అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

శనివారం, మార్చి 21, 2020

భయం మంచిదే...

అవును ఒక్కోసారి భయం కూడా మంచిదే, ప్రస్తుత పరిస్థితులలో భయం అవసరం కూడా. అపోహలతో హేతుబద్ధత లేని ప్రచారాలను చూసి పానిక్/భయాందోళనలకు గురికావలసిన పని లేదు. ప్రళయం వచ్చేస్తుంది ఏదో జరిగిపోతుందని గాభరా పడాల్సిన పనిలేదు. అలాగని పూర్తిగా మనకేం కాదులే అనే నిర్లక్ష్య ధోరణీ మంచిది కాదు. మన సహేతుకమైన భయాన్ని జాగ్రత్తగా మార్చుకుందాం, కర్తవ్యాన్ని శ్రద్దగా నిర్వహిద్దాం. కరోనా (కోవిడ్ 19) కి మందు లేకపోవచ్చు కానీ సమిష్టిగా అందరూ తగు జాగ్రత్తలు తీస్కుని దాన్ని వ్యాపించకుండా కట్టడి చేయగలం. గత కొన్ని రోజులుగా నేను వింటున్న కొన్ని నిర్లక్ష్యపు సమాధానాలు : "అబ్బే...

శుక్రవారం, మార్చి 06, 2020

మన ఊరి రామాయణం...

దుబాయ్ లో పని చేసొచ్చి ఇండియా లో స్థిరపడిన భుజంగయ్య (ప్రకాష్ రాజ్) కి డబ్బూ అధికారం తెచ్చిపెట్టిన గౌరవం పలుకుబడీ చూసుకుని మురిసి పోతూ ఉంటాడు. ఊరంతా అంత గౌరవం ఇస్తున్న తనకి తన ఇంట్లో ఏమాత్రం విలువ ఇవ్వడం లేదనీ తన కూతురు, భార్య, అత్త గారు తన మాట వినడం లేదనే కోపంతో అస్తమానం అరుస్తూ వారి మీద అజమాయిషీ చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఆటో నడుపుకుంటూ ఎప్పటికైనా ఇతని సాయంతో దుబాయ్ వెళ్ళాలని కలలుగనే శివ(సత్యదేవ్) ఇతనికి నమ్మిన బంటు.  గరుడ(పృథ్వీ) ఓ సినిమా డైరెక్టర్ ఇదే ఊరిలో షూటింగ్ జరుపుకుంటున్న హీరోకి కథ చెప్పడానికి వచ్చి దారిలో తన స్క్రిప్ట్...

బుధవారం, మార్చి 04, 2020

హిట్ - ది ఫస్ట్ కేస్...

స్క్రిప్ట్ సెలెక్షన్ లో నానీది మంచి అభిరుచి అనేది అందరికీ తెలిసినదే అలాంటి నటుడు తనే సొంతంగా నిర్మిద్దామనుకున్నపుడు ఇంకెంత వైవిధ్యమైన స్క్రిప్ట్ ఎన్నుకుంటాడో తను నిర్మించిన మొదటి సినిమా ’ఆ!’ తోనే నిరూపించేశాడు. ఇపుడు తీసిన రెండవ సినిమా ’హిట్’ కూడా అలాగే రొటీన్ ఫార్ములా సినిమాలంటే మొహం మొత్తేసిన వాళ్ళని ఆకట్టుకునే స్క్రిప్ట్. దానికి సరిగ్గా సరిపోయే హీరో విశ్వక్ సేన్ కూడా తోడవడంతో సినిమా పేరులో ఉన్న హిట్ సినిమా ఫలితంలో కూడా కనిపించింది. హిట్ (Homicide Intervention Team) లో పని చేస్తున్న ఇంటెలిజెంట్ అండ్ ఎఫీషియంట్ ఆఫీసర్ విక్కీ(విశ్వక్ సేన్)...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.