అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

మంగళవారం, ఫిబ్రవరి 25, 2020

భీష్మ...

త్రివిక్రం గారి ప్రియ శిష్యుడు వెంకీ కుడుముల ఇంటిల్లి పాది హాయిగా నవ్వుకుంటూ చూసొచ్చేలా తీసిన సినిమా భీష్మ. సినిమాలో అక్కడక్కడ మనం త్రివిక్రమ్ సినిమా చూస్తున్నామా లేక వెంకీ కుడుముల సినిమా చూస్తున్నామా అనిపిస్తుంటుంది. చిత్రమైన విషయమేంటంటే ఇదే దర్శకుని మొదటి సినిమా ’ఛలో’ చూసినపుడు ఇలాంటి ఆలోచన రాలేదు. అది చాలా రిఫ్రెషింగ్ గా కొత్తగా ఉంటుంది కానీ ఈ సినిమాలో మాత్రం గురువు గారి ప్రభావం బాగా కనిపించింది.బహుశా ఎన్నుకున్న స్క్రిప్ట్ వల్లేమో. ఏదైనా కానీ అలవైకుంఠపురం లానే ఈ సినిమా కూడా అద్యంతం హాస్యంలో ముంచి తేలుస్తుంది. దానితో పాటు ఎరువులు పెస్టిసైడ్స్...

శుక్రవారం, ఫిబ్రవరి 21, 2020

కోటప్పకొండ తిరణాల జ్ఞాపకాలు...

శివరాత్రి అనగానే అందరికీ ఆ పరమశివుడు, ఉపవాస జాగారాలు గుర్తు రావడం సహజమే కానీ మా నర్సరావుపేట వాళ్ళకి మాత్రం శివరాత్రి అనగానే ముందు కోటప్ప కొండ తిరణాళ్ళే గుర్తొస్తుంది. దక్షయజ్ఞం తర్వాత పన్నెండేళ్ళ బాలుడిగా దక్షిణామూర్తి అవతారంలో త్రికూటాచలమైన మా కోటప్ప కొండపై వెలిశారట ఆ పరమశివుడు. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా.. కన్నెపిల్ల కనిపిస్తే నాకోసం పడిఛస్తే నూటొక్క టెంకాయ కొడతానని మొక్కుకున్నా అని దాసరి గారు పాట రాసేశారు కానీ మా కోటయ్య బ్రహ్మచారి దేవుడు. అందుకే ఈ కొండమీద కానీ గుడిలో కానీ పెళ్ళిళ్ళు చేయరట. ఇక్కడి గుడి ముందు ద్వజస్తంభం కూడా...

బుధవారం, ఫిబ్రవరి 19, 2020

కార్తీ ఖైదీ...

సాథారణంగా ఒక్క రోజులోనో ఒక్క పూటలోనో నడిచే సంఘటనలతో తీసిన సినిమాలు కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మీద పాటల మీద  ఆధారపడుతూ ఉంటాయి. అలాంటి అవకాశం కూడా లేకుండా కేవలం రెండు చోట్ల ఒక రాత్రిపూట జరిగే సంఘటనల ఆధారంగా రెండున్నరగంటల పాటు కూర్చోపెట్ట గలగడం అంటే మాములు విషయం కాదు. ఆ ఫీట్ ని సునాయసంగా సాధించింది ’ఖైదీ’ టీమ్. బిజోయ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. అతను ఓ రాత్రి చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న ఒక అతి పెద్ద డ్రగ్ ముఠా తాలూకు డ్రగ్స్ ని పట్టుకుంటాడు. దాదాపు తొమ్మిదివందల కిలోల బరువున్న ఆ కొకెయిన్ ధర తొమ్మిది వందల కోట్లు. తెల్లవారే వరకూ హయ్యర్...

బుధవారం, ఫిబ్రవరి 12, 2020

జాను...

రామ్ (శర్వానంద్) ఒక ట్రావెల్ ఫోటోగ్రాఫర్. ప్రకృతితో మమేకమై తిరుగుతూ తనలోని ఒంటరితనాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూంటాడు. అనుకోకుండా ఒక రోజు తను చిన్నపుడు చదువుకున్న వైజాగ్ కి చేరుకుంటాడు. అక్కడ తాను తిరిగిన ప్రదేశాలు అన్నీ చూస్తూ తాను టెంత్ వరకూ చదివిన స్కూల్ కీ వెళ్తాడు. అక్కడ నుండి అలా కనెక్ట్ అయిన క్లాస్మేట్స్ ఒక రీ యూనియన్ ప్లాన్ చేస్తారు. ఆ రీయూనియన్ కి వెళ్ళి దాదాపు పదిహేనేళ్ళ తర్వాత కలిసిన అందరితో జ్ఞాపకాలు కలబోసుకుంటున్న రామ్ కి జాను(సమంతా) కూడా అక్కడకి వస్తుందని తెలుస్తుంది. చిన్నప్పటినుండీ కలిసి చదువుకున్న జాను అన్నా తను పాడే...

సోమవారం, ఫిబ్రవరి 03, 2020

అల వైకుంఠపురములో...

సంక్రాంతి తెలుగు వాళ్ళందరికీ ఎంత ఇష్టమైన పెద్ద పండగో సినీ ప్రియులకి అంతకంత ఇష్టమైన పండగ. ఎందుకంటే ఈ సీజన్ లో కనీసం రెండు మూడు పెద్ద సినిమాలు విడుదలై అభిమానులని అలరిస్తూ సినిమాకి దాని చుట్టూ ఆధారపడే వాళ్ళందరికి నాలుగు డబ్బులు సంపాదించి పెట్టే పండగ కనుక. ఐతే ఈ పండగను అడ్డం పెట్టుకుని టిక్కెట్ రేట్లు అడ్డగోలుగా పెంచేసి "ఐనా కలెక్షన్స్ వస్తున్నాయంటే డబ్బులు పెడుతున్నారు సో పండగరోజులే కాదు వీకెండ్ కూడా టిక్కెట్ రేట్లు పెంచుతాం" అనే నిర్మాతలని చూస్తే మాత్రం అలాగే మీరు పెంచుకోండి పైరసీని కూడా పెంచి పోషించుతారు ప్రేక్షకులు అని అనాలనిపిస్తుంది....

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.