అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శనివారం, ఏప్రిల్ 11, 2009

ఇది విన్నారా !! సూపర్ బ్రెయిన్ యోగా !!

ఇది విన్నారా !! ఈ సూపర్ బ్రెయిన్ యోగా గురించి విన్నారా... ఎంత వరకూ నిజమో నాకు తెలియదు కానీ ఈ వీడియో ఇది వరకు చూసి ఉండక పోతే ఓ సారి చూడండి. ఇది దదాపు ఒక సంవత్సరం క్రితం 2008 ఆగస్ట్ లోది, అయినా నేను ఇప్పుడే చూసాను, మీరూ ఇదివరకు చూసి ఉండక పోతే ఓ సారి చూడండి."ఓసోస్ ఇది మాకెందుకు తెలియదు చిన్నప్పటి నుండి ఎన్ని సార్లు తీయలేదు మనకి చిరపరిచితమైన గుంజీళ్ళేగా.." అంటారా. అదే మరి నాకూ అలా అనిపించి మన బడి లో ఇచ్చే సాధారణమైన పనిష్మంట్ వెనకాల ఇంత ప్రయోజనం ఉందా అని ఆశ్చర్య పడిపోయే ఇలా బ్లాగుతున్నా. ఈ ప్రయోజనం గుర్తెరిగే మన బడి లో ఉపాధ్యాయులు ఈ దండనని ప్రవేశ పెట్టారా...

శుక్రవారం, ఏప్రిల్ 03, 2009

రామా కనవేమి రా !!

శ్రీ రామ నవమి సంధర్బంగా తోటి బ్లాగరు లందరికీ, పాఠకులకూ, నా హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అంతా ఈ పాటికి పూజలు గట్రా ముగించుకుని రేడియో లో కళ్యాణం వింటూ ఉండి ఉంటారు. రేడియో లో వింటం ఏమిటి నా మొహం నేనింకా ఎనభైల లోనే ఉన్నాను !! ఇప్పుడన్నీ లైవ్ ప్రోగ్రాం లే కదా... సరే లెండి టీవీ లో చూస్తుండి ఉంటారు. నా మటుకు నాకు శ్రీరామ నవమి అనగానే మొదట గుర్తొచ్చేది భద్రాచలం లోని రాముని కళ్యాణం, ఆ వైభవానికి తగ్గట్టుగా ఇక ఉషశ్రీ గారి వ్యాఖ్యానం (ఇక్కడ క్లిక్ చేసి వినవచ్చు), ముఖ్యమంత్రి నెత్తిన పెట్టుకుని మరీ తీసుకు వచ్చే ముత్యాల తలంబ్రాలు, దేనికవే సాటి. వాటి...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.