అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శుక్రవారం, డిసెంబర్ 26, 2008

సాయము వలదా !! ఓ చెయ్ వేసేదా...

కొన్ని నెలల క్రితం అంటే ఆగస్ట్ లో నేను ఇండియా వెళ్ళివచ్చాను చాలా మంది బ్లాగ్ మిత్రులకు తెలుసు ఆ విషయం. అప్పటి కొన్ని అనుభవాలు బ్లాగ్ లో పంచుకోడానికి ఇప్పటికి వీలు దొరికింది. ఏం చేయమంటారు చెప్పండి నా బ్లాగ్ ధీం ఙ్ఞాపకాలు కదా, మరి అందుకే ఇన్ని రోజులు గడచిన తరవాత కానీ రాయడానికి కుదరడం లేదు :-) రావు గారు చెప్పినట్లు ఎప్పటికప్పుడు ట్రావెలాగుడు రాయగలిగితే బాగుండేది కానీ అది మన స్కూలు కాదు, అదీ కాక అసలు అన్ని విశేషాలు ఏమీ లేవు. ఎక్కడికైనా సైట్ సీయింగ్ కి వెళ్తే ఏమన్నా ఉంటాయ్ కానీ ఏదో పర్సనల్ ట్రిప్ కి ఇంటికి వెళ్ళినపుడు ఏముంటాయ్ చెప్పండి మనకీ రోజూ తారస...

సోమవారం, డిసెంబర్ 22, 2008

బృందావని - తిల్లాన - బాలమురళీకృష్ణ

రుద్రవీణ సినిమా లో ప్రఖ్యాత సంగీత కళాకారుని కొడుకైన కధానాయకుడు కట్టెలు కొట్టుకునే వాళ్ళ దగ్గరకు వెళ్ళినపుడు వాళ్ళు "మీ నాన్నగారి పాట యినే అదృష్టం మాకెలాగూ లేదు మీరైనా మాకోసం ఏదైనా ఓ పాట పాడండయ్యా.." అని మన కధానాయకుడిని అడుగుతారు దానికతను ఓ మంచి ఆలాపన తో మొదలు పెట్టగానే కొందరు నోళ్ళు తెరుచుకుని అర్ధం కాని మొహంతో చూస్తుంటే, మరికొందరు బుర్ర గోక్కుంటూ ఉంటే, మరికొందరు దిక్కులు చూస్తూ ఉంటారు, తను కొంచెం విరామం ఇవ్వగానే అందరూ కలిసి "కాస్త మంచి పాట పాడండయ్యా..." అని అమాయకంగా అడుగుతారు. అలానే డిగ్రీ పూర్తయి ఉద్యోగం లో చేరిన తర్వాత వరకూ కూడా నాకు కర్ణాటక...

శుక్రవారం, డిసెంబర్ 19, 2008

నాన్న తో షికార్లు !! మరికొన్ని..

నాన్న నేను అప్పుడప్పుడూ షటిల్ కూడా ఆడేవాళ్ళం. కారణం ఏంటో తెలియదు అనుకోకుండా మొదలు పెట్టాం కానీ ఎందుకో మరి మధ్యలోనే ఆపేసాం ఆ అలవాటు అలా కొనసాగించలేకపోయాం. ఇంకా ఒక టైం లో అయితే నాన్న కీ, నాకూ, మా తమ్ముడుకీ ఒకేలాంటి డ్రెస్ లు వుండేవి. తమ్ముడు నెలల పాపాయి అయితే నేనేమో మూడో నాలుగో చదువుతుండే వాడ్ని అనుకుంటా, మేము ముగ్గురం అలా ఒకే లాంటి బట్టలు వేసుకోడం ఎంత బాగుండేదో నాకైతే ఏదో గొప్ప ఫీలింగ్ "నాన్న లాంటి చొక్కానే నేను కూడా వేసుకున్నాను.." అని, ఎంత బాగుండేదో మాటలలో చెప్పలేను. ఇంకా నాన్న ఆఫీసు నుండి వస్తూ ఆఫీసు ఎదురుగా ఉండే షాపు నుండి వేరు శనగ పప్పుండలు,...

గురువారం, డిసెంబర్ 18, 2008

ఈ రోజు ఎక్కడికి వెళదాం నాన్నా ?

నా చిన్నతనం లో నాకు అత్యంత ఇష్టమైన పనుల లో నాన్న తో షికారు కి వెళ్ళడం ఒకటి. పాపం రోజంతా ఆఫీసు లో అలసి పోయి వచ్చినా ఓపికగా పార్కుకో, మార్కెట్ కో లేదంటే ఏదైనా పని ఉంటే అక్కడికి తన తో పాటు నన్నూ తీసుకు వెళ్ళేవారు నాన్న. నరసరావుపేట్ లో గాంధీపార్క్ కూరగాయల మార్కెట్ రెండూ ఎదురుబొదురు గానే ఉండేవి. పార్కు లో జారుడు బల్ల, ఊగుడు బల్ల (Seasaw), ఉయ్యాల ఇలాంటి వాటితో మిగిలిన పిల్లలతో కలిసి ఆడుకునే వాడిని. లేదంటే నాన్న వాటర్ ఫౌంటైన్, పూల మొక్కల పక్కన బెంచ్ మీద కూర్చుని వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే నేను ఫౌంటైన్ ని వచ్చేపోయే జనాన్ని చూస్తూనో, లేదంటే పార్కు పక్కనే...

బుధవారం, డిసెంబర్ 17, 2008

జన్మదిన శుభాకాంక్షలు భాస్కరా

ఆ చేత్తో ఓ నాలుగూ, ఈ చేత్తో ఓ నాలుగూ, మొత్తం ఓ ఎనిమిది బ్లాగులు అవలీలగా నడిపిస్తూ, వివిధ రకాలైన దేశ విదేశీ వంటలను సుళువు గా ఇంట్లోనే చేసుకునే విధానం గురించి వైవిధ్యభరితమైన తన శైలి లో వివరిస్తూ, బ్రహ్మచారుల పాలిటి అభినవ నలభీముడి గానే కాక.. నాన్న , నా.యస్.యల్.ఆర్.కన్ను బ్లాగుల ద్వారా అనతి కాలం లోనే బ్లాగ్ లోకం లోని అందరి అభిమానాన్ని చురగొన్న పలనాటి ముద్దు బిడ్డ "భాస్కర్ రామరాజు" గారి పుట్టిన రోజు డిశంబర్ 17. ఈ సంధర్భం గా తనకి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.మీరిలాగే సంపూర్ణ ఆయుఃఆరోగ్య ఐశ్వర్యాలతో నవ్వుతూ నవ్విస్తూ చిరకాలం వర్ధిల్లాలని ఆశిస్తూ...--వేణూ...

సోమవారం, డిసెంబర్ 08, 2008

అనగనగా ఓ డిశంబర్ 6 !!!

ఈ తేదీ వినగానే చాలా మందికి గుర్తొచ్చేది బ్లాక్ డే... బాబ్రీ మసీదుని కూల్చివేసిన రోజు... ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ఎక్కడ ఏ తీవ్రవాది విరుచుకు పడతాడో అని ప్రభుత్వం అప్రమత్తం గా ఉండే రోజు. అయితే సాధారణం గా పొలిటికల్ టపాలు రాసే అలవాటు లేని నీ బ్లాగ్ లో ఈ ప్రస్తావన ఎందుకు రా అంటారా... వస్తున్నా అక్కడికే వస్తున్నా... ఈ దుస్సంఘటన జరగడానికి చాలా కుంచెం సంవత్సరాలకి పూర్వం సరిగ్గా ఇదే రోజు నేను పుట్టాననమాట. నేను టీనేజ్ లో ఉన్నంతవరకూ కూడా ఈ రోజు నాకు మాత్రమే ప్రత్యేకం కానీ ఇది జరిగిన తర్వాత అందరూ ప్రత్యేకం గా గుర్తు పెట్టుకునే రోజయిపోయింది. ఈ రోజు...

శుక్రవారం, డిసెంబర్ 05, 2008

ఆకాశం నవ్వింది !!!

శీర్షిక చూసి మీకు ఏ 80 ల లోని ఓ తెలుగు నవల పేరో గుర్తొస్తే తప్పు నాది కాదు. నా చిన్న తనం లో నా పక్కన కూర్చుని నన్ను చదివించడానికి అమ్మ తెప్పించుకుని చదివి పక్కన పడేసిన నవలలు చూస్తూ అవి నేను చదివే రోజు ఎప్పుడొస్తుందో అని అనుకున్న నా బాల్యానిది . యద్దనపూడి సులోచనా రాణి , వాసిరెడ్డిసీతాదేవి , మైనంపాటి భాస్కర్, ఇంకా యండమూరి, యర్రంశెట్టి శాయి, మల్లాది గారి గురించి చెప్పనే అక్కరలేదనుకోండి. అ నవలలు అన్నీ చదవాలని ఉన్నపుడు చదవడానికి అనుమతి లేదు అనుమతి దొరికి ఒక వయసుకి వచ్చే సరికి యండమూరి గారి నవలలకి మాత్రం అతుక్కు పోయాను. అప్పుడప్పుడూ మల్లాది గారి రచనలు...

బుధవారం, నవంబర్ 26, 2008

చలి -- పులి

శీర్షిక చూసిన వెంటనే తెలుగు పేపర్ చదివే అలవాటున్న వారికి వాతావరణం ఉష్ణోగ్రతలు కాలమ్ గుర్తుకు వచ్చి ఉంటుంది కదా. పేపర్ వాళ్ళు ఈ Temperatures column heading ని ఆయా కాలాలకి (Seasonal) అణుగుణం గా భలే మారుస్తుంటారు. చలికాలం చలి పులి అని పెట్టి పక్కనే వణుకుతున్న కిరణాలతో సూరీడి బొమ్మ వేస్తారు :-) అలానే ఇక సమ్మర్ లో ఎండాకాలం.. మండే ఎండలు.. ఈ తరహా శీర్షిక లు మామూలే... సరే ఇదంతా ఎందుకు గుర్తు చేసుకుంటున్నా అంటే ఇక్కడ చలి కాలం మొదలై పోయింది అంటే ఇది ఇంకా మొదలే అనుకోండి ఇంకా ముందుంది అసలైన తధిగిణతోం కానీ నిన్న మొన్నటి వరకు సమ్మర్ మరియూ స్ప్రింగ్ వాతావరణం...

మంగళవారం, నవంబర్ 25, 2008

కార్పొరేట్ ట్రావెల్ !!!

నాకు సాధారణం గా లంచ్ నా డెస్క్ దగ్గరకే తెచ్చుకుని ఇంటర్నెట్ లో వార్తలో, వికీ నో, మరోటో చూస్తూ తినడం అలవాటు. మొన్న గురువారం అలాగే లంచ్ టైం లో CNN news చదువుతుంటే ఈ వార్త నన్నాకర్షించింది. దాని గురించే ఈ టపా….మీ ఊహా శక్తి కి కొంచెం పని కల్పించి ఒక చిన్న దృశ్యం ఊహించుకోండి. మీరో గంపెడు పిల్లలు బోలెడు జనాభా మరియూ భాధ్యతలతో నిండి ఉన్న ఒక ఉమ్మడి కుటుంబానికి పెద్ద అయి ఉండి నెలాఖరు రోజులలో కడుపు నిండా తింటానికి కూడా డబ్బులు లేని పరిస్తితులలో కష్ట పడి పచ్చడి మెతుకులతో కడుపు నింపుకుని అరుగు మీద సేద దీరుతుంటే మీ ముందు ఒక ఖరీదైన బెంజ్ కార్ వచ్చి ఆగి అందులో...

ఆదివారం, నవంబర్ 16, 2008

ఓ క్లాసు... ఓ మాసు... :-)

గత వారం రోజులు గా ఎందుకో ఈ రెండు పాటలూ పదే పదే గుర్తొస్తున్నాయి సో టపాయించేస్తే ఓ పనైపోతుంది అని మొదలెట్టాను. అసలు ఈ టపా కి సరైన శీర్షిక ఓ క్లాసిక్... ఓ జానపదం అయి ఉండేదేమో. ముందు క్లాసిక్ గురించి... జంధ్యాల గారి ముద్దమందారం సినిమాలో వేటూరి గారు రాసిన ఈ పాట చాలా బాగుంటుంది. సాహిత్యం గొప్ప గా లేకపోయినా చిన్న చిన్న పదాలలో మంచి భావాలని పలికించారు వేటూరి గారు... రమేష్‌నాయుడు గారి సంగీతం ఆహ్లాదం గా ఉంటే... ఇక బాలు గాత్రం అద్భుతమైన వన్నె తెస్తుంది మనసుకు హాయినిస్తుంది. ఒక సారి విని చూడండి.... 05.Neelalu Kareena...చిత్రం : ముద్దమందారంసాహిత్యం : వేటూరిసంగీతం...

మంగళవారం, నవంబర్ 11, 2008

Potluck !! మన వన భోజనాలేనండీ...

మా టీం లో మూడొంతుల పైగా భారతీయులు ఉండటం తో మొన్నీమధ్య దీపావళి సంధర్భం గా మా ఆఫీస్ లో పాట్ లక్ అరేంజ్ చేసాము సరదాగా ఆ ఫోటోలు దాని ప్రిపరేషన్ కోసం నే పడ్డ పాట్లు మీతో పంచుకుందామని ఈ టపా...అమెరికా జీవన విధానం గురించి పెద్ద గా పరిచయం లేని వారికోసం అసలు potluck అంటే ఏంటో ముందు చూద్దాం. నేను అమెరికా వచ్చిన కొత్త లో అందరితో కలిసి పాట్‌లాక్ (potlock) అని అనే వాడ్ని తర్వాత తర్వాత మెల్ల గా అది pot lock కాదు potluck అని తెలుసుకున్నాను. దీని డిక్షనరీ మీనింగ్ ఏమిటా అని వెతికితే అనుకోని అతిధి కి కుండలో ఉన్నదేదో వడ్డించడం అని ఒక అర్ధం అట అంటే నిఖార్సైన తర్జుమా...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.