అమ్మ జ్ఞాపకాల కబుర్లు

చదువుకోసం హాస్టల్ కు పంపేప్పుడు తన బేలతనం నాకుకనపడనివ్వకుండా దాచుకుంటూ అమ్మ నాకు చెప్పిన ధైర్యం, ఎంత దూరంలో ఉన్నా ఎలాంటి సమస్య అయినా ఫోన్ లోనే తన సలహాలతో దూరం చేసిన వైనం. తనులేకపోతే ఏమీలేదన్న నిస్పృహ, అంతలోనే తనిచ్చిన జీవితం ఉందన్న ఆశ. ఇలా అమ్మ గురించిన కబుర్లు ఇక్కడ చూడండి.

సోమవారం, జనవరి 22, 2018

అమ్మ...

అమ్మ అంటే లాలనకూ నాన్నంటే క్రమశిక్షణకూ మారుపేరని లోకరీతి కానీ మా ఇంట్లో మాత్రం నాన్నారు మమ్మల్ని సాధారణంగా ఏమీ అనేవారు కాదు అమ్మ మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఉండేవారు. అదికూడా కోప్పడకుండానే ఓపికగా నెమ్మదిగా తియ్యగా చెప్తూనే మమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుండేది. ఒకోసారి అబ్బా ఏంటో అమ్మ ఇన్ని రూల్స్ పెడుతుంది అసలు చెప్పకుండా ఎక్కడికైనా దూరంగా పారిపోతే బావుండు అప్పుడు తెలిసొస్తుంది అమ్మకి అని అనిపించేది కానీ హాస్టల్ పేరుతో మొదటిసారి దూరంగా ఉన్న రోజు నాన్న కంటే అమ్మే ఎక్కువ గుర్తొచ్చి బోలెడంత దిగులేసేది. నాకు చిన్నపుడు అత్యంత కష్టమైన పని స్నానం...

నేను ???

నా ఫోటో
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.