల్ - 7 (న్యూ ఇయర్)

ఈ టపానూ ఇంకా కొత్త సంవత్సరం పై బ్లాగరులు రాసిన మరికొన్ని చక్కని టపాలను సుజన మధుర గారి e-బుక్ లో ఇక్కడ చదవండి. సర్వర్ లో డౌన్లోడ్ అవకపోతే గూగుల్ డాక్స్ లో ఇక్కడ నుండి దింపుకోండి. మిగతా పండగలు చేసినా చేయకపోయినా ఆగస్ట్ 15 కాక మా కాలేజ్ లో ముఖ్యంగా చేసేవి మూడు పండగలు. ఒకటి దీపావళి -  పెద్ద సంఖ్యలో బాణాసంచా తెప్పించి ఇళ్ళకు వెళ్లకుండా హాస్టల్లోనే ఉండిపోయిన పిల్లలతో కాల్పించేవారు. రెండోది కాలేజ్ యానివర్సరీ - ఒక చీఫ్ గెస్ట్ ను పిలిపించి పెద్ద సభ జరిపి, సాంస్కృతిక కార్యక్రమాలు, రెండువారాలుగా జరిగిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతిప్రదానం, మెస్ లో ఫీస్ట్...

ఆదివారం, డిసెంబర్ 26, 2010

హాస్టల్ - 6 (వేణు The దేవదాస్ !!)

~*~*~ ఇది సీరియల్ కాదు ఏ టపాకు ఆ టపానే విడిగా కూడా చదువుకోవచ్చు.. నేను విజయవాడ సిద్దార్థ రెసిడెన్షియల్ లో ఇంటర్మీడియట్ చదివేరోజుల్లో జరిగిన ఈ హాస్టల్ కబుర్ల గురించి పరిచయం లేని వారు విజయవాడ హాస్టల్లో అన్న లేబుల్ పై క్లిక్ చేస్తే ముందు 5 టపాలు చదవవచ్చు.~*~*~ ఖర్మరా బాబు ఇపుడు వీడి ప్రేమకథ వినిపిస్తాడా అని కంగారు పడకండి, ఓ ప్రేమికుడుగా దేవదాస్ ఎంత ఫేమస్సో ఓ తాగుబోతుగా కూడా అంతే ఫేమస్ మరి, ఇపుడు నే చెప్పబోయేది ఆ రెండో (అవ)లక్షణం గురించే. నేను విజయవాడలో ఇంటర్ చదివేరోజుల్లో మాకు ప్రతి ఆదివారం ఔటింగ్ ఇచ్చేవారు అంటే మధ్యహ్నం భోజనాలు అవ్వగానే బయటకి వెళ్ళి...

గురువారం, డిసెంబర్ 23, 2010

చిన్ననాటి పాటలు

ఆ మధ్య ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళినపుడు, వాళ్ళ పాప ఆటల మధ్యలో తన 'చిన్నారుల తెలుగు పాటల పుస్తకం' తెచ్చి నాకు చూపించింది. దాన్లో కొన్ని పాటలు చూసిన మరుక్షణం మనసు అలా బాల్యంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రానని మొరాయిస్తుంటే బలవంతంగా లాక్కొచ్చి ఇహంలో పడేసాను. వెంటనే ఆ మధురానుభూతిని అనుకున్న తక్షణం పొందడానికి వీలుగా ఆ పాటలను ఎక్కడైన పదిల పరచుకోవాలని ఎక్కడో ఎందుకు బ్లాగ్ ఉందికదా అనుకుని అన్ని ఇక్కడ రాసుకుంటున్నాను. అచ్చుతప్పులకు తోడు ఙ్ఞాపకశక్తియొక్క లోపాల వలన కొన్ని పాటలలో తప్పులు ఉండవచ్చు, కొన్ని అసంపూర్తిగా ఉండవచ్చు. నేను మిస్ అయినవి మీకు తెలిసిన మరికొన్ని...

బుధవారం, డిసెంబర్ 15, 2010

చిత్రమాలిక లో నేను..

పదేళ్ళ క్రితం నేను అమెరికాలో మొదటిసారి కాలుపెట్టినపుడు ఎదుర్కొన్న ప్రధమ సమస్య భాష. భాష అనేకన్నా యాస అనడం సబబేమో. పదోతరగతి వరకు తెలుగుమీడియంలో చదువుకున్న నాకు నాఇంగ్లీష్ నాలెడ్జే అంతంత మాత్రం, ఇక అమెరికన్ యాక్సెంట్ అర్ధం చేసుకోడానికి నానా కష్టాలు పడి ఒళ్ళు చెవులు సర్వం  రిక్కించి విని ఆ మాటలు మనసులో ప్రాసెస్ చేసుకుని అర్ధంచేసుకోవాల్సి వచ్చేది. ఇక అమెరికన్ల సంగతికొస్తే నేను మాట్లాడటం దేవుడెరుగు కనీసం తలాడించినా అర్ధమయ్యేది కాదు “అవుననా కాదనా దాని అర్ధమేమిటి” అని మళ్ళీ మళ్ళీ అడిగేవాళ్ళు. వీటన్నిటినీ అధిగమించడానికి నేను ఎన్నుకున్న మార్గం టివిలొ...

ఆదివారం, డిసెంబర్ 12, 2010

నిజం చెప్పి ప్రేమించమనే ఆరెంజ్.

నేనూ మార్గదర్శిలో చేరాను ఆరెంజ్ సినిమా చూశాను :-) ఈ సినిమాగురించి మాటమాట్లాడితే బడ్జెట్ అంటున్నారు అదీకాక ఇంత ఆలశ్యంగా చూశాను కదా అని ఈ కామెడీ డైలాగ్ కొట్టా కానీ ఇలా చిట్టీలు కట్టుకుని పొదుపుచేసి సినిమాకి వెళ్ళవలసివచ్చే రోజులు ఎంతో దూరంలేవు. దిక్కుమాలిన మల్టిప్లెక్స్ పుణ్యమా అని ఇక్కడ టిక్కెట్లకు ఒక స్థిరమైన ధర ఉండదు కన్నడ సినిమాలు కాస్త తక్కువేకానీ పరభాషాచిత్రాలు మరీ ఎక్కువ అవి మొదటివారమైతే 350 తరవాత నుండి వారంమధ్యలో ఐతే పగలు 160, సాయంత్రాలు 180, వారాంతం(శుక్ర,శని,ఆది) వచ్చిందంటే అవే రేట్లు వరుసగా 200, 240 ఐపోతాయి. వీటికితోడు మంచినీళ్ళ సీసా కావాలన్నా...

సోమవారం, డిసెంబర్ 06, 2010

నెనర్లు.. ధన్యవాదాలు.. త్యాంకులు..

ఈరోజు (డిశంబర్ ఆరు) నా పుట్టిన రోజు సంధర్బంగా బ్లాగులలో టపాల ద్వారా, కామెంట్ల ద్వారా, బజ్ లోనూ, లేఖలలోనూ నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులందరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంధర్బంగా గతంలో గుర్తుచేసుకున్న నా పుట్టినరోజు ఙ్ఞాపకాలు ఇక్కడ చూడవచ్చు.   నాకు ఇష్టమైన "పుదీనా జంతికలు" చేసిపెట్టిన సృజనగారికి, తనెవరో నేను పేరుచెప్పను మీరే కనిపెట్టండి అంటూ నాకు అభావకుడు అని పేరు తగిలించి దేశమంతా బ్లాక్ డే జరుపుకునే ఈరోజున మా నరసరావుపేట రాష్ట్రానికి మాత్రం శ్వేతదినంగా ప్రకటించి తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పిన "గీతాచార్యగారికి", తన బ్లాగ్...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.