సోమవారం, అక్టోబర్ 01, 2018

నవాబ్...

ఎక్కడనుండో వలస వచ్చిన ఒక అనామకుడిగా మొదలుపెట్టి చిన్న సైజు సామ్రాజ్యాన్ని స్థాపించుకుని రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) కి ముగ్గురు పిల్లలు. పెద్దకొడుకు వరద(అరవింద్ స్వామి) తండ్రి దగ్గరే ఉంటూ ఆయనకి దళపతిలా పనిచేస్తుంటాడు. రెండవ వాడు త్యాగు (అరుణ్ విజయ్) దుబాయ్ లో తన దందాని నిర్వహిస్తుంటాడు. మూడవ వాడు రుద్ర(శింబు) సెర్బియా లో అక్రమ ఆయుధ రవాణా చేస్తుంటాడు.

ఒక బాంబు దాడిలో దెబ్బతిన్న తండ్రిని చూడడానికి వచ్చిన ముగ్గురు కొడుకుల మధ్య తండ్రి తర్వాత వారసత్వం ఎవరిది అనే చర్చ మొదలవుతుంది. ఆ చర్చ దేనికి దారితీసింది, భూపతి సంపదకి పవర్ కి వారసత్వం కోసం జరిగిన పోరులో ఎవరు గెలిచారు, ఈ మొత్తంలో వరద బెస్ట్ ఫ్రెండ్ అయిన ఓ కరప్ట్ పోలీసాఫీసర్ రసూల్(విజయ్ సేతుపతి) పాత్ర ఏంటి అనేది తెలుసుకోవాలంటే "నవాబ్" చిత్రం చూడాలి.

మణిరత్నం ఒకప్పటి క్లాసిక్స్ సరసన నిలవకపోవచ్చేమో కానీ ఆయన ఈ మధ్య తీసిన చాలా సినిమాలకన్నా చాలా బావుందీసినిమా. కథనుండి ఎక్కడా డీవియేట్ కాకపోవడంతో ఎంటర్టైన్మెంట్, పేస్ కాస్త అటూ ఇటూ అయినట్లు అనిపించవచ్చు కానీ సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ, ఏ.ఆర్. రహ్మాన్ నేపధ్య సంగీతం, మణిరత్నం టేకింగ్ మనల్ని కట్టి పడేస్తాయి.

ఒక సీరియస్ కథ చెప్పాలనుకున్నపుడు ఇలా చెప్పడమే సరైన పద్దతని నాకనిపించింది అలాగే క్లైమాక్స్ కొందరికి థ్రిల్లింగ్ గా అనిపిస్తే కొందరికి చీట్ చేసిన ఫీలింగ్ రప్పించవచ్చు. క్రైమ్ బిజెనెస్ లో ఉన్న కుటుంబాలలోని వ్యక్తులు ఎంత మెటీరియలిస్టిక్ గా మారిపోవచ్చో వారి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు, స్వార్ధం ఎలా ఉండచ్చూ అనేది చూపించిన విధానానికి హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. 
 
ప్రకాష్ రాజ్, జయసుధ, విజయ్ సేతుపతి, అరవింద్, జ్యోతిక, శింబు అందరూ పాత్రలలో ఒదిగిపోయారు చాలాకాలం గుర్తుండి పోతారు. అరవింద్ స్వామి, జ్యోతిక, అదితిరావ్ హైదరీ మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటా ఒకప్పటి విలన్ త్యాగరాజన్ ను భూపతికి రైవల్ చిన్నప్పగౌడ్ గా చూడడం బావుంది. ఉన్న కొద్ది పాటలు ప్రత్యేకంగా కాక కథనంలో కలిసిపోయాయి.

సినిమా కథ తెలుసుకోవడం కోసం కన్నా నటీనటుల నటన అండ్ టెక్నికాలిటీస్ కోసం చూడాల్సిన సినిమా నవాబ్. మణిరత్నం అభిమానులు, గ్యాంగ్ స్టర్ మూవీస్ ఇష్టపడేవాళ్ళు మిస్సవకుండా చూడవలసిన చిత్రం "నవాబ్". ఈ సినిమా ట్రైలర్స్ ఇక్కడ మరియూ ఇక్కడ చూడవచ్చు. 

9 కామెంట్‌లు:

  1. మణిరత్నం గారి మూవీ అంటే ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది..యెట్ టూ వాచ్ అండి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజమేనండీ.. కానీ మధ్యలో కొన్ని సినిమాలు భయపెట్టాయండి.. ఇది మాత్రం బావుంది..

      తొలగించండి
  2. ఫాల్తు సైన్మ.గాడ్ ఫాదర్ సైన్మా నే అటు ఇటు పీకి పచ్చడి చేసాడు.ఢమాల్ బర్మ , రత్న మని సైన్మాలు తీసుడు అవసరమా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారు మీరు సినిమా చూశారా.. లేదా రివ్యూలని బట్టి ఆ అంచనాలకి వచ్చారా..

      తొలగించండి
  3. Chala rojula tarvatha malli venta ventane reviews rastunnaru...Glad to see posts in your blog..Actual ga meeru blogging aapesaremo anukunna🤔

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ ద కామెంట్ ప్రియరాగాలు గారు.. ఆపేయడమేం లేదండీ పాటల బ్లాగ్ లో రోజుకో పాట వేస్తూనే ఉన్నాను.. తీరిక దొరకక ఇందులో ఎక్కువ వ్రాయడం లేదు అంతేనండీ..

      తొలగించండి
  4. నిన్నే ఈ మూవీ చూశామండీ..చూశాక నాకు బాగ నచ్చిన అంశాలు..1987 లో వచ్చిన నాయకుడు లో డాన్ పాత్ర మనకి కమల్ పై హీరో వర్షిప్ ని పెంచేస్తే ఇప్పటి మూవీ లో డాన్స్ ని యెంత పవర్ఫుల్ గా చూపించినా ఆడియన్స్ నించి డిటాచ్డ్ గా ఉంచారు..అలానే డబ్బు కోసం కన్న వాళ్ళనే కనికరించని ఈ రోజుల్లో ఆశ ఆకాశమైతే అందులో నిజానికి ఉండేది శూన్యమే నని అద్భుతం గా చిత్రీకరించారు..నిజంగానే హాట్సాఫ్ టూ మణిరత్నం అని అనకుండా ఉండలేమండి..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా కరెక్ట్ గా చెప్పారు శాంతి గారు.. నేను మిస్సయిన పాయింట్ ని బాగా సమ్మరైజ్ చేశారు. అంత పెద్ద స్టార్ కాస్ట్ ని పెట్తుకుని కూడా డిటాచ్డ్ గా ఉంచగలగడం ఖచ్చితంగా మణిరత్నం గారి ప్రత్యేకతే..

      తొలగించండి
    2. సినిమా చూసి వచ్చి మళ్ళీ మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యావాదాలు శాంతిగారు.

      తొలగించండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ అగ్ర్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ ప్రచురించ బడవు.

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.