అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శనివారం, ఆగస్టు 14, 2010

మర్యాద రామన్న..

ఈ సినిమా పై ఇప్పటికే చాలా రివ్యూలు చదివి ఉంటారు కనుక నేను కథా పరిచయం చేయబోవడం లేదు, మరికొన్ని వివరాలకు ఇదే సినిమా పై బ్లాగ్ మితృలు మురళి గారు రాసిన టపా ఇక్కడ చదవవచ్చు.  "A picture is worth a thousand words", ఏదైనా ఒక విషయాన్ని వేయి మాటల్లో కన్నా ఒక్క చిత్రంతో హృదయానికి హత్తుకునేలా చెప్పవచ్చు అన్నది జగమెరిగిన సామెత. అలాంటి చిత్రాల(scenes) సమాహారమైన చలనచిత్రానికి కొన్ని శక్తివంతమైన మాటలతో కూడిన నేపథ్యసంగీతం తోడైతే చెప్పవలసిన విషయం మరింత సూటిగా ప్రేక్షకునికి చేరుతుంది కదా, అదే మర్యాద రామన్న సినిమా. ఈ సినిమా చూస్తున్నంత సేపు నాకు ప్రతి...

గురువారం, ఆగస్టు 12, 2010

లీడర్ మాటీవి లో (ఈ ఆదివారం ఆగస్ట్ 15)

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ’లీడర్’ సినిమా ఈ ఆగస్ట్ పదిహేనో తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ’మా టీవి’ లో ప్రదర్శిస్తున్నారుట, సరైన సమయం ఇంకా తెలియదు బహుశా మద్యాహ్నం ప్రదర్శిస్తుండవచ్చు. సమయం తెలిసాక ఈ పోస్ట్ మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఈ సినిమా మీరు ఇంకా చూడనట్లైతే ఈ అవకాశాన్ని మిస్ కాకుండా తప్పని సరిగా చూడండి. ప్రదర్శన సమయం : మధ్యాహ్నం ఒంటిగంట (1:00 PM on 15th Aug) ఈ సినిమా పై ఇదివరకు నేను రాసిన పోస్ట్ ఇక్కడ చదవవచ్చు. ...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.